'ఆడ' నయీంను చూస్తారా!
హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీం వేసిన వేషాలు అన్నీఇన్నీ కావు. ప్రమాదకరమైన నేరసామ్రాజ్యాన్ని సృష్టించడంలో ఆరితేరిపోయిన ఈ నేరగాడు.. పోలీసుల నుంచి తప్పించుకోవడంలోనూ అనేక నక్కజిత్తులు వేశాడు. 'బిజినెస్ మ్యాన్'లాంటి మాఫియా సినిమాను తలదన్నేస్థాయిలో నేరప్రపంచాన్ని సృష్టించి రాజకీయ నేతలు మొదలు పోలీసుల వరకు వ్యవస్థతో పెద్ద ఎత్తున నయీం పెట్టుకున్న సంబంధాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తూ.. విస్మయ పరుస్తున్నాయి. చాపకింద నీరులా అండర్ వరల్డ్ మాఫియా డాన్‌గా ఎదిగి తన సామ్రాజ్యాన్ని విస్తరించుకున్న తీరు వెలుగులోకి వస్తోంది.
నక్కజిత్తుల నయీం చాలా మారువేషాల్లో తప్పించుకొని తిరిగిన విషయం తెలిసిందే. పోలీసుల కళ్లుగప్పి యథేచ్ఛగా తిరిగేందుకు, ఎవరికీ అనుమానం రాకుండా తన పనులు చక్కబెట్టుకునేందుకు నయీం ఆడవేషంలో కూడా సంచరించాడు. అచ్చం మహిళలాగే కనిపించేందుకు, మగువ తరహాలోనే ఆహార్యం, నడక, నడవడిక ఉండేందుకు ప్రత్యేకంగా అతడు ట్రైనింగ్ కూడా తీసుకొన్నాడట. ఈ నేపథ్యంలోనే నయీం ఆడవేషంలో ఉన్న ఫొటోలను సిట్ స్వాధీనం చేసుకుంది. గాగ్రా-చోళీ వేసుకొని మెడలో నగలు ధరించి, జడలో పూలు, నుదుటిన పాపిడబిళ్ల పెట్టుకొని వగలుపోతున్న నయీం ఫొటో వెలుగులోకి వచ్చింది. ఆ ఫొటోలో నయీం అమ్మాయిలా వయ్యారాలు పోతున్న తీరును ఇక్కడ చూడొచ్చు!