సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ అమ్రపాలి
హన్మకొండ అర్బన్ : జూన్ 2న రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అమ్రపాలి కాట వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం సుబేదారి కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో అవతరణ వేడుకలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉదయం హన్మకొండ అ దాలత్ సెంటర్‌లో అమర వీరులస్తూపం వద్ద అధికారులు, ప్రజాప్రతినిధులు నివాళి అర్పించే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు.
అదేవిధంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ పంచాయతీల్లో జాతీయ జెండా ఆవిష్కరణ చేసి ఉత్సవాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక అవార్డులు అందజేయడం జరగుతుం ద ని, అందుకోసం మంగళవారం సాయంత్రం 3 గం టల్లో సంబంధిత దరఖాస్తులు కలెక్టరేట్‌లో అందజేయాలన్నారు. ఎంపికైన వారికి రూ.50,116, ప్రశంసాపత్రం అందజేయనున్నట్లు తెలిపారు.
పలు కేటగిరీల్లో అవార్డులు...
అవార్డులు వేద పండితులు/అర్చకులు, సామాజిక కార్యకర్త/ఎన్జీవో, ఉత్తమ మండలం/మున్సిపాలిటీ/గ్రామ పంచాయతీ, తెలుగు, ఉర్దూ రంగంలో కవిత్వం, రచయిత, పద్య, గద్య విభాగాల్లో ఉత్తమ సాహిత్య వ్యక్తిత్వం కల్గిన వారు. నృత్య, గాయకులు, సంగీతం, కళాకారులు, శిల్పకళా విభాగంలో ఉత్తమ కళాకారులు, శాస్త్రవేత్త, అంగన్‌వాడీ టీచర్, క్రీడాకారులు, టీచర్/ప్రభుత్వ ఉద్యోగి విభాగల్లో ఉత్తమ ప్రతిభావంతులుగా ఎంపిక కోసం గుడువులోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని కలెక్టర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment