
సాక్షి, ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌లోని తెలంగాణ ఉద్యమకారులు పార్టీ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి వ్యతిరేకంగా గళమెత్తారు. టీఆర్ఎస్ ఉద్యమకారుల ఆవేదన సభ పేరిట నిర్వహించి.. మంచిరెడ్డి కిషన్ రెడ్డికి టికెట్ ఇవ్వడంపై ఉద్యమకారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సభ జరుగుతుండగా.. మధ్యలోనే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి రావడంతో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. కిషన్ రెడ్డి తీరుపై ఉద్యమకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీఆర్‌ఎస్ పాత, కొత్త నేతల మధ్య వాగ్వాదం జరిగింది. అందరినీ కలుపుకొని వెళ్తున్నానని కిషన్ రెడ్డి సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా.. ఆయన తీరుపై అసమ్మతి నేతలు చల్లబడలేదు. ఉద్యమకారులను కిషన్‌రెడ్డి కించపరిచారని పలువురు నేతలు నిరసన వ్యక్తం చేశారు. దీంతో సభ పూర్తికాకుండానే మంచిరెడ్డి వెళ్లిపోయారు. మంచిరెడ్డితోపాటు ఈ సమావేశానికి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ కూడా హాజరయ్యారు. పార్టీలోని ఉద్యమకారులను కలుపుకొని వెళ్లాలని ఆయన నేతలకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment