మల్‌రెడ్డి బ్రదర్స్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గాంధీభవన్ ఎదుట టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. గాంధీభవన్‌లోకి దూసుకెళ్లి కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదలను అడ్డుకునే ప్రయత్నించారు. కాంగ్రెస్ పార్టీ మిత్రద్రోహానికి పాల్పడుతోందని టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పొత్తులో భాగంగా ఇబ్రహీంపట్నం టికెట్‌ను మహాకూటమికి కేటాయిస్తే.. మల్‌రెడ్డి రంగారెడ్డి బీఎస్పీ తరపున నామినేషన్ వేసి కాంగ్రెస్ జెండాలతో ప్రచారం నిర్వహిస్తూ కార్యకర్తలను గందరగోళానికి గురి చేస్తున్నారని టీడీపీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కూటమి అభ్యర్థి సామ రంగారెడ్డికి వ్యతిరేకంగా పనిచేస్తున్న మల్‌రెడ్డి బ్రదర్స్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసి..