గ్యాంగ్స్టర్ నయీం వేషధారణ మార్చి అమ్మాయిల రూపంలోనూ, అనేక వేషాల్లో తిరిగాడని (ప్రత్యేక దర్యాప్తు సంస్థ) సిట్ చీఫ్ నాగిరెడ్డి తెలిపారు. శనివారం రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో సిట్ బృందం సమావేశనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ....అమ్మాయిల వేషధారణలో నయీం తిరిగిన ఫోటోలను త్వరలో విడుదల చేస్తామన్నారు.