ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
మంచాల : నియోజకవర్గ అభివృద్ధికి అందరూ టీఆర్‌ఎస్ పార్టీతో కలిసి రావాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని జాపాల గ్రామంలోని శ్రీమల్లి కార్జున స్వామి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆంజనేయ స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను టీఆర్‌ఎస్ పార్టీలో చేరానని తెలిపారు.
ఏళ్ల తరబడిగా వెనుకబాటులో ఉన్న ఇబ్రహీంపట్నం నియోజకవర్గ అభివృద్ధికోసమే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు. అన్ని గ్రామాలను సంపూర్ణంగా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమన్నారు. నియోజకవర్గం అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ భరోసా ఇవ్వడంతోనే పార్టీలో చేరినట్లు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి చెప్పారు. అభివృద్ధి కోసం అన్ని పార్టీల వారు టీఆర్‌ఎస్‌తో కలిసి రావాలని ఆయన కోరారు. ఈనెల 24న మండల కేంద్రంలో నిర్వహించే టీఆర్‌ఎస్ సదస్సుకు పార్టీ కార్యకర్తలు అందరూ హాజరుకావాలని సూచించారు.
జూన్ 2 నుంచి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలను ఘనంగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు ఈసీ శేఖర్‌గౌడ్, అంజిరెడ్డి, సత్తు వెంకటరమణారెడ్డి, బీయన్ జ్ఞానేశ్వర్, డబ్బికార్ శ్రీనివాస్, ఆవుల మల్లేష్, దండేటికార్ రవి, జక్క రాంరె డ్డి, పుల్లారెడ్డి, రఘుపతి, జంగయ్య, చంద్రయ్య, జాపాల యాదవ సంఘం నాయకులు ఉన్నారు. అయితే.. చిత్తాపూర్ గ్రామంలో బీజేపీ, టీడీపీ నుంచి మాజీ ఎంపీటీసీ సభ్యుడు బొడ్డు రాములు గౌడ్, మాజీ సర్పంచ్ సత్యనారాయణతో పాటు ఉపసర్పంచ్ ఎల్లమ్మతో పాటు మొత్తం పలువురు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రె డ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.
అభివృద్ధికి అందరూ సహకరించాలి
Published Sun, May 17 2015 11:37 PM | Last Updated on Tue, Oct 30 2018 4:40 PM
Advertisement
Advertisement