'నయీం కేసును సీరియల్లా సాగదీయకండి' | T Congress MLA Komatireddy Venkat Reddy slams CM KCR | Sakshi
Sakshi News home page

'నయీం కేసును సీరియల్లా సాగదీయకండి'

Published Thu, Sep 29 2016 3:04 PM | Last Updated on Tue, Nov 6 2018 4:42 PM

'నయీం కేసును సీరియల్లా సాగదీయకండి' - Sakshi

'నయీం కేసును సీరియల్లా సాగదీయకండి'

హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీం కేసు విచారణ డైలీ సీరియల్ సాగదీయకుండా.. త్వరగా విచారణ పూర్తిచేసి దోషులను శిక్షించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. సీబీఐ విచారణ జరిపించాలని అనేక సార్లు కోరినా.. ప్రభుత్వ పట్టించుకోవడంలేదని వెంకట్ రెడ్డి తెలిపారు. నయీంతో సంబంధాలు పెట్టుకోవాల్సిన అవసరం తమకు లేదని ఆయన పునరుద్ఘాటించారు.
 
మరోవైపు సీఎం కేసీఆర్ మిడ్ మానేరు నిర్వాసితులను క్షమాపణ కోరిన విధంగానే రుణమాఫీపై మాటమార్చినందుకు రైతులను కూడా క్షమాపణ కోరాలని  రుణమాఫీ ఏక కాలంలో పూర్తిచేయకపోవడం వల్లే రైతులు అప్పులపాలవుతున్నారు. సీఎం వద్ద ఉన్న ప్రత్యేక అభివృద్ధి నిధి రూ.4750 కోట్లను రుణమాఫీ కోసం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement