kadapa crime
-
బంధాలు మరిచి..
రోజురోజుకూ పెరుగుతున్న సాంకేతికతతో ఆనందించాలో.. తరుగుతున్న మానవ విలువలకు బాధపడాలో తెలియని పరిస్థితి. స్నేహాలు, బంధుత్వాలు, అనురాగాలు, చివరకు మూడుముళ్ల బంధాలు, కన్న ప్రేమలు కూడా దూరమవుతున్నాయి. కేవలం డబ్బు, ఆస్తులకే విలువ నిచ్చేలా ఉన్నాయి.. జిల్లాలో చోటు చేసుకున్న సంఘటనలు. కష్టాల్లో, సుఖాల్లో ఒకరికొకరం తోడుగా ఉంటామని పెళ్లి నాటి మాటలు మృగ్యమవుతున్నాయి. అమ్మను గాయపరిచాడని కన్న కొడుకు తండ్రిని కత్తితో పొడిచి హత్య చేశాడు. అలాగే మామ తమ కుటుంబంలో అశాంతి నెలకొల్పుతున్నాడని, బీమా సొమ్ము వస్తుందని హత్య చేసి, రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే యత్నం. మరో సంఘటనలో డీకేటీ స్థలం విషయమై హత్య చోటు చేసుకుంది. తండ్రిని కత్తితో పొడిచిన కుమారుడు కాశినాయన: బంధాలు మరిచిపోయి ఆస్తి కోసం కన్నతండ్రినే కుమారుడు హత్య చేసిన సంఘటన పలువురిని కలిచివేసింది. ఈ సంఘటన కాశినాయన మండలం వరికుంట్ల గ్రామంలో చోటు చేసుకుంది. గంగన్నపల్లె గ్రామానికి చెందిన యర్రంరెడ్డి పెంచల్‌రెడ్డి(50)ని కుమారుడు జయసింహారెడ్డి బుధవారం కత్తితో పొడిచి హత్య చేశాడు. స్థానికులు తెలిపిన మేరకు వివరాలు.. పదేళ్ల కిందట గంగన్నపల్లె నుంచి పెంచల్‌రెడ్డి కుటుంబం వరికుంట్లలో నివాసం ఏర్పరచుకుని జీవనం సాగిస్తున్నారు. పెంచల్‌రెడ్డి భార్య శివమ్మ పేరుతో అయిదెకరాల డీకేటీ పొలం ఉంది. మొత్తంగా 8 ఎకరాల పొలం సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయిదేళ్ల కిందట భార్యాభర్తల మధ్య వివాదాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో తన పేరు మీద ఉన్న భూమిని తనకు, కుమారుడికి ఇప్పించాలని కలసపాడు పోలీస్‌స్టేషన్‌లో శివమ్మ ఫిర్యాదు చేసింది. పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ చేసి శివమ్మ, కుమారుడు జయసింహారెడ్డికి రెండు భాగాలు, పెంచల్రెడ్డికి ఒక భాగంగా ఇచ్చారు. శివమ్మ గతేడాది ఏప్రిల్‌లో తన భూమిలో అరటి పంటను సాగు చేసింది. బోరుబావిలో నీరు తగ్గిపోవడంతో ఆమె పంటను వదిలేసి కడప సమీపంలోని పుట్టింటికి వెళ్లింది. పెంచల్‌రెడ్డి భార్య వదిలేసిన పంటకు నీళ్లు, ఎరువులు అందించాడు. ప్రస్తుతం కోత దశకు చేరింది. విషయం తెలుసుకున్న శివమ్మ వారం కిందట పొలం వద్దకు వచ్చి దిగుబడిని తాను అమ్ముకుంటానని భర్తతో గొడవకు దిగింది. ఈ నేపథ్యంలో బుధవారం కూలీలను పిలిపించి అరటి గెలలు కోసేందుకు శివమ్మ పొలం వద్దకు వెళ్లగా.. పెంచల్‌రెడ్డి అడ్డుకున్నాడు. ఇద్దరి మధ్య వివాదం తీవ్రస్థాయికి చేరింది. శివమ్మకు గాయాలయ్యాయి. దీంతో కోపోద్రిక్తుడైన కుమారుడు జయసింహారెడ్డి తండ్రిని కత్తితో పొడివగా ఘటనాస్థలంలోనే పెంచల్‌రెడ్డి చనిపోయాడు. విషయాన్ని స్థానిక వీఆర్ఓ చెంచురామిరెడ్డి పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా.. కలసపాడు ఎస్ఐ వెంకటరమణ సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు జయసింహారెడ్డి, శివమ్మ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. విచారణలో పోరుమామిళ్ల సీఐ రెడ్డెప్పరెడ్డి, ఎస్ఐ సురేష్, సిబ్బంది పాల్గొన్నారు. మామను హత్య చేసిన కేసులో.. ఎర్రగుంట్ల : మామ యరమల చెన్నకృష్ణారెడ్డిని హత్య చేసిన కేసులో అల్లుడు రాయపాటి కిరణ్ కుమార్‌రెడ్డి, తన బావ మల్లెం శ్రీనివాసులురెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు కడప డీఎస్పీ మాసూం బాషా మాట్లాడుతూ ప్రొద్దుటూరులోని గౌరీ శంకర్ జూనియర్ కళాశాలలో అటెండర్‌గా పనిచేస్తున్న యరమల చెన్నకృష్ణారెడ్డికి ఇద్దరు కూతుళ్లు. పెద్ద అమ్మాయి చైతన్యవాణిని సింహాద్రిపురం మండలం బలపనూరు గ్రామానికి చెందిన రాయపాటి కిరణ్‌కుమార్‌రెడ్డికి ఇచ్చి వివాహం చేశారు. కిరణ్‌కుమార్‌రెడ్డి సింహాద్రిపురంలో అసిస్టెంట్ లైన్మెన్గా పనిచేస్తున్నాడు. మామ చెన్నకృష్ణారెడ్డి తన కూతురుకు లేనిపోని మాటలు చెబుతూ తన సంసారంలో సుఖం లేకుండా చేస్తున్నాడని, సంసారం ప్రొద్దుటూరులో పెట్టించి తనను చాలా ఇబ్బంది పెడుతున్నాడని అల్లుడు కక్ష పెంచుకున్నాడు. తన మామ చెన్నకృష్ణారెడ్డిని చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరిస్తే.. బీమా సొమ్ము నామినీ అయిన తన భార్యకు వస్తుందని ఆలోచించాడు. దీంతో కిరణ్‌కుమార్‌రెడ్డి తన బావ శ్రీనివాసులురెడ్డితో కలిసి పోట్లదుర్తి ఢాబా సమీపంలోని ప్లాట్లలోకి మామను గత నెల 30న తీసుకెళ్లాడు. ఎర్రగుంట్లలో డబ్బుల కోసమని చెప్పి.. తమ వెంట తెచ్చుకున్న వస్తువులతో మామ చెన్నకృష్ణారెడ్డి కాళ్లు చేతులు కట్టి, తలకు ప్లాస్టిక్ కవర్ తొడిగి సుత్తెతో తలపై కొట్టి చంపారు. హత్యగా అనుమానం రాకుండా ఉండేందుకు ఎర్రగుంట్ల–ప్రొద్దుటూరు రోడ్డులోని శ్రీ ఆంజనేయస్వామి గుడి సమీపంలో గల మైలవరం దక్షిణ కాలువలో పడేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు. మృతుడు చెన్నకృష్ణారెడ్డి భార్య లక్ష్మీప్రసన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎర్రగుంట్ల సీఐ వెంకటరమణ కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో తన సొంత అల్లుడు రాయపాటి కిరణ్‌కుమార్‌రెడ్డి, తన బావ శ్రీనివాసులరెడ్డి (పెండ్లిమర్రి మండలం నంది మండలం) కలిసి చెన్నకృష్ణారెడ్డిని హత్య చేసినట్లు తేలింది. నిందితులను బుధవారం జువారి బస్టాప్ వద్ద అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సీఐ వెంకటరమణను, పోలీసు బృందాన్ని ప్రత్యేక అభినందించారు. -
భర్త, కుమారుడే హతమార్చారు
వివాహేతర సంబంధం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసింది.. తన తల్లి పరాయి మగాడితో ఉండడాన్నికుమారుడు జీర్ణించుకోలేక పోయాడు.. తప్పు చేస్తున్నావు అమ్మా అంటూ పలు సార్లు ఆమెను మందలించాడు.. ఇలా చేస్తే బంధువుల మధ్య పరువు పోతుందని నచ్చజెప్పాడు.. ఇవన్నీ వద్దమ్మా మన ఊరికి వెళ్దాం.. పదమ్మా అంటూ ప్రాధేయ పడ్డాడు.. అయినా తల్లి మనసు మారలేదు. కన్నప్రేమనుకాదనుకుంది.. పరాయివాడి ప్రేమే కావాలనుకుంది.. ఫలితంగా కన్న కొడుకు, భర్త చేతిలోనే ఆమె బలైంది. ప్రొద్దుటూరు క్రైం : గత నెల 29న అనుమానాస్పద స్థితిలో పట్టణంలోని గౌరమ్మకట్టవీధిలో నివాసం ఉంటున్న రైల్వే టీసీ దేవరకొండ రమాదేవి మృతి చెందింది. ఈ సంఘనటపై అదే రోజు టూ టౌన్ పోలీస్‌స్టేష్‌లో అనుమానాస్పద మృతి కింద కేసు నమోదైంది. ఆమె మృతిపై అనుమానం రావడంతో పోలీసులు లోతైన దర్యాప్తు చేపట్టారు. రమాదేవిని ఆమె భర్త లక్ష్మీనారాయణ, కుమారుడు నిఖిల్, మామ మునుస్వామి, అతని స్నేహితుడు రామచంద్ర హత్య చేసినట్లు పోలీసు దర్యాప్తులో తేలింది. వీరిని టూ టౌన్ పోలీసులు మంగళవారం రైల్వేస్టేషన్ సమీపంలో అరెస్ట్ చేశారు. అరెస్ట్ వివరాలను డీఎస్పీ శ్రీనివాసరావు సాయంత్రం టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. దేవరకొండ లక్ష్మీనారాయణ రైల్వేశాఖలో టీసీగా పని చేస్తున్నాడు. అతనికి 1997లో గుంతకల్‌కు చెందిన రమాదేవితో వివాహం అయింది. రమాదేవి కూడా ధర్మవరంలో టీసీగా పని చేస్తున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు నిఖిల్ ఉన్నారు. నిఖిల్ బెంగళూరులో బీటెక్ చదువుతున్నాడు. కొన్నేళ్ల క్రితం సంసారంలో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చాయి. తరచూ వారి మధ్య గొడవలు జరిగేవి. ఈక్రమంలోనే లక్ష్మీనారాయణ తాగుడుకు బానిసయ్యాడు. అతనికి 2010లో ధర్మవరానికి బదిలీ అయింది. కొంత కాలానికి అదే ప్రాంతానికి చెందిన ఒక స్త్రీతో అతను వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం రమాదేవికి తెలియడంతో అనంతపురంలోని త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టారు. తర్వాత భార్యాభర్తలిద్దరూ రాజీ అయ్యారు. అయినా భర్తపై ఆమెకు అనుమానం పోలేదు. ఆస్తిలో తన భాగం రాసివ్వమని భర్తతో గొడవపడుతూ ఉండేది. మద్యానికి బానిస అయిన అతను 8 నెలల క్రితం బెంగుళూరులోని రిహాబిటేషన్ సెంటర్లో చికిత్స చేయించుకుంటున్నాడు. అదే సమయంలో రమాదేవికి ప్రొద్దుటూరుకు చెందిన ఒక వ్యక్తితో ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది. దీంతో ఆమె అనంతపురం నుంచి ప్రొద్దుటూరుకు కాపురాన్ని మార్చారు. గౌరమ్మకట్టవీధిలోని ఒక ఇంటిని బాడుగకు తీసుకొని నివాసం ఉంటున్నారు. ఫేస్బుక్లో పరిచయమైన అతను తరచూ ఆమె ఇంటికి వచ్చేవాడు. ఇలా వారి మధ్య ఉన్న పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ప్రవర్తన మార్చుకోమని చెప్పినా వినిపిం చుకోలేదు. మందలించినా మారలేదు రమాదేవి మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న విషయం భర్తతో పాటు కుమారుడికి తెలిసింది. దీంతో కుమారుడు నిఖిల్ పలుమార్లు ఫోన్ చేసి తల్లిని మందలించాడు. ఈ విషయం బంధువులకు తెలిస్తే తలెత్తుకొని తిరగలేమని ప్రవర్తన మార్చుకోవాలని బతిమలాడాడు. అయినా ఆమె వినిపించుకోలేదు. ఇదే విషయాన్ని నిఖిల్ తండ్రితో చెప్పాడు. రెండు, మూడు సార్లు కుమారుడు ప్రొద్దుటూరుకు వచ్చాడు. తనతో పాటు ధర్మవరానికి రమ్మని చెప్పాడు. ఎక్కడికి వచ్చేది లేదని, ఇక్కడే ఉంటానని ఆమె తేల్చి చెప్పింది. ముందే పసిగట్టిన రమాదేవి ఆమె మృతిపై టూ టౌన్ పోలీసులకు అనుమానం రావడంతో ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగానే ఫేస్బుక్ ద్వారా పరిచయమైన వ్యక్తిని విచారించారు. అయితే ఈ విచారణలో కొన్ని ఆసక్తి కరమైన విషయలు వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. తనను భర్త, కుటుంబ సభ్యులు హతమారుస్తారనే విషయాన్ని రమాదేవి ముందుగానే పసిగట్టింది. ఒకటి, రెండు రోజుల్లో పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆమె ఫిర్యాదు పత్రాన్ని కూడా సిద్ధం చేసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. ఇంతలోనే వారి చేతిలో హత్యకు గురైంది. సీసీ కెమెరాల ద్వారా గుర్తింపు రమాదేవి మృతి చెందిన విషయం తెలిసిన మరుక్షణమే డీఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో సీఐ మల్లికార్జునగుప్త, ఎస్ఐ మధుమళ్లేశ్వరరెడ్డి సీసీ కెమెరాల ద్వారా నిందితులను పసిగట్టారు. వారు ఎప్పుడు వచ్చారు, ఎక్కడ దిగారనే విషయాన్ని కమాండ్ కంట్రోల్లోని నిఘా కెమెరాల ద్వారా గుర్తించారు. దీంతో రంగంలోకి దిగి వెంటనే వారిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన సీఐ, ఎస్ఐతో పాటు హెడ్‌కానిస్టేబుల్ ఇబ్రహీం, సుధాకర్, కానిస్టేబుళ్లు శ్రీనివాసులరెడ్డి, సుధాకర్, సునీల్, రాజశేఖర్, సుబ్బయ్య, జయచంద్రలను డీఎస్పీ అభినందించారు. వీరికి రివార్డు కోసం ఎస్పీకి సిఫారస్సు చేస్తానని చెప్పారు. నిందితులను రిమాండుకు తరలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. కుటుంబం చిన్నాభిన్నం వివాహేతర సంబంధం ఒక కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. రమాదేవి మృతి చెందడంతో ఇద్దరు కుమార్తెలు, కుమారుడు తల్లి లేని పిల్లలయ్యారు. బీటెక్ చదువుతున్న కుమారుడు నిఖిల్ భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారింది. అంతేగాక సొంత తల్లిని చంపాడనే అపవాదును మూటగట్టుకున్నాడు. వివాహేతర సంబం«ధాలు ఎంత వరకూ అయినా దారి తీస్తాయో రమాదేవి ఉదంతమే ఉదాహరణ అని డీఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వివాహేతర సంబంధాల జోలికి వెళ్లరాదని ఆయన సూచించారు. ప్రొద్దుటూరులో రెక్కీ.. గొంతు నులిమి హత్య భర్త లక్ష్మీనారాయణ, కుమారుడు నిఖిల్, మామ మునిస్వామి, అతని స్నేహితుడు రామచంద్ర కలిసి గత నెల 27న ప్రొద్దుటూరుకు వచ్చి మైదుకూరు రోడ్డులోని ఓ లాడ్జీలో దిగారు. రమాదేవి ఉంటున్న వీధిలో రెండు రోజుల పాటు వారు రెక్కీ నిర్వహించారు. ఎవ్వరికీ అనుమానం రాకుండా ఉండేందుకు నిఖిల్‌ను రమాదేవి ఇంటికి పంపించారు. ఈ క్రమంలో నిఖిల్ ఆమె ఇంట్లో ఉన్న సమయంలోనే 29న వేకువ జామున లక్ష్మీనారాయణ, మునుస్వామి, రామచంద్ర అక్కడికి వెళ్లారు. అప్పటికే నిఖిల్ తలుపు తెరిచి ఉండటంతో వారు ఇంట్లోకి ప్రవేశించారు. నిద్రపోతున్న రమాదేవిని నలుగురు కలిసి గొంతు నులిమి చంపేశారు. అయితే దీనిని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు నోట్లో వాస్మోల్ పోసి అందరూ అక్కడి నుంచి Ððవెళ్లిపోయారు. -
రక్త సంబంధాలు
మాయమై పోతున్నడమ్మా.. మనిషన్నవాడు.. మచ్చుకైనా లేదు చూడు మానవత్వము నేడు.. అన్న ఓ ప్రజాకవి మాటలు అనునిత్యం అక్షరసత్యాలే. నేటి నవ నాగరిక సమాజంలో మానవత్వం మంట గలిసిపోతోంది. రక్త సంబంధాలు రక్తపుటేరులు పారిస్తున్నాయి. తన రక్తాన్ని పాలుగా మార్చి బిడ్డ ఆకలిదప్పులు తీర్చి కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన మాతృమూర్తినే కడతేరుస్తున్న కసాయి కొడుకులు పుట్టుకొస్తున్నారు. వేలు పట్టుకుని నడకతో పాటు నడ తనూ నేర్పి కొడుకును ప్రయోజకుడిని చేయాలని త పించిన తండ్రినే విచక్షణారహితంగా తుదముట్టిస్తున్న కర్కోటకపు కుమారులూ కోకొల్లలుగా కనిపిస్తున్నారు. ఒకే రక్తం పంచుకుపుట్టిన అన్నదమ్ములు సైతం ఆస్తికోసం.. అంతస్తుల కోసం పగలు.. ప్రతీకారాలతో రగిలిపోతూ ప్రాణాలు తీసుకునేంత తీవ్ర స్థాయికి వెళ్తున్నారు. ఇలాంటి సంఘటనలు పరిశీలిస్తే ఏమైపోతోంది మానవత్వం.. ఎటువెళుతోంది సమాజం అనిపిస్తుంది. మానవతకే మచ్చ తెస్తున్న ‘రక్త’సంబంధాలపై ప్రత్యేక కథనం.. కడప క్రైం : సమాజంలో రోజురోజుకు రక్తసంబంధాలు బలహీనంగా మారుతున్నా యి. ప్రజల్లో వ్యక్తిగత స్వార్థం ఎక్కువై.. ఆస్తులు, డబ్బే ముఖ్యమై బంధాల్నే దూ రం చేసుకునే దుస్థితి నెలకొంది. తల్లీ, తండ్రీ, అన్నాదమ్ములనే బేధాలు లేకుండా దారుణంగా హత్యలు చేస్తున్నా రు. విచక్షణ మరిచి నిమిషాల్లోనే నిండు ప్రాణాలను బలి తీసుకుంటూ కటకటాల పాలవుతున్నారు. ఇటీవల జిల్లా లో చోటు చేసుకున్న సంఘటనలు మా యమైపోతున్న మని షిని ఎక్కడా అని అడుగుతున్నాయి. మచ్చుకైనా కానరాని మానవత్వాన్ని వెదుకుతున్నాయి. ఆస్తికోసం కత్తిదూసిన వైనం.. కడప అర్బన్ సర్కిల్ పరిధిలోని తాలూ కా పోలీసుస్టేషన్ పరిధిలో నివసించి న తీట్ల రోజమ్మ (70) అనే వృద్ధురాలిని కుమారుడు బెంజిమన్ గతేడాది డిసెంబర్లో ఇంట్లోనే హత్య చేశాడు. వృద్ధాప్య దశలో ఆప్యాయంగా చూసుకోవాల్సిన తల్లిని తన దురలవాట్లకు డబ్బులివ్వలేదని హత్య చేసి కటకటాలపాలయ్యాడు. ఈ నెల 23న ఆస్తి తగాదాలు, మోటారు సైకి ల్ వివాదంపై కుటుంబంలో పెద్ద కుమారుడు సాదత్ అలీఖాన్ తన తమ్ముడు దావూద్ అలీఖాన్‌ను కత్తిపోటుతో హత్య చేశాడు.