Gangster Nayeem case
-
నయీం ఇంట్లో కళ్లు చెదిరే నిజాలు..!
సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో పూర్తిస్థాయి దర్యాప్తు జరిపించాలని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సెక్రటరీ పద్మనాభరెడ్డి కోరారు. సోమవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. నయీం ఇంట్లో 24 వెపన్స్, ఏకే 47 రైఫిల్స్, పిస్టర్స్, గ్రనేడ్స్ పట్టుబడ్డాయని, పోలీసుల సహకారం లేకుండా అత్యాధునిక ఆయుధాలు నయీంకు ఎలా వచ్చాయని ఆయన ప్రశ్నించారు. (చదవండి: ‘తెలంగాణలో నయా రాచరికం’) ‘‘నయీం ఇంట్లో దొరికిన 24 గన్స్కు లైసెన్స్ ఇచ్చింది పోలీసులే. నయీం ఇంట్లో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు దొరికాయంటే పోలీసులకు సంబంధం లేదని సిట్ ఎలా చెబుతుంది. పోలీసులతో పాటు రెవెన్యూ సిబ్బంది కూడా నయీంకు సహకరించారు. నయీం ఇంట్లో 752 ల్యాండ్ డాక్యుమెంట్లు దొరికాయి. నయీం కేసును సీబీఐకి అప్పగించాలి. నయీం ఇంట్లో దొరికిన 602 సెల్ఫోన్ల కాల్ డేటాను ఎందుకు బయట పెట్టడం లేదని’’ ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రశ్నించింది. నయీం లాంటి దుర్మార్గులు మళ్ళీ మళ్ళీ పుట్టకుండా ఉండాలంటే సహకరించిన పోలీసులపై పూర్తిస్థాయి దర్యాప్తు జరగాల్సిందేనని, దీని పై గవర్నర్ కు లేఖ రాశామని పద్మనాభరెడ్డి తెలిపారు. (చదవండి: టీపీసీసీ చీఫ్ ఎంపిక మరింత ఆలస్యం!) -
గ్యాంగ్ నయీమ్
-
గ్యాంగ్ నయీమ్
♦ ఐదుగురు ఖాకీల సస్పెన్షన్ ♦ మరో 20 మంది పోలీసు అధికారుల విచారణ.. ♦ ఆరోపణలు రుజువైతే వారిపైనా వేటు ♦ అప్పటివరకు విధుల నుంచి తొలగించి వీఆర్‌లో ఉంచాలని డీజీపీ ఆదేశం ♦ సస్పెండ్ అయినవారిలో అదనపు ఎస్పీ, ఇద్దరు ఏసీపీలు సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసులో పోలీస్ అధికారులపై ఎట్టకేలకు వేటు పడింది! నయీమ్‌తో చేతులు కలిపి కోట్లు గడించిన ఖాకీలపై పోలీస్ శాఖ కొరడా ఝళిపించింది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 25 మంది పోలీస్ అధికారులపై డీజీపీ అనురాగ్ శర్మ చర్యలు తీసుకున్నారు. వారిలో ఐదుగురిపై సస్పెన్షన్ వేటు వేయగా, మిగతావారిపై తీవ్రమైన క్రమశిక్షణ చర్యలతోపాటు విచారణకు ఆదేశిస్తూ గురువారం ఆదేశాలు వెలువరించారు. ప్రభుత్వంపైనే ఒత్తిడి కిందటేడాది ఆగస్టు 8న మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ శివారులో నయీమ్ ఎన్కౌంటర్లో హతమయ్యాడు. అతడి ఆస్తులు, దందాలు, సెటిల్మెంట్లు, భూకబ్జాలపై ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించింది. అయితే విచారణ నుంచి తప్పించుకునేందుకు, సస్పెన్షన్ వేటు పడకుండా ఉండేందుకు పలువురు అధికారులు ఏకంగా ప్రభుత్వంపైనే ఒత్తిడి తెచ్చారు. కొన్నాళ్లపాటు నయీమ్ కేసు మూతపడిందన్న ఆరోపణలు వినిపించాయి. అయితే పోలీస్ ఉన్నతాధికారులు రెండ్రోజుల క్రితం ఢిల్లీలో సీఎం కేసీఆర్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నయీమ్ తో అంటకాగిన అధికారులపై చర్యలు తీసుకునేందుకు అనుమతి పొందినట్టు తెలిసింది. వారిపై చర్యలు తీసుకోకుంటే పోలీస్ విభాగంపైనే అపవాదు ఉండిపోతుందని,నయీమ్‌తో సన్నిహితంగా మెలిగిన వారికి కూడా పదోన్నతుల్లో అందలం ఇచ్చారన్న ఆరోపణలెదుర్కోవడం ప్రభుత్వానికి కూడా మంచిది కాదని ఉన్నతాధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆ అధికారులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని స్పష్టం చేస్తూ చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు పోలీస్ వర్గాలు తెలిపాయి. ఆరోపణలు రుజువైతే వేటే.. నయీమ్‌తో కలిసి సెటిల్మెంట్లు చేయించుకోవడం, ఫ్లాట్లు గిఫ్టులుగా పొందడం, లంచాలు తీసుకోవడం.. తదితర కార్యక్రమాలకు అలవాటుపడ్డ వారిపై శాఖాపరమైన విచారణ జరపాలని డీజీపీ ఆదేశించారు. అప్పటివరకు వారిని విధుల్లో నుంచి తొలగించి వీఆర్‌లో పెట్టాలని ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. విచారణలో ఆరోపణలు రుజువైతే వారిపై కూడా సస్పెన్షన్ వేటు వేయాలని నిర్ణయించినట్టు ఉన్నతాధికారులు తెలిపారు. విచారణ ఎదుర్కోవాల్సిన అధికారులు వీరే.. ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ చంద్రశేఖర్, మహబూబ్‌నగర్ ట్రైనింగ్ కాలేజీ డీఎస్పీ సాయి మనోహర్, ఇల్లందు డీఎస్పీ ప్రకాశ్‌రావు, జెన్కో డీఎస్పీ వెంకట నర్సయ్య, పోలీస్ అకాడమీలో ఉన్న డీఎస్పీ అమరేందర్‌రెడ్డి, సంగారెడ్డి డీఎస్పీ తిరుపతన్న, మలక్‌పేట్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకట్‌రెడ్డి, హయత్‌నగర్ ఇన్స్పెక్టర్ నరేందర్‌గౌడ్, ఇన్స్పెక్టర్ కిషన్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రవికిరణ్‌రెడ్డి, ఇన్స్పెక్టర్ వెంకటయ్య, టాస్క్‌ఫోర్స్ నార్త్‌జోన్ ఇన్స్పెక్టర్ బల్వంతయ్య, ఇన్స్పెక్టర్ రవీందర్, ఇన్స్పెక్టర్ సూర్యప్రకాశ్, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్‌నాయుడు, ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, ఇన్స్పెక్టర్ మాజిద్, హెడ్‌కానిస్టేబుళ్లు ఆనంద్, మహ్మద్ మియా, కానిస్టేబుల్ బాలయ్య. పదోన్నతుల ముందు కలకలం రాష్ట్రంలో నూతన జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ప్రభుత్వం కొత్త పోస్టులు మంజూరు చేసింది. ఇన్స్పెక్టర్ నుంచి నాన్ క్యాడర్ ఎస్పీ వరకు పదోన్నతుల ప్రక్రియను పోలీస్ శాఖ ఇప్పటికే వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో నయీమ్ కేసులో అంటకాగిన అధికారులకు కూడా పదోన్నతులు కల్పిస్తే పోలీస్ శాఖ నైతిక విలువ దెబ్బతినే ప్రమాదం ఉందని గ్రహించిన ఉన్నతాధికారులు ప్రభుత్వ వర్గాలతో చర్చించారు. కేవలం 25 మంది అధికారుల వల్ల మిగిలినవారికి అన్యాయం చేసిన వారిమవుతామని వివరించినట్టు తెలిసింది. దీనితో వీరి సస్పెన్షన్, విచారణ నిర్ణయంతో పదోన్నతులకు సైతం లైన్‌క్లియర్ అయ్యిందని ఉన్నతాధికారులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నెలాఖరుకల్లా ఇన్స్పెక్టర్ నుంచి డీఎస్పీ పదోన్నతులు కల్పించి, తదుపరి దశలో డీఎస్పీ నుంచి అదనపు ఎస్పీ, నాన్ క్యాడర్ ఎస్పీ పదోన్నతులు కల్పించాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం. మా దగ్గర ఆధారాలున్నాయి నయీమ్‌తో అంటకాగినట్టు ఆరోపణలు మోపి చర్యలు తీసుకున్న అధికారుల ఎదుట త్వరలోనే అసలు అధికారులకు సంబంధించిన అధారాలు పెడతామని సస్పెన్షన్‌కు గురైన పలువురు అధికారులు స్పష్టం చేశారు. తాము మాత్రమే సస్పెన్షన్‌కు గురవడం, మిగతా వారికి ఎలాంటి సంబంధం లేదన్నట్టు వ్యవహరించడం సరి కాదని, తామేమీ నయీమ్‌తో వ్యక్తిగత పనులు చేయించుకోలేదని వారు స్పష్టం చేశారు. రాష్ట్రంలో మావోయిస్టులను ఏరివేసేందుకు నయీమ్‌ను పెంచి పోషించిన ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోకపోవడం పారదర్శకమైన చర్య ఎలా అవుతుందని వారు ప్రశ్నించారు. త్వరలోనే పూర్తి వివరాలతో మీడియా ముందుకు వస్తామని పలువురు అధికారులు సన్నిహితుల వద్ద పేర్కొన్నట్టు తెలిసింది. -
పోలీస్ శాఖలో ‘నయీమ్’ వార్
-
పోలీస్ శాఖలో ‘నయీమ్’ వార్
► అధికారుల మధ్య ‘అఫిడవిట్’ రగడ ► మాకు తెలియకుండానే అఫిడవిట్ తయారైంది ► కనీస సమాచారం కూడా లేదంటున్న పోలీసు ఉన్నతాధికారులు ► హోం, పోలీస్ శాఖ మధ్య కోల్డ్‌వార్ సాక్షి, హైదరాబాద్ : పోలీస్ శాఖలో నయీమ్ వ్యవహారం దుమారం రేపుతోంది. నాలుగు రోజుల క్రితం నయీమ్ కేసులో హోంశాఖ దాఖలు చేసిన అఫిడవిట్‌పై వాడివేడిగా చర్చ జరుగుతోంది. పోలీస్ శాఖలో కీలక అధికారులకు కూడా తెలియకుండా అఫిడవిట్ రూపొందిందని, కేవలం అధికారిక సంతకం కోసం మాత్రమే ఉన్నతాధికారులకు అఫిడవిట్ కాపీ చేరినట్టు చర్చ జరుగుతోంది. సాధారణంగా న్యాయస్థానాల్లో పోలీస్ శాఖకు సంబంధించిన కేసుల్లో అఫిడవిట్ వేసే సందర్భాల్లో.. ఉన్నతాధికారులు, న్యాయశాఖ అధికారులు చర్చిస్తారు. ప్రభుత్వ నిర్ణయాన్ని కౌంటర్ అఫిడవిట్లో పేర్కొంటారు. కానీ ఇక్కడ అలాంటి కార్యక్రమాలేవీ జరగలేదని పోలీసు శాఖలోని ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు. తమకు కనీస సమాచారం కూడా లేదని, అఫిడవిట్ వివరాలు మీడియాలో చూసిన తర్వాతే తెలిసిందని కీలక అధికారి ఒకరు పేర్కొన్నారు. దర్యాప్తు జరుగుతుండగానే.. నయీమ్ కేసులో రాజకీయ నేతలు, పోలీస్ అధికారులు, ఇతరత్రా పెద్దలున్నారన్న వార్తలు మొదట్లో షికార్లు చేశాయి. కేసులో చోటామోటా అధికారులకు సాక్షులుగా నోటీసులిచ్చి సిట్ విచారించింది. డీఎస్పీ స్థాయి అధికారుల వరకు వివరాలు రాబట్టింది. రాజకీయ నాయకుల విషయంలోనూ కొంత వరకు విచారణ చేసింది. ఇదే సమయంలో సీపీఐ నేత నారాయణ నయీమ్ కేసును సీబీఐకి బదిలీ చేయాలని కోరుతూ హైకోర్టు తలుపుతట్టారు. ఆ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. కంగుతిన్న అధికారులు న్యాయస్థానం ఆదేశం మేరకు హోంశాఖ కౌంటర్ దాఖలు చేసింది. ఈ అఫిడవిట్లో ఉన్న వివరాలు, కొంత మంది అధికారులు, రాజకీయ నాయకులకు తీపి కబురుగా అనిపించినా పోలీస్ ఉన్నతాధికారుల్లో మాత్రం ఆగ్రహం రగిలేలా చేసిందని పోలీస్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. నయీమ్ కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులకు సైతం ఈ అఫిడవిట్‌లోని అంశాలు కంగు తినిపించాయని, పోలీస్ శాఖలో పెద్దతలలుగా చెప్పుకుంటున్న వారు కూడా ఈ అఫిడవిట్ వార్తతో షాక్ తిన్నట్టు చర్చించుకుంటున్నారు. మొదలైన అసహనం హోంశాఖ అధికారులు, పోలీస్ ఉన్నతాధికారుల మధ్య ప్రస్తుతం బయటపడని అసహనం వ్యక్తమవుతోంది. అఫిడవిట్ అంశాలపై ఆరా తీయగా ఆ విషయంపై తమకెలాంటి సమాచారం లేదని కొందరు, హోంశాఖ అధికారులకే అంతా తెలుసని మరికొందరు చెబుతున్నారు. దీంతో ఈ రెండు విభాగాల మధ్య అంతరం పెరిగినట్టుగా చర్చ సాగుతోంది. అఫిడవిట్ అంశంపై తమకు కనీసం సమాచారం చెప్పకపోవడంపై పోలీసు ఉన్నతాధికారులు హోంశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేసినట్టు తెలిసింది. -
సీబీఐకి అప్పగించే ప్రసక్తే లేదు
నయీం కేసుపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టీకరణ - మనకు సమర్థులైన పోలీసులున్నారు - రాష్ట్ర పోలీసులకే ఈ క్రెడిట్ దక్కాలి - కేసుతో సంబంధం ఉన్న ఎవరినైనా శిక్షించి తీరుతాం - నయీం పిశాచాన్ని సృష్టించింది ఎవరో ప్రపంచానికి తెలుసు - నాడు కళ్లు మూసుకొని రాజ్యం చేసింది ఎవరు? - కేసు దర్యాప్తులో ఎక్కడా ఉదాసీనత లేదు - 740 మందికి పైగా సాక్షులను విచారించి 124 మందిని అరెస్టు చేశారు.. దర్యాప్తు మధ్యలో ఉంది.. - సమయం, సందర్భాన్ని బట్టి అన్నీ బయటపెడతాం సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీం కేసు దర్యాప్తును ఎట్టి పరిస్థితుల్లో సీబీఐకి అప్పగించేది లేదని సీఎం కె.చంద్రశేఖర్‌రావు తేల్చి చెప్పారు. జాతీయ స్థాయిలో ప్రశంసలందుకునే సమర్థులైన పోలీసు అధికారులు, సిబ్బంది ఉన్నందున వారితోనే దర్యాప్తు చేయిస్తామని స్పష్టం చేశారు. సోమవారం శాసనసభలో నయీం, అతని అనుచరులు సాగించిన నేర కార్యకలాపాలపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలపై లఘు చర్చ జరిగింది. ఈ చర్చలో ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం తరఫున సీఎం సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నయీం ఎన్కౌంటర్ తర్వాత తనకు వేలాది మంది ఫోన్లు చేశారని, కన్నీళ్లు పెట్టుకుంటూ అభినందనలు తెలిపారని పేర్కొన్నారు. భువనగిరి వెళ్తే వేలాది మంది వచ్చి ‘మా దరిద్రాన్ని వదిలించారు..’ అంటూ సంతోషించారని చెప్పారు. నయీంను హతమార్చడంలో మన పోలీసులు చేసిన కృషి అభినందనీయమని, అందుకే ఈ కేసు దర్యాప్తు చేసిన క్రెడిట్ మన పోలీసులకే దక్కాలని, సీబీఐకి ఈ కేసు ఇవ్వడం లేదని అన్నారు. ‘‘మన పోలీసులు బెస్ట్ పోలీసింగ్ అవార్డులు అందుకుంటున్నారు. జాతీయ పోలీసు అకాడమీకి వచ్చిన సందర్భంగా ప్రధాని కూడా మన పోలీసులను ప్రశంసించారు. కేంద్ర హోంమంత్రి కితాబిచ్చారు. అలాంటి పోలీసులను ఉపయోగించుకునే ఈ కేసు దర్యాప్తు పూర్తి చేస్తాం’’ అని చెప్పారు. ‘‘నయీం కేసును సీబీఐకి అప్పగించాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. నయీంను హతమార్చింది, ఆ తర్వాత 124 మంది అతని అనుచరులను పట్టుకుంది ఎవరు? సీబీఐ వాళ్లు వచ్చి పట్టుకున్నారా..?’’ అని కేసీఆర్ ప్రశ్నించారు. నయీం విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై అపవాదు వేయాలనుకోవడం సరైంది కాదని వ్యాఖ్యానించారు. ఈ పిశాచాన్ని ప్రోత్సహించింది ఎవరు? అసలు నయీం అనే ఈ పిశాచం సృష్టికర్తలెవరో ప్రపంచానికి తెలియదా అని సీఎం ప్రశ్నించారు. ‘‘ఆ పిశాచం నమిలి మింగుతుంటే ప్రోత్సహించింది ఎవరు? కళ్లు మూసుకుని రాజ్యం చేసింది ఎవరు’’ అంటూ కాంగ్రెస్, టీడీపీలను పరోక్షంగా విమర్శించారు. టీఆర్ఎస్ అధికారంలోని వచ్చాక రాష్ట్రంలో నేరాల సంఖ్య తగ్గిందని, పేకాట, గుడుంబాలపై ఉక్కుపాదం మోపి అణచివేశామని సీఎం చెప్పారు. శాంతిభద్రతల విషయంలో తాము చాలా కఠినంగా ఉంటున్నామని, నయీం కాదు ఆయన తాత అయినా ఈ ప్రభుత్వం క్షమించదని స్పష్టం చేశారు. ఎక్కడా ఉదాసీనత లేదు.. నయీం ఉదంతంలో ప్రభుత్వం కానీ, పోలీసులు కానీ ఎక్కడా ఉదాసీనంగా వ్యవహరించడం లేదని, ఏ విషయాన్ని కూడా దాచిపెట్టడం లేదని సీఎం స్పష్టంచేశారు. నయీంను ప్రాణాలతో పట్టుకుని ఉంటే బాగుండేదని, అయితే పోలీసులపై నయీం ముఠా కాల్పులకు దిగడంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో నయీం హతమయ్యాడని పేర్కొన్నారు. ఎన్కౌంటర్ అనంతరం పోలీసులు సమర్థంగా ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారని, ఇప్పటి వరకు నయీం ఉదంతంలో 740 మందికి పైగా సాక్షులను విచారించి 124 మందిని అరెస్టు చేశామని వెల్లడించారు. నయీం ముఠాకు మొత్తం 52 హత్య కేసుల్లో ప్రమేయం ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారని, అందులో 26–27 కేసుల్లో సాక్ష్యాధారాలు కూడా లభ్యమయ్యాయని తెలిపారు. ఇప్పటికే రెండు చార్జిషీట్లు వేశారని, ఇంకో 10–15 చార్జిషీట్లు వేసేందుకు సిద్ధమయ్యారని వివరించారు. కేసు దర్యాప్తు మధ్య దశలో ఉన్నందున అన్ని విషయాలను బయటపెట్టడం కుదరదని, కేసును తేల్చాలంటే పోలీసులు కొంత వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సి ఉంటుందని అన్నారు. అయినా దర్యాప్తులో ఇప్పటివరకు తేలిన అంశాలన్నింటినీ సభ ముందుంచామన్నారు. నయీం కేసు చాలా సున్నితమైనది కనుక అన్ని విషయాలను బయటకు వెల్లడించలేమని, సమయం, సందర్భం వచ్చినప్పుడు అన్ని అంశాలను బహిర్గతం చేస్తామని, అన్ని చరిత్రలు బయటకు వస్తాయని చెప్పారు. నయీం ముఠా అవశేషాలను కూడా వదిలిపెట్టేది లేదని స్పష్టంచేశారు. ఈ కేసుతో సంబంధం ఉన్నవారెవరైనా, ఏ పార్టీలో ఉన్నా, ఏ హోదాలో ఉన్నా నూరు శాతం శిక్షించి తీరుతామని, ఎవరినీ ఉపేక్షించాలన్న పిచ్చి ఆలోచన ప్రభుత్వానికి లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఎవడ్రా నయీం.. ఏమనుకుంటున్నవ్..? తన ప్రసంగంలో భాగంగా సీఎం కేసీఆర్ కొన్ని పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. టీఆర్ఎస్ నేత సాంబశివుడి హత్య జరిగిన తర్వాత ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు తాను వెళ్లానని, అప్పుడు అక్కడ జరిగిన సంస్మరణ సభలోనే నయీం దురాగతాల్ని ప్రశ్నించానని గుర్తు చేశారు. వలిగొండ సభలో ‘‘ఎవడ్రా నయీం.. ఏమనుకుంటున్నవ్... దేవుడు నీకేమైనా ఆరుచేతులిచ్చిండా.. నువ్వు చేసే పని మేం చేస్తే ఎట్టుంటది...?’’ అని ప్రశ్నించానని చెప్పారు. ఈ మాటల తర్వాత కేసీఆర్ భువనగిరి దాటి వెళ్తాడా అని కూడా వ్యాఖ్యలు చేశారని అన్నారు. అంతటి స్థాయిలో నయీం అనే పిశాచి పాతుకుపోయినా ఏమీ చేయలేక పోయారని కాంగ్రెస్, టీడీపీలను విమర్శించారు. ‘‘మేం 15 ఏళ్లు పడుకున్నం. ఇప్పుడు మీకు రెండేళ్లు ఎందుకు పట్టింది’’ అని ప్రతిపక్షాలు ప్రశ్నించడం అన్యాయమని అన్నారు. నయీం ఉదంతంపై సీఎం ప్రసంగం తర్వాత మళ్లీ జీవన్‌రెడ్డి మాట్లాడేందుకు ప్రయత్నించినా సభను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. -
'శ్రీధర్‌బాబుకు నయీంతో సంబంధాలు'
మంథని: మాజీ మంత్రి శ్రీధర్‌బాబుకు గ్యాంగ్‌స్టర్ నయీంతో సంబంధాలు ఉన్నాయంటూ మంథని ఎమ్మెల్యే పుట్టమధు ఆరోపించారు. ఈ అంశంలో పూర్తిస్థాయి విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. తన వద్ద ఉన్న ఆధారాలను ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు డీజీపీ అనురాగ్ శర్మకు అందిజేస్తానని అన్నారు. ఈ మేరకు సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు. -
నయీమ్ కేసులో ఎవర్నీ వదిలిపెట్టం: నాయిని
సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసుకు సంబంధం ఉన్న వారెవరినీ వదిలే ప్రసక్తే లేదని, రాజకీయ నేతలైనా ప్రభుత్వం ఉపేక్షించబోదని హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి స్పష్టం చేశారు. కార్మిక శాఖకు సంబంధించి గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ నివేదిక ప్రభుత్వానికి అందలేదని, అందిన వెంటనే దోషులపై ప్రభుత్వం కఠినచర్యలు చేపడుతుందని తెలిపారు. -
'నయీం కేసును సీరియల్లా సాగదీయకండి'
హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీం కేసు విచారణ డైలీ సీరియల్ సాగదీయకుండా.. త్వరగా విచారణ పూర్తిచేసి దోషులను శిక్షించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. సీబీఐ విచారణ జరిపించాలని అనేక సార్లు కోరినా.. ప్రభుత్వ పట్టించుకోవడంలేదని వెంకట్ రెడ్డి తెలిపారు. నయీంతో సంబంధాలు పెట్టుకోవాల్సిన అవసరం తమకు లేదని ఆయన పునరుద్ఘాటించారు. మరోవైపు సీఎం కేసీఆర్ మిడ్ మానేరు నిర్వాసితులను క్షమాపణ కోరిన విధంగానే రుణమాఫీపై మాటమార్చినందుకు రైతులను కూడా క్షమాపణ కోరాలని రుణమాఫీ ఏక కాలంలో పూర్తిచేయకపోవడం వల్లే రైతులు అప్పులపాలవుతున్నారు. సీఎం వద్ద ఉన్న ప్రత్యేక అభివృద్ధి నిధి రూ.4750 కోట్లను రుణమాఫీ కోసం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
‘నయీం డైరీల్లో ఉన్న లోగుట్టును బయటపెట్టాలి’
నల్లగొండ: గ్యాంగ్‌స్టర్ నయీం డైరీల్లో ఉన్న లోగుట్టును ప్రభుత్వం వెంటనే బయట పెట్టాలని తెలంగాణ ఉద్యమ వేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ చెరుకు సుధాకర్ డిమాండ్ చేశారు. శనివారం నల్లగొండలోని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నయీమ్ డైరీల వెనుక ఉన్న వ్యక్తుల పేర్లను బయటపెట్టి వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. దొరికిన ఆధారాలను దాచుకోకుండా వెంటనే కోర్టులో ప్రొడ్యూస్ చేయాలని, డైరీలను పరిశీలించేటప్పుడు వీడియో కెమెరాలు వాడాలన్నారు. సిట్ అనే సంస్థ కేసీఆర్ కనుసన్నల్లో నడుస్తోందని, ఎప్పుడు ఎవరిమీద లీకులు పేపర్లకు అందుతాయో అర్థం కావడం లేదన్నారు. సొహ్రాబుద్దీన్, కోనపురి రాములు, బెల్లి లలిత, బాబర్‌ఖాన్ లాంటి వాళ్లను నిర్ధాక్షిణ్యంగా హతమార్చిన నేరస్తుడి వివరాలను ప్రజలకు అందకుండా దాచిపెట్టడం వెనుకఉన్న కారణం ఏంటో ప్రభుత్వం వెంటనే తెలియజేయాలని డిమాండ్ చేశారు. లీకుల్లో కోమటిరెడ్డి బ్రదర్స్, బీసీ సంక్షేమం కోసం పోరాడుతున్న ఆర్. కృష్ణయ్య పేర్లుండటం వెనుక ప్రభుత్వ హస్తం ఉందన్నారు. టీఆర్ఎస్కు సంబంధించిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీల పేర్లు వినిపిస్తున్నాయని, కాబట్టి వెంటనే అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులందరినీ అరెస్ట్ చేసి ప్రజా న్యాయస్థానంలో నిలబెట్టాలని కోరారు. ఆర్. కృష్ణయ్య లాంటి వాళ్లు టీఆర్ఎస్ పార్టీలో చేరకపోవడంతో కక్ష కట్టి కేసును బనాయించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. సిట్ నిర్వహిస్తున్న విచారణపై అనుమానాలు ఉన్నందున కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. త్వరలో ఈ విషయంపై ఆందోళన చేపట్టనున్నామని సుధాకర్ చెప్పారు. -
నయీమ్ కేసులో మరో పది మంది అరెస్టు : ఐజీ
సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసులో మరో పదిమందిని అరెస్టు చేసినట్లు సిట్ చీఫ్ ఐజీ నాగిరెడ్డి తెలిపారు. వీరిలో ఒకరిని కరీంనగర్ జిల్లా కోరుట్ల పోలీసులు, మిగతా తొమ్మిది మందిని నల్లగొండ జిల్లా భువనగిరి పోలీసులు అరెస్టు చేసినట్లు చెప్పారు. అరెస్టు అయినవారిలో ఒకరు నయీమ్ బావ మహ్మద్ అషఫ్అలియాస్ అషు ఉన్నట్లు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. నయీమ్ కేసుల్లో ఇప్పటివరకు అరెస్టైన వారిసంఖ్య 77, కేసుల సంఖ్య 72కు చేరినట్లు నాగిరెడ్డి వివరించారు. ఈ కేసులన్నీ కూడా నల్లగొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాల్లోని పలు పోలీస్స్టేషన్ల పరిధిలో నమోదైనట్లు పేర్కొన్నారు. గురువారం అరెస్టు చేసినవారిలో పూత బాలకృష్ణ, ఎండీ అఖిల్ పాష, రాపోలు సుదర్శన్, జుక్కంటి బుచ్చయ్య, ఎం.డి. ఖాసింసాబ్, సుధాకర్, అడ్వకేట్ వెంకటేశ్, శ్రీనివాస్, శ్రీధర్‌రాజు, మహ్మద్ అషఫ్రఉన్నట్లు తెలిపారు. వీరిలో అషఫ్రమినహా మిగతా తొమ్మిది మంది నయీమ్ ప్రధాన అనుచరుడు పాశం శ్రీనుతో కలసి బెది రింపులు, బలవంతంగా భూముల రిజిస్ట్రేషన్ వంటి అక్రమాలకు పాల్పడినట్లు తెలిపారు. సుధాకర్, వెంకటేష్‌గౌడ్, రాపర్తి కరుణాకర్, దోర్నాల శ్రీను, శ్రీధర్రాజుముందుగా హయత్‌నగర్ కోర్టులో లొంగిపోయారు. వీరు నయీం ఎన్కౌంటర్ అనంతరం పరారీలో ఉన్నారు. వీరికి మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించగా పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. పోలీస్ కస్టడీకి ఆరుగురు చర్లపల్లి కేంద్ర కారాగారంలో విచారణ ఖైదీలుగా ఉన్న నయీం అనుచరులు ఆరుగురిని గురువారం పోలీస్ కస్టడీకి తరలించారు. రాజేంద్రనగర్ కోర్టు ఆదేశాల మేరకు శ్రీధర్‌గౌడ్, సమీరుద్దీన్లను శంషాబాద్ ఎరుుర్పోర్స్ పోలీసులు 8 రోజులు, సామ సంజీవరెడ్డి, పి.శ్రీహరిని పహాడీషరీఫ్ పోలీసులు నాలుగు రోజులు, మరో ఇద్దరు నిందితులు ఎం.డి. అబ్దుల్ఫహీం, సమేలను వనస్థలిపురం పోలీసులు రెండు రోజుల కస్టడీకి తీసుకున్నట్లు జైలు అధికారులు తెలిపారు. -
నయీం కేసులో మరో పదిమంది అరెస్టు
హైదరాబాద్: నయీం కేసులో మరికొన్ని అరెస్టులు జరిగాయి. నయీంతో కలిసి భువనగిరి ప్రాంతంలో కిడ్నాప్‌లు, బలవంతపు భూముల రిజిస్ట్రేషన్లకు, ఆయుధాల సేకరణ వంటి చర్యలకు పాల్పడిన పదిమందిని సిట్ అధికారులు తమ అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరిని కరీంనగర్ జిల్లాలోని కోరుట్ల పోలీసులు అరెస్టు చేయగా, మిగితా తొమ్మిదిమందిని నల్లగొండ జిల్లాలోని భువనగిరి పోలీసులు అరెస్టు చేశారు. పూత బాలకిషన్, ఎండీ అఖిల్ పాషా, రాపోలు సుదర్శన్, జూకంటి బుచ్చయ్య, ఎండీ ఖాసీంసాబ్, సుధాకర్, వెంకటేశ్ అడ్వకేట్, శ్రీనివాస్, శ్రీధర్ రాజు, మహ్మద్ అష్రప్(నయీం బావమరిది)ని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. పాశం శ్రీనివాస్ తో సహా మొత్తం తొమ్మిదిమంది నయీంతో పనిచేస్తూ కిడ్నాప్‌లు, ఆయుధాల సేకరణ, బలవంతపు భూకబ్జాలకు భువనగిరి పట్టణంలో పాల్పడేవారని చెప్పారు. వీరితో కలిపి ఇప్పటి వరకు నయీం కేసులో అరెస్టయిన వారి సంఖ్య మొత్తం 77కు చేరింది. నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాల్లో మొత్తం నయీంకు సంబంధింది 72 కేసులు నమోదయ్యాయి. ఇంకొంతమంది నేరస్తులను అరెస్టు చేసేందుకు పోలీసుల వేట కొనసాగిస్తున్నారు. -
నయీం పచ్చిమిర్చి రసం తాగించి...అకృత్యాలు
హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో విస్మయకర విషయాలు బయటపడుతున్నాయి. నయీం మాట వినక పోతే పచ్చిమిర్చి రసం తాగించి అత్యాచారం చేసేవాడని బాధిత బాలికలు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. నయీం తమపై పలుమార్లు అత్యాచారం చేశాడని ఆ తర్వాత ఏవో మందులు ఇచ్చేవాడని బాలికలు తెలిపారు. ఈ అకృత్యాలను నయీం బంధువులు సుల్తానా, తాహెరా, ఫహీం, హసీనా, సలీమా, తానియానే దగ్గరుండి నిర్వహించేవారన్నారు. రెండు రోజులకోసారి నయీం గదిలోకి వెళ్లాల్సిందిగా నయీం బంధువులు తమను బలవంతం చేసేవారని బాలికలు వెల్లడించారు. నయీం మాట వినకుంటే తీవ్రంగా కొట్టడంతో పాటు పచ్చిమిర్చి రసం తాగించేవాడన్నారు. నయీం అత్త సుల్తానా తనకు పెళ్లి చేస్తానని చెప్పి ఆరేళ్ల క్రితం ఇక్కడికి తీసుకొచ్చినట్లు ఓ బాధిత బాలిక తెలిపింది. అంతేకాక నయీంకు ఎదురు మాట్లాడిన ఓ బాలికను నయీం హతమార్చాడని వారు వాంగ్మూలంలో తెలిపారు. -
మంచిరెడ్డిపై డీజీపీకి మల్రెడ్డి ఫిర్యాదు
హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీం దందాలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి పాత్ర ఉందని కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంపై సిట్ తో పూర్తిస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బుధవారం ఆయన డీజీపీ అనురాగ్ శర్మను కలిశారు. నయీం ముఠాతో మంచిరెడ్డి కిషన్ రెడ్డికి సంబంధాలున్నాయని ఫిర్యాదు చేశారు. కాగా, మంచిరెడ్డిపై తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని, నిరూపించలేకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని అంతకుముందు ఆయన పేర్కొన్నారు. అయితే మల్రెడ్డి ఆరోపణలను మంచిరెడ్డి తోసిపుచ్చారు. -
ఆ ఎమ్మెల్యే జైలుకూడు తినకతప్పదు
హైదరాబాద్: కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిల మధ్య వివాదం ముదిరింది. మల్రెడ్డి రంగారెడ్డి తనపై చేసిన ఆరోపణలను రుజువు చేయాలని, లేదంటే చట్టప్రకారం చర్యలు తీసుకుంటానని మంచిరెడ్డి కిషన్‌రెడ్డి హెచ్చరించారు. ఎమ్మెల్యే అనుచరులతో వచ్చి ఇబ్రహీంపట్నం చౌరస్తాలో బైఠాయించారు. ఈ వ్యాఖ్యలపై మల్రెడ్డి స్పందిస్తూ.. తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని, నిరూపించలేకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. 'మంచిరెడ్డి సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు. ఓ గ్యాంగ్‌స్టర్ మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు. నయీంతో ఆయనకు ఏడెనిమిది సంవత్సరాల నుంచి సంబంధాలు ఉన్నాయి. దమ్ముంటే నయీంతో కలసి చేసిన దందాల మీద మాట్లాడాలి. మంచిరెడ్డి పేదల దగ్గర నుంచి భూములు లాక్కొన్నారు. ఏడేళ్ల నుంచి ఎక్కడెక్కడ కబ్జాలు చేశారో నా దగ్గర ఆధారాలున్నాయి. మంచిరెడ్డి తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే అధికార టీఆర్ఎస్లోకి వెళ్లారు. పేదల రక్తాన్ని పీల్చి వందల కోట్ల రూపాయలు సంపాదించారు. నయీం కేసులో సంబంధాలున్నవారిని అరెస్ట్ చేసినట్టే మంచిరెడ్డిపై కూడా చర్యలు తీసుకోవాలి. ఆయన దళిత కుటుంబాలను మోసం చేశాడు. నా దగ్గర ఆధారాలున్నాయి. మంచిరెడ్డి దొరికిన దొంగ, తప్పించుకోలేరు. జైలు కూడు తినకతప్పదు' అని మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. -
మల్‌రెడ్డికి ఎమ్మెల్యే మంచిరెడ్డి సవాల్
రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం చౌరస్తాలో సోమవారం మధ్యాహ్నం ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తనపై చేసిన ఆరోపణలను రుజువు చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అనుచరులతో వచ్చి స్థానిక చౌరస్తాలో బైఠాయించారు. మల్రెడ్డి చర్చకు రావాలని ఎమ్మెల్యే సవాల్ విసిరారు. (చదవండి 'ఎమ్మెల్యే మంచిరెడ్డికి నయీంతో సంబంధాలు!') ఈ సందర్భంగా ఎమ్మెల్యే మంచిరెడ్డి మాట్లాడుతూ...మరో రెండు గంటలు ఇక్కడే ఉంటానన్నారు. గ్యాంగ్‌స్టర్ నయీంతో తనకు సంబంధముందన్న ఆరోపణలను మల్రెడ్డి రుజువు చేయాలన్నారు. దమ్ము, ధైర్యం లేకే మల్రెడ్డి మొహం చాటేశారని మంచిరెడ్డి ఆరోపించారు. ఆరోపణలు నిరూపించకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటానని మంచిరెడ్డి హెచ్చరించారు. (చదవండి : 'నయీంతో నాకెలాంటి సంబంధాలు లేవు' ). -
'నయీం కేసులో పెద్దల పేర్లు బహిర్గతం చేయాలి'
-టీయూడబ్ల్యూజే సెక్రటరీ జనరల్ అమర్ వరంగల్ : గ్యాంగ్‌స్టర్ నయూం కేసులో కావాలని జర్నలిస్టుల పేర్లు బయటపెట్టిన సిట్ అధికారి నాగిరెడ్డి.. నయీంతో ములాఖత్ అయి కోట్లు గడించిన రాజకీయ నేతలు, పోలీసు అధికారుల పేర్లు బహిర్గతం చేయాలని టీయూడబ్ల్యూజే(ఐజేయూ) సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్ డిమాండ్ చేశారు. ఆదివారం వరంగల్‌లో జరిగిన టీయూడబ్ల్యూజే(ఐజేయూ) జిల్లా సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓ ప్రోగ్రామ్ కవరేజీకి వెళ్లిన విలేకరులకు రూ.300 విలువైన వాచ్ ఇస్తే నల్లగొండ జిల్లాలోని 67 మంది విలేకరుల పేర్లు బహిర్గతం చేసి ఎఫ్ఐఆర్లో పెడతారా ? అని అమర్ ప్రశ్నించారు. అధికారులు కావాలనే జర్నలిస్టులను అణచివేసే ప్రయత్నం చేస్తున్నారని, నల్లగొండ ఘటనే దీనికి నిదర్శనమన్నారు. పోరాటాల ద్వారానే జర్నలిస్టుల సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు. ఇప్పుడున్న యూనియన్లు సర్కారీ సంఘాలని, జర్నలిస్టుల సమస్యల పట్ల ఎదుటి సంఘానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. మావోయిస్టు నేత జగన్ జర్నలిస్టుల సమస్యలపై లేఖ ద్వారా స్పందిస్తే కావాలనే ఐజేయూ నేతలు ప్రకటన ఇప్పించారానడం నీచ సంస్కృతికి నిదర్శమన్నారు. ఈ కార్యక్రమంలో సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి మాట్లాడుతూ... జర్నలిస్టు జీవితం సమాజానికి అంకితమన్నారు. రాజకీయ నేతలు అధికారంలోకి రాక ముందు జర్నలిస్టులతో మిత్రులుగా ఉంటారని, అధికారంలోకి వచ్చాక శత్రువులుగా మారుతారని అన్నారు. జర్నలిస్టులు ఎప్పుడూ ప్రజల పక్షానే నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు. యూనియన్ జిల్లా కన్వీనర్ టి.శ్రీధర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర నేతలు కరుణాకర్, డి.క్రిష్ణారెడ్డి, డి.రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
'ఎమ్మెల్యే రూ.300 కోట్లు సంపాదించాడు'
హైదరాబాద్ : గ్యాంగ్‌స్టర్ నయీం ప్రధాన అనుచరుడు శ్రీహరితో కలిసి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి భారీగా అక్రమాలకు పాల్పడ్డారని కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఆరోపించారు. హైదరాబాద్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఎమ్మెల్యే మంచిరెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నయీం కేసులో శ్రీహరిని అరెస్ట్ చేసిన పోలీసులు ఎమ్మెల్యే మంచిరెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదని రంగారెడ్డి ప్రశ్నించారు. శ్రీహరితో కలిసి ఎమ్మెల్యే రూ.300 కోట్లు సంపాదించాడని ఆయన ఆరోపించారు. ఆదిభట్లలోని భూ కబ్జా విషయాలు బయటకొస్తాయనే భయంతోనే మంచిరెడ్డి పార్టీ మారారన్నారు. ఎమ్మెల్యే అవినీతిపై ఇబ్రహీంపట్నం చౌరస్తాలో బహిరంగ చర్చకు సిద్ధమని రంగారెడ్డి సవాల్ విసిరారు. -
పోలీసు శాఖలో కదులుతున్న డొంక
- పోలీసు అధికారుల అక్రమాస్తుల్ని గుర్తించిన సిట్ నల్లగొండ క్రైం: నయూమ్‌తో అంటకాగిన జిల్లా పోలీస్ అధికారుల డొంక కదులుతోంది. ఇప్పటికే నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఓ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న ఓ సీఐని బాధ్యతల నుంచి తప్పించి డీసీఆర్‌బీకీ అటాచ్ చేసిన విషయం తెలిసిందే. ఆయన నయూమ్ అనుచరులతో చేతులు కలిపి హత్యలు, భూదందాల్లో సహకరించి మహబూబ్‌నగర్, నిజామాబాద్, నల్లగొండ జిల్లాల్లో స్థిరాస్తులు సంపాదించినట్లు సిట్ అధికారులు గుర్తించినట్లు పోలీసు వర్గాల ద్వారా తెలిసింది. అక్రమంగా సంపాదించిన డబ్బుతో వ్యవసాయ భూములు, స్థిరాస్తులను కొనుగోలు చేసిన సీఐ తన కుటుంబ సభ్యుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. ఉద్యోగ విరమణ చేసి దేవరకొండ రోడ్డులోని ప్రేరణ కాన్సెప్ట్ స్కూల్ సమీపంలో నివాసముంటున్న ఓ సీఐ స్థారుు అధికారి కూడా నయీమ్ అనుచరులను అడ్డం పెట్టుకుని ఇళ్లస్థలాలు తక్కువ ధరకు కొనుగోలు చేసినట్లు కూడా సిట్ గుర్తించినట్లు తెలిసింది. నయీం అనుచరులతో మరో ముగ్గురు సీఐలకు ఉన్న లింకును కూడా సిట్ గుర్తించినట్టు సమాచారం. సిట్ పోలీసుల అదుపులో వలిగొండ ఎంపీపీ వలిగొండ: నయీమ్ కేసులో నల్లగొండ జిల్లా వలిగొండ ఎంపీపీ శ్రీరాముల నాగరాజును హైదరాబాద్‌లో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ఇంటి సమీపంలో సిట్ పోలీస్ అధికారులు బుధవారం కస్టడీలోకి తీసుకున్నట్లు సమాచారం. అక్కడ నుంచి వలిగొండ పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నట్లు తెలిసింది. ఇక నయీమ్‌కు ప్రధాన అనుచరుడైన భువనగిరికి చెందిన పాశం శ్రీనుకు ఎంపీపీ నాగరాజు బంధువు. కోర్టులో లొంగిపోయిన శ్రీహరి హైదరాబాద్ : నయీమ్ అనుచరుడు పి. శ్రీహరి (50) బుధవారం సైబరాబాద్ 14 వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో లొంగి పోయాడు. పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో శ్రీహరి మూడో ముద్దాయిగా ఉన్నాడు. మేజిస్ట్రేట్ కోర్టు శ్రీహరికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ కేసును ఈ నెల 14కు వాయిదా వేసింది. భువనగిరి కోర్టుకు పాశం శ్రీను, సుధాకర్ భువనగిరి: గ్యాంగ్‌స్టర్ నయీమ్ అనుచరులు పాశం శ్రీను, సందెల సుధాకర్‌లను బుధవారం భువనగిరి కోర్టులో పీటీ వారంట్‌పై హాజరుపర్చారు. పీడీ యాక్టు నమోదుతో వరంగల్ జైలులో ఉన్న వీరిని భువనగిరి రూరల్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసుల్లో బుధవారం ఉదయం కోర్టులో హాజరుపర్చారు. అయితే ఇప్పటికే పాశం శ్రీనును తమకు అప్పగించాలని సిట్ పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్‌ను అంగీకరించి జడ్జి మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతి నిచ్చారు. ఈనెల 3 వ తేదీ వరకు కస్టడీ పిటిషన్‌కు జడ్జి అనుమతి నిచ్చారు. దీంతో సిట్ పోలీసులు పాశం శ్రీను ను రహస్య ప్రాంతానికి తరలించి విచారణ ప్రారంభించారు. నయీమ్ అనుచరుడిగా పలు కేసుల్లో పాశం శ్రీను ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. -
నయీంతో ఎలాంటి సంబంధాలు లేవు: శ్రీహరి
హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీంతో తనకు ఎలాంటి సంబంధాలు లేవని నయీం అనుచరుడు శ్రీహరి తెలిపాడు. రంగారెడ్డి జిల్లా కోర్టులో బుధవారం లొంగిపోయిన అతడు.. సాక్షి టీవీతో మాట్లాడాడు. రియల్ ఎస్టేట్ పరంగానే నయీంతో తనకు పరిచయం ఏర్పడిందని శ్రీహరి తెలిపాడు. నయీం కేవలం న్యాయపరమైన సలహాలకు మాత్రమే తనను సంప్రదించేవాడని చెప్పాడు. తనపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని ఆయన పేర్కొన్నాడు. తామిద్దరి మధ్య ఎలాంటి లావాదేవీలు లేవన్నాడు. నయీమే తనపై 2013లో దాడి చేసినట్లు శ్రీహరి వెల్లడించాడు. 2006వ సంవత్సరంలో ఆదిభట్లలో 4 ఎకరాల భూమి కొనుకున్నానని...ఆ సమయంలో పక్కపొలం వారు భూమి కబ్జాకు యత్నించడంతో వారిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానన్నాడు. -
నయీం కీలక అనుచరుడి అరెస్ట్
హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో మరో కీలక అనుచరుడు బుధవారం లొంగిపోయాడు. రంగారెడ్డి జిల్లా కోర్టులో లొంగిపోయిన వ్యక్తిని శ్రీహరిగా గుర్తించారు. సొహ్రాబుద్దీన్ గుజరాత్ ఎన్కౌంటర్ కేసులో ఆయన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా ఉన్నాడు. నయీం ఎన్కౌంటర్ అనంతరం శ్రీహరి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. నాటకీయ పరిణామాల మధ్య బుధవారం కోర్టులో లొంగిపోవడంతో... ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. నయీం కేసులో ఇప్పటికే సుమారు 50 మంది నయీం అనుచరులను సిట్ బృందం అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. మరికొందరి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేసింది. తాజాగా శ్రీహరి లొంగుబాటుతో మరిన్ని కేసులు కొలిక్కి వచ్చే అవకాశముంది. -
'ఆ ఇద్దరు ఎమ్మెల్యేలను బర్తరఫ్ చేయాలి'
చండూరు: నల్లగొండ జిల్లాలో అక్రమాలకు పాల్పడుతున్న ఇద్దరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం నల్లగొండ జిల్లా చండూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలిద్దరూ భూ కబ్జాలు, నకిలీ నోట్లు, ఇసుక దందాలు చేస్తున్నా సీఎం కేసీఆర్ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల సూర్యాపేటలో ఓ భూ వివాదంలో ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఐదు రాష్ట్రాల్లో అక్రమ ఆస్తులు సంపాదించిన గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. సిట్ విచారణ చేస్తే న్యాయం జరగదని...వెంటనే ప్రభుత్వం కేంద్రానికి లేఖరాసి కేసు సీబీఐకి అప్పగించాలని కోరారు. నయీమ్‌కు టీఆర్ఎస్ పార్టీ నేతలతో 90 శాతం వరకు సంబంధాలున్నాయని చెప్పారు. నయీమ్‌తో సంబంధాలు ఉన్న ఓ టీఆర్ఎస్ నాయకుడిపై ఇటీవలే కేసు నమోదైందని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. -
నయీమ్‌కు 20 ఇళ్లు
-
నయీమ్‌కు 20 ఇళ్లు
ఇప్పటివరకు 20 మందిని అరెస్టు చేశాం: సిట్ చీఫ్ నాగిరెడ్డి సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్‌కు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 20 ఇళ్లను గుర్తించామని సిట్ చీఫ్ వై.నాగిరెడ్డి వెల్లడించారు. ఇప్పటివరకు నిర్వహించిన సోదాల్లో భారీగా ల్యాండ్ డాక్యుమెంట్లతోపాటు ఇళ్లనూ గుర్తించినట్లు పేర్కొన్నారు. శనివారం సిట్ అధికారులతో పాటు నయీమ్‌పై కేసులు నమోదైన స్టేషన్లకు చెందిన అధికారులతో నాగిరెడ్డి సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. నయీమ్ రెండు హత్యలు చేసినట్లు నార్సింగ్ పోలీసుల విచారణలో నిర్ధారణైనట్లు తెలిపారు. నదీమ్ అలియాస్ విజయ్‌కుమార్, వంట మనిషి నస్రీన్లను హత్య చేశారని, వీరి మృతదేహాలను ఎక్కడ పడేశారనేది గుర్తించాల్సి ఉందని చెప్పారు. నయీమ్ సోదరుడు అలీమ్ భార్య హీనా, అతని కూతురు చియాన్ అదృశ్యమయ్యారని, దాని వెనకా గ్యాంగ్‌స్టర్ హస్తమున్నట్లు తెలుస్తోందన్నారు. నయీమ్ ఎన్కౌంటర్ తర్వాత ఇప్పటివరకు 20 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. షాద్‌నగర్, నార్సింగ్ పోలీసులు అరెస్టు చేసిన నిందితులను కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసినట్లు వివరించారు. మిర్యాలగూడ వన్‌టౌన్, వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో అరెస్టైన వారిని కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోరుతూ పిటిషన్ దాఖలు చేశామన్నారు. నయీమ్‌తో సాన్నిహిత్యం ఉన్న తోట కుమరస్వామి అలియాస్ టెక్‌మధు, అలియస్ రఘు, అలియాస్ అశోక్‌తో పాటు రేవల్లి శ్రీని వాస్ అలియాస్ రమేశ్‌లను భువనగిరి పోలీ సులు అరెస్టు చేశారన్నారు. నయీమ్ అతని అనుచరులపై కొత్తగా మరో 4 కేసులు నమోదయ్యాయని, మొత్తం కేసుల సంఖ్య 16కు చేరిందన్నారు. తాజాగా నమోదైన వాటిల్లో కోరుట్ల, కరీంనగర్ రూరల్ పోలీస్స్టేషన్ల పరిధిలో బలవంతపు వసూళ్లకు సంబంధించి కేసులున్నాయని వివరించారు. సిట్ ఇచ్చిన కంట్రోల్ నంబర్‌కు ఇప్పటి వరకు బాధితుల నుంచి 60 ఫోన్‌కాల్స్ రాగా... వారిని సంబంధిత పోలీస్స్టేషన్ల పరిధిలో ఫిర్యాదు చేయాల్సిందిగా కోరినట్లు తెలిపారు. సంబంధిత స్టేషన్‌హౌస్ అధికారులకూ కేసులు నమోదు చేయాలని ఆదేశించడంతో పాటు వాటికి సంబంధించిన సీడీ ఫైల్‌ను సిట్‌కు బదిలీ చేయాల్సిందిగా సూచించారు. రాజేంద్రనగర్ ఏసీపీ కార్యాలయంలో నిర్వహించిన సుదీర్ఘ సమావేశంలో సైబరాబాద్ పరిధిలోని శంషాబాద్ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్, రాజేంద్రనగర్ ఏసీపీ గంగారెడ్డి, నార్సింగ్, వనస్థలిపురం ఇన్స్పెక్టర్లు, కరీంగనర్‌లోని రాయికల్ ఇన్స్పెక్టర్, నల్లగొండ జిల్లా భువనగిరి, మిర్యాలగూడ ఇన్స్పెక్టర్లు, మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ ఇన్స్పెక్టర్ పాల్గొన్నారు. మహిళలు, పిల్లలే కవచాలుగా.. గ్యాంగ్‌స్టర్ నయీమ్ పోలీసుల తనిఖీల నుంచి తప్పించుకునేందుకు మానవ కవచాలుగా మహిళలు, పిల్లలను ఉపయోగించుకున్నట్లు దర్యాప్తులో వెలుగు చూసినట్లు నాగిరెడ్డి తెలిపారు. అలాగే స్త్రీ వేషధారణతో తరచుగా ప్రయాణాలు చేసేవాడన్నారు. నయీమ్ తాజా ఫోటోలను విడుదల చేసిన నాగిరెడ్డి.. అతడు నివసించిన ప్రదేశాలు, నేరాలకు సంబంధించిన సమాచారం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. సమాచారాన్ని ఫోన్/ఎస్ఎంఎస్/వాట్సప్ ద్వారా లేదా సిట్ కంట్రోల్ నంబర్ 9440627218కు అందజేయాలని సూచించారు. నయీమ్ ముఠా సభ్యులు, అనుచరులను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ప్రస్తుతం నయీమ్ దగ్గరి వారికి సంబంధించి దర్యాప్తు చేస్తున్నామని.. మున్ముందు బినామీలతోపాటు ఎవరున్నా వారందరినీ బయటకు తెస్తామన్నారు. కోడ్ భాష ఏంటో తెలుసుకోండి... నయీమ్ ఇంటి వద్ద లభించిన డైరీలో ఉన్న కోడ్ భాష ఏంటో తెలుసుకోవడంపై పోలీసులు దృష్టి సారించారు. ఇందుకు ఇప్పటికే అదుపులోకి తీసుకున్న నయీమ్ అనుచరులందరిని ప్రశ్నించాలని శనివారం సిట్ చీఫ్ నాగిరెడ్డి పోలీసులను ఆదేశించినట్టు తెలిసింది. ఆ కోడ్ భాష తెలిస్తే విచారణ సులువవుతుందని, సాధ్యమైనంత తొందరగా ఆ పని చేయాలని సూచించినట్టు సమాచారం. భూముల లెక్కల కోసం ప్రత్యేక బృందాలు నయీమ్ ఎన్కౌంటర్ తర్వాత వెలుగులోకి వస్తున్న భూముల విలువ తేల్చడంపైనా సిట్ చీఫ్ ఆధ్వర్యంలో జరిగిన భేటీలో చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఒకట్రెండు రోజుల్లో రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయనున్నారు. ఆ భూముల డాటాను సేకరించాలని, ప్రస్తుతం బాధితులు చెబుతోంది కరెక్టా కాదా అన్నది తేల్చాలని నాగిరెడ్డి సూచించారు. అలాగే నయీమ్ తన డైరీలో రాసుకున్న వారి ఇంటికి వెళ్లి పూర్తి వివరాలను సేకరించాలని పేర్కొన్నారు. -
'ఆడ' నయీంను చూస్తారా!
హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీం వేసిన వేషాలు అన్నీఇన్నీ కావు. ప్రమాదకరమైన నేరసామ్రాజ్యాన్ని సృష్టించడంలో ఆరితేరిపోయిన ఈ నేరగాడు.. పోలీసుల నుంచి తప్పించుకోవడంలోనూ అనేక నక్కజిత్తులు వేశాడు. 'బిజినెస్ మ్యాన్'లాంటి మాఫియా సినిమాను తలదన్నేస్థాయిలో నేరప్రపంచాన్ని సృష్టించి రాజకీయ నేతలు మొదలు పోలీసుల వరకు వ్యవస్థతో పెద్ద ఎత్తున నయీం పెట్టుకున్న సంబంధాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తూ.. విస్మయ పరుస్తున్నాయి. చాపకింద నీరులా అండర్ వరల్డ్ మాఫియా డాన్‌గా ఎదిగి తన సామ్రాజ్యాన్ని విస్తరించుకున్న తీరు వెలుగులోకి వస్తోంది. నక్కజిత్తుల నయీం చాలా మారువేషాల్లో తప్పించుకొని తిరిగిన విషయం తెలిసిందే. పోలీసుల కళ్లుగప్పి యథేచ్ఛగా తిరిగేందుకు, ఎవరికీ అనుమానం రాకుండా తన పనులు చక్కబెట్టుకునేందుకు నయీం ఆడవేషంలో కూడా సంచరించాడు. అచ్చం మహిళలాగే కనిపించేందుకు, మగువ తరహాలోనే ఆహార్యం, నడక, నడవడిక ఉండేందుకు ప్రత్యేకంగా అతడు ట్రైనింగ్ కూడా తీసుకొన్నాడట. ఈ నేపథ్యంలోనే నయీం ఆడవేషంలో ఉన్న ఫొటోలను సిట్ స్వాధీనం చేసుకుంది. గాగ్రా-చోళీ వేసుకొని మెడలో నగలు ధరించి, జడలో పూలు, నుదుటిన పాపిడబిళ్ల పెట్టుకొని వగలుపోతున్న నయీం ఫొటో వెలుగులోకి వచ్చింది. ఆ ఫొటోలో నయీం అమ్మాయిలా వయ్యారాలు పోతున్న తీరును ఇక్కడ చూడొచ్చు! -
అమ్మాయిల వేషంలో నయీం...