Ranga Reddy Congress Leaders
-
ప్రత్యేక పరిస్థితుల వల్లే ఓటమి: సబిత
హైదరాబాద్: గత ఎన్నికల్లో కాంగ్రెస్కు ఊహించని ఫలితాలు వచ్చాయని మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మోడీ ప్రభావం, సెటిలర్ల అంశం, జిల్లాలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల వల్ల పార్టీ ఓటమి పాలైందని తెలిపారు. గాంధీభవన్లో జరిగిన రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ సమీక్షా సమావేశంలో ఆమె పాల్గొన్నారు. టీఆర్ఎస్ మేనిఫెస్టోను ప్రజలు నమ్మారని ఈ సందర్భంగా సబిత అన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లలేదన్నారు. టీఆర్ఎస్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలన్నారు. హామీల అమలుకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవటం తమ బాధ్యతని, కానీ టీఆర్ఎస్ తమపై ఎదురుదాడి చేయగం తగదన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అవినీతి ఉంటే విచారణ జరిపించాలని, కానీ పేదలకు అన్యాయం చేయొద్దని సబిత కోరారు. -
'బ్రోకర్లకే ఎన్నికల్లో టికెట్లు ఇచ్చారు'
హైదరాబాద్: గాంధీభవన్ చుట్టూ తిరిగే బ్రోకర్లకే ఎన్నికల్లో టికెట్లు ఇచ్చారని కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఆరోపించారు. మధ్య దళారుల వ్యవస్థే పార్టీని ముంచిందని ఆయన అన్నారు. ఇకనైన పార్టీ కోసం కష్టపడేవారికే టికెట్లు ఇవ్వాలని, లేదంటే కాంగ్రెస్కు భవిష్యత్ ఉండదని హెచ్చరించారు. గ్రూపు రాజకీయాలే వల్లే కొన్ని గెలిచే సీట్లు ఓడిపోయామని వాపోయారు. ఈ సమీక్ష వాస్తవాలన్ని సోనియా గాంధీకి పొన్నాల లక్ష్మయ్య వివరించాలని సూచించారు. గాంధీభవన్ లో రంగారెడ్డి జిల్లా నేతలతో శుక్రవారం పీసీసీ అధ్యక్షుడు పొన్నాల నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఎన్నికల్లో ఓటమిపై సమీక్ష, పార్టీ భవిష్యత్ ప్రణాళికపై ఈ సమావేశంలో చర్చించారు.