
నయీమ్ కేసులో ఎవర్నీ వదిలిపెట్టం: నాయిని
సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసుకు సంబంధం ఉన్న వారెవరినీ వదిలే ప్రసక్తే లేదని, రాజకీయ నేతలైనా ప్రభుత్వం ఉపేక్షించబోదని హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి స్పష్టం చేశారు. కార్మిక శాఖకు సంబంధించి గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ నివేదిక ప్రభుత్వానికి అందలేదని, అందిన వెంటనే దోషులపై ప్రభుత్వం కఠినచర్యలు చేపడుతుందని తెలిపారు.