197 కేసులు.. 125 అరెస్ట్‌లు | 125 arrests and 197 cases in the name of Nayeem | Sakshi
Sakshi News home page

197 కేసులు.. 125 అరెస్ట్‌లు

Published Tue, Feb 21 2017 3:32 AM | Last Updated on Tue, Nov 6 2018 4:42 PM

197 కేసులు.. 125 అరెస్ట్‌లు - Sakshi

197 కేసులు.. 125 అరెస్ట్‌లు

‘నయీమ్‌’ కేసులపై సిట్‌ చీఫ్‌ వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: నయీమ్‌ కేసులో ఇప్పటివరకు 197 కేసులు నమోదు చేసి, 125 మందిని అరెస్ట్‌ చేశామని సిట్‌ చీఫ్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 330 మందిని పీటీ వారెంట్‌పై విచారించామని, 107 మంది పోలీస్‌ కస్టడీలోనే ఉన్నారన్నారు. 878 సాక్షులను విచారించామ ని, 18 కేసుల్లో చార్జిషీట్‌ దాఖలు చేసినట్టు చెప్పారు.

14 మంది నయీమ్‌ అనుచరులపై పీడీ యాక్టులు మోపామని, వారిలో పాశం శ్రీను, సందెలా సుధాకర్, అబ్దుల్‌ నాసర్, బాచు నాగరాజు, పులి నాగరాజు, సారగడి హరి, కత్తుల జంగయ్య, సామ సంజీవరెడ్డి, తబ్రేజ్, గుమ్మడివాలి శ్రీనివాస్, షేక్‌ జహంగీర్, షేక్‌ జానీపాషా, షేక్‌ అబ్దుల్లా, మహ్మద్‌ ముబీన్‌ అలియాస్‌ కాలా ముబీన్‌ ఉన్నారన్నారు. త్వరలోనే మిగతా కేసుల్లోనూ చార్జిషీట్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement