TAKE
-
'వారి ప్రాణాలు తీయడానికి వెనకాడబోం' బీజేపీ లీడర్ వివాదాస్పద వ్యాఖ్యలు..
భోపాల్: బీజేపీ సీనియర్ నాయకుడు కైలాష్ విజయవర్గీయ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని ప్రేమించేవాళ్లందరూ తమ సోదరులేనని అన్నారు. అలాగే.. దేశానికి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ల ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడబోమని వ్యాఖ్యానించారు. బాంగ్రోట్‌లో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఈ మేరకు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ' మేము ఎవరికీ ప్రత్యర్థులం కాదు. భారత మాతా కీ జై అనేవారందరూ మా సోదరులే. వారికోసం మా ప్రాణాలను త్యజించడానికి ముందుంటాం. కానీ భారత మాతకు వ్యతిరేకుల ప్రాణాలు తీయడానికి మాత్రం అస్సలు వెనకాడబోము' అని కైలాష్ విజయవర్గీయ మాట్లాడారు. రామ మందిరంపై మాట్లాడిన ఆయన కాంగ్రెస్ స్వభావంపై నిప్పులు చెరిగారు. ఉత్తరప్రదేశ్‌లో రామ మందిరం ఎప్పుడు అవుతుందని కొందరు విమర్శలు చేస్తున్నారని, అలాంటివారందరూ వచ్చే జనవరిలో ప్రారంభం కాబోతున్న అయోధ్య రామాలయాన్ని దర్శించుకుని పాప పరిహారం చేసుకోవాలని హితువు పలికారు. ఈ సందర్భంగా కైలాష్ విజయవర్గీయ కేంద్ర ప్రభుత్వం పనితీరుపై ప్రశంసలు కురిపించారు. కాశ్మీర్లో శాంతి పునరుద్ధరణను అందరం గుర్తించాలని అన్నారు. కాశ్మీర్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి, ఇంతకు ముందు ఉన్న పరిణామాలు అందరికీ తెలుసని అన్నారు. ప్రస్తుతం అక్కడ ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురుతుందని చెప్పారు. ఇదీ చదవండి: సీఎంను కించపరుస్తూ పోస్టులు.. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ అరెస్టు.. -
Viveka Case: గూగుల్ టేక్ అవుట్ తప్పు.. మాటమార్చిన సీబీఐ!
సాక్షి, అమరావతి: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో సీబీఐ డొల్లతనం మరోసారి బట్టబయలైంది. ఈ కేసులో అత్యంత కీలకమైన ఆధారమంటూ గూగుల్ టేక్ అవుట్ పేరిట కొండను తవ్వినంత హడావుడి చేసిన సీబీఐ.. తుది చార్జ్‌షీట్‌లో తోక ముడిచింది. ఇన్నాళ్లూ ఎంతో శాస్త్రీయ ఆధారమంటూ చెప్పుకొచ్చిన అంశంపైనే చివరికి చేతులెత్తేసింది. తాను గతంలో చార్జ్‌షీట్‌లో పేర్కొన్న నిందితుడు సునీల్ యాదవ్ మొబైల్ ఫోన్ గూగుల్ టేక్ అవుట్ వివరాలు అంతా పొరపాటని అంగీకరించడం గమనార్హం. కాగా, ఈ కేసులో అరెస్టు చేసిన ఏ–6 గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి, ఏ–7 వైఎస్ భాస్కర్‌రెడ్డికి వ్యతిరేకంగా సీబీఐ ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయింది. కేవలం గూగుల్ టేక్ అవుట్ డేటా ఆధారంగా చూపిస్తూ వారిని అరెస్టు చేసిన సీబీఐ తుది చార్జ్‌షీట్‌లో ఎలాంటి ఆధారం చూపించకపోవడం గమనార్హం. మరోవైపు షర్మిల తన చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి కడప ఎంపీ టికెట్‌ను ఆశించనే లేదని సీబీఐకి వాంగ్మూలం ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. తద్వారా ఎంపీ టికెట్‌కు అడ్డుగా ఉన్నందునే వివేకాను హత్య చేశారన్న అభియోగాల్లో వాస్తవం లేదన్నది తేటతెల్లమైంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు హైదరాబాద్‌లోని సీబీఐ న్యాయస్థానంలో బుధవారం తుది చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈ కేసులో అభియోగాలకు సరైన ఆధారమేదీ తుది చార్జ్‌షీట్‌లో సీబీఐ చూపించలేకపోయింది. వెరసి వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ఏనాడో దారి తప్పిందని.. కొందరి ప్రభావానికి గురై సీబీఐ అధికారులు వ్యవహరిస్తున్నారన్నది స్పష్టమైంది. వైఎస్సార్ కుటుంబంపై రాజకీయ దురుద్దేశంతో ఎల్లో మీడియా చేస్తున్న రాద్ధాంతం అంతా దుష్ప్రచారమేనన్నది తేలిపోయింది. తూచ్.. అంతా ఉత్తిదే కేసు దర్యాప్తులో కేంద్ర బిందువుగా పేర్కొన్న ప్రధాన సాక్ష్యాధారంపైనే సీబీఐ బొక్కబోర్లా పడింది. వివేకాను హత్య చేసిన నలుగురు నిందితుల్లో ఏ–2 సునీల్ యాదవ్ మొబైల్ ఫోన్ గూగుల్ టేక్ అవుట్ డేటాను సేకరించి ఈ కేసు దర్యాప్తులో కీలక పురోగతి సాధించామని రెండేళ్లుగా చెబుతున్న సీబీఐ.. తుది చార్జ్‌షీట్‌లో మాట మార్చింది. ‘సునీల్ యాదవ్ 2019 మార్చి 14వ తేదీ రాత్రి వివేకానందరెడ్డి నివాసంలో ఉన్నాడు. అర్ధరాత్రి దాటాక 2.35 గంటలకు వివేకా నివాసం సమీపంలో, 2.42 గంటలకు నివాసం లోపల ఉన్నాడు. ఈ విషయాన్ని ఆయన మొబైల్ నంబర్ గూగుల్ టేక్ అవుట్ ద్వారా గుర్తించాం’ అని సీబీఐ ఇన్నాళ్లు చెబుతూ వచ్చింది. తాజాగా న్యాయస్థానంలో దాఖలు చేసిన తుది చార్జ్‌షీట్‌లో అందుకు విరుద్ధంగా పేర్కొంది. ‘సునీల్ యాదవ్ 2019 మార్చి 14 అర్ధరాత్రి దాటిన తర్వాత వివేకానందరెడ్డి నివాసంలో లేరు. 2019 మార్చి 15న ఉదయం 8.05 గంటలకు వివేకా ఇంటి బయట, ఉదయం 8.12 గంటలకు ఇంటి లోపల ఉన్నాడు. గతంలో గూగుల్ టేక్ అవుట్ ద్వారా తెలుసుకున్నది గ్రీన్విచ్ కాలమానం ప్రకారం. కానీ ఏ దేశంలోనైనా స్థానిక కాలమానం ప్రకారమే చూడాలి. ఈ లెక్కన భారత కాలమానం ప్రకారం అంటే దానికి 5.30 గంటల సమయం కలపాలి. గతంలో పొరబడ్డాం’ అని స్పష్టం చేసింది. గూగుల్ టేక్ అవుట్ పేరిట బురిడీకి యత్నం! కేసు దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు గూగుల్ టేక్ అవుట్ డేటా పేరిట సీబీఐ యత్నిస్తోందన్న సందేహాలు బలపడుతున్నాయి. వివేకా మరణించారనే విషయం 2019 మార్చి 15 ఉదయం 6.05 గంటలకే అందరికీ తెలిసింది. అప్పటి టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఆదినారాయణ రెడ్డి కూడా వివేకా గుండెపోటుతో మరణించారని మీడియాకు వెల్లడించారు. సమాచారం తెలుసుకున్న వందలాది మంది ఉదయం 7 గంటలకే పులివెందులలోని వివేకా నివాసానికి చేరుకున్నారు. స్థానికులు ఆ విధంగా రావడం సహజం. ఆ తర్వాత 8 గంటల సమయంలో సునీల్ యాదవ్ అక్కడికి వచ్చారని సీబీఐ ప్రస్తుతం చెప్పడం గమనార్హం. ఆ రోజు వివేకా నివాసానికి చేరుకున్న వారిలో 248 మందిని సాక్షులుగా సీబీఐ అధికారులు విచారించారు. వారిలో ఎవరూ కూడా ఆ రోజు సునీల్ యాదవ్ అక్కడ ఉన్నట్టు చెప్పనే లేదు. గూగుల్ టేక్ అవుట్ పేరిట సీబీఐ ఉద్దేశ పూర్వకంగానే గందరగోళం సృష్టిస్తోందన్నది స్పష్టమవుతోంది. ఒక్క ఆధారం లేదే.. గూగుల్ టేక్ అవుట్ డేటా అశాస్త్రీయతతతోపాటు ఈ కేసులో సీబీఐ అరెస్టుల వెనుక డొల్లతనం కూడా తుది చార్జ్‌షీట్‌లో బట్టబయలైంది. సీబీఐ హడావుడిగా అరెస్టు చేసిన వైఎస్ భాస్కర్‌రెడ్డి, గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డిలకు వ్యతిరేకంగా కొత్తగా ఒక్క ఆధారాన్ని కూడా చూపించలేకపోయింది. వివేకా హత్యకు ముందు, తర్వాత సునీల్ యాదవ్ వైఎస్ భాస్కర్‌రెడ్డి నివాసానికి 30 సార్లు వచ్చినట్టుగా సీబీఐ గత చార్జ్‌షీట్‌లో పేర్కొంది. అసలు సునీల్ యాదవ్ ముందు రోజు రాత్రి వివేకానందరెడ్డి ఇంట్లోనే లేరని తుది చార్జ్‌షీట్‌లో పేర్కొంది. హత్య సమయంలో వివేకా ఇంట్లోలేని సునీల్ యాదవ్.. ఆ రోజు రాత్రి భాస్కర్‌రెడ్డి నివాసం నుంచి వివేకా నివాసానికి వెళ్లినట్టు, హత్య తర్వాత మళ్లీ వివేకా నివాసం నుంచి భాస్కర్‌రెడ్డి నివాసానికి వచ్చినట్టు ఎలా చెబుతుంది? ఈ లెక్కన గూగుల్ టేక్ అవుట్ ద్వారా గుర్తించామన్న ఆ సమాచారం కూడా తప్పే కదా! కేవలం గూగుల్ టేక్ అవుట్ డేటా ఆధారంగానే వైఎస్ భాస్కర్‌రెడ్డిని అరెస్టు చేయడం పూర్తిగా అసంబద్ధమన్నది స్పష్టమైంది. అదే గూగుల్ టేక్ అవుట్ ఆధారంగా గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డిని అరెస్టు చేసినట్టు సీబీఐ చెప్పింది. వివేకా హత్య జరిగిన రోజు రాత్రి ఆయన తన ఇంటి నుంచి తొందరగా వెళ్లిపోయారని, మర్నాడు ఉదయం వివేకా ఇంటి వద్దకు వెళ్లారని చెప్పింది. కానీ ఆ రోజు రాత్రి ఉదయ్ కుమార్ రెడ్డి ఎక్కడ ఉన్నారన్నది మాత్రం సీబీఐ చెప్పనే లేదు. మర్నాడు వివేకా మరణించారని సమాచారం తెలిసిన తర్వాత వందలాది మంది ఆయన నివాసానినికి చేరుకున్నారు. తాను ఉదయం 8 గంటల సమయంలో అక్కడికి వెళ్లానని ఉదయ్ కుమార్‌రెడ్డే చెప్పారు. మరి దాన్ని ఏదో గూగుల్ టేక్ అవుట్ ద్వారా గుర్తించినట్టు సీబీఐ చెప్పడం ఏమిటి? ఎంపీ అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి మార్చి 15 ఉదయం వివేకా నివాసానికి చేరుకోవడానికి ముందే తాము అక్కడకు వెళ్లామని ప్రత్యక్ష సాక్షి సత్యనారాయణ చెప్పినట్టు తుది చార్జ్‌షీట్‌లో ఉంది. అప్పటికే వివేకా గుండెపోటుతో మరణించినట్టు అక్కడ కొందరు మాట్లాడుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. అంటే వివేకా గుండెపోటుతోనే మరణించారని మొదట బయటకు పొక్కిన సమాచారంతో భాస్కర్‌రెడ్డికి ఎలాంటి సంబంధం లేదన్నది స్పష్టమైంది. ఏ విధంగానూ భాస్కర్‌రెడ్డికి వ్యతిరేకంగా సీబీఐ తుది చార్జ్‌షీట్‌లో ఒక్క ఆధారాన్ని కూడా చూపించలేకపోయింది. మిగిలిన నిందితుల గూగుల్ టేక్ అవుట్ డేటా లేదా? సీబీఐ ఎంతగా హడావుడి చేస్తున్నప్పటికీ గూగుల్ టేక్ అవుట్ డేటా శాస్త్రీయతమై మొదటి నుంచి నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అంతగా గూగుల్ టేక్ అవుట్ డేటా శాస్త్రీయమైనదని సీబీఐ భావిస్తే.. ఈ కేసులో మిగిలిన నిందితులు ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్‌రెడ్డి, దస్తగిరి మొబైల్ ఫోన్ల గూగుల్ టేక్ అవుట్ డేటాను సీబీఐ ఎందుకు సేకరించలేదన్నది ప్రశ్నార్థకంగా మారింది. నలుగురు నిందితుల్లో ఒకరి డేటాను మాత్రమే సేకరించడం ఏమిటి.. మిగిలిన ముగ్గురి డేటాను విస్మరించడం ఏమిటన్నది కీలకంగా మారింది. ఆ సమాచారం శాస్త్రీయమైనదని సీబీఐ భావిస్తే హత్యలో పాలుపంచుకున్నారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్న నలుగురు నిందితుల మొబైల్ ఫోన్ల గూగుల్ డేటాను సేకరించి విశ్లేషించాలి. కానీ సీబీఐ అలా చేయకపోవడం సందేహాస్పదంగా మారింది. దర్యాప్తును పక్కదారి పట్టించేందుకే సీబీఐ ఉద్దేశ పూర్వకంగానే ఇలా వ్యవహరిస్తోందని నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. చిన్నాన్న కడప ఎంపీ టికెట్ ఆశించనే లేదు ‘మా చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి 2019 ఎన్నికల్లో కడప ఎంపీగా పోటీ చేయాలని భావించలేదు. ఆయన ఎంపీ టికెట్ ఆశించలేదు’ అని షర్మిల స్పష్టం చేశారు. ‘కడప ఎంపీగా నన్ను పోటీ చేయమని చిన్నాన్న కోరారు. కానీ ఆ సమయంలో కడప జిల్లా రాజకీయాల పట్ల నేను ఆసక్తిగా లేను’ అని తెలిపారు. ఈ మేరకు షర్మిల ఇచ్చిన వాంగ్మూలాన్ని సీబీఐ తుది చార్జ్‌షీట్‌లో పొందుపరిచింది. దాంతో కడప ఎంపీ టికెట్ అంశంపై సీబీఐ ఇన్నాళ్లూ చేస్తున్న అభియోగాలు అవాస్తవం అని పరోక్షంగా తేలిపోయింది. వివేకానందరెడ్డి కడప ఎంపీగా పోటీ చేయాలని భావించారని, దీంతో ఎంపీ టికెట్‌కు అడ్డురాకుండా ఉండేందుకే ఆయన్ని హత్య చేశారన్న సీబీఐ అభియోగాల్లో నిజం లేదని నిగ్గు తేలింది. 2022 అక్టోబర్ 7న ఢిల్లీలోని సీబీఐ కార్యాలాయానికి వెళ్లి షర్మిల వాంగ్మూలం ఇచ్చారు. సీబీఐ అధికారులు అడిగిన 20 ప్రశ్నలకు ఆమె సమాధానం చెప్పారు. ఎన్నికలకు దాదాపు మూడు నెలల ముందు బెంగళూరులోని తన నివాసానికి వైఎస్ వివేకానందరెడ్డి వచ్చారని, 2019 ఎన్నికల్లో కడప ఎంపీగా తనను పోటీ చేయమని కోరారని షర్మిల చెప్పారు. ఆ సమయంలో ఆసక్తిగా లేనని చెప్పానన్నారు. వివేకా ఎందుకు పోటీ చేయాలని భావించలేదని సీబీఐ అధికారులు ఆమెను ప్రశ్నించారు. 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోవడంతో బహుశా ఆయన పోటీ చేసేందుకు సుముఖత చూపలేదని షర్మిల చెప్పారు. 2009లో తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఆదేశాలతో వివేకానందరెడ్డి తన తల్లి విజయమ్మపై పులివెందుల ఉప ఎన్నికల్లో పోటీ చేసిన విషయాన్ని షర్మిల గుర్తు చేశారు. బహుశా అందువల్ల తనకు టికెట్ రాదని ఆయన భావించి ఉండవచ్చని చెప్పారు. -
రిటైల్ సంస్థలకు షాక్ ఇక ఫోన్ నెంబర్ అవసరం లేదు..!
-
Viral Video : కట్టి ని తీసుకుపోవడానికి కుక్క పడ్డ పాట్లు చూడండి..!
-
నో సెకండ్ టేక్!
... అంటున్నారు అతిలోకసుందరి శ్రీదేవి. నాలుగేళ్లకే బాల నటిగా సినీరంగ ప్రవేశం చేసిన శ్రీదేవి మూడువందలకు పైగా సినిమాలు చేశారు. అన్ని సినిమాలు చేసినా ఎప్పుడూ సెకండ్ టేక్ తీసుకోలేదట ఈ బ్యూటీ. సీన్ ఎంత కష్టమైనదైనా సరే ఫస్ట్ టేక్‌లోనే పూర్తి చేసేవారట. ‘వన్ మోర్ టేక్’ అనే ఛాన్స్ దర్శకులకు ఇచ్చేవారు కాదట. ‘‘చిన్న సీన్ అయినా.. పెద్ద సీన్ అయినా.. ఏదైనా నాకు సింగిల్ టేక్‌లో చేయడం అలవాటు. మొదటిసారి వచ్చే నటన అన్నింటికీ మించి అత్యుత్తమమైనది, సహజమైనది. ఆ తర్వాత తీసుకునే టేక్స్ అన్నీ మెకానికల్‌గా ఉంటాయన్నది నా భావన. అందుకే నేనెప్పుడూ రెండో టేక్‌ని నమ్మను. ఇన్నేళ్ల నా కెరీర్లో సెకండ్ టేక్ తీసుకున్నది లేదు’’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు శ్రీదేవి. ఇలా సింగిల్ టేక్‌లో సీన్ చేయాలంటే సీన్ తీసే ముందు శ్రీదేవి ఎంతగా రిహార్సల్స్ చేస్తారో ఊహించవచ్చు. -
అనిల్ అంబానీ సంచలన నిర్ణయం
-
అనిల్ అంబానీ సంచలన నిర్ణయం
ముంబై: రిలయన్స్ గ్రూపు చైర్మన్ అనిల్ ధీరూబాయ్ అంబానీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రిలయన్స్ కమ్యూనికేషన్స్ నుంచి ఎలాంటి వేతనం తీసుకోకూడదని నిర్ణయించుకన్నారు. అప్పల ఊబిలో కూరుకుపోయి కష్టాల్లో ఉన్న ఆర్‌కామ్‌ను అదుకునేందుకు ఈ చర్యకు దిగారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ కమ్యూనికేషన్స్ నుంచి జీతం లేదా కమిషన్ గానీ స్వీకరించకూడదని అనిల్ అంబానీ నిర్ణయించుకున్నారని సంస్థ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. వ్యూహాత్మక పరివర్తన కార్యక్రమంలో సంస్థ ప్రమోటర్ల బాధ్యతతో పాటు, ఛైర్మన్ ఈ నిర్ణయం తీసుకున్నారని సంస్థ పేర్కొంది. ఈ క్రమంలో ఆర్‌కాం మేనేజ్మెంట్ కూడా ముందుకు సాగుతుందని తెలిపింది. సంస్థ బోర్డు సభ్యులు కూడా 21 రోజుల వేతనం వదులుకోవాలని నిర్ణయించారు. డిశెంబర్ 2017 వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని రిలయన్స్ కమ్యూనికేషన్స్ వెల్లడించింది. -
బాసర అమ్మవారి ఆదాయం రూ. 49 లక్షలు
బాసర(నిర్మల్): బాసరలో కొలువు దీరిన శ్రీజ్ఞానసరస్వతి అమ్మవారి హుండీ లెక్కింపు కార్యక్రమం పూర్తైంది. గత 50 రోజుల్లో అమ్మవారి హుండీకి రూ. 49,79,327 నగదుతో పాటు 120 గ్రాముల బంగారం, రెండున్నర కిలోల వెండి ఆభరణాలు కానుకలుగా వచ్చాయి. వీటితో పాటు 13 విదేశీ కరెన్సీ నాణాలు కూడా ఉన్నాయి. -
ప్రైవేటు ఆస్పత్రుల్లో పాతనోట్లు తీసుకోవాలి
డీఎంహెచ్‌వో పద్మజారాణి గుంటూరు మెడికల్ : జిల్లాలోని అన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స కోసం వచ్చే రోగులకు ఓపీ, ఐపీ వైద్యసేవల కోసం పెద్ద నోట్లు తీసుకోవాల్సిందేనని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ తిరుమలశెట్టి పద్మజారాణి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం రోగులకు వైద్యం చేసేందుకు వారి వద్ద ఉన్న పాత రూ.500 నోట్లు తీసుకోవాలని లేని పక్షంలో వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. డైరక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ అరుణకుమారి ఆదేశాల మేరకు జిల్లాలోని ఆస్పత్రుల యాజమాన్యాలు తప్పనిసరిగా ఈ ఆదేశాలు పాటించాలన్నారు. -
భార్యను పుట్టింటికి తీసుకెళ్లారని..
శాలిగౌరారం తన భార్యను పుట్టింటికి తీసుకెళ్లిన అత్తమామలు తిరిగి కాపురానికి పంపాలని ఓ వ్యక్తి సోమవారం రాత్రి మండలకేంద్రంలోని ఓ సెల్‌టవర్ ఆందోళన చేశాడు. సుమారు రెండు గంటలపాటు తీవ్ర ఉత్కంఠను కలిగించిన ఆ వ్యక్తిని పోలీసులు కిందకు దించి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మనిమద్దె గ్రామానికి చెందిన పోలేపాక సుధాకర్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపనీలో గత సంవత్సరం సూపర్వైజర్గా పనిచేశాడు. ఆ సమయంలో అదే కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తున్న నేరేడుచర్ల మండలం సజ్జాపురం గ్రామానికి చెందిన బైరి వసంతలు ప్రేమించుకున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరు 5 మార్చి 2016న ఉప్పల్‌లోని సాయిబాబా దేవాలయంలో వివాహం చేసుకున్నారు. అనంతరం మీర్‌పేట సీఐ రాములును కలిశారు. దీంతో ఆయన ఇరువురి తల్లిదండ్రులను పిలిపించి విచారించగా వసంత తల్లిదండ్రులకు పెళ్లి ఇష్టం లేక వెళ్లిపోయారు. సుధాకర్, వసంతలు మేజర్ కావడంతో మీ ఇష్టప్రకారం నడుచుకోవాలని సీఐ చెప్పారు. దీంతో సుధాకర్ తన సొంత గ్రామమైన మనిమద్దెకు వచ్చి కుటింబీకులతో కలిసి కాపురం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో వసంత కుటింబీకులు, బంధువులు సుధాకర్‌ను పలుమార్లు ఫోన్లో బెదిరింపులకు పాల్పడ్డారు. ఇదిలా ఉండగా వసంత తల్లిదండ్రులు ఈనెల 23న వసంతను బలవంతంగా లాక్కెళ్లారు. ఆ సమయంలో అడ్డువచ్చిన సుధాకర్ తల్లిని చంపుతామని బెదిరించారు. వెంటనే సుధాకర్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఈనెల 24న సజ్జాపురం వెళ్లగా అక్కడ వసంత ఆచూకీ లభించలేదు. దీంతో వారి బంధువుల వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో భార్యను కాపురానికి పంపకుండా తన అత్తమామలు వ్యవహరిస్తున్నారంటూ మనస్తాపానికి గురైన సుధాకర్ సోమవారం పోలీస్‌స్టేషన్‌కు వచ్చివెళ్తూ సాయంత్రం మండలకేంద్రంలోని సెల్‌టవర్‌ను ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించాడు. విషయం తెలుసుకున్న సుధాకర్ తల్లిదండ్రులు, స్నేహితులతో పాటు ఎస్ఐ అయోధ్య సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని సుధాకర్‌కు నచ్చజెప్పి కిందకు దించేందుకు నానాహైరాన పడ్డారు. న్యాయం జరిగేలా చూస్తామని ఎస్ఐ హామీ ఇవ్వడంతో ఎట్టకేలకు రాత్రి 7.30 గంటలకు సుధాకర్ సెల్‌టవర్ దిగికిందకు వచ్చాడు. వెంటనే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. -
జబ్బుల పట్ల జాగ్రతలు పాటించాలి
మోతె : సీజనల్ జబ్బుల పట్ల ప్రజలు జాగ్రతలు పాటించాలని మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ నాగలక్ష్మి అన్నారు.సోమవారం మండల కేంద్రంలో జరిగిన జాతీయ పైలేరియా వ్యాధి నివారణ కార్యక్రమంపై ఆరోగ్య సిబ్బందికి జరిగిన అవగాహణ సదస్సులో ఆమే మాట్లాడుతు గ్రామాలలో ప్రజలు ప్రమాదకరమైన జబ్బులపై జాగ్రతలు పాటించాలన్నారు. నేటి నుంచి∙సెప్టెంబర్ ఒకటో తేదీ వరకు గ్రామాలలో ఫైలేరియా వ్యాధికి నివారణ ముందులను పంపిణీ చేయాలని ఆరోగ్య సిబ్బందికి ఆమే సూచించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది, శ్రీనివాస్, రాములమ్మ, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. -
ఢిల్లీలో ‘అంకురం’
ఖమ్మం స్పోర్ట్స్: ఢిల్లీలో జరుగుతున్న అండర్–15 జాతీయస్థాయి క్రికెట్ టోర్నీలో ఖమ్మానికి చెందిన క్రికెటర్లు సత్తా చాటుతున్నారు. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (సీఏటీ) తరఫున పాల్గొన్న క్రికెటర్లు చక్కని ఆటతీరు ప్రదర్శిస్తున్నారు. తమిళనాడు–సీఏటీ జట్ల మధ్య మంగళవారం జరిగిన మ్యాచ్‌లో అంకుర్‌సింగ్ మూడు వికెట్లు తీసి రాణించాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన సీఏటీ నిర్ణీత 20 ఓవర్లలో 108 పరుగులు చేసింది. 109 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరభించిన తమిళనాడు 96 పరుగులకే కుప్పకూలింది. సీఏటీ బుధవారం ఆంధ్రతో తలపడుతుందని కోచ్ రాజు టక్కర్ తెలిపారు. -
పుష్కరాల్లో అప్రమతంగా ఉండాలి
–ఏఎస్పీ గంగారామ్ భువనగిరి కృష్ణ పుష్కరాల్లో పోలీస్ యంత్రాగం అప్రమతంగా ఉండాలని ఏఎస్పీ గంగారామ్ సూచించారు. పుష్కరాల ఏర్పాట్లలో భాగంగా బుధవారం భువనగిరిలోని ఏఆర్ గార్డెన్లో జరిగిన డివిజన్ స్థాయి సమీక్ష సమావేశంలో ఏఎస్పీ మాట్లాడారు. డివిజన్ పరిధిలో ఏర్పాటు చేసిన హోల్డింగ్ పాయింట్ల వద్ద పోలీస్ సిబ్బంది ఉండాలని చెప్పారు. ఎప్పటి కప్పుడు వాహనాల రద్ది గుర్చి సమాచారం ఇవ్వాలన్నారు. ఇందులో భాగంగా భువనగిరిలోని నల్లగొండ చౌరస్తా వద్ద 1. మండలంలోని వడపర్తి వద్ద 2, చౌటుప్పల్ వద్ద 1, పోచంపల్లి మండలంలోని లక్కారం వద్ద 1 హోల్డింగ్ పాయింట్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ట్రాఫిక్ సమస్య రాకుండా ముందు ఉన్న వాహనాలు వెళ్లిన తర్వాత వెనుకల వచ్చే వాహనాలను పంపిచాలని సూచించారు. సమావేశంలో సీఐలు ఎం. శంకర్‌గౌడ్, అర్జునయ్య, రాఘువీర్రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, ఎస్ఐలు మంజునా«ద్‌రెడ్డి, హన్మంత్‌లాల్, ఎండి సజిదుల్లా, మధుసూదన్‌రెడ్డి, నర్సింహ్మ, రాజశేఖర్‌రెడ్డి, ఏఎస్ఐ లింగమాయ్య, కానిస్టేబుల్, ఎన్ఎస్ఎస్ వాలంటర్లు ఉన్నారు. -
రోబోలు ప్రపంచాన్ని శాసిస్తాయా?
కార్టలన్ః యాంత్రీకరణ పలు రకాల ఉద్యోగాలు అంతర్థానమయ్యేలా చేస్తోంది. వీటి ప్రభావం ఉపాధిని భారీగా దెబ్బతీస్తోంది. కంప్యూటరరీకరణ వల్ల ఉపాధి శాతం ఇప్పటికే తగ్గిపోగా.. ఆధునిక రోబోట్లు ఆ సమస్యను మరింత జఠిలం చేస్తాయా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అదే కొనసాగితే వచ్చే 20 ఏళ్ళలో ప్రపంచమే రోబోట్ లా మారిపోతుందేమోనన్న ఆందోళనా వ్యక్తమౌతోంది. ఇటీవల ఓ ఫుడ్ కంపెనీలో పనికోసం ప్రవేశ పెట్టిన అతిపెద్ద రోబో అందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఇటీవల బ్రిటన్ బార్న్ స్లే లోని కారల్టన్.. ప్రిమియర్ ఫుడ్ ఫ్యాక్టరీలో కొత్తగా ప్రవేశ పెట్టిన అతిపెద్ద రోబో.. అనేకమంది కార్మికుల ఉపాధిని కొల్లగొట్టింది. ఆ సరికొత్త యంత్రం.. వందలకొద్దీ మిస్టర్ క్లిప్పింగ్ కేక్ లను సునాయాసంగా బాక్స్ లలో పెట్టి ప్యాక్ చేసేస్తోంది. ఇక్కడ ఈ యంత్రానికి సంబంధించిన అన్ని పనులు ఆపరేషన్ప్ మేనేజర్ డారన్ రైనే చూసుకుంటాడు. పని సరిగా చేయడం లేదు, ప్యాకింగ్ సరిగా లేదు అంటూ కార్మికులపై అరవాల్సిన పని ఇప్పుడతడికి లేదు. పనికోసం అధికశాతం ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేదు. అనేక చేతులున్న మనుషుల్లాగా పనిచేసే ఆరోబో... ఎంతోమంది కార్మికులు చేయాల్సిన పనిని స్వయంగా చేసేస్తోంది. ప్రిమియర్ ఫుడ్స్ ఫ్యాక్టరీ కొత్తగా ప్రవేశపెట్టిన డజన్లకొద్దీ చేతులున్న ఆ యంత్రం.. సుమారు వెయ్యి కేక్ ముక్కలను కేవలం ఒక్క నిమిషంలోనే ప్యాక్ చేసేస్తుంది. రోబోకి ఏర్పాటు చేసిన కళ్ళు.. కేక్ ఆకారాన్ని గుర్తుపట్టగల్గుతాయి. దీంతో ట్రేలో సర్దుకునే ముందే వాటిలో లోపాలను గుర్తించి, ఏమాత్రం తేడా కనిపించినా వాటిని పక్కకు నెట్టేస్తుంది. ఈ మిషన్ తో కేవలం ఒక్క నిమిషంలో 1000 వరకూ కేక్ లు ప్యాక్ అయిపోవడం చూసినవారికి ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. రోబోకు ఏర్పాటు చేసిన చేతులు అతి వేగంగా ఒక్కో ముక్కను ఎంచుకోవడం, ట్రేలో పెట్టి నిమిషాల్లో ప్యాక్ చేసేయడం చూపరులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఇక్కడ కార్మికులు కేవలం మిషన్ ను ఆపరేట్ చేయడానికి, క్లీన్ చేయడానికి మాత్రమే అవసరం అవుతారు. దీంతోపాటు రోబో తీసుకోకుండా వదిలేసిన ముక్కలు, ప్లాస్టిక్ పేపర్లను తొలగించి ఫ్యాక్టరీ ఉద్యోగుల షాప్ కు తరలిస్తారు. బ్రిటన్ ఫ్యాక్టరీల్లో ఈ ఆటోమేషన్ ఉపయోగం ఇటీవల చాలా మామూలైపోయింది.ఇటువంటి అత్యాధునిక రోబోలు నిజంగా అద్భుతమే అనిపించినప్పటికీ, ఇక్కడ కార్మిక శక్తి తగ్గిపోవడం, ఉపాధి మార్గాలు కరువవ్వడం మాత్రం కొంత నిరాశను కలిగిస్తుంది. చివరికి మనుషులు.. ఫ్యాక్టరీల్లో చెత్తను క్లీన్ చేయడానికి మాత్రమే ఉపయోగపడతారా అన్న అనుమానం వ్యక్తమౌతుంది. -
సొంత నిర్ణయం తీసుకోనివ్వండి..రాజన్
భువనేశ్వర్ : ఆర్బీఐ కు సొంత నిర్ణయాలను తీసుకొనే స్వేచ్ఛనివ్వాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ రఘురామ్ రాజన్ వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం కేంద్ర బ్యాంకుకు అందిస్తున్న పూర్తి స్వేచ్చ, మద్దతుపై సంతోషం వ్యక్తం చేస్తూనే, ఇకముందు సంస్థకు తన సొంత నిర్ణయాలు తీసుకునే అవకాశం కల్పించాలని కోరారు. ఒడిశా రాష్ట్రంలో మూడు రోజుల పర్యటనలో ఉన్న రాజన్, మొదటిరోజు ఆర్బీఐ ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. మనది వ్యవసాయ ఆధారితమైన ఎకానమీ అనీ, భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.అందుకే వ్యవసాయ ఆధారిత చిన్న, మధ్యస్థ ప్రాజెక్టులపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దీంతోపాటు భారతీయ ఆర్థిక వ్యవస్థ ఇపుడు సరైన దారిలో నడుస్తోందనీ,ఈ క్రమంలో ప్రపంచంలో ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఉద్భవించనుందని వ్యాఖ్యానించారు. ఒడిషాలో ఖనిజ వనరులు విరివిగా ఉన్నాయని, పర్యాటకపరంగా అభివృద్ధి చేసి రాష్ట్ర ఆర్థిక పురోభివృద్దికి వినియోగించుకోవాలని రాజన్ సూచించారు. కోట్లాదిమంది భవిష్యత్తును నిర్దేశించే క్రమంలో ఆర్ బీఐ నిర్ణయం చాలా కీలకమైందని, ఏ చిన్న తప్పు దొర్లినా,దేశాన్ని ప్రజలను కష్టాల్లోకి నెడుతుందని ఉద్యోగులు అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఈ సమావేశానికి మీడియాను అనుమతించలేదు. అనంతరం ఆయన కళింగ సోషల్ సైన్సెస్ సంస్థను (కెఐఎస్ఎస్)ను సందర్శించారు. పాఠశాల నిర్వహణ, దాని ఆర్థిక నమూనాకు సంబంధించి అక్కడి అధికారులతో చర్చించారు. తన పర్యటనలో భాగంగా ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, ప్రభుత్వ అధికారులను కలువనున్నారు. గ్లోబల్ ఎకానమీ ఆఫ్ ఇండియా అనే అంశంపై హరే కృష్ణ మెహతాబ్ లో మెమోరియల్ లెక్చర్ ఇవ్వనున్నారు. -
పదేపదే పట్టుబడితే అంతే...!