Malreddy Ranga Reddy
-
‘పట్నం’ కాంగ్రెస్‌లో ముసలం!
రంగారెడ్డి జిల్లా: ఇబ్రహీంపట్నం కాంగ్రెస్‌లో ముసలం పుట్టింది. ఓ వైపు ఎన్నికల గడువు సమీపిస్తుండగా.. మరో వైపు పార్టీలో అంతర్గత పోరు తార స్థాయికి చేరుకుంది. ఇప్పటికే పలువురు ద్వితీయ శ్రేణి నాయకులు కాంగ్రెస్‌ను వీడి అధికార పార్టీలో చేరగా.. తాజాగా మరికొంత మంది అదే బాటలో పయనించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటి వరకు బీఆర్ఎస్కు గట్టి పోటీ ఇస్తుందని భావించిన కాంగ్రెస్ పార్టీ.. ఉన్నత స్థాయి నేతల తీరుతో అప్రతిష్ట పాలవుతోంది. మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, సీనియర్ నేతలు దండెం రామిరెడ్డి, మర్రి నిరంజన్‌రెడ్డి నియోజకవర్గంలో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. వీరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. పార్టీ సంక్షోభ సమయంలో అంతా కలిసి పని చేయాల్సి ఉండగా.. ఎవరికి వారే అనే చందంగా సాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ నాకంటే.. నాకే వస్తుందని ప్రచారం చేసుకుంటూ గ్రూపు రాజకీయాలకు తెరలేపారు. వీరి ప్రవర్తన నచ్చక ఇప్పటికే గ్రామాల్లోని పలువురు ద్వితీయ శ్రేణి నాయకులు బీఆర్ఎస్లో చేరడం గమనార్హం. తాజాగా తుర్కయాంజాల్, పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీలకు చెందిన పలువురు కౌన్సిలర్లు సైతం పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. నేతల మధ్య కొట్లాట పట్నం నియోజకవర్గానికి 1952 నుంచి 2018 వరకు 16సార్లు ఎన్నికలు జరిగాయి. ఎనిమిది సార్లు కాంగ్రెస్, మూడుసార్లు సీపీఎం, నాలుగుసార్లు టీడీపీ, ఒకసారి బీఆర్ఎస్ గెలుపొందాయి. జిల్లాలో కాంగ్రెస్‌కు మంచి పట్టున్న నియోజకవర్గాల జాబితాలో ఇది మొదటి స్థానంలో ఉంటుంది. 2018 ఎన్నికల్లో టీడీపీతో పొత్తులో భాగంగా ఈ సీటును సామరంగారెడ్డికి త్యాగం చేయాల్సి వచ్చింది. అప్పటికే కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించి పొత్తులో భాగంగా భంగపడిన మల్రెడ్డి రంగారెడ్డి ఆ తర్వాత బీఎస్పీ నుంచి పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. అనంతరం జరిగిన సర్పంచ్, మండల, జిల్లా పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులే మెజార్టీ సీట్లు దక్కించుకున్నారు. క్షేత్ర స్థాయిలో పార్టీకి గట్టిపట్టుంది. అయితే ప్రస్తుతం సీనియర్ నేతల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలు ఆ పార్టీకి శాపంగా మారాయి. మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీకి సన్నాహాలు చేసుకుంటుండగా.. మరో వైపు ఎంపీ కోమటిరెడ్డి వర్గంగా చెప్పుకుంటున్న మర్రి నిరంజన్‌రెడ్డి, గ్రేటర్ పరిధిలోని ఓ బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు సన్నిహితుడిగా చెప్పుకొనే దండెం రామిరెడ్డి సైతం ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డి సొంత నియోజకవర్గంలోనే పార్టీ నేతల మధ్య సమన్వయం కొరవడటం విశేషం. పార్టీని వీడే యోచన తుర్కయాంజాల్ మున్సిపల్ పరిధిలోని మాజీ ఎంపీపీ, రైతుసేవా సహకార సంఘం బ్యాంకు మాజీ చైర్మన్ రొక్కం భీంరెడ్డి సహా ఎనిమిది మంది కౌన్సిలర్లు, మరో ముగ్గురు కో ఆప్షన్ మెంబర్లు కాంగ్రెస్‌ను వీడి.. బీఆర్ఎస్లో చేరే యోచ నలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీరంతా స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డితో టచ్‌లో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. భీంరెడ్డి గతంలో టీడీపీలో పని చేశారు. 2018లో టీడీపీ టికెట్ ఆశించారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. ప్రస్తుతం ఆయనకు ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ మల్రెడ్డి రంగారెడ్డి, భీంరెడ్డికి మధ్య సఖ్యత లేదు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రెండున్నరేళ్లకు చైర్మన్ పీఠాన్ని భీంరెడ్డి కోడలికి ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. కానీ ఇప్పటికీ అది నిలబెట్టుకోలేదు. దీంతో వారంతా పార్టీ మారేందుకు సన్నాహాలు చేస్తున్నారు. భీంరెడ్డి వర్గీయులు పార్టీ వీడకుండా మల్రెడ్డి వర్గీయులు బుజ్జగింపులు.. బేరసారాలకు దిగుతున్నారు. అయినా వారు పట్టు వీడటం లేదు. ఈ నెల 19న మంత్రి కేటీఆర్ సమక్షంలో వీరంతా పార్టీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీలోని పలువురు కాంగ్రెస్ కౌన్సిలర్లు నియోజకవర్గ ఇన్చార్జ్ మల్రెడ్డి సోదరుల నాయకత్వాన్ని విభేదిస్తున్నారు. వీరంతా పక్క బాటపట్టే అవకాశం లేకపోలేదు. -
తహసీల్దార్ హత్యపై రాజకీయ దుమారం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి సజీవ దహనంపై జిల్లాలో రాజకీయ రగడ మొదలైంది. లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత చల్లబడిన రాజకీయం.. విజయారెడ్డి హత్యోదంతంతో క్రమంగా వేడెక్కుతోంది. తహసీల్దార్ హత్యకు నువ్వంటే.. నువ్వే కారణమని స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఒకరిపై ఒకరు మీడియా వేదికగా ఆరోపించుకుంటున్నారు. ఆది నుంచి వీరు రాజకీయ ప్రత్యర్థులు. ఒకరంటే ఒకరికి పడని వీరిద్దరూ మాటల తూటాలు పేల్చుతూ సవాల్.. ప్రతి సవాల్ విసురుకుంటున్నారు. సోమవారం రైతు కూర సురేష్ తహసీల్దార్ విజయారెడ్డిపై కార్యాలయంలోనే పెట్రోల్ పోసి నిప్పటించడంతో సజీవదహనమైన చేసిన విషయం తెలిసిందే. ఈ అమానుషానికి ప్రధాన కారణమైన భూముల వ్యవహారంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే హస్తం ఉందని మల్రెడ్డి రంగారెడ్డి ఆరోపణల బాంబ్ పేల్చడంతో వివాదం రాజుకుంది. భూముల నిగ్గు తేల్చేందుకు సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేసిన ఆయన... ల్యాండ్ మాఫియాకు ఎమ్మెల్యే నాయకత్వం వహిస్తున్నారని తీవ్రపదజాలంతో విరుచుకుపడటం సర్వత్రా చర్చనీయాంశమయింది. రూ.వేల కోట్లు ఎలా వచ్చాయ్? భూ మాఫియా అంటేనే మల్రెడ్డి రంగారెడ్డి. గత 20 ఏళ్లుగా ఆయనకు ఆస్తులు, భూములు ఎలా వచ్చాయో విచారణ జరిపితే తెలుస్తుంది. వందశాతం భూకబ్జా దారుడు.. ల్యాండ్ గ్రాబర్.. విచారణ జరిపిస్తే మాఫియా ఎవరో బయటపడుతుంది. తహసీల్దార్ మీద ఎవరు ఒత్తిడి తెచ్చారో తేలాలి. విజయారెడ్డి హత్య కేసులో కావాలనే నాపై బురదజల్లుతున్నారు. నేను సాయం చేసే మనిషినే..అన్యాయం చేసే వాడినికాదు. రెండెకరాల మనిషి.. రూ.వేల కోట్లు ఎలా సంపాదించారో అందరికీ తెలుసు. మా ఆస్తులన్నీ మా తాతలు, తండ్రుల కాలం నాటివే. అబ్దుల్లాపూర్‌మెట్ చుట్టుపక్కల ఉన్న 412 ఎకరాల వివాదాస్పద భూమిపై విచారణ జరిపి తీరాలి. వాస్తవాలేంటో తేలుతాయి. అంబర్‌పేట ఓఆర్ఆర్ దగ్గర సర్వే నంబర్లు 230 – 233లో ఉన్న 16 ఎకరాల భూమిని మల్రెడ్డి రంగారెడ్డి బంధువులే కబ్జా చేశారు. మెట్రోసిటీ పేరుతో 60 ఎకరాలను కొల్లగొట్టారు. నేను రూ.30 లక్షలు ఎవరి దగ్గరా వసూలు చేయలేదు. తీసుకున్నట్లు ఆయన రుజువు చేయాలి. మూడుసార్లు ఓడిపోయిన వ్యక్తి నాపై ఆరోపణలు చేస్తే స్పందించాలా అనుకున్నా. కానీ శవ రాజకీయాలు చేస్తుంటే తట్టుకోలేక మీడియా ముందుకు రావాల్సి వచ్చింది. – మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే 40 ఎకరాలు ఎవరబ్బ సొమ్ము? ల్యాండ్ మాఫియాకు నాయకత్వం వహిస్తున్న నాయకుడు ఎమ్మెల్యే కిషన్ రెడ్డి. నయీంతో దోస్తీ చేసిన వ్యక్తి ఆయన. నాకున్న ఆస్తుల వివరాలను నిర్భయంగా, నిర్మొహమాటంగా చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. ఆ వివాదాస్పద భూముల్లో నా బంధువులు అక్రమంగా కొనుగోలు చేస్తే 24 గంటల్లోగా స్వాధీనం చేసుకుని పేదలకు పంచండి. అధికారంలో మీరే ఉన్నారు. సీఎంకు కూడా చెప్పు. నేను పది మందికి మంచి చెప్పేవాడిని. నేను ఎవరితోనూ చెప్పించుకోను. నువ్వు చెబుతున్నట్లుగానే.. ఎప్పుడో మావాళ్లు భూములు కొని ఉంటే ఇన్ని రోజులు ఏం చేశావ్? పదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉండి ఎందుకు అడగలేదు? రూ.400 కోట్ల విలువచేసే ప్రభుత్వ భూమిని ఇబ్రహీంపట్నంలో కాజేశావ్. అధికారుల మీద ఒత్తిడి తెచ్చి ఓఆర్సీ ఇప్పించావ్. దాని పక్కనే ప్రభుత్వ సంస్థలకు భూమిని గతంలో ఇచ్చారు. పోలీస్‌స్టేషన్, మార్కెట్ కమిటీ, ఆర్టీసీ డిపోలకు దాదాపు 30 ఎకరాలు కేటాయించారు. ఇదిపోగా 40 ఎకరాలు ఎవరబ్బ సొమ్మని బినామీల పేరిట తెచ్చుకున్నావ్? – మల్రెడ్డి రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే -
‘వీవీ ప్యాట్’ల లెక్కింపునకు ఆదేశాలివ్వండి
సాక్షి, హైదరాబాద్: ఇటీవల తమ నియోజకవర్గాల పరిధిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని (ఈసీ) ఆదేశించాలని కోరుతూ కాంగ్రెస్ నేతలు పద్మావతిరెడ్డి, అద్దంకి దయాకర్, బీఎస్పీ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఈసీని ఆదేశించింది. ఫిబ్రవరి 7 లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఈసీకి స్పష్టం చేసింది. ఈ కౌంటర్‌కు 14వ తేదీ లోపు తిరుగు సమాధానం ఇస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని పిటిషనర్లను ఆదేశించింది. ఫిబ్రవరి 14న తదుపరి విచారణ చేపడతామంది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈవీఎంల ద్వారా తమకు వచ్చిన ఓట్లకు, వీవీ ప్యాట్లలో నమోదైన ఓట్లకు తేడా ఉందని, అందువల్ల వీవీ ప్యాట్లలో ఓట్లను లెక్కించేలా ఈసీని ఆదేశించాలని కోరుతూ కోదాడ కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతిరెడ్డి, తుంగతుర్తి కాంగ్రెస్ అభ్యర్థి అద్దంకి దయాకర్‌లు హైకోర్టులో తాజాగా పిటిషన్లు దాఖలు చేశారు. ఇదే అంశంపై మల్రెడ్డి రంగారెడ్డి గతంలోనే పిటిషన్ దాఖలు చేశారు. వీటిపై ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. వీవీ ప్యాట్లను లెక్కించలేదు.. పిటిషనర్ల తరఫున తూమ్ శ్రీనివాస్ తదితరులు వాదనలు వినిపిస్తూ.. తుంగతుర్తి నియోజకవర్గంలో 18 ఈవీఎంలు సరిగ్గా పనిచేయలేదని, అందువల్ల వీవీ ప్యాట్ల ఓట్లను లెక్కించాల్సిన అవసరం ఉందన్నారు. ఓటు వేసిన ఫలితం ఈవీఎంలపై కనిపించనప్పుడు, నిబంధనల ప్రకారం ఆ ఈవీఎంలను పక్కన పెట్టేయాల్సి ఉంటుందని తెలిపారు. అన్ని ఈవీఎంల ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక, ఈ పనిచేయని ఈవీఎంల వీవీ ప్యాట్లను లెక్కించాల్సి ఉంటుందని, తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలో అలా జరగలేదన్నారు. వీవీ ప్యాట్ స్లిప్పులు థర్మల్ పేపర్‌పై ముద్రితమవుతాయని, నిపుణులు చెప్పే దానిని బట్టి వీటిపై ముద్రితమైన వివరాలు 45 రోజుల్లో తుడిచిపెట్టుకుపోతాయన్నారు. ఇలా జరిగితే తాము ఈ వ్యాజ్యాలు దాఖలు చేసి ఎటువంటి ప్రయోజనం ఉండదని నివేదించారు. పిటిషనర్ల వాదనలను ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది అవినాశ్ దేశాయ్ తోసిపుచ్చారు. థర్మల్ ప్రింట్ ఐదేళ్ల వరకు ఉంటుందన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. ఈ వివరాలన్నింటితో కౌంటర్ దాఖలు చేయాలని తెలిపింది. -
మల్రెడ్డి పిటిషన్ వచ్చేనెలకు వాయిదా వేసిన కోర్టు
సాక్షి, హైదరాబాద్ : వీవీ ప్యాలెట్ ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయంటూ మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి వేసిన ఎలక్షన్ పిటిషన్‌ను బుధవారం తెలంగాణ హైకోర్టు విచారించింది. వచ్చే నెల 7 వరకూ ఈ పిటిషన్‌కు సంబంధించి పూర్తి సమాచారంతో కౌంటర్ దాఖలు చేయాలంటూ.. హై కోర్టు కేంద్ర ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయంటూ మల్రెడ్డి రంగారెడ్డితో పాటు ఉత్తం పద్మావతి, ధర్మపురి లక్ష్మణ్‌లు కూడా పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. -
30న పూర్తి సమాచారం సమర్పించండి
సాక్షి, హైదరాబాద్: ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఓట్లకు సంబంధించిన అన్ని వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించేలా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో)ని ఆదేశించాలని కోరుతూ మల్రెడ్డి రంగారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ నెల 30 తేదీన లెక్కింపు వ్యవహారానికి సంబంధించిన పూర్తి సమాచారంతో తమ ముందుకు రావాలని ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం నుంచి బీఎస్పీ తరఫున పోటీ చేసి 376 ఓట్ల తేడాతో మల్రెడ్డి రంగారెడ్డి ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఓట్లకు, వీవీ ప్యాట్ స్లిప్పులకు తేడాలున్నాయి.. డిసెంబర్ 11న ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా, ఆ ఓట్ల లెక్కింపులో లోపాలపై తన చీఫ్ ఎన్నికల ఏజెంట్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ రిటర్నింగ్ అధికారికి వినతిపత్రం సమర్పించారని రంగారెడ్డి తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ వినతి పత్రం తీసుకుంటున్నట్లు రిటర్నింగ్ అధికారి ఎటువంటి అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వలేదని ప్రస్తావించారు. పోలింగ్ స్టేషన్ 199, 221ల్లో వీవీ ప్యాట్ స్లిప్పులను, ఈవీఎంలను పోల్చిచూడగా, ఈవీఎంల ప్రకారం టీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి 146 ఓట్లు, తనకు 130 ఓట్లు వచ్చాయని, ఇదే సమయంలో వీవీ ప్యాట్లను లెక్కించగా, మంచిరెడ్డికి 139 ఓట్లు, తనకు 129 ఓట్లు వచ్చాయన్నారు. 221 పోలింగ్ కేంద్రంలో కూడా ఈవీఎం ఓట్లకు, వీవీ ప్యాట్ స్లిప్పులకు తేడాలున్నాయని తెలిపారు. వీటిపై అభ్యంతరాలు వ్యక్తం చేసినా పట్టించుకోకుండా రిటర్నింగ్ అధికారి రాత్రి 9 గంటల సమయంలో ఫలితాలను ప్రకటించారని పేర్కొన్నారు. మాక్ పోలింగ్ డేటాను తుడిచేయకుండా వీవీ ప్యాట్లను లెక్కించడం వల్ల సమస్య వచ్చిందని రిటర్నింగ్ అధికారి చెప్పారన్నారు. దీనిపై సీఈవోను కలిసి వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించాలని అభ్యర్థిస్తూ వినతిపత్రం ఇవ్వడం జరిగిందని చెప్పారు. సమాచార హక్కు చట్టం కింద సమాచారం కోరగా, రిటర్నింగ్ అధికారి కార్యాలయం కీలక సమాచారాన్ని తొక్కిపెట్టిందని తెలిపారు. పోలింగ్ పారదర్శకంగా జరిగేందుకు వీవీ ప్యాట్లను తీసుకువచ్చారని, అయితే అధికారులు మాత్రం పారదర్శకంగా వ్యవహరించడం లేదని రంగారెడ్డి తన పిటిషన్లో పేర్కొన్నారు. అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోర్టును అభ్యర్థించారు. -
ఓట్ల లెక్కింపు: హైకోర్టును ఆశ్రయించిన మల్రెడ్డి రంగారెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి బీఎస్పీ తరఫున పోటీ చేసి 376 ఓట్ల తేడాతో ఓటమిపాలైన మల్రెడ్డి రంగారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఓట్లకు సంబంధించిన అన్ని వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించేలా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో)ని ఆదేశించాలని కోరుతూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ అంశం గురించి రంగారెడ్డి తరఫున హాజరైన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది రాకేష్ ముంజాల్ శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ముందు ప్రస్తావించారు. తమ అభ్యర్థన గురించి ధర్మాసనానికి వివరించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం, కేంద్ర ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది అవినాశ్ దేశాయ్ గురించి ఆరా తీసింది. ఈ పిటిషన్ గురించి ముం దస్తు సమాచారం ఇవ్వకపోవడంతో ఆ సమయానికి అవినాశ్ కోర్టులో లేరు. దీంతో ధర్మాసనం పిటిషనర్ అభ్యంతరాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకుని తమకు చెప్పాలని అవినాశ్‌కు స్పష్టం చేసింది. విచారణను ఈ నెల 26కి వాయిదా వేసింది. తాము ఇచ్చిన ఈ ఆదేశాల గురించి అవినాశ్‌కు తెలియచేయాలని అక్కడే ఉన్న ప్రభుత్వ న్యాయవాదులకు సూచించింది. ఓట్లకు, వీవీ ప్యాట్ స్లిప్పులకు తేడాలున్నాయి.. ఈ నెల 11న ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా, ఆ ఓట్ల లెక్కింపులో లోపాలపై తన చీఫ్ ఎన్నికల ఏజెంట్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ రిటర్నింగ్ అధికారికి వినతిపత్రం సమర్పించారని రంగారెడ్డి తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ వినతి పత్రం తీసుకుంటున్నట్లు రిటర్నింగ్ అధికారి ఎటువంటి అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వలేదని ప్రస్తావించారు. పోలింగ్ స్టేషన్ 199, 221ల్లో వీవీ ప్యాట్ స్లిప్పులను, ఈవీఎంలను పోల్చిచూడగా, ఈవీఎంల ప్రకారం టీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి 146 ఓట్లు, తనకు 130 ఓట్లు వచ్చాయని, ఇదే సమయంలో వీవీ ప్యాట్లను లెక్కించగా, మంచిరెడ్డికి 139 ఓట్లు, తనకు 129 ఓట్లు వచ్చాయన్నారు. 221 పోలింగ్ కేంద్రంలో కూడా ఈవీఎం ఓట్లకు, వీవీ ప్యాట్ స్లిప్పులకు తేడాలున్నాయని తెలిపారు. వీటిపై అభ్యంతరాలు వ్యక్తం చేసినా పట్టించుకోకుండా రిటర్నింగ్ అధికారి రాత్రి 9 గంటల సమయంలో ఫలితాలను ప్రకటించారని పేర్కొన్నారు. మాక్ పోలింగ్ డేటాను తుడిచేయకుండా వీవీ ప్యాట్లను లెక్కించడం వల్ల సమస్య వచ్చిందని రిటర్నింగ్ అధికారి చెప్పారన్నారు. దీనిపై సీఈవోను కలిసి వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించాలని అభ్యర్థిస్తూ వినతిపత్రం ఇవ్వడం జరిగిందని చెప్పారు. సమాచార హక్కు చట్టం కింద సమాచారం కోరగా, రిటర్నింగ్ అధికారి కార్యాలయం కీలక సమాచారాన్ని తొక్కిపెట్టిందని తెలిపారు. పోలింగ్ పారదర్శకంగా జరిగేందుకు వీవీ ప్యాట్లను తీసుకువచ్చారని, అయితే అధికారులు మాత్రం పారదర్శకంగా వ్యవహరించడం లేదని రంగారెడ్డి తన పిటిషన్లో పేర్కొన్నారు. అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోర్టును అభ్యర్థించారు. -
గాంధీభవన్‌లోకి దూసుకెళ్లిన టీడీపీ కార్యకర్తలు!
సాక్షి, హైదరాబాద్: మల్రెడ్డి బ్రదర్స్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గాంధీభవన్ ఎదుట టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. గాంధీభవన్‌లోకి దూసుకెళ్లి కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదలను అడ్డుకునే ప్రయత్నించారు. కాంగ్రెస్ పార్టీ మిత్రద్రోహానికి పాల్పడుతోందని టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పొత్తులో భాగంగా ఇబ్రహీంపట్నం టికెట్‌ను మహాకూటమికి కేటాయిస్తే.. మల్రెడ్డి రంగారెడ్డి బీఎస్పీ తరపున నామినేషన్ వేసి కాంగ్రెస్ జెండాలతో ప్రచారం నిర్వహిస్తూ కార్యకర్తలను గందరగోళానికి గురి చేస్తున్నారని టీడీపీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కూటమి అభ్యర్థి సామ రంగారెడ్డికి వ్యతిరేకంగా పనిచేస్తున్న మల్రెడ్డి బ్రదర్స్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసి.. కాంగ్రెస్ కార్యకర్తల్ని సామ రంగారెడ్డి విజయం కోసం కృషి చేసే విధంగా టీపీసీసీ ఆదేశించాలని వారు డిమాండ్ చేశారు. మల్రెడ్డి బ్రదర్స్‌ను సస్పెండ్ చేసే వరకూ గాంధీభవన్ నుంచి కదిలేది లేదని వారు హెచ్చరిస్తున్నారు. -
గాంధీభవన్‌లోని దూసుకెళ్లిన టీడీపీ కార్యకర్తలు!
-
పట్నంలో పోటీకి ఓకే
సాక్షి, ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం స్థానం నుంచి పోటీ చేసేందుకు సామ రంగారెడ్డి అంగీకరించారు. మొదటి నుంచి ఎల్బీనగర్లో పోటీ చేయాలని ఆయన ఆసక్తి కనబరిచినా కూటమి పొత్తులో భాగంగా ఆ సీటు కాంగ్రెస్ ఖాతాలోకి పోయింది. దీంతో ఇబ్రహీంపట్నం సీటు టీడీపీకి దక్కింది. ఇక్కడి నుంచి పార్టీ అభ్యర్థిగా సామ రంగారెడ్డిని అధిష్టానం ఖరారు చేసింది. అయితే, పట్నంలో పోటీచేసేందుకు రంగారెడ్డి ససేమిరా అన్నారు. ఇదే విషయాన్ని చంద్రబాబుతో మాట్లాడేందుకు అమరావతికి వెళ్లారు. బాబు బుజ్జగింపులతో మొత్తబడ్డ ఆయన ఎట్టకేలకు పోటీకి అంగీకారం తెలిపారు. కాగా, ఈ టికెట్‌ను ఆశించి భంగపడ్డ రొక్కం భీంరెడ్డికి నచ్చజెప్పి రెబల్‌గా నిలబడకుండా టీడీపీ నాయకులు వ్యూహరచన చేస్తున్నారు. క్యామ మల్లేష్‌తో సామ భేటీ కాంగ్రెస్ పార్టీలో మల్రెడ్డి రంగారెడ్డికి ప్రత్యర్థిగా నిలిచిన డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్‌తో టీడీపీ అభ్యర్థి సామ రంగారెడ్డి శుక్రవారం భేటీ అయ్యారు. తనకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని కోరారు. అయితే, తనకు అన్యాయం చేసిన పీసీసీ ఛీప్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై వ్యతిరేకం తప్ప మహాకూటమికి కాదని మల్లేష్ తెలిపారు. తన సంపూర్ణ మద్దతు ఉంటుందని సామ రంగారెడ్డికి చెప్పారు. స్వతంత్ర అభ్యర్థిగా మల్రెడ్డి! పట్టు వదలకుండా ఢిల్లీలో తిష్టవేసి కాంగ్రెస్ టికెట్ కోసం పైరవీలు చేస్తున్న మల్రెడ్డి రంగారెడ్డి తనకు టికెట్ రాకుంటే స్వతంత్ర అభ్యర్థిగా రంగంలో ఉంటాడనే ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఆయన ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలిసింది. అయితే మల్రెడ్డి బరిలో ఉంటే క్యామ మల్లేష్ కూడా స్వతంత్ర అభ్యర్థిగా రంగంలో ఉండే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. -
కాంగ్రెస్ నిర్ణయాలతో పార్టీ గ్రాఫ్ పడిపోతోంది
-
అమరావతిలోనే తేల్చుకుంటా..
హైదరాబాద్: సీట్ల పంపకం మహాకూటమికి పెద్ద తలనొప్పిగా మారింది. రెండు స్థానాలతో టీడీపీ నిన్న విడుదల జాబితా.. కాంగ్రెస్‌లో అసమ్మతిని రాజేసింది. రాజేంద్రనగర్ నియోజకవర్గాన్ని పొత్తులో భాగంగా టీడీపీకి కేటాయించడం పట్ల సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అలాగే ఇబ్రహీంపట్నం నియోజకవర్గాన్ని టీడీపీకి కేటాయించడంపై మల్రెడ్డి రంగారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్లు తీవ్రంగా రగిలిపోతున్నారు. కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి బీజేపీ నుంచి బరిలోకి దిగే ఆలోచనలో మల్రెడ్డి ఉన్నట్లుగా తెలిసింది. అవసరమైతే ఇండిపెండెంట్‌గానైనా బరిలో దిగుతానని అనుచరులతో చెప్పినట్లు వార్తలు వినపడుతున్నాయి. క్యామ మల్లేష్ కూడా ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగేందుకు సమాలోచనలు చేస్తున్నారు. ఇప్పటికే వనస్థలిపురంలోని ఇబ్రహీంపట్నం టీడీపీ అభ్యర్థి సామ రంగారెడ్డి ఇంట్లో కాంగ్రెస్ నేత మల్ రెడ్డి రంగారెడ్డి అనుచరులు మంతనాలు కూడా జరిపారు. మల్రెడ్డి సోదరుడు రాంరెడ్డి, సామ రంగారెడ్డితో రహస్య భేటీ జరిపినట్లు తెలిసింది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గ మహాకూటమి అభ్యర్థిగా సామ రంగారెడ్డి పేరు ప్రకటించడంపై మల్రెడ్డి, క్యామ వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. ఈ విషయమై అమరావతి వెళ్లి చంద్రబాబు వద్దనే తేల్చుకుంటానని సామ రంగారెడ్డి చెప్పినట్లుగా తెలిసింది. ఎల్బీనగర్ కాకుండా ఇబ్రహీంపట్నం నియోజకవర్గాన్ని తనకు కేటాయించడంపట్ల సామ రంగారెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. 11 ఏళ్ల నుంచి టీడీపీని ఎల్బీనగర్లో బలోపేతం చేశానని సామ రంగారెడ్డి మీడియాతో తెలిపారు. ఎల్బీనగర్లో ఏ వార్డులోనూ కాంగ్రెస్‌కు టీడీపీ కంటే ఆధిక్యం రాదని అన్నారు. ఇబ్రహీంపట్నం టికెట్ తనకు రావడంతో కాంగ్రెస్ నేత మల్ రెడ్డి రంగారెడ్డి తన వద్దకు వచ్చి మంతనాలు జరిపారని వెల్లడించారు. ఇబ్రహీంపట్నం టికెట్ ఎందుకు తనకు ఇచ్చారని మల్రెడ్డి ప్రశ్నించారని తెలిపారు. దమ్మూ, ధైర్యం లేని నేతల వద్ద పనిచేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. -
అప్పుడే టికెట్ల గొడవ
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: కాంగ్రెస్‌లో సీట్ల లొల్లి తారాస్థాయికి చేరింది.నియోజకవర్గస్థాయి రాజకీయాలు చినికి చినికి గాలివానలా మారి గాంధీభవన్‌కు చేరాయి. ఎన్నికలకు ఏడాది ముందే వర్గ కుమ్ము లాటలు జోరందుకున్నాయి. నేతల మధ్య సిగపట్లు ఆ పార్టీని అంతర్గతంగా కుదిపేస్తున్నాయి. తాజాగా ఇబ్రహీంపట్నం అసెంబ్లీ స్థానాన్ని డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్‌కు కేటాయించినట్లు జరుగుతున్న ప్రచారంతో రగిలిపోతున్న వైరివర్గం నాయకులు గాంధీభవన్ వద్ద పంచాయతీ పెట్టారు. వచ్చే ఎన్నికల్లోనూ క్యామ మల్లేషే బరిలో ఉంటారని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇటీవల ప్రకటించినట్లు వార్తలు రావడంతో.. ఇదే సీటును ఆశిస్తున్న మల్రెడ్డి రంగారెడ్డి, రాంరెడ్డిలు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో మల్రెడ్డి సోదరులు, అనుచరులు కార్యకర్తలను తప్పుదోవ పట్టించేలా పార్టీ అధ్యక్షుడు చేసిన ప్రకటనపై తాడోపేడో తేల్చుకోవాలని అనుచరవర్గంతో గాంధీభవన్‌కు తరలివచ్చారు. ఈ పరిణామంతో ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ రాజకీయం వేడెక్కింది. ఈ క్రమంలో గురువారం గాంధీభవన్‌లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి కుంతియా, అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కలిసి ఇటీవల ప్రకటనపై వాకబు చేశారు. గత ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడానికి క్యామ మల్లేష్ అభ్యర్థిత్వమే కారణమని, మరోసారి అలాంటి పొరపాటు చేయవద్దని సూచించారు. టికెట్టుపై కార్యకర్తల్లో అయోమయం సృష్టించవద్దని విజ్ఞప్తి చేశారు. ఉత్తమ్ మాత్రం గెలుపుగుర్రాలకే సీటు కేటాయిస్తామని, టికెట్ల ఖరారు వ్యవహారంపై అధిష్టానమే తుది నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఇటీవల ఇతర పార్టీల నేతలు కొందరు పార్టీలో చేరిన సమయంలో అన్యాపదేశంగా క్యామకు టికెట్ అన్నానే తప్ప... ఖరారైందని తాను అనలేదని ఉత్తమ్ మల్రెడ్డి వర్గీయులతో అన్నట్లు తెలిసింది. కాగా, ఇప్పటికే ఉప్పు..నిప్పులా ఉన్న పట్నం రాజకీయాలు తాజా పరిణామాలతో మరింత చిటపటలాడుతున్నాయి. క్యామ వల్లే భువనగిరిలో ఓడిపోయాం: మల్రెడ్డి ఓడిపోయేవారికి టికెట్లు ఇవ్వడం వల్లే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఓడిపోయిందని కాంగ్రెస్ సీనియర్ నేత మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. క్యామ మల్లేష్‌కు ఇబ్రహీంపట్నం టికెట్ వచ్చినట్లు ప్రచారం చేసుకోవడంతో కార్యకర్తలు ఆందోళన చెంది గాంధీ భవన్‌కు వచ్చారని తెలిపారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారానికి దూరం కావడానికి ఇలాంటి వాళ్లే కారణమన్నారు. గెలిచే వారికే టికెట్లు ఇస్తామని ఉత్తమ్ స్పష్టం చేశారని, మల్లేష్ మాత్రం టికెట్ వచ్చిన్నట్టు అబద్దపు ప్రచారం చేస్తున్నారని వెల్లడించారు. క్యామ మల్లేష్‌కు ఇవ్వడం వల్ల భువనగిరి పార్లమెంటు సీటు ఓడిపోయామని, తమకే గనక పట్నం టికెట్ ఇచ్చి ఉంటే.. భువనగిరి పార్లమెంటు సీటు గెలిచే వాళ్లమని చెప్పారు. అధిష్టానం మాటే శిరోధార్యం : క్యామ మల్లేశ్ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటా. గెలుపోటములకు అతీతంగా పార్టీ కోసమే పనిచేస్తున్నా. పార్టీని బలోపేతం చేయడమే నా లక్ష్యం. మల్రెడ్డి సోదరులు కార్యకర్తలను ఏనాడూ పట్టించుకోలేదు. అధికారం పోగానే కనుమరుగైన నేతలు ఇప్పుడు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారో కార్యకర్తలకు తెలుసు. ఎన్నడు కూడా ఏఐసీసీ, పీసీసీ నేతలను గౌరవించలేదు. స్థానికంగా వేసిన ఫ్లెక్సీల్లో కూడా నేతలను విస్మరించారు. నాకు టికెట్ ఇవ్వనని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎక్కడా ఖండించలేదు. వీరే కార్యకర్తలను తప్పుదోవ పట్టిస్తున్నారు. -
‘అందువల్లే 2014లో కాంగ్రెస్ ఓడిపోయింది’
హైదరాబాద్ : గత ఎన్నికల్లో ఓడిపోయేవారికి టిక్కెట్లు ఇవ్వడం వల్లే..కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఓడిపోయిందని కాంగ్రెస్ సీనియర్ నేత మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. విలేకరులతో మాట్లాడుతూ..రంగారెడ్డి జిల్లా పీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్ ఇబ్రహీంపట్నం టిక్కెట్ వచ్చినట్లు ప్రచారం చేసుకోవడంతో కార్యకర్తలు ఆందోళన చెంది గాంధీ భవన్‌కు వచ్చారని తెలిపారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారానికి దూరం కావడానికి ఇలాంటి వాళ్లే కారణమన్నారు. గెలిచే వారికే టికెట్లు ఇస్తామని ఉత్తమ్ స్పష్టం చేశారని, మల్లేష్ మాత్రం టిక్కెట్ వచిన్నట్టుగా అబద్దపు ప్రచారం చేస్తున్నారని వెల్లడించారు. గెలిచే వారికి టిక్కెట్ ఇవ్వాలని ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జి ఆర్ కుంతియాను కలిసి చెప్పామని అన్నారు. ఇది కేవలం మనవి మాత్రమేనని స్పష్టం చేశారు. పీసీసీ దృష్టికి కార్యకర్తల మనోభావాలు తీసుకు వచ్చామని తెలిపారు. క్యామ మల్లేష్‌కు ఇబ్రహీంపట్నం టిక్కెట్ ఇవ్వడం వల్ల భువనగిరి పార్లమెంటు సీటు ఓడిపోయామని, తమకే గనక ఇబ్రహీంపట్నం టిక్కెట్ ఇచ్చి ఉంటే..భువనగిరి పార్లమెంటు గెలిచే వాళ్లమని జోస్యం చెప్పారు. క్యామమల్లేశ్ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని బదనాం చేస్తున్నాడని ఆరోపించారు. -
మంచిరెడ్డిపై డీజీపీకి మల్రెడ్డి ఫిర్యాదు
హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీం దందాలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి పాత్ర ఉందని కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంపై సిట్ తో పూర్తిస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బుధవారం ఆయన డీజీపీ అనురాగ్ శర్మను కలిశారు. నయీం ముఠాతో మంచిరెడ్డి కిషన్ రెడ్డికి సంబంధాలున్నాయని ఫిర్యాదు చేశారు. కాగా, మంచిరెడ్డిపై తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని, నిరూపించలేకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని అంతకుముందు ఆయన పేర్కొన్నారు. అయితే మల్రెడ్డి ఆరోపణలను మంచిరెడ్డి తోసిపుచ్చారు. -
ఆ ఎమ్మెల్యే జైలుకూడు తినకతప్పదు
హైదరాబాద్: కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిల మధ్య వివాదం ముదిరింది. మల్రెడ్డి రంగారెడ్డి తనపై చేసిన ఆరోపణలను రుజువు చేయాలని, లేదంటే చట్టప్రకారం చర్యలు తీసుకుంటానని మంచిరెడ్డి కిషన్‌రెడ్డి హెచ్చరించారు. ఎమ్మెల్యే అనుచరులతో వచ్చి ఇబ్రహీంపట్నం చౌరస్తాలో బైఠాయించారు. ఈ వ్యాఖ్యలపై మల్రెడ్డి స్పందిస్తూ.. తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని, నిరూపించలేకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. 'మంచిరెడ్డి సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు. ఓ గ్యాంగ్‌స్టర్ మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు. నయీంతో ఆయనకు ఏడెనిమిది సంవత్సరాల నుంచి సంబంధాలు ఉన్నాయి. దమ్ముంటే నయీంతో కలసి చేసిన దందాల మీద మాట్లాడాలి. మంచిరెడ్డి పేదల దగ్గర నుంచి భూములు లాక్కొన్నారు. ఏడేళ్ల నుంచి ఎక్కడెక్కడ కబ్జాలు చేశారో నా దగ్గర ఆధారాలున్నాయి. మంచిరెడ్డి తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే అధికార టీఆర్ఎస్లోకి వెళ్లారు. పేదల రక్తాన్ని పీల్చి వందల కోట్ల రూపాయలు సంపాదించారు. నయీం కేసులో సంబంధాలున్నవారిని అరెస్ట్ చేసినట్టే మంచిరెడ్డిపై కూడా చర్యలు తీసుకోవాలి. ఆయన దళిత కుటుంబాలను మోసం చేశాడు. నా దగ్గర ఆధారాలున్నాయి. మంచిరెడ్డి దొరికిన దొంగ, తప్పించుకోలేరు. జైలు కూడు తినకతప్పదు' అని మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. -
మల్‌రెడ్డికి ఎమ్మెల్యే మంచిరెడ్డి సవాల్
రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం చౌరస్తాలో సోమవారం మధ్యాహ్నం ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తనపై చేసిన ఆరోపణలను రుజువు చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అనుచరులతో వచ్చి స్థానిక చౌరస్తాలో బైఠాయించారు. మల్రెడ్డి చర్చకు రావాలని ఎమ్మెల్యే సవాల్ విసిరారు. (చదవండి 'ఎమ్మెల్యే మంచిరెడ్డికి నయీంతో సంబంధాలు!') ఈ సందర్భంగా ఎమ్మెల్యే మంచిరెడ్డి మాట్లాడుతూ...మరో రెండు గంటలు ఇక్కడే ఉంటానన్నారు. గ్యాంగ్‌స్టర్ నయీంతో తనకు సంబంధముందన్న ఆరోపణలను మల్రెడ్డి రుజువు చేయాలన్నారు. దమ్ము, ధైర్యం లేకే మల్రెడ్డి మొహం చాటేశారని మంచిరెడ్డి ఆరోపించారు. ఆరోపణలు నిరూపించకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటానని మంచిరెడ్డి హెచ్చరించారు. (చదవండి : 'నయీంతో నాకెలాంటి సంబంధాలు లేవు' ). -
'ఎమ్మెల్యే రూ.300 కోట్లు సంపాదించాడు'
హైదరాబాద్ : గ్యాంగ్‌స్టర్ నయీం ప్రధాన అనుచరుడు శ్రీహరితో కలిసి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి భారీగా అక్రమాలకు పాల్పడ్డారని కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఆరోపించారు. హైదరాబాద్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఎమ్మెల్యే మంచిరెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నయీం కేసులో శ్రీహరిని అరెస్ట్ చేసిన పోలీసులు ఎమ్మెల్యే మంచిరెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదని రంగారెడ్డి ప్రశ్నించారు. శ్రీహరితో కలిసి ఎమ్మెల్యే రూ.300 కోట్లు సంపాదించాడని ఆయన ఆరోపించారు. ఆదిభట్లలోని భూ కబ్జా విషయాలు బయటకొస్తాయనే భయంతోనే మంచిరెడ్డి పార్టీ మారారన్నారు. ఎమ్మెల్యే అవినీతిపై ఇబ్రహీంపట్నం చౌరస్తాలో బహిరంగ చర్చకు సిద్ధమని రంగారెడ్డి సవాల్ విసిరారు. -
భూదందా కోసమే ఎమ్మెల్యే పార్టీ మారాడు
మంచిరెడ్డి టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలవాలి విలేకరుల సమావేశంలో మల్రెడ్డి రంగారెడ్డి ధ్వజం ఆదిబట్ల : ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తన భూదందా కోసమే అధికార టీఆర్ఎస్లో చేరాడని మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఎమ్మెల్యే ఇబ్రహీంపట్నంలో చేస్తున్న అక్రమ భూదందాలకు అడ్డుకట్టు వేస్తామని ఆయన తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలోని డాగ్ బంగ్లాలో విలేకరుల సమావేశంలో మల్రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అభివృద్ధి పేరుతో నియోజకవర్గ ప్రజలను మభ్యపెట్టి టీఆర్ఎస్లో చేరాడని ఆరోపించారు. కరీముల్లాఖాన్ భూములకు సంబంధించి గతంలోనే ప్రభుత్వం భూసేకరణకు నోటీసు ఇచ్చిందని, అయినా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తన పలుకుబడితో తన చెంచాల(అనుచరుల) పేరు మీద అగ్రిమెంట్ ఏ విధంగా చేసుకుంటారని ప్రశ్నించారు. ఒకవైపు సాధారణ ప్రజలకు కులం, ఆదాయం సర్టిఫికెట్ల కోసం తహాసీల్దార్ కార్యాలయాలల్లో వారం రోజుల సమయం పడుతుంటే కలెక్టర్ కార్యాలయంలో ఎలాంటి సర్వే చేయకుండా మూడు రోజుల్లో సదరు భూమికి సంబంధించిన ఓఆర్సీ ఇవ్వటం ఏమిటని దుయ్యబట్టారు. భూదాన్ బోర్డు పరిహారం విషయంలో ఏపీఐఐసీ గతంలో కరీముల్లాఖాన్ వారసులకు రూ. 18 కోట్లు ఇచ్చిందని తెలిపారు. కరీముల్లాఖాన్ వారసులు లేకపోవడంతో ఆ పరిహారం వెనుతిరిగిందని చెప్పారు. మరిప్పుడు కరీముల్లాఖాన్‌కు కొత్తగా వారసులు ఎలా వచ్చారని మల్రెడ్డి రంగారెడ్డి ప్రశ్నించారు. సర్కార్ కరీముల్లాఖాన్ భూములకు సంబంధించి సమగ్ర విచారణ జరిపించి చర్యలు తీసుకొవాలని డిమాండ్ చేశారు. పట్నం అంగట్లో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పశువులాగా అమ్ముడుపోయి అక్రమ భూదందాకు తెర లేపాడని ధ్వజమెత్తారు. సొంత పార్టీ నాయకులే కిషన్‌రెడ్డితో వేగలేమని చెబుతుంటే.. ఆయన తీరు ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చన్నారు. పట్నం ప్రజల ఉసురు ఎమ్మెల్యేకు తగులుతుందని చెప్పారు. కృష్ణా నది జలాలతో పట్నం చెరువును నింపి సస్యశామలం చేస్తామన్న ఎమ్మెల్యే.. నామమాత్రంగా రెండు రోజులు నీళ్లు వదిలి ప్రజలను మభ్యపెట్టారని మండిపడ్డారు. ఎమ్మెల్యే తన పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలవాలని మల్రెడ్డి రంగారెడ్డి సవాల్ విసిరారు. సమావేశంలో మంచాల జెడ్పీటీసీ సభ్యులు భూపతిగల్ల మహిపాల్, మాజీ ఎంపీపీ కృపేష్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గురునాథ్‌రెడ్డి, మాజీ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నిట్టు కృష్ణ. ఎమ్ఆర్ఆర్ యువసేన నియోజకవర్గ అధ్యక్షుడు బుర్ర మహేందర్‌గౌడ్, మండల అధ్యక్షుడు మొద్దు కరుణాకర్‌రెడ్డి, నాయకులు దర్పల్లి రాజశేఖర్‌రెడ్డి, పట్నం శివశంకర్, జైపాల్‌రెడ్డి, భాస్కరాచారి, గౌస్, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. -
'మూడు అక్షరాల పదవిని అమ్ముకున్నాడు'
హైదరాబాద్ : ఇబ్రహీంపట్నం ప్రజల ఆత్మాభిమానాన్ని, గౌరవాన్ని తాకట్టుపెట్టిన వ్యక్తి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అని మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఆరోపించారు. ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని డాగ్‌బంగ్లాలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ప్రజల ప్రతినిధిగా చెప్పకునే ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి నేడు ప్రజలు తలదించుకునేలా వ్యవహరించారని, నడిబజారులో ఎమ్మెల్యే అను మూడు అక్షరాల పదవిని అమ్ముకున్నారని ఆయన ఆరోపించారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ప్రజల నమ్మకాన్ని వమ్ముచేసి నేడు ఈ ప్రాంత అభివృధ్ది పేరుతో అధికార దాహంతో టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని విమర్శించారు. టీడీపీ ప్రాధమిక సభ్యత్వానికి, జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన విధంగానే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయాలని . కిషన్‌రెడ్డిని మల్రెడ్డి రంగారెడ్డి డిమాండ్ చేశారు. గత ఎన్నికలల్లో రెండు సార్లు ఏ విధంగా గెలిచారో ప్రజలకు తెలుసునని ఆయన గుర్తు చేశారు. గత ఎన్నికల్లో నైతిక విజయం ఎవరిదో ప్రజలకు తెలుసునని, స్వతంత్ర అభ్యర్థికి ఎమ్మెల్యే, ఎంపీకి కలిసి దాదాపు 70 వేల ఓట్లు నియోజకవర్గంలో వచ్చాయంటే నీది గెలుపేనా..? నీవు చరిష్మ ఉన్న నాయకుడివా..? అంటు విమర్శలు చేశారు. నీవు చరిష్మగల నాయకుడివి అయితే వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజాకోర్టుకు సిద్దం కావాలని సవాల్ విసిరారు. టీడీపీలో ఉన్నప్పుడు జెడ్పీ ఎన్నికలు వస్తే కిషన్‌రెడ్డి జెడ్పీ చైర్మన్‌కు మద్దతుగా మూడు కోట్ల రూపాయలు ముడుపులు తీసుకున్నమాటా వాస్తవం కదా?..అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే స్వార్ధ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పట్నం అభివృధ్దిపై మట్లాడడం సిగ్గుచేటని విమర్శించారు. అభివృధ్దిపై నీకు ప్రేమ ఉంటే దమ్ము, సత్తా కలిగిన నాయకుడు పోరాటలతో ఉద్యమిస్తాడని, నీలా ఇతర పార్టీలకు అమ్ముడుపోడని విమర్శించారు. ఇబ్రహీంపట్నం సమీపంలోని 300 ఎకరాలకు సంబంధించి 20 కోట్ల రూపాయలు వస్తే మూడు కోట్ల రూపాయలు రైతులకు పంచావని, మిగతా 17 కోట్ల రూపాయలు కూడా పంచేస్తే ఇబ్రహీంపట్నం రైతుల రైతాంగాన్ని కాపాడినవాడివి అవుతానని సూచించారు. గెలిచిన నీ పదవిని అడ్డం పెట్టుకొని ఎవడబ్బా సోమ్మని తింటున్నావని విమర్శించారు. చేసిన పాపాలను తుడ్చడానికి టీఆర్ఎస్లో చేరతున్నారని, బజారులో అమ్ముడుపోయిన ఎమ్మెల్యే అని అన్నారు. నియోజకవర్గంలో వడగండ్ల వర్షం పడి రైతన్నలు నష్టాలలో ఉంటే, ప్యాకేజీలతో పబ్బం గడుపుతున్నాడని ఎద్దేవా చేశారు. తాను ప్రజల మనిషినని, ఇక పట్నం నియోజకవర్గ ప్రజల సమస్యలపై ఉద్యమిస్తానని మల్రెడ్డి రంగారెడ్డి స్పష్టం చేశారు. కష్టం వచ్చిన, నష్టం వచ్చిన నేనుంటానంటూ ఆయన నియోజకవర్గ ప్రజలకు ఈ సందర్భంగా భరోసా ఇస్తున్నానన్నారు. విలేకరులు టీడీపీలో చేరుతారా....? అన్న ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ నియోజకవర్గంలో అన్ని పార్టీలలో తనను అభిమానించే నాయకులు ఉన్నరన్నారు. సమావేశంలో మంచాల జెడ్పీటీసీ సభ్యుడు భూపతిగల్ల మహిపాల్, మార్కెట్ కమిటీ చైర్మన్ గుర్నాద్‌రెడ్డి, మాజీ ఎంపీపీ కృపేష్, మార్కెట్ కమిటీ డెరైక్టర్లు రవీదంర్‌రెడ్డి, నిట్టు కృష్ణ, ముడుపు వెణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
'బ్రోకర్లకే ఎన్నికల్లో టికెట్లు ఇచ్చారు'
హైదరాబాద్: గాంధీభవన్ చుట్టూ తిరిగే బ్రోకర్లకే ఎన్నికల్లో టికెట్లు ఇచ్చారని కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఆరోపించారు. మధ్య దళారుల వ్యవస్థే పార్టీని ముంచిందని ఆయన అన్నారు. ఇకనైన పార్టీ కోసం కష్టపడేవారికే టికెట్లు ఇవ్వాలని, లేదంటే కాంగ్రెస్‌కు భవిష్యత్ ఉండదని హెచ్చరించారు. గ్రూపు రాజకీయాలే వల్లే కొన్ని గెలిచే సీట్లు ఓడిపోయామని వాపోయారు. ఈ సమీక్ష వాస్తవాలన్ని సోనియా గాంధీకి పొన్నాల లక్ష్మయ్య వివరించాలని సూచించారు. గాంధీభవన్ లో రంగారెడ్డి జిల్లా నేతలతో శుక్రవారం పీసీసీ అధ్యక్షుడు పొన్నాల నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఎన్నికల్లో ఓటమిపై సమీక్ష, పార్టీ భవిష్యత్ ప్రణాళికపై ఈ సమావేశంలో చర్చించారు.