'ఎమ్మెల్యే రూ.300 కోట్లు సంపాదించాడు' | malreddy ranga reddy slams mla manchireddy kishan reddy over nayeem case | Sakshi
Sakshi News home page

'ఎమ్మెల్యే రూ.300 కోట్లు సంపాదించాడు'

Published Sun, Sep 4 2016 4:13 PM | Last Updated on Tue, Oct 30 2018 4:40 PM

'ఎమ్మెల్యే రూ.300 కోట్లు సంపాదించాడు' - Sakshi

'ఎమ్మెల్యే రూ.300 కోట్లు సంపాదించాడు'

హైదరాబాద్ : గ్యాంగ్స్టర్ నయీం ప్రధాన అనుచరుడు శ్రీహరితో కలిసి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి భారీగా అక్రమాలకు పాల్పడ్డారని కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఆరోపించారు. హైదరాబాద్లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఎమ్మెల్యే మంచిరెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.  
 
నయీం కేసులో శ్రీహరిని అరెస్ట్ చేసిన పోలీసులు ఎమ్మెల్యే మంచిరెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదని రంగారెడ్డి ప్రశ్నించారు. శ్రీహరితో కలిసి ఎమ్మెల్యే రూ.300 కోట్లు సంపాదించాడని ఆయన ఆరోపించారు. ఆదిభట్లలోని భూ కబ్జా విషయాలు బయటకొస్తాయనే భయంతోనే మంచిరెడ్డి పార్టీ మారారన్నారు. ఎమ్మెల్యే అవినీతిపై ఇబ్రహీంపట్నం చౌరస్తాలో బహిరంగ చర్చకు సిద్ధమని రంగారెడ్డి సవాల్ విసిరారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement