State formation Celebrations
-
అవతరణ వేడుకలకు ఏర్పాట్లు చేయాలి
హన్మకొండ అర్బన్ : జూన్ 2న రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అమ్రపాలి కాట వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం సుబేదారి కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో అవతరణ వేడుకలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉదయం హన్మకొండ అ దాలత్ సెంటర్లో అమర వీరులస్తూపం వద్ద అధికారులు, ప్రజాప్రతినిధులు నివాళి అర్పించే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. అదేవిధంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ పంచాయతీల్లో జాతీయ జెండా ఆవిష్కరణ చేసి ఉత్సవాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక అవార్డులు అందజేయడం జరగుతుం ద ని, అందుకోసం మంగళవారం సాయంత్రం 3 గం టల్లో సంబంధిత దరఖాస్తులు కలెక్టరేట్లో అందజేయాలన్నారు. ఎంపికైన వారికి రూ.50,116, ప్రశంసాపత్రం అందజేయనున్నట్లు తెలిపారు. పలు కేటగిరీల్లో అవార్డులు... అవార్డులు వేద పండితులు/అర్చకులు, సామాజిక కార్యకర్త/ఎన్జీవో, ఉత్తమ మండలం/మున్సిపాలిటీ/గ్రామ పంచాయతీ, తెలుగు, ఉర్దూ రంగంలో కవిత్వం, రచయిత, పద్య, గద్య విభాగాల్లో ఉత్తమ సాహిత్య వ్యక్తిత్వం కల్గిన వారు. నృత్య, గాయకులు, సంగీతం, కళాకారులు, శిల్పకళా విభాగంలో ఉత్తమ కళాకారులు, శాస్త్రవేత్త, అంగన్వాడీ టీచర్, క్రీడాకారులు, టీచర్/ప్రభుత్వ ఉద్యోగి విభాగల్లో ఉత్తమ ప్రతిభావంతులుగా ఎంపిక కోసం గుడువులోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని కలెక్టర్ తెలిపారు. -
పండుగలా అవతరణ వేడుకలు
- పల్లె నుంచి ఢిల్లీ దాకా ఘనంగా నిర్వహించాలి: సీఎం - జూన్ 2న ఉత్సవాలు.. 3న కేసీఆర్ కిట్స్ పంపిణీ - 4న ఒంటరి మహిళలకు భృతి సాక్షి, హైదరాబాద్: పల్లె నుంచి ఢిల్లీ దాకా రాష్ట్రావతరణ దినోత్సవాలను పండుగలా నిర్వహించాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో నివాళి అర్పించి, రాష్ట్ర అవతరణ ఉత్సవాలను ప్రారంభించాలని సూచించారు. రాష్ట్రావతరణ దినోత్సవ ఏర్పాట్లకు సంబంధించి మంగళవారం ప్రగతి భవన్లో సీఎం సమీక్ష నిర్వహించారు. జూన్ 2న రాష్ట్రవ్యాప్తంగా అవతరణ దినోత్సవం నిర్వహించాలని, జూన్ 3న కేసీఆర్ కిట్స్, జూన్ 4న ఒంటరి మహిళలకు భృతి కార్యక్రమాలు ప్రారంభిం చాలని ఆదేశించారు. మండలం యూనిట్‌గా ఈ కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రతీ మండలంలో ఓ ప్రముఖుడు పాల్గొనేలా కార్యక్రమం రూపొందించుకోవాలని సూచించారు. జిల్లా కేంద్రాల్లో మంత్రులతో పాటు ప్రభుత్వ విప్‌లు పతాకావిష్కరణ చేస్తార న్నారు. మండలాల్లో ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, జెడ్పీ చైర్మన్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు ముఖ్య అతిథులుగా పాల్గొనాలన్నారు. అమరవీరుల స్తూపాలు లేని జిల్లా కేంద్రాల్లో తాత్కాలిక స్తూపాలు ఏర్పాటు చేసి నివాళులు అర్పిం చాలని, శాశ్వత అమరవీరుల స్తూపాలు నిర్మించాలన్నారు. హైదరాబాద్‌లో తానే స్వయంగా గన్‌పార్కు అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పిస్తానని చెప్పారు. -
ఘనంగా జిల్లాల సంబురాలు
♦ రాష్ట్రావతరణ తరహాలో జరపాలి.. కేబినెట్ భేటీలో నిర్ణయం ♦ అన్ని జిల్లాలు ఒకే సమయంలో ప్రారంభించాలి ♦ ఒకట్రెండు రోజుల్లో ముహూర్తం ఖరారు ♦ మొదట పోలీస్ పరేడ్, తర్వాత జాతీయ జెండా ఆవిష్కరణ ♦ ఆ వెంటనే కలెక్టర్ కార్యాలయాల ప్రారంభం.. మంత్రులతో బహిరంగ సభలు ♦ 31 జిల్లాల ఏర్పాటుకు మంత్రివర్గం సూత్రప్రాయ ఆమోదం ♦ కొత్త జిల్లాలకు తెలంగాణ ప్రముఖుల పేర్లపై చర్చ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రావతరణ వేడుకల తరహాలో జిల్లాల ఆవిర్భావ సంబురాలను ఘనంగా నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలో పాత జిల్లాలు సహా మొత్తం 31 జిల్లాల ఏర్పాటుకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ భేటీ జరిగింది. కొత్త జిల్లాల ప్రారంభం, జిల్లాల పేర్లు, కేకే నేతృత్వంలోని హై పవర్ కమిటీ ఇచ్చిన నివేదికపైనే భేటీలో ప్రధాన చర్చ జరిగినట్లు తెలిసింది. కొత్తగా ఏర్పాటు కాబోయే జిల్లాల సరిహద్దుల విషయంలో ఆయా జిల్లాల స్థానిక మంత్రులు ప్రజలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సీఎం సూచించారు. ఒకే ముహూర్తానికి ప్రారంభం కొత్తగా ఏర్పడబోయే జిల్లాలన్నింటినీ ఒకే సమయంలో ప్రారంభించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు ఒకట్రెండు రోజుల్లో ముహూర్తాన్ని ఖరారు చేయనున్నారు. కొత్త జిల్లాల్లో మొదట పోలీసు బలగాల పరేడ్, తర్వాత జాతీయ పతాకావిష్కరణ, ఆ వెంటనే కలెక్టర్ కార్యాలయ ప్రారం భం ఉంటుంది. కలెక్టర్లు బాధ్యతలు తీసుకున్న అనంతరం బహిరంగ సభల్లో మంత్రులు పాల్గొననున్నారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొనేలా ప్లాన్ చేసుకోవాలని సీఎం సూచించారు. జిల్లాల పరిధిలోని కొత్త రెవెన్యూ డివిజన్లు, మండల కార్యాలయాలు, కొత్త పోలీసు స్టేషన్లను ఎమ్మెల్యేలు ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ నేతలు పాల్గొనాలని, ఈ అంశంపై మంత్రులు తుది నిర్ణయం తీసుకోవాలని సూచించారు. కొత్త జిల్లాల పరిధిలోకి వెళ్లడానికి కొన్ని మండలాలు, గ్రామాల ప్రజలు నిరాకరిస్తున్నారన్న అంశంపైనా కేబినెట్లో చర్చ జరిగింది. దీనిపై ఒకట్రెండు రోజుల్లో ఆయా జిల్లాల మంత్రులు కలెక్టర్లతో సమన్వయం చేసుకుని నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు. మొత్తంగా 31 జిల్లాలను ఏర్పాటు చేయడానికి ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చినా తుది నోటిఫికేషన్లో వెల్లడిస్తామని మంత్రులతో సీఎం అన్నారు. మరోవైపు అలంపూర్ నియోజకవర్గాన్ని గద్వాల నియోజకవర్గంలోనే కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. అలంపూర్, రాజోలి మండలాలను ప్రతిపాదిత వనపర్తి జిల్లాలో ఉంచాలన్న ప్రతిపాదనను వెనక్కి తీసుకున్నారు. మక్తల్, మాగనూరు, కృష్ణా మండలాలను మహబూబ్‌నగర్ జిల్లాలో ఉంచాలని నిర్ణయించారు. కొత్త జిల్లాల పేర్లపై చర్చ కొత్త జిల్లాల పేర్లపైనా కేబినెట్లో చర్చించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రొఫెసర్ జయశంకర్, సురవరం ప్రతాప్‌రెడ్డి, రాజు బహదూర్ వెంకట్రామిరెడ్డి, వెంకటస్వామి, మహేంద్రనాథ్, పీవీ నరసింహారావు, రాజన్న, భద్రాద్రి, జోగులాంబ, కొమురం భీం పేర్ల ఖరారుపై చర్చ జరిగినట్లు సమాచారం. ఇప్పటికే భూపాలపల్లికి ప్రొఫెసర్ జయశంకర్, సిరిసిల్లకు రాజన్న, గద్వాలకు జోగులాంబ, ఆసిఫాబాద్‌కు కొమురం భీం పేర్లు ఖరారు చేసినట్లు సీఎం ప్రకటించారు. మిగతా జిల్లాల పేర్లపై ఆలోచించాలని, తెలంగాణ ఆత్మగౌరవం, వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా, అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా ప్రముఖుల పేర్లపై ఆలోచనలు చేయాలన్నారు. ఎస్సీ గురుకులాలకు సీఎం కితాబు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లపై మంత్రివర్గంలో చర్చ జరిగింది. రెసిడెన్షియల్ స్కూళ్ల విధానంపై పదేళ్ల నుంచి బాగా స్పందన వస్తోందని, రాష్ట్రానికి, గురుకులాలకు ఆదర్శంగా ఉన్న ఎస్సీ గురుకులాలను సీఎం అభినందించారు. మైనార్టీలు అధికంగా ఉన్నచోట ఎక్కువగా రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేసి, వాటిని విజయవంతం చేయాలన్న అంశంపై చర్చించారు. మైనారిటీ గురుకులాల కార్యదర్శి షఫీ ఉల్లాను సీఎం అభినందించారు. ఎస్సీ గురుకులాల సక్సెస్ వెనుక ఎస్సీ, ఎస్టీ గురుకులాల సొసైటీ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ కృషి ఎంతో ఉందని, ఆయన బాగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. అవసరమైతే బీసీ, గురుకులాలను ఆయనకే అప్పజెప్పాలన్న అభిప్రాయాన్ని సీఎం వ్యక్తంచేశారు. బంగారు తెలంగాణ భవిష్యత్ రెసిడెన్షియల్ స్కూళ్లల్లోనే ఉందని పేర్కొన్నారు. -
జయహో తెలంగాణ
-
అభివృద్ధికి అందరూ సహకరించాలి
ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మంచాల : నియోజకవర్గ అభివృద్ధికి అందరూ టీఆర్ఎస్ పార్టీతో కలిసి రావాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని జాపాల గ్రామంలోని శ్రీమల్లి కార్జున స్వామి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆంజనేయ స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను టీఆర్ఎస్ పార్టీలో చేరానని తెలిపారు. ఏళ్ల తరబడిగా వెనుకబాటులో ఉన్న ఇబ్రహీంపట్నం నియోజకవర్గ అభివృద్ధికోసమే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు. అన్ని గ్రామాలను సంపూర్ణంగా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమన్నారు. నియోజకవర్గం అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ భరోసా ఇవ్వడంతోనే పార్టీలో చేరినట్లు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి చెప్పారు. అభివృద్ధి కోసం అన్ని పార్టీల వారు టీఆర్ఎస్తో కలిసి రావాలని ఆయన కోరారు. ఈనెల 24న మండల కేంద్రంలో నిర్వహించే టీఆర్ఎస్ సదస్సుకు పార్టీ కార్యకర్తలు అందరూ హాజరుకావాలని సూచించారు. జూన్ 2 నుంచి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలను ఘనంగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు ఈసీ శేఖర్‌గౌడ్, అంజిరెడ్డి, సత్తు వెంకటరమణారెడ్డి, బీయన్ జ్ఞానేశ్వర్, డబ్బికార్ శ్రీనివాస్, ఆవుల మల్లేష్, దండేటికార్ రవి, జక్క రాంరె డ్డి, పుల్లారెడ్డి, రఘుపతి, జంగయ్య, చంద్రయ్య, జాపాల యాదవ సంఘం నాయకులు ఉన్నారు. అయితే.. చిత్తాపూర్ గ్రామంలో బీజేపీ, టీడీపీ నుంచి మాజీ ఎంపీటీసీ సభ్యుడు బొడ్డు రాములు గౌడ్, మాజీ సర్పంచ్ సత్యనారాయణతో పాటు ఉపసర్పంచ్ ఎల్లమ్మతో పాటు మొత్తం పలువురు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రె డ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.