ప్రజాస్వామ్యానికి గీటురాయి అసమ్మతి. భిన్నాభిప్రాయ ప్రకటనకు స్వేచ్ఛ లేకుంటే సామాజిక జీవి తానికి అర్థమే లేదు. కానీ నేడు పరిస్థితి దీనికి భిన్నంగా తయారైంది. నచ్చని భావాలు ప్రకటించే మేధావులు, రచయితల మీద దాడులు చేస్తున్నారు. కుట్ర కేసులు మోపి అక్రమంగా నిర్బంధిస్తున్నారు. ఆధిపత్యశక్తులకు వైవిధ్యమనే జీవన విలువ అంగీకారం కాదు. భావాలను అదుపు చేయాలనుకుంటారు. రచన అంటేనే అసమ్మతి కాబట్టి సృజనకారులపై దాడులు చేస్తున్నారు. బెది రిస్తున్నారు. రచయితలు తమ రచనలను తామే తృణీకరించుకునే పరిస్థితి కల్పిస్తున్నారు. పాలకుల భావాలపై అసమ్మతి ప్రకటించే స్వేచ్ఛ ఉండాలి. అదే ప్రజాస్వామ్యం. దేశవ్యాప్తంగా మేధావులు, రచయితల అరెస్టుల సందర్భంగా మన సుప్రీం కోర్టు ఇదే చెప్పింది. ‘అసమ్మతి అనేది ప్రజాస్వామ్యానికి సేఫ్టీ వాల్వ్ లాంటిది.
దాన్ని అనుమతించకుంటే ప్రజాస్వామ్యమనే ప్రెషర్ కుక్కర్ పేలిపోతుంద’ని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య భావనను బతికించుకుందాం. కులమత లింగ అంతరాలకు అతీతంగా మనిషిని ఉన్నతంగా నిలబెట్టే ఒక సామూహిక స్వరాన్ని వినిపిద్దాం. భావ ప్రకటనా స్వేచ్ఛకై, జీవించే స్వేచ్ఛకై మన గొంతునే ఒక ఉమ్మడి వేదిక చేద్దాం. కలెక్టివ్ వాయిస్ ఆధ్వర్యంలో వివిధ రంగాల మేధావులు, పత్రికా సంపాదకులు, ప్రముఖులు, భాగస్వామ్య సంస్థలతో వినిపిస్తున్న భావ ప్రకటన పరిరక్షణ సామూహిక స్వరంలో గొంతు కలుపుదాం.
(భావప్రకటన స్వేచ్ఛ కోసం ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు సుందరయ్య విజ్ఞానకేంద్రంలో సభ)
కలెక్టివ్ వాయిస్, హైదరాబాద్
భావ స్వేచ్ఛను కాపాడదాం.
Published Sat, Nov 3 2018 2:49 AM | Last Updated on Sat, Nov 3 2018 2:49 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment