ప్రత్యేక పరిస్థితుల వల్లే ఓటమి: సబిత | congress lost in special situation, says Sabitha Indra Reddy | Sakshi
Sakshi News home page

ప్రత్యేక పరిస్థితుల వల్లే ఓటమి: సబిత

Published Fri, Aug 1 2014 5:14 PM | Last Updated on Wed, Mar 28 2018 11:05 AM

ప్రత్యేక పరిస్థితుల వల్లే ఓటమి: సబిత - Sakshi

ప్రత్యేక పరిస్థితుల వల్లే ఓటమి: సబిత

హైదరాబాద్: గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఊహించని ఫలితాలు వచ్చాయని మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మోడీ ప్రభావం, సెటిలర్ల అంశం, జిల్లాలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల వల్ల పార్టీ ఓటమి పాలైందని తెలిపారు. గాంధీభవన్‌లో జరిగిన రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ సమీక్షా సమావేశంలో ఆమె పాల్గొన్నారు.

టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోను ప్రజలు నమ్మారని ఈ సందర్భంగా సబిత అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టో ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లలేదన్నారు. టీఆర్ఎస్‌ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలన్నారు. హామీల అమలుకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవటం తమ బాధ్యతని, కానీ టీఆర్ఎస్‌ తమపై ఎదురుదాడి చేయగం తగదన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అవినీతి ఉంటే విచారణ జరిపించాలని, కానీ పేదలకు అన్యాయం చేయొద్దని సబిత కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement