సిట్ అధికారులను కలిసిన బాధితురాలు
సిద్దిపేట రూరల్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ నీడలు మెదక్ జిల్లా సిద్దిపేటకు పాకారుు. భూవివాదంలో నయీమ్ పేరుతో తనను ఒకరు బెది రించారని బాధిత మహిళ రెండు రోజుల క్రితం సిట్ అధికారులను ఆశ్రరుుంచింది. సిద్దిపేటకు చెందిన ఆత్మ లక్ష్మీ 2008 సంవత్సరంలో హౌసింగ్ బోర్డులోని 1340 సర్వే నంబర్‌లో 13 గుంటల భూమి కొనుగోలు చేసేందుకు పట్టణానికి చెందిన రియల్టర్ బత్తుల చంద్రం వద్ద రూ. 7.70 లక్షలకు రిజిస్టర్ భూమిగా బేరం కుదుర్చుకుంది. సదరు భూమికి మొదట రూ.5.70 లక్షలు ఇచ్చి, రూ.2 లక్షలకు చెక్కు ఇచ్చింది. ఈ మేరకు రిజిస్టర్ చేయాలని చంద్రంను కోరగా అది రిజి స్టర్ భూమి కాదని, నోటరీ చేసుకోవాలని సూచించాడు.
దీంతో బాధితురాలు అప్పట్లోనే స్థానిక పోలీసులను ఆశ్రరుుంచారు. పోలీసులు పట్టించుకోకపోవడంతో పెద్దల సమక్షంలో పంచారుుతీ కొనసాగింది. దీంతో రూ.3.90 లక్షలు బాధితురాలికి తిరిగి ఇచ్చి, మిగతా డబ్బులకు 6 గుంటల భూమి ఇస్తానని చంద్రం ఒప్పుకున్నాడు. కాగా, ఆరు గుంటల భూమిని చూపించాలని లక్ష్మీ వెళ్లగా.. ‘నీకు భూమి ఇచ్చేది లేదు. నేను నయీమ్ ముఠా సభ్యుడిని’ అని చంద్రం బెదిరించాడు. దీంతో కుటుంబ సభ్యులతో కలసి లక్ష్మీ హైదారాబాద్‌కు వలస వెళ్లింది. ఇటీవల నయీమ్ ఉదం తం బయటకు రావడంతో ఫిర్యాదు చేసింది. సిట్ చీఫ్ నాగిరెడ్డి సమగ్ర దర్యాప్తు కోసం ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డిని ఆదేశించారు.
నయీమ్ పేరిట బెదిరింపులు
Published Thu, Sep 15 2016 12:57 AM | Last Updated on Tue, Nov 6 2018 4:42 PM
Advertisement
Advertisement