నిస్వార్థ సేవకు నిదర్శనం లైఫ్ సభ్యులు
నిస్వార్థ సేవకు నిదర్శనం లైఫ్ సభ్యులు
Published Wed, Oct 19 2016 12:15 AM | Last Updated on Mon, Sep 4 2017 5:36 PM
– జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ
బేతంచెర్ల : నేత్రదానం ద్వారా అంధులకు వెలుగును ప్రసాదిస్తున్న బేతంచెర్ల లైఫ్ సభ్యులు నిస్వార్థసేవకు నిదర్శనంగా నిలుస్తున్నారని జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ అన్నారు. మంగళవారం స్థానిక శేషారెడ్డి ఉన్నత పాఠశాల్లో లైఫ్ ఆధ్వర్యంలో లైఫ్ గౌరవాధ్యక్షులు గౌరు హుసేన్‌రెడ్డి, రవి, ప్రతాప్‌రెడ్డి అధ్యక్షతన ఎస్పీ సమక్షంలో 130 మంది నేత్రదాతల కుటుంబ సభ్యులను ఘనంగా సత్కరించారు. దాదాపు 150 మంది నేత్రాలు దానం చేయించడం అభినందనీయమని ఎస్పీ పేర్కొన్నారు. బేతంచెర్ల లైఫ్ సభ్యుల ఉత్సాహం చూస్తుంటే తాను కూడా ఇక్కడే ఉండి సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలనిపిస్తోందన్నారు. ఈ సందర్భంగా అన్నపూర్ణ అనాథ ఆశ్రమం నిర్వహణకు పారిశ్రామికవేత్త గౌరు హుసేన్‌రెడ్డి రూ, 5 లక్షలు, క్రిష్ణమూర్తి రూ,25,000, కందగడ్డల మోహన్‌రావు రూ,25, 000, జబ్బార్ జవేద్ రూ. 33,000, చంద్రశేఖర్‌రెడ్డి రూ,10,000ను ఎస్పీ చేతుల మీదుగా అందజేశారు. ఆశ్రమంలోని చిన్నారులతో కలిసి ఎస్పీ భోజనం చేశారు. రెడ్ క్రాస్ చైర్మన్ శ్రీనివాసులు, డీఎస్పీ మురళీధర్, ఎంపీడీవో నాగరాజు నాయుడు, సీఐ సుబ్రమణ్యం , ఎస్‌ఐ తిరుపాలు, పట్టణ పారిశ్రామిక వేత్తలు మూర్తుజావలి, తెలుగు రమణ,గుండా గోపాలు, గుండా జగన్, మాణిక్యం, నాగసురేంద్ర, వన్నూర్ బాషా పాల్గొన్నారు.
Advertisement
Advertisement