
... అంటున్నారు అతిలోకసుందరి శ్రీదేవి. నాలుగేళ్లకే బాల నటిగా సినీరంగ ప్రవేశం చేసిన శ్రీదేవి మూడువందలకు పైగా సినిమాలు చేశారు. అన్ని సినిమాలు చేసినా ఎప్పుడూ సెకండ్ టేక్ తీసుకోలేదట ఈ బ్యూటీ. సీన్ ఎంత కష్టమైనదైనా సరే ఫస్ట్ టేక్‌లోనే పూర్తి చేసేవారట. ‘వన్ మోర్ టేక్’ అనే ఛాన్స్ దర్శకులకు ఇచ్చేవారు కాదట. ‘‘చిన్న సీన్ అయినా.. పెద్ద సీన్ అయినా.. ఏదైనా నాకు సింగిల్ టేక్‌లో చేయడం అలవాటు.
మొదటిసారి వచ్చే నటన అన్నింటికీ మించి అత్యుత్తమమైనది, సహజమైనది. ఆ తర్వాత తీసుకునే టేక్స్ అన్నీ మెకానికల్‌గా ఉంటాయన్నది నా భావన. అందుకే నేనెప్పుడూ రెండో టేక్‌ని నమ్మను. ఇన్నేళ్ల నా కెరీర్‌లో సెకండ్ టేక్ తీసుకున్నది లేదు’’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు శ్రీదేవి. ఇలా సింగిల్ టేక్‌లో సీన్ చేయాలంటే సీన్ తీసే ముందు శ్రీదేవి ఎంతగా రిహార్సల్స్ చేస్తారో ఊహించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment