నయీమ్ కేసులో మరో పది మంది అరెస్టు : ఐజీ
సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసులో మరో పదిమందిని అరెస్టు చేసినట్లు సిట్ చీఫ్ ఐజీ నాగిరెడ్డి తెలిపారు. వీరిలో ఒకరిని కరీంనగర్ జిల్లా కోరుట్ల పోలీసులు, మిగతా తొమ్మిది మందిని నల్లగొండ జిల్లా భువనగిరి పోలీసులు అరెస్టు చేసినట్లు చెప్పారు. అరెస్టు అయినవారిలో ఒకరు నయీమ్ బావ మహ్మద్ అషఫ్అలియాస్ అషు ఉన్నట్లు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. నయీమ్ కేసుల్లో ఇప్పటివరకు అరెస్టైన వారిసంఖ్య 77, కేసుల సంఖ్య 72కు చేరినట్లు నాగిరెడ్డి వివరించారు. ఈ కేసులన్నీ కూడా నల్లగొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాల్లోని పలు పోలీస్‌స్టేషన్ల పరిధిలో నమోదైనట్లు పేర్కొన్నారు.
గురువారం అరెస్టు చేసినవారిలో పూత బాలకృష్ణ, ఎండీ అఖిల్ పాష, రాపోలు సుదర్శన్, జుక్కంటి బుచ్చయ్య, ఎం.డి. ఖాసింసాబ్, సుధాకర్, అడ్వకేట్ వెంకటేశ్, శ్రీనివాస్, శ్రీధర్‌రాజు, మహ్మద్ అషఫ్రఉన్నట్లు తెలిపారు. వీరిలో అషఫ్రమినహా మిగతా తొమ్మిది మంది నయీమ్ ప్రధాన అనుచరుడు పాశం శ్రీనుతో కలసి బెది రింపులు, బలవంతంగా భూముల రిజిస్ట్రేషన్ వంటి అక్రమాలకు పాల్పడినట్లు తెలిపారు. సుధాకర్, వెంకటేష్‌గౌడ్, రాపర్తి కరుణాకర్, దోర్నాల శ్రీను, శ్రీధర్‌రాజుముందుగా హయత్‌నగర్ కోర్టులో లొంగిపోయారు. వీరు నయీం ఎన్‌కౌంటర్ అనంతరం పరారీలో ఉన్నారు. వీరికి మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించగా పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు.
పోలీస్ కస్టడీకి ఆరుగురు
చర్లపల్లి కేంద్ర కారాగారంలో విచారణ ఖైదీలుగా ఉన్న నయీం అనుచరులు ఆరుగురిని గురువారం పోలీస్ కస్టడీకి తరలించారు. రాజేంద్రనగర్ కోర్టు ఆదేశాల మేరకు శ్రీధర్‌గౌడ్, సమీరుద్దీన్‌లను శంషాబాద్ ఎరుుర్‌పోర్స్ పోలీసులు 8 రోజులు, సామ సంజీవరెడ్డి, పి.శ్రీహరిని పహాడీషరీఫ్ పోలీసులు నాలుగు రోజులు, మరో ఇద్దరు నిందితులు ఎం.డి. అబ్దుల్‌ఫహీం, సమేలను వనస్థలిపురం పోలీసులు రెండు రోజుల కస్టడీకి తీసుకున్నట్లు జైలు అధికారులు తెలిపారు.