రక్తదానం చేస్తే ప్రాణం పోసినట్లే
రక్తదానం చేస్తే ప్రాణం పోసినట్లే
Published Thu, Sep 15 2016 9:47 PM | Last Updated on Wed, Apr 3 2019 4:24 PM
కర్నూలు: అత్యవసర సమయాల్లో రక్తం ఇచ్చి ఆదుకుంటే బాధితులకు ప్రాణం పోసినట్లేనని ఎస్పీ ఆకె రవికృష్ణ అన్నారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య 49వ జయంతి సందర్భంగా గురువారం ఉదయం స్థానిక గాయత్రి ఎస్టేట్ ఎదుటనున్న మోక్షగుండం విశ్వేSశ్వరయ్య సర్కిల్‌లో లైసెన్స్‌డ్ ఇంజనీర్ ఆర్కిటెక్చర్ సర్వేయర్ అసోసియేషన్(లీసా) ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా లీసా సభ్యులు రక్తదానం చేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ప్రమాదం సంభవించినపుడు, ఆపరేషన్ల సమయంలో సరైన సమయానికి రక్తం అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. రోడ్డు ప్రమాదాల్లో ఒక కుటుంబానికి ఆధారంగా ఉన్న వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబ సభ్యుల పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందన్నారు. రక్తదానం చేస్తే ఇలాంటి ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపవచ్చన్నారు. కార్యక్రమంలో కర్నూలు డీఎస్పీ రమణమూర్తి, ఇంజనీర్స్ లీసా చైర్మన్ మురళిమోహన్‌రావు, మూడవ పట్టణ సీఐ మధుసూదన్‌రావు, ఆర్గనైజర్ యోహాన్, రెడ్‌క్రాస్ చైర్మెన్ శ్రీనివాసులు, మెడికల్ ఆఫీసర్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు.
Advertisement