మరో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్‌ | TRS MLA Manchireddy Kishan Reddy Tests Corona Positive | Sakshi
Sakshi News home page

మరో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్‌

Published Wed, Jul 22 2020 9:30 PM | Last Updated on Wed, Jul 22 2020 9:33 PM

TRS MLA Manchireddy Kishan Reddy Tests Corona Positive - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులకు కరోనా సోకడం రాష్ట్ర ప్రజానీకాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా అధికార టీఆర్‌ఎస్‌కు చెందిన నేతలు ఎక్కువగా వైరస్‌ బారిన పడటం ఆ పార్టీలో గుబులు రేపుతోంది. తాజాగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆయన అపోలో​ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు గత కొద్ది రోజులుగా ఎమ్మెల్యేకు సన్నిహితంగా మెలిగిన వారి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ఇటీవల ఆయన నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడంతో ప్రభుత్వ అధికారులు, పార్టీ శ్రేణులు భయాందోళనకు గురవుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement