
అనిల్ అంబానీ సంచలన నిర్ణయం
ముంబై: రిలయన్స్ గ్రూపు చైర్మన్ అనిల్ ధీరూబాయ్ అంబానీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రిలయన్స్ కమ్యూనికేషన్స్ నుంచి ఎలాంటి వేతనం తీసుకోకూడదని నిర్ణయించుకన్నారు. అప్పల ఊబిలో కూరుకుపోయి కష్టాల్లో ఉన్న ఆర్‌కామ్‌ను అదుకునేందుకు ఈ చర్యకు దిగారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ కమ్యూనికేషన్స్ నుంచి జీతం లేదా కమిషన్ గానీ స్వీకరించకూడదని అనిల్ అంబానీ నిర్ణయించుకున్నారని సంస్థ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. వ్యూహాత్మక పరివర్తన కార్యక్రమంలో సంస్థ ప్రమోటర్ల బాధ్యతతో పాటు, ఛైర్మన్ ఈ నిర్ణయం తీసుకున్నారని సంస్థ పేర్కొంది. ఈ క్రమంలో ఆర్కాం మేనేజ్మెంట్ కూడా ముందుకు సాగుతుందని తెలిపింది. సంస్థ బోర్డు సభ్యులు కూడా 21 రోజుల వేతనం వదులుకోవాలని నిర్ణయించారు. డిశెంబర్ 2017 వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని రిలయన్స్ కమ్యూనికేషన్స్ వెల్లడించింది.