రక్తదానం చేయడం ప్రాణదానం చేయడమే
Published Tue, Oct 18 2016 7:19 PM | Last Updated on Wed, Apr 3 2019 4:24 PM
–జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణŠ
ఏలూరు అర్బన్ ః
విపరీతమైన రక్తం స్రావం జరిగిన సందర్భాలలో బాధితులకు రక్తం అందించడం ప్రాణదానం చేయడమేనని జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా పోలీసుల ఆధ్వర్యంలో బుధవారం స్థానిక అమీనాపేట పోలీసు కళ్యాణమండపంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ భాస్కర్‌భూషణ్ రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదాలు జరిగిన సందర్భాలలో చాలా మంది బాధితులు తీవ్ర రక్తస్రావం కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. కాబట్టి ఆరోగ్యవంతులంతా తరచూ రక్తం దానం చేయాలని విజ్ఞప్తి చే శారు. ఇదే సందర్భంలో పలువురు పోలీసు అధికారులు, సిబ్బందితో పాటు శిబిరానికి హాజరైన నగరంలోని వివిధ కళాళాలలో చదువుకుంటున్న విద్యార్ధులు రక్తదానం చేశారు. కార్యక్రమంలో జిలా అడిషనల్ ఎస్పీ ఎన్. చంద్రశేఖర్, ఓఎస్‌డీ చంద్రశేఖరరావు, ఏలూరు డీఎస్పీ గోగుల వెంకటేశ్వరరావు.ఎస్బీ డీఎస్పీ పి. భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement