prepare plan
-
మోదీ విమానానికి పాక్ ఓకే
న్యూఢిల్లీ: అన్ని మంత్రిత్వ శాఖలు వచ్చే అయిదేళ్లలో ప్రజాభీష్టం మేరకు వారి జీవితాలను మెరుగుపరిచే ప్రభావవంతమైన ప్రణాళికలను రూపొందించాలని ప్రధాని మోదీ ఉన్నతాధికారులను కోరారు. సోమవారం ఆయన అన్ని మంత్రిత్వ శాఖల కార్యదర్శులతో సమావేశమయ్యారు. ప్రభావశీల ప్రణాళికతో ముందుకు వస్తే వందరోజుల్లోనే అమలయ్యేలా అనుమతులు మంజూరు చేస్తాం’ అని ప్రధాని అధికారులను కోరారని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ‘దేశంలో పని చేయగలిగే వారి సంఖ్య ఎక్కువగా మంది ఉన్నందున వారిని సమర్థంగా వాడుకోవాలి. కేంద్రంలోని ప్రతి శాఖ, రాష్ట్రంలోని ప్రతి జిల్లా కూడా 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ గల దేశంగా మార్చేందుకు కీలకమైనవి. ఎంతో కీలకమైన ‘భారత్‌లో తయారీ’ నినాదాన్ని ముందుకు తీసుకెళ్లాలి. చిన్న వ్యాపారాలు, సంస్థల విషయంలో సులభతర వాణిజ్య విధానం ప్రతిఫలించాలి’ అని సూచించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల కార్యదర్శులు పరిపాలనపరమైన నిర్ణయాలు, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, ఐటీ, విద్యారంగ సంస్కరణలు, ఆరోగ్యం, పారిశ్రామిక విధానం, ఆర్థికాభివృద్ధి తదితర అంశాల్లో కొన్ని సూచనలు, సలహాలు చేశారు. 2014లోనూ ఇఏదేవిధంగా కార్యదర్శుల స్థాయి అధికారులతో మోదీ సమావేశమ య్యారు. మోదీ విమానానికి పాక్ ఓకే కిర్గిజిస్తాన్లోని బిష్కెక్లో జూన్ 13–14 తేదీల్లో జరిగే షాంఘై సహకార సదస్సు(ఎస్సీవో)కు హాజరయ్యేందుకు ప్రధాని మోదీ విమానానికి గగనతల అనుమతులు ఇవ్వాలన్న భారత్ విజ్ఞప్తికి పాకిస్తాన్ సానుకూలంగా స్పందించింది. తమ దేశం మీదుగా మోదీ విమానం కిర్గిజిస్తాన్ వెళ్లేందుకు పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ అంగీకరించినట్లు పాకిస్తాన్ ప్రభుత్వవర్గాలు తెలిపాయి. బాలాకోట్‌లోని జైషే ఉగ్రవాద స్థావరంపై ఐఏఎఫ్ ఈ ఏడాది ఫిబ్రవరి 26న వైమానికదాడులు చేపట్టడంతో పాక్ తన గగనతలాన్ని మూసివేసింది. దేశంలోని మొత్తం 11 రూట్లకుగానూ రెండు మార్గాల్లోనే రాకపోకల్ని అనుమతిస్తోంది. కాగా, జీ7 సదస్సుకు ప్రత్యేక అతిథిగా హాజరుకావాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చేసిన విజ్ఞప్తికి మోదీ అంగీకరించారు. ఫ్రాన్స్‌లోని బియర్రిట్జ్‌లో ఆగస్టు 24 నుంచి 26 వరకూ జరిగే 45వ జీ7 సదస్సుకు హాజరుకావాలని నిర్ణయించారు. -
‘లోక్‌సభ’కు సన్నద్ధం
నిర్మల్: శాసనసభ ఎన్నికల్లో గెలిచిన ఉత్సాహంతో అధికార టీఆర్ఎస్ పార్టీ లోక్‌సభ పోరుకు సన్నద్ధమవుతోంది. అసెంబ్లీ పోరులో ముందస్తు ఎన్నికలకు వెళ్లి విజయం సాధించిన సెంటిమెంట్‌తోనే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలోనూ అందరికంటే ముందే టీఆర్ఎస్ సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగానే శనివారం ఉమ్మడి జిల్లాకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలు, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కలిసి హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. ఈ భేటీలో ప్రధాన ఎజెండా పార్లమెంట్ ఎన్నికలే కావడం గమనార్హం. సీఎం కేసీఆర్ ప్రతీ సమావేశం, సభలో తెలంగాణలో హైదరాబాద్ మినహా మిగిలిన 16స్థానాలను తామే గెలుస్తామని చెబుతున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా పార్లమెంట్ నియోజకవర్గాల సన్నాహాక సమావేశాలు మార్చి 1 నుంచి ప్రారంభం కానున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. మార్చి 8న ఆదిలాబాద్‌లో, 9న పెద్దపల్లి జిల్లాలోని రామగుండంలో ఈ సమావేశాల షెడ్యూల్ ఖరారైనట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని రెండు స్థానాలను మళ్లీ తామే కైవసం చేసుకుని పార్టీ అధినేతల మాట నిలుపాలన్న లక్ష్యంతో జిల్లా ప్రజాప్రతినిధులు ముందడుగు వేస్తున్నారు. అటు అధికార పార్టీ ఇప్పటి నుంచే లోక్‌సభ సమరానికి సన్నద్ధమవుతుండగా, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలో మాత్రం ఇంకా కదలిక కనిపించడం లేదు. అధికారులు మాత్రం ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సంసిద్ధంగా ఉండేందుకు ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రెండుస్థానాలు.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న రెండు లోక్‌సభ స్థానాలు గత ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచినవే. ఉమ్మడి జిల్లాలోని పశ్చిమ ప్రాంతం ఆదిలాబాద్ పరిధిలో ఉండగా, తూర్పు ప్రాంతం పెద్దపల్లి నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. పశ్చిమ ప్రాంతంలోని ఆదిలాబాద్, బోథ్, ఖానాపూర్, నిర్మల్, ముథోల్, ఆసిఫాబాద్, సిర్పూరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నాయి. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి(ప్రస్తుతం జిల్లాకేంద్రం) కేంద్రంగా ఉన్న పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో తూర్పు ప్రాంతంలోని మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయి. ఇక ఈరెండు స్థానాలు ప్రస్తుతం రిజర్వేషన్ల ప్రకారం ఆదిలాబాద్ ఎస్టీ, పెద్దపల్లి ఎస్సీ రిజర్వుడ్‌గా ఉన్నాయి. ప్రస్తుతం ఆదిలాబాద్ ఎంపీగా గోడెం నగేశ్ ఉండగా, పెద్దపల్లి ఎంపీగా ఉన్న బాల్క సుమన్ శాసనసభ ఎన్నికల్లో చెన్నూరు నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. గెలిచి.. నిలబెట్టుకోవాలని.. ఆదిలాబాద్, పెద్దపల్లి పార్లమెంట్ స్థానాలను మళ్లీ గెలిచి నిలబెట్టుకోవాలన్న లక్ష్యంతో అధికార టీఆర్ఎస్ ఇప్పటి నుంచి కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగానే శనివారం హైదరాబాద్‌లోని హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, తొమ్మిదిమంది ఎమ్మెల్యేలు, ఎంపీ సమావేశమయ్యారు. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పనిచేసేలా దిశానిర్దేశం చేయా లని నిర్ణయించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ఎంపీ సీట్లను గెలిపిస్తే ఢిల్లీస్థాయిలో తెలంగాణ అభివృద్ధి చక్రం తిప్పవచ్చన్న విషయాన్నీ వివరించాలని సూచించారు. రెండు నియోజకవర్గాల్లోనూ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు సమష్టికృషితో అభ్యర్థుల విజయానికి కృషిచేయాలని స్పష్టం చేశారు. పార్టీ పరంగా అభ్యర్థుల ఖరారుపై ఎలాంటి ప్రకటన రాలేదు. ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ నగేశ్ మళ్లీ పోటీలో ఉంటారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక పెద్దపల్లి స్థానంపైనే పార్టీలో చర్చ కొనసాగుతోంది. ఇక్కడ ఎవరు పోటీ చేస్తారనే దానిపై ఎలాంటి స్పష్టత లేదు. ఈ స్థానానికి మాజీ ఎంపీ వివేక్‌తో పాటు మరికొందరు పోటీ పడుతున్నట్లు సమాచారం . కేటీఆర్ టూర్ ఖరారు.. టీఆర్ఎస్ పార్లమెంటు నియోజకవర్గాల సన్నాహాక సమావేశాలు మార్చి 1 నుంచి 11 వరకు నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైనట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశాల్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొననున్నారు. ఇందులో భాగంగా వచ్చే నెల 8న ఆదిలాబాద్‌లో, మరుసటి రోజు 9న పెద్దపల్లి జిల్లా రామగుండంలో సమావేశాలు నిర్వహించేందుకు పార్టీ నేతలు ఏర్పాట్లు షురూ చేశారు. స్తబ్ధుగానే ప్రతిపక్షాలు అధికార టీఆర్ఎస్లో ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల ప్రభావం కనిపిస్తుండగా ప్రతిపక్షాల్లో మాత్రం ఆ సందడి ఇంకా మొదలు కాలేదు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో ఓడినా పార్లమెంట్లో గెలువాలన్న తపనతో ఉంది. ఎలాగైనా అత్యధిక స్థానాలను గెలుచుకుని తమ అధినేత రా>హుల్‌గాంధీని ప్రధానమంత్రిని చేయాలని భావిస్తోంది. కానీ.. అలాంటి పార్టీ ఇప్పటి వరకు లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన పనిని మొదలు పెట్టినట్లుగా కనిపించడం లేదని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. కాంగ్రెస్ హవా నడిచిన రోజుల్లో రెండు స్థానాలనూ గెలిచిన చరిత్ర ఆ పార్టీకి ఉంది. శాసనసభ ఎన్నికల్లో ఒక్క ఆసిఫాబాద్ స్థానాన్ని గెలుచుకుని ఉమ్మడి జిల్లాలో పరువు నిలబెట్టుకుంది. ఇక లోక్‌సభ స్థానాలపై దృష్టి కేంద్రీకరించాల్సిన సమయం ఆసన్నమైందని ఆ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. ఆదిలాబాద్ పరిధిలో ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, పెద్దపల్లి పరిధిలో ప్రేంసాగర్‌రావు వర్గాలు పార్టీలో బలంగా ఉన్నాయి. ఈ రెండు వర్గాలతో సంబంధం లేకుండా పలువురు అధిష్ఠానంతో నేరుగా సంబంధాలు కొనసాగిస్తూ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇక మళ్లీ తమ నరేంద్రుడిని ప్రధాని చేస్తామన్న ధీమాతో ఉన్న బీజేపీ ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో బోణి కొట్టలేకపోయింది. ఈసారీ విజయం అంత ఈజీ కాదన్న విషయం ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. ఎంపీ స్థానానికి పోటీ పడేస్థాయి గల నాయకుల కోసం పార్టీ అధినేతలు చూస్తున్నట్లు సమాచారం. ఇక ఇటీవల ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థుల్లోనూ కొందరు ఆ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. అధికారులు సిద్ధం.. పార్టీలతోపాటుగా జిల్లాల అధికారులూ లోక్‌సభ ఎన్నికల కోసం సిద్ధమవుతున్నారు. ఇప్పటికే మం చిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, కుమురంభీం జిల్లాలో ఈవీఎంల ఫస్ట్ లెవల్ చెక్ పూర్తయ్యింది. త్వరలోనే రెండోసారి పరిశీలన ప్రారంభం కానుంది. మరోవైపు ఈనెల 22న ఓటర్ల తుది జాబితా వచ్చేసింది. ఉమ్మడి జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 20,63,963 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 10,20,320 మంది పురుషులు, 10,43,552మంది మహిళలు, ఇతరులు 91 మంది ఓటర్లు ఉన్నారు. -
బడ్జెట్ తయారీ ఇలా..
బడ్జెట్ అనగానే చాలామంది లెక్కల చిక్కులే అనుకుంటారు! కానీ ఈ మూడక్షరాల వెనుక చాలా కృషి దాగుంటుంది. ఎంతో కసరత్తు.. లెక్కకు మించి భేటీలు.. ఆద్యంతం గోప్యత.. అబ్బో చాలా తతంగమే ఉంటుంది. అదేంటో ఓ లుక్కేయండి! సెప్టెంబర్‌లో.. రానున్న ఆర్థిక సంవత్సరంలో ఏయే రంగానికి ఎంత ఖర్చు పెట్టాలన్న కసరత్తు మొదలవుతుంది. దేశంలో మొత్తం జనాభా తమ తిండి కోసం ఏడాది అంతా ఎంత ఖర్చు చేస్తున్నారో దాదాపు అంత మొత్తాన్ని ప్రభుత్వం బడ్జెట్‌కు కేటాయిస్తుంది. అక్టోబర్‌లో.. తమకు కావాల్సిన నిధులపై వివిధ మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు ఆర్థికశాఖతో చర్చల్లో తలమునకలవుతారు. డిసెంబర్ ముసాయిదా బడ్జెట్ కాపీలను అధికారులు ఆర్థికమంత్రికి నివేదిస్తారు. ఈ ముసాయిదా పత్రాలన్నీ నీలం రంగులో ఉంటాయి. జనవరి.. పారిశ్రామిక, బ్యాంకింగ్ రంగాలకు చెందిన వివిధ సంఘాల ప్రతినిధులు ఆర్థికమంత్రిని కలసి తమ సమస్యలను సలహాలను, సూచనలను అందజేస్తారు. ఈ సందర్భంగా ఆర్థికమంత్రి అందరి వాదనలు వింటారుగానీ ఎవరికీ నిర్దిష్టమైన హామీ ఇవ్వరు. ముద్రణ ప్రక్రియ బడ్జెట్‌కు సంబంధించిన అన్ని వివరాలను అత్యంత రహస్యంగా ఉంచేందుకు జనవరి నుంచి ఆర్థికమంత్రిత్వ శాఖ కార్యాలయాల్లోకి జర్నలిస్టుల ప్రవేశాన్ని నిషేధిస్తారు. ఫోన్ ట్యాపింగ్ బడ్జెట్ ప్రతిపాదనలు ఏమాత్రం లీక్ కాకుండా చూసే బాధ్యతను ఇంటెలిజెన్స్ విభాగం చూసుకుంటుంది. ఇందుకు కొందరు ఉన్నతాధికారుల ఫోన్లను సైతం ట్యాప్ చేస్తుంటుంది. మూడో కన్ను.. ఆర్థిక శాఖ కార్యాలయానికి వచ్చే సందర్శకులపై సీసీటీవీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు నిఘా ఉంటుంది. ఈ కెమెరాల పరిధిని దాటి వారు కనీసం కుర్చీలపై కూర్చోవడానికి కూడా అనుమతి ఉండదు. అంతా ప్రత్యేకం బడ్జెట్ పత్రాలను తయారు చేసే ‘ప్రింటింగ్ ప్రెస్’ సిబ్బందిని ఎవరితో సంబంధం లేకుం డా ప్రత్యేకంగా ఉంచుతారు. వీరికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినా వైద్యులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు. ఆహారంపైనా.. ప్రింటింగ్ ప్రెస్ సిబ్బందికి అందించే తిండిపై అత్యంత జాగ్రత్త తీసుకుంటారు. ఏ ఆహారాన్నైనా పరీక్షించిన తర్వాతే వారికి ఇస్తారు. నీడలా వెన్నంటే.. ముద్రణ విభాగంలో పనిచేసే సిబ్బంది ఎవరైనా అత్యవసరంగా బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే.. సదరు వ్యక్తి వెంట ఓ ఇంటెలిజెన్స్ అధికారి, ఓ పోలీసు ఉంటారు. వారు అనుక్షణం ఆయనను నీడలా అనుసరిస్తారు. ఫిబ్రవరి 1న.. ఉదయం 11 గంటలకు ఆర్థికమంత్రి పార్లమెంటుకు బడ్జెట్‌ను సమర్పిస్తారు. సభలో ప్రవేశపెట్టేముందు రాష్ట్రపతి, ప్రధానమంత్రికి బడ్జెట్ గురించి స్థూలంగా వివరిస్తారు. బడ్జెట్ లీక్.. పరీక్ష పేపర్లే కాదు.. బడ్జెట్ పేపర్లు కూడా లీకైన సంఘటన 1950లో చోటుచేసుకుంది. అప్పట్లో బడ్జెట్ పత్రాల్ని రాష్ట్రపతి భవన్లో ముద్రించేవారు. 1950లో ఈ పత్రాలు లీక్ కావడంతో అప్పట్నుంచీ మింట్‌రోడ్‌లోని సెక్యూరిటీ ప్రెస్‌కు వేదికను మార్చారు. 1980 నుంచి ఢిల్లీలోని నార్త్ బ్లాక్‌లో బడ్జెట్ పత్రాల్ని ముద్రిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రింటింగ్ ప్రెస్‌ను ఏర్పాటు చేశారు. -
ఇంటింటా కూరగాయల విత్తనాలు
ఏలూరు (మెట్రో): త్వరలో జిల్లాలో ఇంటింటా కూరగాయల విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలని కలెక్టర్ కె.భాస్కర్ ఉద్యాన శాఖ అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్లో బుధవారం ఉద్యాన శాఖ పనుల తీరుపై సమీక్షించారు. జిల్లాలో ఆరు లక్షల కుటుంబాలకు విత్తనాలు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. బెండ, టమాట, కాకర, బీర, వంగ, పొట్ల, ఆనప, మెంతు వంటి విత్తనాలు కిట్‌ను ప్రతి కుటుంబానికి అందించాలన్నారు. ఒక్కో కిట్ ఖరీదు రూ.20 ఉండేలా చూడాలని దీనిలో రూ.10 సబ్సిడీ ఉద్యాన శాఖ భరించాలని చెప్పారు. వచ్చేనెల 1 నుంచి ప్రతి పాఠశాలకూ విత్తనాలు అందించేలా చర్యలు తీసుకోవాలని ఉద్యాన శాఖ అధికారులు దుర్గేష్, విజయలక్ష్మికి ఆదేశించారు. అదనపు జాయింట్ కలెక్టర్ ఎంహెచ్ షరీఫ్ పాల్గొన్నారు. చేపల చెరువుల రొయ్యల చెరువులుగా మార్చితే చర్యలు జిల్లాలో చేపల చెరువులు రొయ్యల చెరువుగా మార్చితే స్థానికంగా పనిచేస్తున్న అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్ కె.భాస్కర్ మత్స్యశాఖ అధికారులకు హెచ్చరించారు. కలెక్టరేట్లో జిల్లా చేపల చెరువుల అభివద్ధి కమిటీ సమావేశానికి కలెక్టర్ అధ్యక్షత వహించారు. జిల్లాలో చేపల చెరువులను అనుమతులు లేకుండా రొయ్యల చెరువులుగా మారుస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయనీ, వాటిని స్థానికంగా ఉన్న మత్స్యశాఖ అధికారులు ప్రోత్సహిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని మత్స్యశాఖ డీడీ ఎంఎ జాకబ్షాకు సూచించారు. ఇరిగేషన్ ఈఈ శ్రీనివాస్, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ సాయిలక్ష్మీశ్వరి, ఎఫ్‌డీవోలు పాల్గొన్నారు. చేపల చెరువుల రొయ్యల చెరువులుగా మార్చితే చర్యలు జిల్లాలో చేపల చెరువులు రొయ్యల చెరువుగా మార్చితే స్థానికంగా పనిచేస్తున్న అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్ కె.భాస్కర్ మత్స్యశాఖ అధికారులకు హెచ్చరించారు. కలెక్టరేట్లో జిల్లా చేపల చెరువుల అభివద్ధి కమిటీ సమావేశానికి కలెక్టర్ అధ్యక్షత వహించారు. జిల్లాలో చేపల చెరువులను అనుమతులు లేకుండా రొయ్యల చెరువులుగా మారుస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయనీ, వాటిని స్థానికంగా ఉన్న మత్స్యశాఖ అధికారులు ప్రోత్సహిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని మత్స్యశాఖ డీడీ ఎంఎ జాకబ్షాకు సూచించారు. ఇరిగేషన్ ఈఈ శ్రీనివాస్, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ సాయిలక్ష్మీశ్వరి, ఎఫ్‌డీవోలు పాల్గొన్నారు. సంక్రాంతిలోపు ఇళ్ల నిర్మాణం పూర్తి ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం ద్వారా జిల్లాలో పేదలకు రానున్న 18,400 ఇళ్లను సంక్రాంతిలోపు పూర్తిచేయాలని కలెక్టర్ భాస్కర్ గృహ నిర్మాణాధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో గృహనిర్మాణ శాఖ ప్రగతి తీరుపై సమీక్షించారు. జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో వచ్చేనెల 1వ తేదీలోపు లబ్ధిదారుల పేర్లు అప్డేట్ చేసి ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టాలని ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న 4 వేల ఇళ్లను సెప్టెంబర్ 30లోపు పూర్తిచేయాలని సూచించారు. హౌసింగ్ పీడీ ఈ.శ్రీనివాస్, హౌసింగ్ డీఈ, ఈఈలు, ఏఈలు పాల్గొన్నారు.