'బ్రోకర్లకే ఎన్నికల్లో టికెట్లు ఇచ్చారు' | congress give tickets to brokers, says Malreddy Ranga Reddy | Sakshi
Sakshi News home page

'బ్రోకర్లకే ఎన్నికల్లో టికెట్లు ఇచ్చారు'

Published Fri, Aug 1 2014 3:31 PM | Last Updated on Wed, Mar 28 2018 11:05 AM

'బ్రోకర్లకే ఎన్నికల్లో టికెట్లు ఇచ్చారు' - Sakshi

'బ్రోకర్లకే ఎన్నికల్లో టికెట్లు ఇచ్చారు'

హైదరాబాద్: గాంధీభవన్‌ చుట్టూ తిరిగే బ్రోకర్లకే ఎన్నికల్లో టికెట్లు ఇచ్చారని కాంగ్రెస్ నేత, మాజీ  ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ఆరోపించారు. మధ్య దళారుల వ్యవస్థే పార్టీని ముంచిందని ఆయన అన్నారు. ఇకనైన పార్టీ కోసం కష్టపడేవారికే టికెట్లు ఇవ్వాలని, లేదంటే కాంగ్రెస్‌కు భవిష్యత్‌ ఉండదని హెచ్చరించారు. గ్రూపు రాజకీయాలే వల్లే కొన్ని గెలిచే సీట్లు ఓడిపోయామని వాపోయారు.

ఈ సమీక్ష వాస్తవాలన్ని సోనియా గాంధీకి పొన్నాల లక్ష్మయ్య వివరించాలని సూచించారు. గాంధీభవన్ లో రంగారెడ్డి జిల్లా నేతలతో శుక్రవారం పీసీసీ అధ్యక్షుడు పొన్నాల నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఎన్నికల్లో ఓటమిపై సమీక్ష, పార్టీ భవిష్యత్‌ ప్రణాళికపై ఈ సమావేశంలో చర్చించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement