manchi reddy kishan reddy
-
ప్రజా ఆశీర్వాదర్యాలీలో పాల్గొన్న మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
-
‘పట్నం’లో టైట్ ఫైట్! కాంగ్రెస్ నలభై ఏళ్ల కల.. బీఆర్ఎస్ హ్యాట్రిక్ కోసం వల!
సాక్షి, రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం: 'విప్లవాల పురిటిగడ్డ.. కమ్యూనిస్టుల కంచుకోట.. రాచకొండ గుట్టలు నిలయంగా సాయుధ తెలంగాణ రైతాంగ పోరాటం.. నియోజకవర్గ సొంతం. ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావానికి ముందుగానే ఇబ్రహీంపట్నం అసెంబ్లీ సెగ్మెంట్‌గా ఉండేది. అంతటి చరిత్ర కలిగిన ఈ గడ్డపై ప్రధాన పార్టీలన్నీ తమ జెండాలుఎగురవేశాయి.' నగరానికి ఆనుకుని ఉన్న ఈ నియోజకవర్గంలో అన్ని పార్టీలు కాలానుగునంగా తమ ప్రాబల్యాన్ని చాటాయి. ఈ సెగ్మెంట్ హస్తం చేజారి రనాలుగు దశబ్దాలు కావొస్తుండగా.. టీడీపీ, సీపీఎంలు మూడు దశాబ్ధాలుగా విజయం సాధిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం ‘కారు’ 2018లో బోణీ కొట్టింది. 1952లో హైదరాబాద్ రాష్ట్రంలో ఈ నియోజకవర్గం ఉండేది. ఇప్పటి వరకు 16సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది సార్లు కాంగ్రెస్, నాలుగు సార్లు టీడీపీ, మూడుసార్లు సీపీఎం, ఒకసారి టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. 1978 నుంచి 2004 వరకు ఈ స్థానం ఎస్సీ రిజర్వ్డ్. ఇక్కడ ప్రాతినిథ్యం వహించిన 11మందిలో కేవలం ఇద్దరికి మాత్రమే అమాత్య పదవి వరించింది. 15ఏళ్ల పాటు సీపీఎం ఎమ్మెల్యేలు ఈ నియోజకవర్గాన్ని శాసించారు. రోజురోజుకు కమ్యూనిస్టుల ప్రాబల్యం తగ్గుతుంది. కాంగ్రెస్, టీడీపీల పొత్తుల ప్రభావం కారణంగా కమ్యూనిస్టుల ప్రాబ ల్యం మసకబారింది. 1952లో ద్విసభ్య శాసనసభ్యులు.. 1952లో జరిగిన ఈ ఎన్నికల్లో ద్విసభ్య శాసనసభ నియోజకవర్గంగా ఉండేది. తూర్పు, పడమటి ప్రాంతాల నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహించేవారు. అప్పట్లో కమ్యూనిస్టు పార్టీపై నిషేధం ఉండటంతో 1952 అసెంబ్లీ ఎన్నికల్లో పీడీఎఫ్ నుంచి పిల్లయిపల్లి పాపిరెడ్డి (తూర్పు భాగం), కాంగ్రెస్ నుంచి ఎంబీ గౌతమ్ పడమటి బాగం(ఇబ్రహీంపట్నం ప్రాంతం) నుంచి ఎమ్మెల్యేలుగా పనిచేశారు.1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా అవతరించిన అనంతరం ఏకసభ్య నియోజకవర్గంగా మారింది. ఇద్దరు అభ్యర్థులను వరించిన హ్యాట్రిక్! 1952 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎంబీ గౌతమ్, పీడీఎఫ్ నుంచి పిలాయిపల్లి పాపిరెడ్డి, 1957, 1962, 1967 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన లక్ష్మీనర్సయ్య హ్యాట్రిక్ విజయం సాధించారు. 1972 ఎన్నికల్లో హస్తంపై అనంతరెడ్డి గెలుపొందింది. 1978 నుంచి ఎస్సీ రిజర్డ్వ్ స్థానంగా మారింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి సుమిత్రదేవి అసెంబ్లీ మెట్లెక్కారు. ఆమె మృతి చెందడంతో 1981లో నిర్వహించిన ఉప ఎన్నిక, 1983 సాధారణ ఎన్నికల్లో ఏజీ కృష్ణ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించారు. ఎన్టీఆర్ టీడీపీని స్థాపించిన అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ప్రభంజనం వీస్తున్న తరుణంలో 1982లో కాంగ్రెస్ జెండా ఎగరడ గమనార్హం. అనంతరం నియోజవర్గ రాజకీయాల్లో మార్పు వచ్చింది. 1985లో ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్ మధ్యంతర ఎన్నికలకు వెళ్లారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ఏ అసెంబ్లీ ఎన్నికలోనూ కాంగ్రెస్ ఈ స్థానాన్ని దక్కించుకోలేకపోయింది. 1985 ఎన్నికల్లో కె.సత్యనారాయణ టీడీపీ నుంచి గెలుపొందారు. 1989, 1994 ఎన్నికల్లో టీడీపీ మిత్రపక్షంగా ఉన్న సీపీఎం నుంచి కొండిగారి రాములు, 1999లో సైకిల్‌పై కొండ్రు పుష్పలీల, 2004లో కాంగ్రెస్ మిత్రపక్షంగా ఉన్న సీపీఎం నుంచి మస్కు నర్సింహ ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. 2009, 2014 ఎన్నికల్లో మంచిరెడ్డి కిషన్‌రెడ్డి టీడీపీ జెండా ఎగురవేశారు. అనంతరం ఆయన సైకిల్ దిగి కారెక్కారు. 2018లో టీఆర్ఎస్ నుంచి హ్యాట్రిక్ విజయం సాధించారు. డీలిమిటేషన్లో మహేశ్వరం, కందుకూరు మండలాల స్థానంలో హయత్‌నగర్ (అబ్దుల్లాపూర్‌మెట్) మండలం ఇందులో కలిసింది. దీంతో 2009 నుంచి మళ్లీ జనరల్ స్థానంగా మారింది. నియోజకవర్గంలో ఇద్దరు మహిళలు సుమిత్రాదేవి, పుష్పలీల ఎమ్మెల్యేలుగా ప్రాతినిథ్యం వహించారు. ఇద్దరు మంత్రులు.. నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేల్లో ఇద్దరికి మంత్రులు పదువులు వచ్చాయి. కాంగ్రెస్ నుంచి హ్యాట్రిక్ విజయం సాధించిన లక్ష్మీనర్సయ్య, టీడీపీ నుంచి ఒకసారి గెలిచిన కొండ్రు పుష్పలీల మంత్రులుగా పనిచేశారు. హస్తంలో గ్రూపు రాజకీయాలు.. 1985 నుంచి కాంగ్రెస్ అపజాయానికి కారణం గ్రూపు రాజకీయాలే. సెగ్మెంట్లో బలమైన పార్టీ కేడర్ ఉన్నా నాయకుల మధ్య సఖ్యత లేక పార్టీ గెలుపునకు అడ్డుకట్ట వేస్తున్నాయి. ‘కమలం’ తహ తహ! నియోజవకర్గంలో పట్టు సాధించేందుకు బీజేపీ ఏళ్ల నుంచి తహ తహలాడుతోంది. ప్రజల్లో పట్టున్న నాయకుడు ఈ నియోజకవర్గంలో లేకపోవడం ఆ పార్టీకి సమస్యగా మారింది. క్షేత్రస్థాయిలో ఇప్పటికీ పార్టీకి కేడర్ లేకపోవడం గమనార్హం. ద్విముఖ పోరు.. ‘పట్నం’లో మరోమారు కారు జోరు చూపించాలని మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తీసుకురావాలని మల్రెడ్డి రంగారెడ్డి ప్రచారం ముమ్మరం చేశారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ దక్కక మల్రెడ్డి రఏనుగు గుర్తుపై పోటీ కేవలం 356 ఓట్ల తేడాతో ఓటమిని చవిచూశారు. దీంతో ఈ ఎన్నికలు మంచిరెడ్డి, మల్రెడ్డి మధ్య హోరాహోరి పోరు జరుగనున్నదని విశ్లేషకులు అంటున్నారు. -
చీకోటితో ఏమిటి సంబంధం?
సాక్షి, హైదరాబాద్: క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్‌కుమార్ వ్యవహారంలో మనీలాండరింగ్, ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇబ్రహీంపట్నం టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరయ్యారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి వచ్చిన మంచిరెడ్డిని అధికారులు రాత్రి వరకు ప్రశ్నించారు. చీకోటితో ఏమిటి సంబంధం? మనీలాండరింగ్‌కు పాల్పడ్డారా? తరలించిన డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకోసం తరలించాల్సి వచ్చింది? అన్న అంశాలపై స్టేట్మెంట్ రికార్డు చేసినట్టు తెలిసింది. చీకోటితో ఆయన కుటుంబసభ్యులకున్న ఆర్థిక లావాదేవీలపైనా ప్రశ్నించినట్టు సమాచారం. కాగా, మంచిరెడ్డిని 9 గంటల పాటు విచారించి ఇంటికి పంపించిన ఈడీ అధికారులు, బుధవారం కూడా విచారణకు హాజరు కావాలని సూచించారు. ఫెమా నిబంధనలు ఉల్లంఘించి.. క్యాసినో వ్యవహారంలో మనీలాండరింగ్‌కు పాల్పడ్డారంటూ చీకోటిని రెండు నెలల క్రితం ఈడీ ప్రశ్నించింది. ఆయనతో సంబంధాలున్నట్టుగా అనుమానాలున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలను సైతం విచారించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా చీకోటితో 2015 నుంచి మంచిరెడ్డికి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ఈడీ గుర్తించింది. 2015–16లో ఇండోనేసియాలోని పెట్టుబడులు పెట్టేందుకు చీకోటి నెట్వర్క్ ద్వారా మంచిరెడ్డి భారీగా డబ్బును హవాలా రూపంలో తరలించినట్టు అనుమానిస్తోంది. ఇందులో ఫెమా నిబంధనల ఉల్లంఘన చోటు చేసుకున్నట్టు గుర్తించింది. ఈ నేపథ్యంలోనే కిషన్‌రెడ్డిని ఈడీ ప్రశ్నించినట్టు తెలిసింది. క్యాసినోల్లోనూ మంచిరెడ్డి పెట్టుబడులు క్యాసినోలోనూ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి లావాదేవీలున్నట్టుగా ఈడీ కీలక ఆధారాలు గుర్తించింది. ఇండోనేసియాలోని బాలి, నేపాల్, గోవాలోని క్యాసినోల్లో చీకోటితో పాటు మంచిరెడ్డి కొంతమేర పెట్టుబడి పెట్టినట్టు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. అదే సమయంలో కిషన్‌రెడ్డితో పాటు ఆయన కుటుంబీకుల్లో ఒకరికి చీకోటి ప్రవీణ్‌తో ఆర్థిక లావాదేవీలున్న విషయాన్ని దర్యాప్తు అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి కూడా మంచిరెడ్డిని ఈడీ అధికారులు విచారించినట్టు తెలిసింది. ఇలావుండగా మంచిరెడ్డి తర్వాత జాబితాలో ఎవరున్నారన్నదానిపై చర్చ జరుగుతోంది. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు, ఓ మంత్రికి ఈడీ తాఖీదులు తప్పవని తెలుస్తోంది. -
మహిళా ఎంపీపీ వివాదం: ఎమ్మెల్యేపై కేసు
సాక్షి, రంగారెడ్డి : మండల పరిధిలోని నందివనపర్తిలో నిర్వహించిన ఫార్మాసిటీ రోడ్డు విస్తరణ భూమిపూజ కార్యక్రమంలో ప్రొటోకాల్ రగడ వివాదంగా మారింది. రూ.77 కోట్లతో యాచారం– మీరాఖాన్‌పేట, నందివనపర్తి– నక్కర్తమేడిపల్లి గ్రామాల మధ్యన చేపట్టే ఈ పనులకు గురువారం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి భూమిపూజ చేస్తుండగా, తనకు అధికారులు ముందస్తు సమాచారం ఇవ్వలేదని స్థానిక ఎంపీపీ కొప్పు సుకన్య పనులను అడ్డుకోబోయారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, ఎంపీపీల మధ్యన మాటల యుద్ధం జరుగుతుండగా పోలీసులు కలగజేసుకొని ఎంపీపీని అక్కడి నుంచి లాగేశారు. ఈ క్రమంలోనే ఏసీపీ యాదగిరిరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు వారిని అడ్డుకోగా, తోపులాటలో ఎంపీపీ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో తనపై దురుసుగా వ్యవహరించారని, దళితులంటూ దూషించారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిపై యాచారం పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 509, 323, ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. కాగా మంచిరెడ్డి తీరును నిరశిస్తూ.. యాచారంలోని అంబేడ్కర్ చౌరస్తాలో బీజేపీ, కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఎంపీపీ సుకన్య నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ.. ప్రొటోకాల్ విషయంలో స్పష్టత ఇవ్వాలని అడిగినందుకు ఎమ్మెల్యే మంచిరెడ్డి దళిత ఎంపీపీ అని అవమానపర్చే విధంగా వ్యవహరించడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. మండుటెండలో నిరసన తెలపడంతో సొమ్మసిల్లి పడిపోయిన ఎంపీపీని నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఎంపీపీని పరామర్శించిన బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గురువారం రాత్రి బీఎన్‌రెడ్డి నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యాచారం ఎంపీపీ కొప్పు సుకన్యను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు మద్దతుగా పోరాటాలు చేయాలని సూచించారు. ప్రొటోకాల్పె స్పష్టత అడిగితే దళిత ఎంపీపీని అవమానించి, పోలీసులచే దాడులు చేయిస్తారా అని ప్రశ్నించారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఇదేనా నీ సంస్కారం అని ప్రశ్నించారు. అభివృద్ధికి బీజేపీ అడ్డుకాదని, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తే చూస్తూ ఊరుకోమన్నారు. -
ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన ఎమ్మెల్యే
సాక్షి, ఇబ్రహీంపట్నం: ప్రభుత్వ సహకారం, ఉద్యోగుల సంకల్పదీక్షతో ప్రజలకు మరింత మెరుగైన రవాణాసేవాలను అందించేవిధంగా ఆర్టీసీని తీర్చిదిద్దుదామని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. ఆర్టీసీ పరిస్థితి, రవాణా సమస్యలు, ప్రయాణికులు, ఉద్యోగుల వినతులపై ఆయన సోమవారం ఆర్టీసీ రీజినల్ మేనేజర్ ఎండీ ఖుస్రుషాఖాన్‌తో కలిసి ఆర్టీసీ, ఆర్టీఓ, పోలీసు అధికారులతో సమీక్షా సమావేశాన్ని ఇబ్రహీంపట్నంలోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. అంతకు ముందు బీఎన్‌రెడ్డి నుంచి ఇబ్రహీంపట్నం వరకు ఆర్టీసీ బస్సులో ఎమ్మెల్యే ప్రయాణించి స్వయంగా టికెట్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆడిగి తెలుసుకున్నారు. బస్టాండ్‌లో వసతులను, పరిసరాలను పరిశీలించిన అనంతరం నిర్వహించిన సమీక్ష సమావేశంలో అయన మాట్లాడుతూ.. ఉద్యోగుల పనితీరు బాగుందని తెలిపారు. సంస్థ అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నివిధాలుగా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణికులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి సంస్థను దివాళాతీయించి వేలాది ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలను రోడ్డున పడేసేందుకు, ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు విపక్షాలు పన్నిన కుయుక్తులు పనిచేయలేవని స్పష్టం చేశారు. ఆర్టీసీ ఉద్యోగస్తులు అడగని వరాలను ముఖ్యమంత్రి ప్రకటించి వారి కుటుంబాల్లో వెలుగులు నింపారని చెప్పారు. సంస్థ మనుగడలేకుండా చేసేందుకు యత్నించిన వారి మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. మహిళా ఉద్యోగులతోపాటు, సీనియర్ ఉద్యోగుల డ్యూటీ చార్ట్ విషయంలో మేలు జరిగేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆధికారులను ఆదేశించారు. ప్రైవేట్ వాహనాలు బస్టాండ్ల వద్ద నిలుపకుండా ఆర్టీఓ, పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఆర్టీఏ అధికారి రఘనందన్‌గౌడ్, ఆర్టీసీ డివిజనల్ మేనేజర్ విజయభాను, డిపో మేనేజర్లు నల్ల యేసు, గిరిమహేశం, శ్రీనివాస్, సీఐ గురువారెడ్డి, ఎంపీపీ కృపేశ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, వైఎస్ ఎంపీపీ ప్రతాప్‌రెడ్డి పాల్గొన్నారు. -
తహసీల్దార్ హత్యపై రాజకీయ దుమారం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి సజీవ దహనంపై జిల్లాలో రాజకీయ రగడ మొదలైంది. లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత చల్లబడిన రాజకీయం.. విజయారెడ్డి హత్యోదంతంతో క్రమంగా వేడెక్కుతోంది. తహసీల్దార్ హత్యకు నువ్వంటే.. నువ్వే కారణమని స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఒకరిపై ఒకరు మీడియా వేదికగా ఆరోపించుకుంటున్నారు. ఆది నుంచి వీరు రాజకీయ ప్రత్యర్థులు. ఒకరంటే ఒకరికి పడని వీరిద్దరూ మాటల తూటాలు పేల్చుతూ సవాల్.. ప్రతి సవాల్ విసురుకుంటున్నారు. సోమవారం రైతు కూర సురేష్ తహసీల్దార్ విజయారెడ్డిపై కార్యాలయంలోనే పెట్రోల్ పోసి నిప్పటించడంతో సజీవదహనమైన చేసిన విషయం తెలిసిందే. ఈ అమానుషానికి ప్రధాన కారణమైన భూముల వ్యవహారంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే హస్తం ఉందని మల్రెడ్డి రంగారెడ్డి ఆరోపణల బాంబ్ పేల్చడంతో వివాదం రాజుకుంది. భూముల నిగ్గు తేల్చేందుకు సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేసిన ఆయన... ల్యాండ్ మాఫియాకు ఎమ్మెల్యే నాయకత్వం వహిస్తున్నారని తీవ్రపదజాలంతో విరుచుకుపడటం సర్వత్రా చర్చనీయాంశమయింది. రూ.వేల కోట్లు ఎలా వచ్చాయ్? భూ మాఫియా అంటేనే మల్రెడ్డి రంగారెడ్డి. గత 20 ఏళ్లుగా ఆయనకు ఆస్తులు, భూములు ఎలా వచ్చాయో విచారణ జరిపితే తెలుస్తుంది. వందశాతం భూకబ్జా దారుడు.. ల్యాండ్ గ్రాబర్.. విచారణ జరిపిస్తే మాఫియా ఎవరో బయటపడుతుంది. తహసీల్దార్ మీద ఎవరు ఒత్తిడి తెచ్చారో తేలాలి. విజయారెడ్డి హత్య కేసులో కావాలనే నాపై బురదజల్లుతున్నారు. నేను సాయం చేసే మనిషినే..అన్యాయం చేసే వాడినికాదు. రెండెకరాల మనిషి.. రూ.వేల కోట్లు ఎలా సంపాదించారో అందరికీ తెలుసు. మా ఆస్తులన్నీ మా తాతలు, తండ్రుల కాలం నాటివే. అబ్దుల్లాపూర్‌మెట్ చుట్టుపక్కల ఉన్న 412 ఎకరాల వివాదాస్పద భూమిపై విచారణ జరిపి తీరాలి. వాస్తవాలేంటో తేలుతాయి. అంబర్‌పేట ఓఆర్ఆర్ దగ్గర సర్వే నంబర్లు 230 – 233లో ఉన్న 16 ఎకరాల భూమిని మల్రెడ్డి రంగారెడ్డి బంధువులే కబ్జా చేశారు. మెట్రోసిటీ పేరుతో 60 ఎకరాలను కొల్లగొట్టారు. నేను రూ.30 లక్షలు ఎవరి దగ్గరా వసూలు చేయలేదు. తీసుకున్నట్లు ఆయన రుజువు చేయాలి. మూడుసార్లు ఓడిపోయిన వ్యక్తి నాపై ఆరోపణలు చేస్తే స్పందించాలా అనుకున్నా. కానీ శవ రాజకీయాలు చేస్తుంటే తట్టుకోలేక మీడియా ముందుకు రావాల్సి వచ్చింది. – మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే 40 ఎకరాలు ఎవరబ్బ సొమ్ము? ల్యాండ్ మాఫియాకు నాయకత్వం వహిస్తున్న నాయకుడు ఎమ్మెల్యే కిషన్ రెడ్డి. నయీంతో దోస్తీ చేసిన వ్యక్తి ఆయన. నాకున్న ఆస్తుల వివరాలను నిర్భయంగా, నిర్మొహమాటంగా చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. ఆ వివాదాస్పద భూముల్లో నా బంధువులు అక్రమంగా కొనుగోలు చేస్తే 24 గంటల్లోగా స్వాధీనం చేసుకుని పేదలకు పంచండి. అధికారంలో మీరే ఉన్నారు. సీఎంకు కూడా చెప్పు. నేను పది మందికి మంచి చెప్పేవాడిని. నేను ఎవరితోనూ చెప్పించుకోను. నువ్వు చెబుతున్నట్లుగానే.. ఎప్పుడో మావాళ్లు భూములు కొని ఉంటే ఇన్ని రోజులు ఏం చేశావ్? పదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉండి ఎందుకు అడగలేదు? రూ.400 కోట్ల విలువచేసే ప్రభుత్వ భూమిని ఇబ్రహీంపట్నంలో కాజేశావ్. అధికారుల మీద ఒత్తిడి తెచ్చి ఓఆర్సీ ఇప్పించావ్. దాని పక్కనే ప్రభుత్వ సంస్థలకు భూమిని గతంలో ఇచ్చారు. పోలీస్‌స్టేషన్, మార్కెట్ కమిటీ, ఆర్టీసీ డిపోలకు దాదాపు 30 ఎకరాలు కేటాయించారు. ఇదిపోగా 40 ఎకరాలు ఎవరబ్బ సొమ్మని బినామీల పేరిట తెచ్చుకున్నావ్? – మల్రెడ్డి రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే -
బతుకమ్మ.. బతుకమ్మ ఉయ్యాలో.. మీ ఓట్లు నాకు వెయ్యాలో..
సాక్షి, మంచాల: ఇబ్రహీంపట్నం టీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మంచాల మండల పరిధిలోని బండలేమూర్, పటేల్‌చెర్వు తండాలో పర్యటించి ప్రచారం చేశారు. అన్నివర్గాల అభివృద్ధి టీఆర్ఎస్ సర్కారు హయాంలోనే జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఆయన బండలేమూర్‌లో మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిపాడారు. -
డిండి.. ఈసారికి ఇంతేలెండీ!
సాక్షి, ప్రతినిధి,రంగారెడ్డి: కరువు నేలకు ఇప్పట్లో సాగునీటి భాగ్యం లేనట్లే. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాలతో పాటు యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపూర్ మండలాన్ని సస్యశ్యామలం చేసేందుకు ఉద్దేశించిన రాచకొండ ఎత్తిపోతల(డిండి) ప్రాజెక్టు డిజైన్ ఖరారుకు గ్రహణం వీడడం లేదు. దీంతో సేద్యపు జలాల కోసం ఇక్కడి రైతాంగం మరికొన్నాళ్లు ఎదురుచూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. లక్ష ఎకరాల సాగు లక్ష్యంగా.. 50 నుంచి 100 చెరువులు, కుంటలను కృష్ణా జలాలతో నింపాలని ప్రభుత్వం నిర్ణయించింది. డిండి ప్రాజెక్టు నుంచి శివన్నగూడెం రిజర్వాయర్‌కు నీటిని తరలించి అటు నుంచి రాచకొండ ఎత్తిపోతలతో 0.10 టీఎంసీల నీటిని సాగు అవసరాలకు వినియోగించుకునేలా ఈస్కీ (ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా) ప్రతిపాదనలు తయారు చేసింది. రూట్ మ్యాప్ సర్వే, డీపీఆర్ తయారీ కోసం ఈ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1.72 కోట్ల నిధులు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సర్వే పూర్తి చేసిన ఈస్కీ.. ప్రాజెక్టు రిపోర్టును చీఫ్ ఇంజ నీర్కు అప్పగించింది. ఈ డిజైన్‌ను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్ స్వల్ప మార్పులను సూచించారు. దీంతో మరోసారి ప్రాజెక్టు స్వరూపం మార్చడానికి ఇంజనీర్ల బృందం కసరత్తు చేస్తోంది. ఇప్పట్లో కష్టమే.. రాచకొండ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు డిజైన్ కొలిక్కి రాకపోవడంతో ఈ పథకం ఇప్పట్లో పట్టాలెక్కడం కష్టంగానే కనిపిస్తోంది. శాసనసభ ఎన్నికలకు నగారా మోగడంతో ప్రాజెక్టుకు మోక్షం లేనట్టే. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగితే డిండి ప్రాజెక్టుకు అంకురార్పణ చేయాలని ప్రభుత్వం భావించినా ప్రస్తుత పరిస్థితులతో ముందుకు కదల్లేని పరిస్థితి తలెత్తింది. ప్రాజెక్టు స్వరూపం ఇలా.. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడెం వద్ద ప్రస్తుతం నిర్మిస్తున్న బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి నీటిని 4 కిలోమీటర్ల గ్రావిటీ కాలువ, 4.50 కి.మీల సొరంగం ద్వారా యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపూర్ మండలం వావిల్లపల్లి పైభాగాన 2.20 టీఎంసీల నీటి సామర్థ్యంతో ఒక రిజర్వాయర్, అక్కడి నుంచి లిఫ్ట్ ద్వారా ఆరుట్ల శివారులో 2.62 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో రెండో రిజర్వాయర్, ఇబ్రహీంపట్నం మండలం పెద్దతుల్ల, యాచారం మండలం గునుగల్ గ్రామాల మధ్య ... ఒక టీఎంసీ కెపాసిటీతో మూడో రిజర్వాయర్‌ను నిర్మించే విధంగా ఈస్కీ ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. ఈ రిపోర్టు, రూట్ మ్యాప్‌ను పరిశీలించిన నీటి పారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ వెంకటేశం గ్రావిటీ కాల్వల నిర్మాణంపై కొన్ని సూచనలు చేసింది. ఆ సూచనల ప్రకారం ఈస్కీ మరోమారు ప్రాజెక్టు స్వరూపాన్ని తయారు చేసే పనిలో నిమగ్నమైంది. నిధులకు ఢోకాలేదు ఈస్కీ బృందం రూపొందించిన డిజైన్‌లో ఇరిగేషన్ శాఖ చీఫ్ ఇంజనీర్ కొన్ని సూచనలు చేశారు. దీనికి అనుగుణంగా మరోసారి రూట్ మ్యాప్‌ను తయారు చేసే పనిలో ఈస్కీ నిమగ్నమైంది. త్వరలో ఇది కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. –శ్యాంప్రసాద్‌రెడ్డి, రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
ప్రచారంలో దూకుడు
ప్రచారంలో ‘కారు’ దూసుకుపోతోంది. టీఆర్ఎస్ అధిష్టానం అభ్యర్థులను ప్రకటించడంతో నిత్యం గ్రామాల్లో పర్యటిస్తూ తమకు ఓటేసి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. కొన్ని సెగ్మెంట్లకు బీజేపీ అభ్యర్థులు సైతం దాదాపు ఖరారవడంతో ప్రచారం మొదలుపెట్టారు. కాంగ్రెస్ పార్టీ రేసుగుర్రాలను ఇంకా ప్రకటించకపోవడంతో నేతలు ప్రచారపర్వానికి శ్రీకారం చుట్టలేదు. పొత్తుల నేపథ్యంలో తమ సీట్లు గల్లంతయ్యే ప్రమాదం ఉందేమోనని కొందరు ఆశావహులు ఆందోళనకు గురవుతున్నారు. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ‘ముందస్తు’ ప్రచారం ఊపందుకుంటోంది. గులాబీ గుర్రాలు కదనరంగంలోకి దూకగా.. కాంగి‘రేసు’ ఇంకా మొదలు కాలేదు. ఒకట్రెండు నియోజకవర్గాల్లో మాత్రం ‘కమలం’ వికసిస్తోంది. శాసనసభను రద్దు చేసిన రోజే అభ్యర్థులను ఖరారు చేసి ఎన్నికల నగారా మోగించడంతో టీఆర్ఎస్ ప్రచారపర్వంలో దూసుకుపోతోంది. కాంగ్రెస్ మాత్రం పొత్తులు..ఎత్తులతోనే కాలయాపన చేస్తోంది. విపక్షాలన్నీ మహాకూటమిగా బరిలో దిగాలని నిర్ణయించిన నేపథ్యంలో సీట్ల సర్దుబాటు ఇంకా ఓ కొలిక్కిరాలేదు. కనీసం సీట్ల సంఖ్యపై కూడా స్పష్టత కనిపించడం లేదు. దీంతో ఆశావహుల్లో గందరగోళం నెలకొంది. పొత్తులు ఎవరి సీట్లకు ఎసరు తెస్తాయోననే ఆయా పార్టీల అభ్యర్థుల్లో కలవరం మొదలైంది. ఇది కాస్తా నేతలను ప్రచార క్షేత్రంలోకి వెళ్లకుండా నిలువరిస్తోంది. ప్రచారపర్వంలో అధికారపార్టీ దూకుడు కొనసాగుతున్నా.. దానికి బ్రేకులు వేసే ప్రయత్నం కూడా చేయడం లేదు. సీట్లు తేలకపోవడంతో హేమాహేమీలు సైతం ఎన్నికల ప్రచారానికి వెళ్లకుండా సన్నిహితులతో మంతనాలకే పరిమితమవుతున్నారు. టికెట్లు ఖరారైతే తప్పా ముందడుగు వేసే వాతావరణం సీనియర్లకు లేకపోగా.. సీట్ల పంపకంపై స్పష్టత వస్తే తప్పా ప్రచారం కోసం ప్రజాక్షేత్రంలోకి వెళ్లే పరిస్థితి ఆశావహులకు లేకుండా పోయింది. దీంతో కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ పార్టీలు ఎన్నికల శంఖారావం ఇంకా పూరించలేకపోతున్నాయి. జెట్ స్పీడులో కారు.. ప్రచారంలో కారు జోరు కొనసాగుతోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో వికారాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి నియోజకవర్గాలు మినహాయించి మిగతా సెగ్మెంట్లకు అధిష్టానం అభ్యర్థులను ప్రకటించడంతో గులాబీ దళం క్షేత్రస్థాయి ప్రచారంలోకి వెళ్లింది. రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి సొంత నియోజకవర్గం తాండూరులోనే మకాం వేశారు. ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజలతో మమేకమవుతూ మరోసారి అవకాశం కల్పించాలని అభ్యర్థిస్తున్నారు. ఆయన సోదరుడు నరేందర్‌రెడ్డి కూడా కొడంగల్ నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. తాజా మాజీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని ఓడించి సంచలనం నమోదు చేయాలని భావిస్తున్న నరేందర్.. నియోజకవర్గంలోనే తిష్ట వేశారు. ఇబ్రహీంపట్నం సిట్టింగ్ శాసనసభ్యుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి కూడా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. అచ్చొచ్చిన నందివనపర్తి నుంచి ఆయన ప్రచార భేరీని మోగించారు. మేజర్ పంచాయతీల్లో ధూంధాం కార్యక్రమాలతో ఆయన ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల దరికి చేర్చేందుకు యత్నిస్తున్నారు. చేవెళ్ల తాజా మాజీ ఎమ్మెల్యే కాలె యాదయ్య శంకర్పల్లి, షాబాద్, నవాబుపేట మండలాల్లో తొలిదఫా ప్రచారాన్ని పూర్తి చేశారు. పరిగిలోని ఆయా మండలాల్లో యువనేత మహేశ్‌రెడ్డి విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆయన సతీమణి ప్రతిమారెడ్డి సైతం నిత్యం ప్రచారం చేస్తూ తన భర్తకు ఓటేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. రాజేంద్రనగర్, ఎల్బీనగర్లో మాత్రం ఊహిం చిన స్థాయిలో ప్రచారం ఊపందుకోలేదు. లేటయినా.. లేటెస్ట్గా షాద్‌నగర్‌లో తాజా మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌కు అసమ్మతి సెగ తగిలింది. టికెట్ ఆశించి భంగపడిన వీర్లపల్లి శంకర్, అందె బాబయ్యను బుజ్జగించేందుకు ప్రయత్నాలు చేసి అలసిపోయిన అంజయ్య.. ఎట్టకేలకు ప్రచారానికి శ్రీకారం చుట్టారు. రోజుకో ర్యాలీతో అసమ్మతి రాజకీయాలు చేస్తున్న ఇరువురికి చెక్ పెట్టేలా భారీగా తరలివస్తునకార్యకర్తలతో ఆయన ప్రచారాన్ని ప్రారంభించారు. కల్వకుర్తిలో టీఆర్ఎస్ అభ్యర్థి జైపాల్‌యాదవ్ ప్రచారాన్ని మొదలుపెట్టినా.. ఇంకా ఊపందుకోలేదు. స్థానిక నేతలు కలిసిరాకపోవడంతో ప్రచారంలో దూకుడును చూపించలేకపోతున్నారు. కమలం జోరు షాద్‌నగర్, కల్వకుర్తి నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు ఆచారి, శ్రీవర్ధన్‌రెడ్డి అధికారపార్టీ అభ్యర్థులకు దీటుగా ప్రచారపర్వంలోకి దిగారు. గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన ఆచారి ఈ సారి ఎలాగైనా విజయం ఢంకా మోగించి శాసనసభలో అడుగుపెట్టాలని భావిస్తున్నారు. అధిష్టానం కూడా టికెట్ విషయంలో లైన్ క్లియర్ చేయడంతో ముందస్తు ప్రచారానికి తెర లేపారు. ముమ్మరంగా గ్రామాలను చుట్టేస్తున్న ఆయన.. తనకు ఓసారి అవకాశం ఇవ్వాలని ప్రజలను వేడుకుంటున్నారు. షాద్‌నగర్‌లో శ్రీవర్ధన్‌రెడ్డి కూడా జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. ఇంటింటికి తిరుగుతున్న ఆయన.. కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే అవినీతి వ్యవహారాలను నిలదీస్తూ..ప్రజలను చైతన్యం చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో పోటీ చేసిన శ్రీవర్ధన్‌కు.. ఈసారి కూడా టికెట్ ఖాయమని బీజేపీ హైకమాండ్ సంకేతాలివ్వడంతో ప్రచారం షురూ చేశారు. మిగతా నియోజకవర్గాల్లో పార్టీ అధిష్టానం అభ్యర్థులను ఖరారు చేయకపోవడంతో ఎన్నికల సందడి మొదలు కాలేదు. -
సందడే సందడి..
ఇబ్రహీంపట్నం రూరల్ (రంగారెడ్డి): అన్ని అడుగులు కొంగరకలాన్‌లోని ప్రగతి నివేదన సభా ప్రాంగణం వైపే పడుతున్నాయి. ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. సభలో కుర్చోవడానికి నిర్వాహకులు దాదాపు 70 వేల కుర్చీలు, 50 వేల చదరపు అడుగుల గ్రీన్ కార్పెట్‌ను ఏర్పాటు చేశారు. మూత్రశాలలు, తాగునీటి వసతిని ఏర్పాటు చేశారు. పోలీసు ఉన్నతాధికారులు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. శనివారం మంత్రులు కేటీఆర్, మహేందర్‌రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తున్నారు. సందడే సందడి.. శనివారం ప్రగతి నివేదన సభ స్థలం వద్ద కోలాహోలం నెలకొంది. స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి గడ్డపై సభ జరుగుతుండటంతో వేదిక వద్ద ప్రత్యేక ఆకర్షణగా ఆయన సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మంచాల, యాచారం, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లోని గిరిజన మహిళలు 300 మంది తమ సాంప్రదాయ వేషధారణలో అక్కడికి చేరుకొని సుమారు అరగంటపాటు నృత్యాలు చేశారు. వారు మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి చుట్టూ చేరుకొని సందడి చేశారు. గిరిజనుల ఆటలను చూసి మంత్రి మంత్రముగ్దులయ్యారు. చాలా చక్కగా ఆటపాడారని అభినందించారు. రోడ్లపై సూచికలు ఏర్పాటు ప్రగతి నివేదన సభకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మంగళ్‌పల్లి–కొంగరకలాన్, ఔటర్ రింగ్‌రోడ్డు నుంచి సభా స్థలం, రావిర్యాల్ నుంచి సభా స్థలం వద్దకు సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. సభా స్థలం, పార్కింగ్ ప్రాంతాలను పరిశీలించడానికి, సభకు రాకపోకలు వారి కదలికలను గుర్తించడానికి పోలీసులు కమోండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. దీనిని మంత్రులు కేటీఆర్, మహేందర్‌రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి, రసమయి బాలకిషన్ పరిశీలించారు. నిరంతరం నిఘాపెట్టాలని పోలీసులను అదేశించారు. కళాకారుల కోసం ప్రత్యేక వేదిక సభ సాయంత్రం ప్రారంభం కానుండడంతో ఉదయం నుంచి వచ్చే జనాలను ఆకర్షించేందుకు కళాకారులు ఆడిపాడేందుకు ప్రత్యేక వేదిక ఏర్పాటు చేశారు. తెలంగాణ యాస, భాషతో కూడిన సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందు కోసం వేదికకు ఎడమ వైపు దాదాపు వంద మంది కళాకారుల కోసం ఏర్పాట్లు చేశారు. సభకు పెద్దఎత్తున ప్రజలు హాజరు కానుండటంతో రోడ్లపై దుకాణాలు వెలిశాయి. వాటర్ బాటిళ్లు, కూల్‌డ్రింక్స్‌తో పాటు ఇతర సామాగ్రిని అందుబాటులో ఉంచారు. -
మంచిరెడ్డిపై డీజీపీకి మల్రెడ్డి ఫిర్యాదు
హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీం దందాలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి పాత్ర ఉందని కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంపై సిట్ తో పూర్తిస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బుధవారం ఆయన డీజీపీ అనురాగ్ శర్మను కలిశారు. నయీం ముఠాతో మంచిరెడ్డి కిషన్ రెడ్డికి సంబంధాలున్నాయని ఫిర్యాదు చేశారు. కాగా, మంచిరెడ్డిపై తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని, నిరూపించలేకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని అంతకుముందు ఆయన పేర్కొన్నారు. అయితే మల్రెడ్డి ఆరోపణలను మంచిరెడ్డి తోసిపుచ్చారు. -
అగ్నిపరీక్ష!
ఇబ్రహీంపట్నం, న్యూస్‌లైన్: రాబోయే ఎన్నికల్లో సొంత గడ్డపై తమ పార్టీలను గెలిపించుకోవడం జిల్లాలో ఇద్దరు నేతలకు ప్రతిష్టాత్మకంగా మారింది. వీరిలో ఒకరు డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్ కాగా మరొకరు టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ‘పట్నం’ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి. మండల పరిధిలోని శేరిగూడ గ్రామానికి చెందిన మల్లేశ్ ఇటీవల డీసీసీ అధ్యక్షుడిగా నియమితులు కాగా, ఎలిమినేడు గ్రామానికి చెందిన మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తాజాగా టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఇద్దరూ ఒకే మండలానికి చెందిన నేతలు కావడం, పార్టీల్లో కీలక పదవుల్లో ఉండడంతో వచ్చే ఎన్నికలు వారికి అగ్నిపరీక్షగా నిలిచాయి. ఇంట గెలిచి రచ్చ గెలవాల్సిన బాధ్యత కూడా వారిపై పడింది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్‌ను మల్లేశ్ ఆశిస్తుండగా, టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా కిషన్‌రెడ్డి తిరిగి పోటీ చేయడం దాదాపు ఖరారైంది. ఈ పరిస్థితుల్లో వచ్చే మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు వారికి సవాల్‌గా మారాయి. గెలుపుపై దృష్టి.. నియోజకవర్గంలోని హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం మండలాల్లో అత్యధిక ఎంపీపీలను, జెడ్పీటీసీలను గెలిపించుకోవడం ద్వారా తమ సత్తా చాటుకోవాలని ఇద్దరు నేతలు తహతహలాడుతున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపోటములు వచ్చే సాధారణ ఎన్నికలపై ప్రభావం చూపనుండడంతో తమ పార్టీలను విజయతీరాలకు చేర్చాల్సిన బాధ్యత వారిపై పడింది. 2006 ఎన్నికల్లో హయత్‌నగర్, యాచారం ఎంపీపీలను కాంగ్రెస్ కైవసం చేసుకోగా ఇబ్రహీంపట్నం, మంచాల ఎంపీపీలను టీడీపీ దక్కించుకుంది. జెడ్పీటీసీల విషయానికొస్తే హయత్‌నగర్, యాచారం, ఇబ్రహీంపట్నం జెడ్పీటీసీలు కాంగ్రెస్ వశమయ్యాయి. మంచాల జెడ్పీటీసీని సీపీఎం కైవసం చేసుకుంది. ప్రస్తుతం మారిన రిజర్వేషన్ల నేపథ్యంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి బలమైన అభ్యర్థులను బరిలోకి దింపడం ద్వారా అత్యధిక స్థానాలను తమ పార్టీలకు గెలిపించుకోవాలని ఇద్దరు నేతలు పావులు కదుపుతున్నారు. ముందుగా వచ్చే నగర పంచాయతీ ఎన్నికలు ఇద్దరూ దృష్టి సారించారు. నియోజకవర్గంలో ఇబ్రహీంపట్నం, పెద్ద అంబర్పేట్ నగర పంచాయతీలు ఇటీవలే ఆవిర్భవించాయి. ఈ రెండు నగర పంచాయతీల చైర్మన్ పదవులు ఎస్సీ జనరల్‌కు రిజర్వ అయ్యాయి. సెమీఫైనల్ లాంటి ఎంపీటీసీ ఎన్నికలకు ముందు జరిగే నగర పంచాయతీ ఎన్నికలు ఇద్దరు నేతల సామర్థ్యానికి ప్రతీకగా నిలవనున్నాయి.