మల్రెడ్డికి ఎమ్మెల్యే మంచిరెడ్డి సవాల్
మల్రెడ్డికి ఎమ్మెల్యే మంచిరెడ్డి సవాల్
Published Mon, Sep 5 2016 1:29 PM | Last Updated on Tue, Oct 30 2018 4:40 PM
రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం చౌరస్తాలో సోమవారం మధ్యాహ్నం ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తనపై చేసిన ఆరోపణలను రుజువు చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అనుచరులతో వచ్చి స్థానిక చౌరస్తాలో బైఠాయించారు. మల్రెడ్డి చర్చకు రావాలని ఎమ్మెల్యే సవాల్ విసిరారు. (చదవండి 'ఎమ్మెల్యే మంచిరెడ్డికి నయీంతో సంబంధాలు!')
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మంచిరెడ్డి మాట్లాడుతూ...మరో రెండు గంటలు ఇక్కడే ఉంటానన్నారు. గ్యాంగ్స్టర్ నయీంతో తనకు సంబంధముందన్న ఆరోపణలను మల్రెడ్డి రుజువు చేయాలన్నారు. దమ్ము, ధైర్యం లేకే మల్రెడ్డి మొహం చాటేశారని మంచిరెడ్డి ఆరోపించారు. ఆరోపణలు నిరూపించకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటానని మంచిరెడ్డి హెచ్చరించారు. (చదవండి : 'నయీంతో నాకెలాంటి సంబంధాలు లేవు' ).
Advertisement
Advertisement