ఇంటింటా కూరగాయల విత్తనాలు
Published Thu, Jul 28 2016 12:36 AM | Last Updated on Mon, Feb 17 2020 5:11 PM
ఏలూరు (మెట్రో): త్వరలో జిల్లాలో ఇంటింటా కూరగాయల విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలని కలెక్టర్ కె.భాస్కర్ ఉద్యాన శాఖ అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం ఉద్యాన శాఖ పనుల తీరుపై సమీక్షించారు. జిల్లాలో ఆరు లక్షల కుటుంబాలకు విత్తనాలు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. బెండ, టమాట, కాకర, బీర, వంగ, పొట్ల, ఆనప, మెంతు వంటి విత్తనాలు కిట్‌ను ప్రతి కుటుంబానికి అందించాలన్నారు. ఒక్కో కిట్ ఖరీదు రూ.20 ఉండేలా చూడాలని దీనిలో రూ.10 సబ్సిడీ ఉద్యాన శాఖ భరించాలని చెప్పారు. వచ్చేనెల 1 నుంచి ప్రతి పాఠశాలకూ విత్తనాలు అందించేలా చర్యలు తీసుకోవాలని ఉద్యాన శాఖ అధికారులు దుర్గేష్, విజయలక్ష్మికి ఆదేశించారు. అదనపు జాయింట్ కలెక్టర్ ఎంహెచ్ షరీఫ్ పాల్గొన్నారు.
చేపల చెరువుల రొయ్యల చెరువులుగా మార్చితే చర్యలు
జిల్లాలో చేపల చెరువులు రొయ్యల చెరువుగా మార్చితే స్థానికంగా పనిచేస్తున్న అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్ కె.భాస్కర్ మత్స్యశాఖ అధికారులకు హెచ్చరించారు. కలెక్టరేట్‌లో జిల్లా చేపల చెరువుల అభివద్ధి కమిటీ సమావేశానికి కలెక్టర్ అధ్యక్షత వహించారు. జిల్లాలో చేపల చెరువులను అనుమతులు లేకుండా రొయ్యల చెరువులుగా మారుస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయనీ, వాటిని స్థానికంగా ఉన్న మత్స్యశాఖ అధికారులు ప్రోత్సహిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని మత్స్యశాఖ డీడీ ఎంఎ జాకబ్‌షాకు సూచించారు. ఇరిగేషన్ ఈఈ శ్రీనివాస్, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ సాయిలక్ష్మీశ్వరి, ఎఫ్‌డీవోలు పాల్గొన్నారు.

సంక్రాంతిలోపు ఇళ్ల నిర్మాణం పూర్తి
ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం ద్వారా జిల్లాలో పేదలకు రానున్న 18,400 ఇళ్లను సంక్రాంతిలోపు పూర్తిచేయాలని కలెక్టర్ భాస్కర్ గృహ నిర్మాణాధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో గృహనిర్మాణ శాఖ ప్రగతి తీరుపై సమీక్షించారు. జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో వచ్చేనెల 1వ తేదీలోపు లబ్ధిదారుల పేర్లు అప్‌డేట్ చేసి ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టాలని ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న 4 వేల ఇళ్లను సెప్టెంబర్ 30లోపు పూర్తిచేయాలని సూచించారు. హౌసింగ్ పీడీ ఈ.శ్రీనివాస్, హౌసింగ్ డీఈ, ఈఈలు, ఏఈలు పాల్గొన్నారు.
Advertisement