
సాక్షి, హైదరాబాద్ : వీవీ ప్యాలెట్ ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయంటూ మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి వేసిన ఎలక్షన్ పిటిషన్‌ను బుధవారం తెలంగాణ హైకోర్టు విచారించింది. వచ్చే నెల 7 వరకూ ఈ పిటిషన్‌కు సంబంధించి పూర్తి సమాచారంతో కౌంటర్ దాఖలు చేయాలంటూ.. హై కోర్టు కేంద్ర ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయంటూ మల్‌రెడ్డి రంగారెడ్డితో పాటు ఉత్తం పద్మావతి, ధర్మపురి లక్ష్మణ్‌లు కూడా పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.