నయీం దందాలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి పాత్ర ఉందని మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఆరోపించారు.
హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీం దందాలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి పాత్ర ఉందని కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంపై సిట్ తో పూర్తిస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బుధవారం ఆయన డీజీపీ అనురాగ్ శర్మను కలిశారు. నయీం ముఠాతో మంచిరెడ్డి కిషన్ రెడ్డికి సంబంధాలున్నాయని ఫిర్యాదు చేశారు.
కాగా, మంచిరెడ్డిపై తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని, నిరూపించలేకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని అంతకుముందు ఆయన పేర్కొన్నారు. అయితే మల్రెడ్డి ఆరోపణలను మంచిరెడ్డి తోసిపుచ్చారు.