సాక్షి, హైదరాబాద్: ఇటీవలి కాలంలో పలు కేసుల్లో తెలంగాణలో ఈడీ, ఐటీ అధికారులు దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అధికార పార్టీ ఎమ్మెల్యేకు మరోసారి ఈడీ నోటీసులు జారీ చేయడం, విచారించడం తెలంగాణలో సంచలనంగా మారింది.
వివరాల ప్రకారం.. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిపై 2015లో ఈడీ కేసు నమోదు చేసింది. ఇండోనేషియాలో బంగారం మైన్స్‌లో పెట్టుబడుల్లో ఫెమా నిబంధనలు ఉల్లంఘించారని మంచిరెడ్డికి ఈడీ నోటీసులు పంపించింది. కాగా, ఆర్థిక లావాదేవీలపై వివరణ ఇవ్వాలని గతంలో నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలో ఈడీ ఎదుట హాజరై మంచిరెడ్డి.. లావాదేవీలపై వివరణ ఇచ్చారు. ఇదిలా ఉండగా.. ఈ కేసులోనే మరోసారి మంచిరెడ్డికి ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు.
దీంతో, కిషన్‌రెడ్డి మంగళవారం మరోసారి ఈడీ ఎదుట హాజరయ్యారు. ఈడీ ఆఫీసులో విచారణ కొనసాగుతోంది. కాగా, ఇటీవల చోటుచేసుకున్న క్యాసినో వ్యవహారంతో ఈ కేసుకు ఏదైనా సంబంధం ఉందా? అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో భాగంగా తెలంగాణకు చెందిన పలువురిని సైతం ఈడీ విచారించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment