నయీంతో ఎలాంటి సంబంధాలు లేవు: శ్రీహరి
హైదరాబాద్: గ్యాంగ్స్టర్ నయీంతో తనకు ఎలాంటి సంబంధాలు లేవని నయీం అనుచరుడు శ్రీహరి తెలిపాడు. రంగారెడ్డి జిల్లా కోర్టులో బుధవారం లొంగిపోయిన అతడు.. సాక్షి టీవీతో మాట్లాడాడు.
రియల్ ఎస్టేట్ పరంగానే నయీంతో తనకు పరిచయం ఏర్పడిందని శ్రీహరి తెలిపాడు. నయీం కేవలం న్యాయపరమైన సలహాలకు మాత్రమే తనను సంప్రదించేవాడని చెప్పాడు. తనపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని ఆయన పేర్కొన్నాడు. తామిద్దరి మధ్య ఎలాంటి లావాదేవీలు లేవన్నాడు. నయీమే తనపై 2013లో దాడి చేసినట్లు శ్రీహరి వెల్లడించాడు. 2006వ సంవత్సరంలో ఆదిభట్లలో 4 ఎకరాల భూమి కొనుకున్నానని...ఆ సమయంలో పక్కపొలం వారు భూమి కబ్జాకు యత్నించడంతో వారిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానన్నాడు.