నయీం పచ్చిమిర్చి రసం తాగించి...అకృత్యాలు | gangster nayeem Affected girls gives to police statement over harassment | Sakshi
Sakshi News home page

నయీం పచ్చిమిర్చి రసం తాగించి...అకృత్యాలు

Published Wed, Sep 7 2016 6:02 PM | Last Updated on Mon, Sep 4 2017 12:33 PM

నయీం పచ్చిమిర్చి రసం తాగించి...అకృత్యాలు

నయీం పచ్చిమిర్చి రసం తాగించి...అకృత్యాలు

గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో విస్మయకర విషయాలు బయటపడుతున్నాయి.

హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో విస్మయకర విషయాలు బయటపడుతున్నాయి. నయీం మాట వినక పోతే పచ్చిమిర్చి రసం తాగించి అత్యాచారం చేసేవాడని బాధిత బాలికలు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. 
 
నయీం తమపై పలుమార్లు అత్యాచారం చేశాడని ఆ తర్వాత ఏవో మందులు ఇచ్చేవాడని బాలికలు తెలిపారు. ఈ అకృత్యాలను నయీం బంధువులు సుల్తానా, తాహెరా, ఫహీం, హసీనా, సలీమా, తానియానే దగ్గరుండి నిర్వహించేవారన్నారు. రెండు రోజులకోసారి నయీం గదిలోకి వెళ్లాల్సిందిగా నయీం బంధువులు తమను బలవంతం చేసేవారని బాలికలు వెల్లడించారు.

నయీం మాట వినకుంటే తీవ్రంగా కొట్టడంతో పాటు పచ్చిమిర్చి రసం తాగించేవాడన్నారు. నయీం అత్త సుల్తానా తనకు పెళ్లి చేస్తానని చెప్పి ఆరేళ్ల క్రితం ఇక్కడికి తీసుకొచ్చినట్లు ఓ బాధిత బాలిక తెలిపింది. అంతేకాక నయీంకు ఎదురు మాట్లాడిన ఓ బాలికను నయీం హతమార్చాడని వారు వాంగ్మూలంలో తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement