మాయమై పోతున్నడమ్మా.. మనిషన్నవాడు.. మచ్చుకైనా లేదు చూడు మానవత్వము నేడు.. అన్న ఓ ప్రజాకవి మాటలు అనునిత్యం అక్షరసత్యాలే. నేటి నవ నాగరిక సమాజంలో మానవత్వం మంట గలిసిపోతోంది. రక్త సంబంధాలు రక్తపుటేరులు పారిస్తున్నాయి. తన రక్తాన్ని పాలుగా మార్చి బిడ్డ ఆకలిదప్పులు తీర్చి కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన మాతృమూర్తినే కడతేరుస్తున్న కసాయి కొడుకులు పుట్టుకొస్తున్నారు. వేలు పట్టుకుని నడకతో పాటు నడ తనూ నేర్పి కొడుకును ప్రయోజకుడిని చేయాలని త పించిన తండ్రినే విచక్షణారహితంగా తుదముట్టిస్తున్న కర్కోటకపు కుమారులూ కోకొల్లలుగా కనిపిస్తున్నారు. ఒకే రక్తం పంచుకుపుట్టిన అన్నదమ్ములు సైతం ఆస్తికోసం.. అంతస్తుల కోసం పగలు.. ప్రతీకారాలతో రగిలిపోతూ ప్రాణాలు తీసుకునేంత తీవ్ర స్థాయికి వెళ్తున్నారు. ఇలాంటి సంఘటనలు పరిశీలిస్తే ఏమైపోతోంది మానవత్వం.. ఎటువెళుతోంది సమాజం అనిపిస్తుంది. మానవతకే మచ్చ తెస్తున్న ‘రక్త’సంబంధాలపై ప్రత్యేక కథనం..
కడప క్రైం : సమాజంలో రోజురోజుకు రక్తసంబంధాలు బలహీనంగా మారుతున్నా యి. ప్రజల్లో వ్యక్తిగత స్వార్థం ఎక్కువై.. ఆస్తులు, డబ్బే ముఖ్యమై బంధాల్నే దూ రం చేసుకునే దుస్థితి నెలకొంది. తల్లీ, తండ్రీ, అన్నాదమ్ములనే బేధాలు లేకుండా దారుణంగా హత్యలు చేస్తున్నా రు. విచక్షణ మరిచి నిమిషాల్లోనే నిండు ప్రాణాలను బలి తీసుకుంటూ కటకటాల పాలవుతున్నారు. ఇటీవల జిల్లా లో చోటు చేసుకున్న సంఘటనలు మా యమైపోతున్న మని షిని ఎక్కడా అని అడుగుతున్నాయి. మచ్చుకైనా కానరాని మానవత్వాన్ని వెదుకుతున్నాయి.
ఆస్తికోసం కత్తిదూసిన వైనం..
కడప అర్బన్ సర్కిల్ పరిధిలోని తాలూ కా పోలీసుస్టేషన్ పరిధిలో నివసించి న తీట్ల రోజమ్మ (70) అనే వృద్ధురాలిని కుమారుడు బెంజిమన్ గతేడాది డిసెంబర్‌లో ఇంట్లోనే హత్య చేశాడు. వృద్ధాప్య దశలో ఆప్యాయంగా చూసుకోవాల్సిన తల్లిని తన దురలవాట్లకు డబ్బులివ్వలేదని హత్య చేసి కటకటాలపాలయ్యాడు. ఈ నెల 23న ఆస్తి తగాదాలు, మోటారు సైకి ల్ వివాదంపై కుటుంబంలో పెద్ద కుమారుడు సాదత్ అలీఖాన్ తన తమ్ముడు దావూద్ అలీఖాన్‌ను కత్తిపోటుతో హత్య చేశాడు.
రక్త సంబంధాలు
Published Mon, Feb 9 2015 2:03 AM | Last Updated on Wed, Apr 3 2019 4:22 PM
Advertisement