arudra
-
రూ. 2 వేల కోట్లకు పైగా మోసం కేసులో సినీ నటుడు,నిర్మాత
తమిళనాడులో ఆరుద్రా గోల్డ్ పెట్టుబడుల విషయంలో రూ. 2,438 కోట్లకు పైగా మోసాలకు పాల్పడిన ఘటన కొన్ని నెలల క్రితం సంచలనం రేపింది. ఈ కేసులో కోలీవుడ్ నటుడు ఆర్కే సురేష్‌కు కూడా సంబంధం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో కొన్ని నెలల అనంతరం దుబాయ్ నుంచి చైన్నెలో ఆర్కే సురేష్ అడుగు పెట్టాడు. ఆయన్ని అధికారులు విమానాశ్రయంలో ప్రశ్నించారు. ఆర్థిక నేర విభాగం పోలీసుల విచారణకు నేడు హాజరు కానున్నట్టు సురేష్ వెల్లడించారు. వివరాలు.. చైన్నె కేంద్రంగా రాష్ట్రంలో ఆరుద్రా గోల్డ్ పెట్టుబడుల పేరిట రూ. 2,438 కోట్లకు పైగా మోసాలకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ కేసులో కీలక నిందితులను ఆర్థిక నేర విభాగం పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద జరిపిన విచారణలో బీజేపీ నేతల పేర్లు తెర మీదకు వచ్చాయి. ఆరుద్రా గోల్డ్‌లో డైరెక్టర్లుగా ఉన్న వాళ్లు బీజేపీకి చెందిన వారుగా తేలడంతో విచారణ వేగం పుంజుకుంది. అదే సమయంలో ఈ కేసుతో సినీ నటుడు ఆర్కే సురేష్‌కు సంబంధాలు ఉన్నట్టు వెలుగు చూశాయి. దీంతో ఆయన్ని విచారించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేశారు. అయితే విదేశాలలో షూటింగ్ బిజి పేరిట ఆయన తప్పించుకునే ప్రయత్నం చేశారు. కొన్ని నెలల పాటు ఆయన విదేశాలలోనే ఉండి పోయారు.ముందస్తు బెయిల్ ప్రయత్నాలు, ఈ కేసుతో తనకు సంబంధం లేదని చాటుకునేందుకు విశ్వ ప్రయత్నాలను చేశారు. చివరకు ఆయనకు వ్యతిరేకంగా లుక్ అవుట్ నోటీసును చైన్నె ఆర్థిక నేర విభాగం పోలీసులు జారీ చేశారు. ఈ పరిస్థితుల్లో కొన్ని నెలల అనంతరం దుబాయ్ నుంచి చైన్నెకు సురేష్ వచ్చారు. చైన్నె విమానాశ్రయంలో అడుగు పెట్టిన ఆయన్ను ఇమిగ్రేషన్ అధికారులు విచారణ జరిపారు. తాను చైన్నె ఆర్థిక నేర విభాగం పోలీసుల విచారణకు హాజరయ్యేందుకే ఇక్కడకు వచ్చినట్టు వారికి వివరించారు. విచారణ అనంతరం చైన్నెలోకి ఆయన్ని అనుమతించారు. విమానాశ్రయం నుంచి తన ఇంటికి చేరుకున్న ఆర్కే సురేష్ డిసెంబర్ 12న చైన్నె ఆర్థిక నేర విభాగం పోలీసుల విచారణకు హాజరవుతారు. ఎవరీ ఆర్.కె. సురేష్ ఆర్.కె. సురేష్ సినీ నిర్మాత, సినిమా నటుడు. ఆయన స్టూడియో 9 నిర్మాణ సంస్థకు అధిపతి. సురేశ్ 2015లో తారై తప్పట్టై సినిమా ద్వారా నటుడిగా అరంగ్రేటం చేశాడు. ఆయన ప్రస్తుతం తమిళనాడు బీజేపీ ఒబిసి విభాగానికి ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు. డిస్ట్రిబ్యూటర్‌గా కూడా ఆయన పలు సినిమాలకు భాగం పంచుకున్నాడు. తెలుగులో విశాల్ రాయుడు చిత్రంతో పాటు విక్రమ్ స్కెచ్ మూవీలో కనిపించాడు. ఆపై కాశి, రాజా నరసింహా చిత్రాల్లో మెప్పించాడు. -
ఆమె ప్రతి అక్షరం స్త్రీ పక్షం
తెలుగు సాహిత్యలోకం నుంచి రచయిత్రి కె.రామలక్ష్మి (92) వీడ్కోలు తీసుకున్నారు. రచయిత్రిగా, ఆరుద్ర సతీమణిగా, మద్రాసు (చెన్నై) నగరంలో తెలుగువారి ప్రతినిధిగా, నాటి సాహితీ సమూహాలలో కీలకమైన వ్యక్తిగా, సినిమా రంగంలో రచయిత్రిగా ఆమె సాగించిన యాత్ర సుదీర్ఘమైనది. ఆమె మరణంతో ఒక కాలపు తెలుగు సాహితీ చరిత్రకు మిగిలిన ఆఖరు సాక్షి లేకుండా పోయినట్టయ్యింది. ప్రముఖ రచయిత ఆరుద్ర సతీమణి కె.రామలక్ష్మి (92) కన్నుమూశారు. కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. శుక్రవారం హైదరాబాద్‌లోని ఆస్మాన్‌ఘడ్‌లో ఉన్న నివాసంలో తుదిశ్వాస విడిచారు. రామలక్ష్మి ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా కోటనందూర్‌లో 1930 డిసెంబర్ 31న జన్మించారు. మద్రాస్ విశ్వవిద్యాలయంలో బీఏ పూర్తిచేశారు. ఆంగ్ల, ఆంధ్ర సాహిత్యం, ప్రాచీనాంధ్ర సాహిత్యం అభ్యసించారు. 1954లో ప్రముఖ కవి ఆరుద్రను వివాహం చేసుకున్నారు. వీరికి ఐదుగురు కుమార్తెలు. 1951 నుంచే రామలక్ష్మి రచనా ప్రస్థానం మొదలైంది. వివాహమైన తర్వాత ‘రామలక్ష్మి ఆరుద్ర’ కలం పేరుతో రచనలు చేశారు. మొత్తం 100 కు పైగా పుస్తకాలు రాశారు. ఆంధ్రపత్రికలో ఆమె సుదీర్ఘకాలం నిర్వహించిన ‘ప్రశ్న జవాబు’ శీర్షిక ప్రసిద్ధి చెందింది. విడదీసే రైలుబళ్లు, అవతలిగట్టు, మెరుపుతీగె, తొణికిన స్వర్గం, మానని గాయం, ఆణిముత్యం, పెళ్లి, ప్రేమించు ప్రేమకై, ఆడది, ఆశకు సంకెళ్లు, కరుణ కథ, లవంగి, ఆంధ్ర నాయకుడు, పాండురంగని ప్రతిజ్ఞ, నీదే నా హృదయం, అద్దం, ఒక జీవికి స్వేచ్ఛ వంటి కథా సంకలనాలను రామలక్ష్మి రచించారు. తెలుగు సాహిత్య రంగానికి చేసిన సేవలకుగాను ఆమెకు గృహలక్ష్మి, స్వర్ణకంకణం సహా పలు ప్రతిష్టాత్మక పురస్కారాలు దక్కాయి. ఉత్తమ రచయిత్రిగా నంది అవార్డు... రామలక్ష్మి పలు సినిమాలకు కథలు అందించారు. 1975వ సంవత్సరంలో జీవనజ్యోతి సినిమా కథకు గాను అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది అవార్డు అందుకున్నారు. కాసా సుబ్బారావు నిర్వహించిన స్వతంత్ర దినపత్రికలో జర్నలిస్టుగా పనిచేశారు. 1978లో ఉత్తమ జర్నలిస్టుగా రామానాయుడు అవార్డు అందుకున్నారు. పలు స్త్రీ సంక్షేమ సంఘాల్లో సేవలు అందించి మహిళల శ్రేయస్సు కోసం పాటుపడ్డారు. కేంద్ర ఫిల్మ్ సెన్సార్ బోర్డ్ రీజనల్ ప్యానెల్ సభ్యురాలిగా కూడా పనిచేశారు. రామలక్ష్మి ఆరుద్ర మృతిపట్ల పలువురు రచయితలు, సినీ, రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు సంతాపం తెలిపారు. శుక్రవారం సాయంత్రమే ఎస్ఆర్నగర్ శ్మశానవాటికలో ఆమె అంత్యక్రియలను నిర్వహించారు. స్టెల్లా మేరీ స్టూడెంట్ స్వస్థలం కాకినాడ అయినా కె.రామలక్ష్మి చదువు చెన్నైలోనే సాగింది. స్టెల్లా మేరీ కాలేజీలో చదువుకుని ఇంగ్లిష్ భాషలో పట్టు సాధించారు. ‘ఐ యామ్ ఏ స్టెల్లామేరియన్’ అని గర్వంగా చెప్పుకునేవారు. కాలేజీలో ఒక కార్యక్రమానికి అతిథిగా హాజరైన ప్రఖ్యాత జర్నలిస్టు ఖాసా సుబ్బారావు ఇంగ్లిష్‌లో ఉపన్యాసం ఇచ్చిన కె.రామలక్ష్మిని చూసి పరీక్షలు అయిపోయాక తనని కలవమని చెప్పారు. ‘స్వతంత్ర’ పత్రికలో ఇంగ్లిష్ విభాగంలో పాత్రికేయురాలిగా ఉద్యోగం ఇచ్చారు. ‘తెలుగు స్వతంత్ర’కు ఎడిటర్‌గా ఉన్న ఖాసా సుబ్బారావు కోరిక మేరకు ‘నడుస్తున్న చరిత్ర’ కాలమ్ రాశారు రామలక్ష్మి. ఆమె ఇంటిలో ప్రతి సాయంత్రం సాహితీచర్చలు జరిగేవి. వాటికి ఆరుద్ర, శ్రీరంగం నారాయణబాబు, శ్రీశ్రీ తదితరులు హాజరయ్యేవారు. ఆరుద్ర, రామలక్ష్మి పరస్పరం ఇష్టపడి ఆ రోజుల్లో అంటే 1954ఏప్రిల్30న రిజిస్టర్డ్ మేరేజీ చేసుకున్నారు. ఈ పెళ్లికి దర్శకుడు హెచ్.ఎం.రెడ్డి, శ్రీశ్రీ సాక్షి సంతకాలు చేశారు. శ్రీశ్రీ తన పెళ్లికి సాక్షి సంతకం చేయాలని ఆరుద్ర భావించడం వల్ల ఇది జరిగింది. శ్రీశ్రీ రామలక్ష్మిని ‘అత్తగారు’ అని సరదాగా పిలిచేవారు. అయితే శ్రీశ్రీ ధోరణిని రామలక్ష్మి చివరి వరకూ వ్యతిరేకిస్తూనే వచ్చారు. ఆరుద్రకు అండా దండా ఆరుద్ర సినిమా రంగంలో కృషి చేయడానికి, ‘సమగ్రాం«ధ్ర చరిత్ర’ పరిశోధన పూర్తి చేయడానికి రామలక్ష్మి అందించిన అండదండలే కారణం. వీరికి ఐదుగురు కుమార్తెలు విజయ, త్రివేణి, కవిత, లలిత, వాసంతి. వీరి పెంపకం, చదువు బాధ్యతలకోసం ఆరుద్ర సమయాన్ని తీసుకోకుండా ఆమే తన సమయమంతా వెచ్చించారు. ‘ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్యం కోసం విపరీతంగా సమయం ఇవ్వాలనుకునేవాడు. కాని ఇల్లు గడవాలి కదా. సినిమా రంగంలో పని చేస్తేనే డబ్బులు వస్తాయి. అందుకని నేనేమి అనకుండా గబగబా కొన్ని పాటలు రాసేసి ఆ డబ్బు అప్పజెప్పి మళ్లీ పరిశోధనలో పడేవాడు’ అన్నారు రామలక్ష్మి. ఆరుద్రకు అనారోగ్యం వస్తే నాటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డితో మాట్లాడి ప్రభుత్వ సహాయం అందేలా చూశారామె. ‘నేను మరణించినప్పుడు ఎటువంటి హంగామా చేయవద్దు’ అని ఆరుద్ర కోరడం వల్ల 1998లో ఆరుద్ర మరణించినప్పుడు కేవలం ముగ్గురు నలుగురు స్నేహితులతో కలిసి అంత్యక్రియలు నిర్వహించి ఆ తర్వాతే మరణవార్తను లోకానికి తెలియచేశారు. ఇది సాహిత్య ప్రియులను బాధించినా రామలక్ష్మి ధోరణి అలాగే ఉండేది. సినిమా రచయిత్రి కె.రామలక్ష్మికి సినిమా రంగంలో అందరూ సుపరిచితులు స్నేహితులు. వారిలో భానుమతి రామకృష్ణ, జయలలిత, వాణిశ్రీ తదితరులు ఉన్నారు. కె.విశ్వనాథ్ తీసిన ‘జీవనజ్యోతి’ సినిమాకు రామలక్ష్మి కథను అందించారు. ఈ సినిమా నిజానికి వాణిశ్రీ కోసమే రాశారు. కె.రామలక్ష్మి రాశారని వాణిశ్రీ నటించారు. దీని నిర్మాణ సమయంలో విశ్వనాథ్‌కు, రామలక్ష్మికి వాదోపవాదాలు నడిచాయి. దాంతో కె.విశ్వనాథ్ విజయవాడలో జరిగిన శతదినోత్సవంలో ‘ఇకపై ఇతరులు రాసిన కథలతో నేను సినిమాలు తీయను’ అని ప్రకటించారు. రామలక్ష్మి రాసిన మరో సినిమా ‘గోరింటాకు’. అయితే దీని మీద ఆ రోజుల్లో వివాదం చెలరేగింది. దాసరి నారాయణరావు స్టోరీ డిపార్ట్మెంట్లో తెర వెనుక ఉండి పని చేసిన వారిలో రామలక్ష్మి కూడా ఒకరు. ఆమె 1970లలో సెన్సార్ బోర్డ్ మెంబర్‌గా పని చేశారు. స్త్రీ పక్షపాతి రామలక్ష్మి నిత్య జీవితంలోనే కాదు రచనా జీవితంలోనూ ఆధునికురాలు. ఛాందసాలు లేని జీవనం గడపాలని, భార్యాభర్తలు స్నేహమయ జీవనాన్ని అనుభవించాలని, స్త్రీలకు తమ జీవిత భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛ ఉండాలని ఆ రోజుల్లోనే తన కథలలో చెప్పారామె. 1954లో ఆమె తన తొలి కథా సంపుటి ‘విడదీసే రైలుబళ్లు’ వెలువరించారు. ఈ సంపుటిలోని ‘చీలిన దారులు’ అనే కథలో ఒక జంట పెళ్లి చేసుకోకుండా సహజీవనం ప్రారంభిస్తారు. పెళ్లి ప్రేమను చంపేస్తుంది అని ఆ కథలో రాసి అప్పటికి తెలియని సహజీవనాన్ని ప్రతిపాదించారామె. ‘తొణికిన స్వప్నం’, ‘ఒక జీవికి స్వేచ్ఛ’, ‘అద్దం’ తదితరాలు ఆమె ఇతర కథా సంపుటాలు. భార్యాభర్తలు స్నేహితులుగా ఉండాలని సూచిస్తూ 1970లలో ఆమె రాసిన ‘పార్వతి కృష్ణమూర్తి కథలు’ పాఠకాదరణ పొందాయి. ఇందులో భార్య అరమరికలు లేకుండా భర్తతో తన అభిప్రాయాలను చెబుతుంది. స్నేహాన్ని, చొరవను ప్రదర్శిస్తుంది. భార్యంటే భర్త చెప్పినట్టుగా పడుండాలనే నాటి ధోరణికి ఈ పాత్ర పూర్తి భిన్నం. రామలక్ష్మి రాసిన కథల్లో ‘అదెక్కడ’ విశిష్టమైనది. ఆ కథలో ముఖ్యపాత్ర తన పేరు మర్చిపోతుంది. దాని కారణం భర్త, పిల్లలు అందరూ ‘అది’ అని పిలుస్తూ ఉండటమే. చివరకు ఆమె ఒకరోజు ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది. భర్త ‘అదెక్కడ’ అని ఎందరిని అడిగినా కనిపించదు. పురుషుడు మోసం చేస్తే స్త్రీ సింగిల్ మదర్‌గా జీవించగలదనే సందేశం ఇస్తూ కథలు రాశారు. బేలగా ఉండే స్త్రీలను అలాంటి పాత్రలను రామలక్ష్మి హర్షించలేదు. స్త్రీలు ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా తమ జీవితాన్ని మలుచుకోవాలని కోరుతారు. ఆమె రచనలను ఈ తరానికి మళ్లీ చేరువ చేయాల్సి ఉంది. -
ప్రముఖ రచయిత్రి కె.రామలక్ష్మి మృతి పట్ల సీఎం జగన్ సంతాపం
సాక్షి, అమరావతి: ప్రముఖ రచయిత్రి కె.రామలక్ష్మి మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. రామలక్ష్మి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రముఖ రచయిత ఆరుద్ర సతీమణి, రచయిత్రి కె.రామలక్ష్మి శుక్రవారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. హైదరాబాద్‌లోని మలక్‌పేటలో నివాసముంటున్న ఆమె వయోభారంతో కన్నుమూశారు. 1930 డిసెంబర్ 31న తూర్పు గోదావరి జిల్లాలోని కోటనందూరులో ఆమె జన్మించారు. మద్రాసు విశ్వవిద్యాలయంలో బీఏ పట్టా పుచ్చుకున్నారు. 1951 నుంచి రచనలు ప్రారంభించారు. ఆమె కలం నుంచి విడదీసే రైలుబళ్లు, మెరుపు తీగె, అవతలిగట్టు, ఆంధ్రనాయకుడు వంటి ఎన్నో రచనలు జాలువారాయి. చదవండి: దిగ్గజ రచయిత ఆరుద్ర సతీమణి కన్నుమూత -
దిగ్గజ రచయిత ఆరుద్ర సతీమణి కె.రామలక్ష్మి కన్నుమూత
ప్రముఖ రచయిత ఆరుద్ర సతీమణి, రచయిత్రి కె.రామలక్ష్మి శుక్రవారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. హైదరాబాద్‌లోని మలక్‌పేటలో నివాసముంటున్న ఆమె వయోభారంతో కన్నుమూశారు. 1930 డిసెంబర్ 31న తూర్పు గోదావరి జిల్లాలోని కోటనందూరులో ఆమె జన్మించారు. మద్రాసు విశ్వవిద్యాలయంలో బీఏ పట్టా పుచ్చుకున్నారు. 1951 నుంచి రచనలు ప్రారంభించారు. ఆమె కలం నుంచి విడదీసే రైలుబళ్లు, మెరుపు తీగె, అవతలిగట్టు, ఆంధ్రనాయకుడు వంటి ఎన్నో రచనలు జాలువారాయి. 1954లో కవి ఆరుద్రతో రామలక్ష్మి వివాహం జరిగింది. ఆరుద్ర మోసగాళ్లకు మోసగాడు సినిమాకు కథ అందించగా ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. మీనా, దేవదాసు సినిమాలకు కూడా రచనాపరంగా ఆరుద్ర సహాయం చేశారు. కె.రామలక్ష్మి సెన్సార్ బోర్డ్ మెంబర్‌గానూ పని చేశారు. ఈ దంపతులు తెలుగు సాహితీరంగానికి ఎనలేని సేవ చేశారు. వీరికి ముగ్గురు కుమార్తెలు. -
అధైర్య పడొద్దు.. అన్ని విధాల ఆదుకుంటాం
లబ్బీపేట(విజయవాడతూర్పు): తన కుమార్తె వైద్య ఖర్చుల కోసం ఏనాడు ప్రభుత్వాన్ని సాయం కోరలేదని, ముఖ్యమంత్రిని కలవలేక పోతున్నాననే ఆవేదన, క్షణికావేశంలో మాత్రమే చేతికి గాయం చేసుకున్నట్లు కాకినాడ రూరల్ మండలం రాయుడుపాలేనికి చెందిన ఆరుద్ర తనను కలిసిన ఉన్నతాధికారులకు తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం సమీపాన తన చేతికి గాయం చేసుకుని విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న రాజులపూడి ఆరుద్రను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు గురువారం ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి ఎం.హరికృష్ణ, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు, సీపీ కాంతి రాణా టాటా పరామర్శించారు. ఆరుద్ర, ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి, సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం న్యాయం చేస్తుందని ధైర్యంగా ఉండాలని సీఎం చెప్పారని, ఆయన ఆదేశాల మేరకే తాము వచ్చినట్లు తెలిపారు. కాగా నిస్సహాయురాలైన ఓ మహిళ తన సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావడంకోసం ప్రయత్నిస్తే ఆ ఉదంతాన్ని కూడా రాజకీయంగా ఉపయోగించుకోవడానికి ఎల్లో మీడియా ప్రయత్నించడం చూసి జనం విస్తుపోతున్నారు. ఆరుద్రను కలసిన అనంతరం కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని చెప్పారు. ఆరుద్ర కుమార్తె సాయి లక్ష్మికి మూడు నెలల వయసులోనే స్పైనల్ వ్యాధికి ఆపరేషన్ జరిగిందని, కొంతకాలం ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నా, తర్వాత తిరిగి అనారోగ్యానికి గురవడంతో వెల్లూరు, లక్నో వంటి అనేక ప్రాంతాల్లో వైద్యం చేసినా మెరుగుపడలేదన్నారు. అమెరికాలో అధునాతన వైద్యం చేయిస్తే కోలుకోవచ్చని కొందరు వైద్యులు చెప్పినట్లు తెలిపారు. కుమార్తె వైద్య ఖర్చుల కోసం అమలాపురంలో ఉన్న తమ ఆస్తులను రూ.62 లక్షలకు విక్రయించినట్లు ఆరుద్ర చెప్పారని కలెక్టర్ పేర్కొన్నారు. శంఖవరం మండలం అన్నవరంలోని తన ఇంటిని అమ్మడానికి ప్రయత్నిస్తే ఇరువైపులా ఉన్న కానిస్టేబుళ్లు శివయ్య, కన్నయ్య, ముత్యాలరావులు అడ్డుపడటమే కాకుండా, న్యాయపరమైన చిక్కులు సృష్టించారని, వారిపై 2020లో జిల్లా ఎస్పీకి, ఆ తర్వాత కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా, చర్యలు తీసుకున్నారని తెలిపినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో తన కుమార్తెకు విదేశాల్లో వైద్యం అందించలేక పోతున్నాననే బాధతో సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావాలని ప్రయత్నించినట్లు ఆరుద్ర తెలిపారని పేర్కొన్నారు. గత నెల 31న ఎ–కన్వెన్షన్ హాలు వద్ద సీఎంను కలిసేందుకు ప్రయత్నించగా, భద్రతా కారణాల వలన పోలీసులు అనుమతించలేదన్నారు. ఈ నెల 2న కుమార్తెతో కలిసి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకుని అధికారులను కలవగా, సమస్య కోర్టు పరిధిలో ఉందని, పౌర సమస్యలను స్థానికంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారని ఆమె తెలిపినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రిని కలవలేక పోయాననే మనస్తాపంతోనే ఆవేశంలో చేతికి గాయం చేసుకున్నానని ఆరుద్ర వివరించిందని తెలిపారు. కుమార్తె అనారోగ్యం వల్ల 2018లో గ్రూప్–2 ఉద్యోగానికి ఎంపికైనా చేరలేక పోయానని, తన ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మానవతా దృక్ఫథంతో మరొకసారి అవకాశం కల్పించాలని ఆరుద్ర కోరినట్లు కలెక్టర్ తెలిపారు. -
Photo Story: కుండపోత వాన, పర్యాటకుల సందడి, ఆరుద్ర ఆగమనం
వర్షాల కోసం భీంసన్ దేవుడికి పూజలు బేల(ఆదిలాబాద్): మండలకేంద్రంలోని ఆదివాసీ పర్దాన్లు వర్షాలు సమృద్ధిగా పడాలని ఆదివారం భీంసన్ దేవుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు కుటుంబ సభ్యులతో కలిసి శోభాయాత్ర నిర్వహించారు. స్థానిక ఇందిరా నగర్‌కాలనీలో భీంసన్ దేవుడికి ప్రత్యేక పూజలు చేసి, నైవేద్యం సమర్పించారు. కుండపోత వర్షం వేములవాడ : వేములవాడలో ఆదివారం సాయంత్రం ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఈదురుగాలుల కారణంగా సెస్ అధికారులు విద్యుత్ సరఫరా నిలిపి వేశారు. పలు గ్రామాల్లో పత్తి చెళ్లలో వర్షపు నీరు నిలిచింది. ఇల్లంతకుంట మండలంలోని పొత్తూరు–కందికట్కూర్ గ్రామాల మధ్య ఉన్న సుద్ద ఒర్రె ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలకు నిలిచిపోయాయి. కుంటాల జలపాతం వద్ద పర్యాటకుల సందడి వరుసగా కురుస్తున్న వర్షాలకు ఆదిలాబాద్ జిల్లాలోని కుంటాల, పొచ్చెర జలపాతాలు జలకళను సంతరించుకున్నాయి. లాక్డౌన్ కారణంగా పర్యాటకులను అనుమతించకపోవడంతో ఇన్ని రోజులు నిర్మానుష్యంగా ఉన్నాయి. అయితే ప్రస్తుతం కరోనా ఆంక్షలు ఎత్తివేయడం, ఆదివారం కలిసి రావడంతో హైదరాబాద్, మహారాష్ట్ర నుంచి పర్యాటకులు తరలివచ్చారు. జలపాతం వద్ద స్నానాలు చేస్తూ.. సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ ఆరుద్ర.. ఆగమనం ఏడాది మొత్తంలో ఆరుద్రకార్తెలో మాత్రమే ఆరుద్ర పురుగులు దర్శనమిస్తాయి. ఆరుద్ర కార్తెకు రైతులకు అవినాభావ సంబంధం ఉంది. ఈ పురుగుల ఆగమనాన్ని అన్నదాతలు శుభసూచకంగా భావిస్తారు. ఆదివారం నెన్నెల శివారులోని చేన్లలో ఆరుద్ర పురుగులు దర్శనమిచ్చాయి. దీంతో ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా పడి, పంటలు బాగా పండుతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. – నెన్నెల విరబూసిన ‘బ్రహ్మ కమలం’ రెబ్బెన(ఆసిఫాబాద్): అత్యంత అరుదుగా కనిపించే బ్రహ్మకమలం రెబ్బెన మండలంలోని గోలేటి టౌన్షిప్లో దర్శనమిచ్చింది. బెల్లంపల్లి ఏరియాలోని ఏరియా వర్క్‌షాప్ డీజీఎంగా పనిచేస్తున్న శివరామిరెడ్డి నివాసంలో ఈ బహ్మకమలం వికసించింది. కొద్ది గంటలు మాత్రమే పూర్తిగా వికసించే ఈ పుష్పం ఆపై ముడుచుకుంటుంది. శివరామిరెడ్డి సతీమణి సృజన మాట్లాడుతూ సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే బ్రహ్మకమలం వికసిస్తుందని తెలిపారు. అలాంటి అరుదైన పుష్పం పూయటం అదృష్టంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. -
తాదుర్దా
‘ఆంధ్రరత్న’ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఓసారి ప్రయాణానికి జట్కా మాట్లాడుకున్నారు. అయితే, ముందువైపు బరువు చాలక జట్కాతోలే మనిషికి ఇబ్బంది అయింది. అందుకే, ‘కొంచెం పైకి రండి సార్’ అన్నాడు. దానికి దుగ్గిరాల ముచ్చటగా– ‘ఇంతకాలానికి నువ్వొక్కడివి దొరికావురా, ఆంధ్రదేశంలో తోటి ఆంధ్రుడిని పైకి రమ్మన్నవాడివి’ అని చమత్కరించాడట. తాపీ ధర్మారావు, ఆరుద్ర కొన్ని సినిమాలకు కలిసి రాశారు. టైటిల్స్‌లో వాళ్ల పేర్లు ‘తాపీ, ఆరుద్ర’ అని పడినప్పుడు, ఆరుద్ర అందుకున్న చమత్కారం ఇది: ‘ఒకరు తాపీ, మరొకరు ఆదుర్దా.’ -
ఉభయభాషా ప్రవీణుడు
మొక్కపాటి నరసింహశాస్త్రి, మునిమాణిక్యం నరసింహారావు, భమిడిపాటి కామేశ్వరరావు, జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రి (ఈయన జరుక్ శాస్త్రిగా ప్రసిద్ధులు)– వీరందరూ ఆధునిక ఆంధ్రసాహిత్యంలో హాస్యరస సామ్రాజ్యానికి చక్రవర్తులు. పరస్పరం గౌరవాభిమానాలు కలిగినవారు. ఒకే కవి కుటుంబంగా మెలగినవాళ్లు. అన్నింటినీ మించి హాస్యసంభాషణా చతురులు. ఒకరోజున ఏదో శుభకార్యాన్ని పురస్కరించుకొని అందరూ మునిమాణిక్యం వారి ఇంట్లో కలుసుకొన్నారు. అక్కడికి శ్రీశ్రీ, ఆరుద్ర కూడా వచ్చారు. సరదా సరదా కబుర్లతోనూ, ఛలోక్తులతోనూ భోజనాలు పూర్తి ఐనై. అందరూ పెద్ద వసారాలోకి వచ్చి కూర్చొని పిచ్చాపాటీ మాట్లాడుకొంటున్నారు. మునిమాణిక్యం ఒక పెద్ద పళ్లెంలో సిగరెట్లు, చుట్టలు పెట్టుకొని వచ్చారు. ‘‘అయ్యా! ఎవరికి ఏవి కావాల్నో వాటిని తీసుకోండి. మొహమాట మేమీ పడబోకండి’’ అన్నారు. ‘అట్లాగే’ నంటూ ఒక్కొక్కళ్లు ఎవరి కేది ఇష్టమో దానిని తీసుకొంటున్నారు. పళ్లెం జరుక్ శాస్త్రి దగ్గరకు వచ్చింది. ఆయన ‘నేను ఉభయభాషా ప్రవీణుడిని’ అంటూ ఒక సిగరెట్టునూ, ఒక చుట్టనూ తీసుకొన్నారు. తీసుకొని అందరి వైపు చిద్విలాసంగా చూశారు. అందరి ముఖాలూ నవ్వుల పువ్వులైనై. డాక్టర్ పోలేపెద్ది రాధాకృష్ణమూర్తి -
టచ్ చేసే చిత్రం
ప్రస్తుతం మహిళలకు ఇంటా, బయటా రక్షణ లేకుండా పోయింది. ఎక్కువశాతం మంది శారీరక, మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ అంశాలను ఆధారంగా చేసుకుని తమిళంలో రూపొందిన చిత్రం ‘ఆరుద్ర’. పా.విజయ్, కె.భాగ్యరాజ కీలక పాత్రల్లో, మేఘాలీ, దక్షిత, సోనీ, సంజన సింగ్ హీరోయిన్లుగా నటించారు. పా. విజయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలందుకుంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని ‘ఆరుద్ర’ పేరుతో వరకాంతం సునీల్ రెడ్డి సమర్పణలో జె.ఎల్.కె. ఎంటర్ప్రైజెస్ తెలుగులోకి అనువదిస్తోంది. ‘‘ఈ సినిమాలో పిల్లలకు, పేరెంట్స్‌కు మంచి సందేశం ఇచ్చారు. గుడ్ అండ్ బ్యాడ్ టచ్ గురించి అందరికీ అర్థమయ్యేలా బాగా చూపించారు. ప్రస్తుతం వెన్నెలకంటిగారి పర్యవేక్షణలో అనువాద కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు సునీల్ రెడ్డి. ఈ చిత్రానికి సంగీతం: విద్యాసాగర్. -
కాపీరైట్ నాది బ్రదర్!
సినిమా కష్టాలు అనే మాట వాడుతుంటాం. ఆ కష్టాల్లో కూడా రకరకాలు ఉంటాయి. అలాంటి ఒక కష్టాన్ని ఆరుద్ర తన ‘సినీ మినీ కబుర్లు’లో పంచుకున్నారు. చిన్నప్పుడు పిల్లలు పొలానికి వెళ్లినప్పుడు, అందులో ఒకడు ‘ఈ చెట్టు పళ్లు నావిరోయ్’ అనేస్తే మిగతావారు విధిగా ఆ చెట్టును వదిలేసి వేరేది చూసుకుంటారు. అదొక రాయబడని చట్టం. ఈ సరదా ఘటన కూడా అలాంటిదే. ‘‘ఒకనాడు నేను పాండిబజారులోని రాజకుమారి టాకీసులో ఆడుతున్న ఒక ఇంగ్లీషు సినిమాకి ఒక ప్రొడ్యూసర్ బలవంతం మీద రెండోసారి వెళ్లాను. ఇంటర్వెల్లో జూనియర్ సిగరెట్ తాగుతూ కనబడ్డాడు. ‘‘బ్రదర్! ఇది నువ్వు ఎడాప్ట్ చేయాలనుకుంటున్నావేమో! నేను రిజర్వు చేసుకున్నాను’’ అని జూనియర్ స్పష్టపరిచాడు. ‘‘ఇది నేను రెండోసారి చూస్తున్నాను బ్రదర్!’’ అని నేను చెప్పాను. ‘‘నేను మూడోసారి చూస్తున్నాను. అసిస్టెంట్ డైరెక్టర్‌కు సీనిక్ ఆర్డర్ ఏమిటో డిక్టేట్ చేస్తున్నాను, రాసుకుంటున్నాడు. దీనికి కాపీ రైటు నాది’’ అని జూనియర్ ప్రకటించాడు. చిత్రరంగంలో కాపీరైటు అంటే చట్టబద్ధమైన సర్వ స్వామ్యాలు కావు. కాపీ చేసే రైటు. ఆ చిత్రాన్ని కాపీ చేసే రైటు జూనియర్‌కు ఉందన్న సంగతి నా ప్రొడ్యూసర్‌కు నచ్చచెప్పటానికి నా తాతలు దిగివచ్చారు’’. (మీకు ఇలాంటి మరమరాలు తెలిస్తే మాకు రాయండి.) -
సినీ అనువాదకుడిగా ఆరుద్ర
నీ లీల పాడెద దేవా! ఆరుద్ర పేరు తెలియని అక్షరాస్యులైన తెలుగువారుండరు. ఆయన అసలు పేరు భాగవతుల సదాశివ శంకరశాస్త్రి అని తెలిసినవాళ్లు మాత్రం తక్కువ. బహుముఖ ప్రతిభాశాలి అయిన ఆరుద్ర చేపట్టని సాహితీ ప్రక్రియ లేదనీ, ఆయన సమగ్రాంధ్ర సాహిత్య చరిత్రను (13 సంపుటాలు) వాడుక భాషలో రాసిన పరిశోధక పట్టభద్రులనీ, సాహిత్యంతో పాటు చదరంగం, ఇంద్రజాలాది రంగాలలో ఆరితేరిన వారనీ అందరికీ తెలియకపోవచ్చు. ఆయన ‘త్వమేవాహమ్’, ‘సినీవాలీ’ వంటి ప్రసిద్ధ కావ్యాలను చదవని వారు ఉండొచ్చుకానీ ఆయన సినిమా పాటల్ని వినని వారు ఉండరు. బంగారుబొమ్మ రావేమే పందిట్లో పెళ్లి జరిగేనే (రక్తసంబంధం-1962) కొండగాలి తిరిగింది గుండె ఊసులాడింది (ఉయ్యాల-జంపాల - 1965) గాంధి పుట్టిన దేశమా ఇది (పవిత్రబంధం - 1971) ముత్యమంతా పసుపు ముఖమెంతొ చాయ (ముత్యాల ముగ్గు - 1974) రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా (గోరంతదీపం - 1978)... ఇలాంటి ఆణిముత్యాలెన్నో నేటికీ వినిపిస్తున్నాయి. ఆయన 500 చిత్రాలకు పాటలు రాశారు. వాటిలో వందల కొద్దీ డబ్బింగ్ చిత్రాలు ఉంటాయని ఆయన అభిప్రాయపడినా ఆయన పేర వచ్చిన అనువాద చిత్రాలు 50కి మించవు. ఆరుద్ర తన ఉద్యోగ ప్రయత్నాలలో అనుకోకుండా 1948లో శ్రీ రాజరాజేశ్వరీ ఫిలిం కంపెనీ వారికి పరిచయమై ఎన్నడూ ఆశించని సినీరంగ జీవితాన్ని ప్రారంభించినట్టే- డబ్బింగ్ చిత్ర రచయితగా స్థిరపడే ఉద్దేశం లేకపోయినా మోడరన్ థియేటర్స్ వారి ‘ఆలీబాబా- 40 దొంగలు’ అనువాద చిత్రానికి దాని రచయిత అయిన తోలేటి వెంకటరెడ్డి ఆకస్మిక మరణం వల్ల ఆపద్ధర్మంగా పూర్తి చెయ్యవలసి వచ్చింది. దాంతో అనువాద చిత్ర రచన కూడా కొనసాగించారు. దానికి ముందే ‘ప్రేమలేఖలు’ (1953)కి మాటలు, పాటలు రాస్తే అది ట్రాక్ ఛేంజ్ చిత్రమే అయినా ఆ సినిమాను పరిశ్రమలో డబ్బింగ్ చిత్రంగా పరిగణించడం వల్ల అప్పటికే ఆరుద్రకు అనువాద రచయితగా కూడా ముద్రపడింది. పందిట్లో పెళ్లవుతున్నది కనువిందవుతున్నది... పాడు జీవితము, యౌవనం మూడునాళ్ల ముచ్చటలోయి... వంటి హిట్స్ అందులోవే. ఆరుద్ర అనువదించిన చిత్రాలలో వీరఖడ్గము, సంపూర్ణ రామాయణము, మురిపించే మువ్వలు, సింగపూర్ సిఐడి, సరస్వతీ శపథం, కొండవీటి సింహం, కోటీశ్వరుడు మొదలైనవి చెప్పుకోదగ్గవి. లభిస్తున్న ఆధారాల మేరకు ఆయన అనువదించిన చివరి చిత్రం ‘అఖండ నాగప్రతిష్ట’ (1984). తెలుగు చిత్ర రంగంలో అనువాద రచనకు ఆద్యులైన శ్రీశ్రీ- నన్నయ వంటి వారైతే అనువాదంలో తెలుగుదనానికి ఎక్కువ ప్రాధాన్యాన్నిచ్చిన ఆరుద్రను అభినవ తిక్కనగా అభివర్ణించవచ్చు. ఆయన ‘లిప్ సింక్’ కంటే తెలుగు నుడికారానికే మొగ్గు చూపించారు. ‘రాణీ రంగమ్మ’ చిత్రాన్ని అనువదించేటప్పుడు అందులో కట్టబొమ్మన సోదరుడైన భూమయ్యదొరను కీర్తిస్తూ పాడే నృత్యగీతాన్ని తొలగించి ఆ స్థానంలో పెదవుల కదలికకు, నాట్యభంగిమలకు సరిపడేలా బొబ్బిలి కథను రాయడం ఆరుద్ర తెలుగుప్రేమకు నిదర్శనం. ఆరుద్ర అనువాద గీతాలలోనే కాదు- తెలుగు అనువాద గీతాల్లోనే మకుటాయమానమైన పాట దేవీ ఫిలిమ్స్ వారి ‘మురిపించే మువ్వలు’ (1962)లోని - ‘నీ లీల పాడెద దేవా’.... ఈ సినిమాలో హీరో నాదస్వర విద్వాంసుడు కావడం వల్ల జానకి ఈ పాటను నాదస్వరంతో సమమైన స్థాయిలో పాడి ఆంధ్ర దేశాన్ని ఉర్రూతలూగించారు. దీని తమిళ మాతృక ‘కొంజు సెలంగై’లో ఈ పాట ‘సింగార వేలనె దేవా’... అని మొదలవుతుంది. ‘శూలపాణి అయిన మనోహరమైన స్వామీ రావా... అద్భుత మహిమాన్వితుడా స్వామీ రావయ్యా’ అనే భావం గల ఆ పాటను ఆరుద్ర ‘సింగార వీధిని రావా’ అని తెనిగిద్దామనుకొని పాట శృంగారపరంగా కాక భక్తిపరంగా ఉండాలనే అభిప్రాయంతో ‘నీ లీల పాడెద దేవా’ అనే ప్రారంభాన్ని ఎంచుకున్నారు. అది జనానికి బాగా నచ్చింది. అనువాద చిత్రాల్లోని గీతాలతో పాటు ద్విభాషా చిత్రాలలోని పునర్నిర్మాణ చిత్రాలలోని సన్నివేశాలకు కూడా పాటలు రాసేటప్పుడు ఆరుద్ర తనదైన ముద్రను ప్రదర్శించారు. ఉదాహరణకు తమిళ చిత్రం‘లక్ష్మీ కల్యాణం’ (1968) కోసం కణ్ణదాసన్- రామన్ ఎత్తనైదా మనడి- అవన్ నల్లవర్ వణంగుం దేవనడి- దేవన్... అనే పాటను అనుసరిస్తూ ఆరుద్ర ‘మీనా’లో- శ్రీరామ నామాలు శతకోటి... ఒక్కొక్క పేరే బహుతీపి... రాశారు. ‘కుళం వైయుం దైవముం’ ఆధారంగా తీసిన తెలుగు చిత్రం ‘లేత మనసులు’లో- కోడి ఒక కోనలో పుంజు ఒక కోనలో పిల్లలేమొ తల్లడిల్లే ప్రేమ లేని కానలో... అని రాశారు. ‘కాదలిక్క నేరమిల్లై’ ఆధారంగా తీసిన పునర్నిర్మాణ చిత్రం ‘ప్రేమించి చూడు’లో- నీ అందాల చేతులు కందేను పాపం ఎందుకు ఈ బెడద సాయము వలదా హాయ్ ఓ చేయి వేసేదా... రాశారు. ఈ పాటలో ‘కడగంటి చూపు కబురంపగానే శుభలేఖ పంపేను’ అనేది మూలాన్ని మించిన గడుసు ప్రయోగం. శబ్దశక్తి, సద్యఃస్ఫూర్తి అక్షరంతోనే అలవడిన ఋషిత్యులుడు ఆరుద్ర. అందుకే ఆయన అసలు సిసలు తెలుగు చిత్రాలకు రాసినా అనువాద చిత్ర రచన చేసినా రెండు రంగాలలోనూ సవ్యసాచిలా రాణించారు. వాస్తవానికి ఆయన చేసిన అనువాద చిత్రాలు పదుల సంఖ్యలోనే ఉన్నా ఆయన భావించినట్టుగా అవి వందల పెట్టు. - పైడిపాల 9989106162 -
ఆరుద్ర
...లేదా, ఒకే ఒక్క వాక్యంతోనూ ఆయన్ని స్ఫురణకు తేవొచ్చు. ‘నీవు ఎక్కవలసిన రైలు ఒక జీవితకాలం లేటు’. ఆరుద్రకు ఒక ‘నేమ్‌ప్లేట్’ చేయించాలంటే, ఆయన పేరుముందు ఏం చెక్కించాలి? బహుముఖ ప్రజ్ఞాశాలి అనేయొచ్చు సింపుల్‌గా. కానీ ఆ ప్రజ్ఞ ఎన్నిరకాలు? కవి, కథకుడు, డిటెక్టివ్ నవలా రచయిత(నెలకొకటి చొప్పున రాస్తానని అలాగే రాయడం ఆయన చేసిన ఆరుద్రశపథం), గేయకర్త, గేయనాటకకర్త, వ్యాసకర్త, గడీనుడీకారుడు, మెజీషియన్, సంపాదకుడు, విమర్శకుడు, పరిశోధకుడు, అనువాదకుడు, అభ్యుదయ రచయితల సంఘం- అరసం వ్యవస్థాపకుల్లో ఒకరు(సంఘాల గొడుగు ఎందుకు? అంటే, వానపడకుండా ఉండటానికంటాడు!), చివరగా సినిమా రచయిత. అనగా, పాటలూ మాటలూ అనువాదాలూ. రాయినైనా కాకపోతిని రామపాదం సోకగా(గోరంతదీపం); అమ్మకడుపు చల్లగా (సాక్షి); కొండగాలి తిరిగింది (ఉయ్యాల జంపాల); వేదంలా ఘోషించే గోదావరి (ఆంధ్రకేసరి); ఇదేనండి ఇదేనండి భాగ్యనగరం (ఎంఎల్ఏ); ఎదగడానికెందుకురా తొందర (అందాల రాముడు); ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ (ముత్యాలముగ్గు); శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది... (పెళ్లిపుస్తకం) ఆరుద్రను ఇలాంటి ఏ కొన్ని పాటలతోనైనా పరిచయం చేయొచ్చు; లేదా, ఒకే ఒక్క వాక్యంతోనూ స్ఫురణకు తేవొచ్చు. ‘నీవు ఎక్కవలసిన రైలు ఒక జీవితకాలం లేటు’. భాగవతుల సదా శివశంకరశాస్త్రిగా జన్మించి, జన్మనక్షత్రం పేరిట తన కలంపేరును స్వీకరించిన ఆరుద్ర- కవిత కోసం నేను పుట్టాను, క్రాంతి కోసం కలం పట్టాను అని చాటుకున్నాడు. ‘నాకోసం నేను రాసుకోను. అందరికోసం నేను రాస్తాను. అందరూ నావాళ్లే కాబట్టి, నాకోసం రాసింది అందరికోసం రాసిందే’ అంటాడు. తెలంగాణ పోరాట ఇతివృత్తంతో ఆరుద్ర రాసిన ‘త్వమేవాహం’ చదివి, ఇక నేను పద్యాలు రాయకపోయినా ఫరవాలేదు, అని ఆనందపడ్డాడట ఆరుద్రకు మేనమామైన శ్రీశ్రీ. ఇందులో ఆరుద్ర- సమాజాన్ని గడియారంతోనూ, ధనికుల్ని గంటల ముల్లుతోనూ, మధ్యతరగతివాళ్లని నిమిషాలముల్లుతోనూ, పేదల్ని సెకన్లముల్లుతోనూ, ‘కీ’ని విప్లవగొంతుకగానూ ప్రతీకిస్తాడు. అంత్యప్రాసల ముద్ర-ఆరుద్ర అనిపించుకున్న ఈ ‘సన్యాసి రూప’ కవి... ‘ఛందస్సులతో అడ్డమైన చాకిరీ అందంగా చేయించుకోగలడు’. శ్లేషలు, చమత్కారాలతో మురిపిస్తాడు. చెరిషించి, పెరిషించి లాంటి తెలుగు ఇంగ్లీషు పదాల కాక్టెయిల్ సృష్టిస్తాడు. ‘ఆ/ మెన్/ ఆమెన్/ చెరపట్టన్/ మ్రోగెన్/ నీగన్/ నా/ పెన్/ ఆపెన్’... లాంటి పదాల గారడీలో వస్తువుకు ఔచిత్యభంగం వాటిల్లుతోందా? అనే మీమాంస ఒకటి కలిగినప్పటికీ! ‘చిన్ని పాదములందు/చివరి ప్రాసల చిందు/ చేయు వీనులవిందు/ ఓ కూనలమ్మా’ అంటూ కూనలమ్మ పదాలు ప్రారంభించాడు ఆరుద్ర. ‘ఆలి కొన్నది కోక/ అంతరిక్షపు నౌక/ అంతకన్నను చౌక/ ఓ కూనలమ్మా’ అని నవ్విస్తూనే, ‘కోర్టుకెక్కినవాడు/ కొండకెక్కినవాడు/ వడివడిగ దిగిరాడు’ అన్న సత్యాన్నీ చెబుతాడు. ‘అంతుచూసేవరకు/ అకట ఆంధ్రుల చురుకు/ నిలువ ఉండని సరుకు’ అని తెలుగువారి ఆరంభశూరత్వాన్ని వెక్కిరిస్తాడు. ‘అణువు గుండెను చీల్చి/ అమితశక్తిని పేల్చి/ నరుడు తన్నును బాల్చి’... చిన్న పదాల్లో పెద్ద భావాన్ని ఇముడుస్తాడు. ‘పరుల మేలును కోరి/ పదములల్లెడు వారి/ పథము చక్కని దారి’ అనిపిస్తాడు. ప్రయోగశీలత ఆయన కథల్లోనూ కనిపిస్తుంది. ‘సుబ్బారావున్నరగంటలసేపు’ అంటాడొకచోట. తన పురుషుడిని తన పూర్తి ప్రపంచంగా మలచుకున్న స్త్రీ హృదయానికి ఈ కొలత సులభంగా అర్థమవుతుంది! ‘రాముడికి సీత ఏమౌతుంది?’ లాంటి ఆసక్తికర శీర్షికతో సకల రామాయణాల్ని తవ్విపోశాడాయన. శ్రీకృష్ణుడు అసలుసిసలు ఆంధ్రుడనీ, ఏకలవ్యుడు కుంతీదేవి అక్క కొడుకనీ, పుత్రికకూ కుమార్తెకూ భేదముందనీ, పుత్రిక అంటే సహోదరులు లేనిదనీ, కుమార్తె అంటే తోడబుట్టినవారిని కలిగినదనీ తేల్చిచెప్పాడు. ‘సినీవాలి’, ‘ఇంటింటి పజ్యాలు’, ‘గాయాలు-గేయాలు’, ‘పైలాపచ్చీసు’, ‘శుద్ధ మధ్యాక్కరలు’, ‘గుడిలో సెక్స్’, ‘వేమన్న వాదం’, ‘తిరుక్కురళ్’అనువాదం, చదరంగ పుస్తకం, ‘సినీ మినీ కబుర్లు’... ఇక, రాయడం అటుండనీ, చదవడానికే జీవితకాలం చాలదనిపించే బృహత్తరమైన ‘సమగ్ర ఆంధ్ర సాహిత్యం’ ఆయన పరిశోధనాశక్తికి పరాకాష్ఠ! సంస్థలుగా మాత్రమే చేయగలిగిన పనిని ఒక్కడే పూనిక వహించి పూర్తిచేశాడు. ‘నాకు స్పష్టంగా తెలుసు అనుకున్నదాన్ని పాఠకులకు స్పష్టంగా’ చెప్పదలిచాడు. చాళుక్యుల నుండి ఆధునిక కాలం వరకు ‘ఆర్థికసంబంధాల ప్రాతిపదికన యుగవిభజన’ చేసిన ఈ పుస్తకం కోసం- ఆరోగ్యాన్ని పాడుచేసుకున్నాడు. మధుమేహం పెరిగి మూత్రపిండాలు పనిచేయడం మానేశాయి. కంటిచూపు తగ్గిపోయింది. అయినా అన్ని కష్టాలనూ ఓర్చి వెయ్యేళ్ల చరిత్రను తెలుగువాళ్లకు అందించగలిగాడు. ‘సాహిత్యం అర్ణవమైతే, ఆరుద్ర మథించని లోతుల్లేవు. సాహిత్యం అంబరమైతే ఆరుద్ర విహరించని ఎత్తుల్లేవు. అతడు పట్టి బంగారం చేయని సాహిత్య శాఖ లేదు; ఆ శాఖపై అతడు పూయించని పువ్వుల్లేవు’. -
చప్పని టిప్పణాలు!
గ్రంథం చెక్క భారతీయ ధర్మానికి స్మృతులు, శ్రుతులు పరమ ప్రమాణాలు. వేదాలు మూడింటినీ శ్రుతులు అంటారు. శ్రుతుల తర్వాత స్మృతులు ప్రామాణికాలు. ధర్మశాస్త్రాలను స్మృతులంటారు. ఇవి పద్ధెనిమిది ఉన్నాయి. మనుస్మృతి వీటిలో సుప్రసిద్ధం. ఆపస్తంబ, ఆశ్వలాయన స్మృతులు తెలుగునాట ప్రచారమైనవి. ఈ ధర్మశాస్త్రాలకు కూడా టిప్పణాలు ఉన్నాయి. యజుర్వేదులకు ఆపస్తంబ ధర్మసూత్రాలూ, సామవేదులకు గౌతమ ధర్మసూత్రాలూ అనుసరణీయాలు. ధర్మశాస్త్రాలకూ, వేదాలకూ పూర్వులు చేసిన టిప్పణాలు చప్పనివని వేమన గారి నిర్ణయం. ఉప్పూకారం లేని ఆహారాన్ని చప్పిడి అంటాం. చప్పమాటలు అంటే రసహీనము, నిస్సారం అని అర్థం. వేదాలు, ధర్మశాస్త్రాల తరువాత భారతీయులు గౌరవించేది వేదాంతాన్నే. బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, భగవద్గీత కలిసి ‘ప్రస్థాన త్రయం’ అనే పేరున వేదాంతంలో ముఖ్యమైనవి. బాదరాయణుడు రచించిన బ్రహ్మసూత్రాలకు అన్ని వేదాంత శాఖల వాళ్ళూ భాష్యాలు రాశారు. వేదశాస్త్రములను విరివిగా దా నేర్చి వాదమాడు వాడు వట్టి వాడు సారమైన గురుతు సాక్షిగా నెంచడు విశ్వదాభిరామ వినురవేమ వేదశాస్త్రాలు విరివిగా చదువుకున్నవాడైనా అతని వాదనలు శుష్కవాదనలు ఎందుకవుతాయో వేమన గారు కారణం చెబుతారు. వేదాంతులకు శ్రుతి ఒక్కటే ప్రమాణం. హేతువాదులైన లోకాయతులకు లోకమే ప్రమాణం. వేదాంతులు తర్కానికి ప్రతిష్ఠ (నిలకడ) లేదంటారు. లోకాయతులు అనుమానాది ప్రమాణాలను అంగీకరించక కేవలం ప్రత్యక్ష ప్రమాణాన్నే అంగీకరిస్తారు. - ఆరుద్ర ‘వేమన్న వేదము’ నుంచి. (రేపు ఆరుద్ర వర్ధంతి) -
గీత స్మరణం
పల్లవి : బలె బలె బలె బలె పెద్దబావ భళిర భళిర ఓహొ చిన్నబావ కనివిని ఎరుగని విడ్డూరం సరిసాటిలేని మీ ఘనకార్యం ॥బలె॥ చరణం : 1 మీరు నూరుగురు కొడుకులు... అహ... మారుమ్రోగు చలిపిడుగులు ॥ మట్టి తెచ్చి గంభీర గుట్టలేసి... జంభారి పట్టపేన్గు బొమ్మ చేయు ఘటికులు (2) వీరాధివీరులైన శూరాతిశూరులైన మీ కాలిగోటికి చాలరు ॥బలె॥ చరణం : 2 దైవమేదీ వేరు లేదు తల్లి కంటే ఆ తల్లి కోర్కె తీర్చువారే బిడ్డలంటే ఏ తల్లీ నోచలేదు ఇంతకంటే (2) ఈ మాట కల్లకాదు ఈరేడు జగములందు మీలాంటి వాళ్లు ఇంక పుట్టరంటే ॥బలె॥ చరణం : 3 మేళాలు తాళాలు ముత్యాలముగ్గులు రతనాలు గొడుగులు సంబరాలు ॥ ఊరంత పచ్చని తోరణాలు వీరణాలు తందనాలు (2) ఊరేగే వైభవాలు బంగారు వాయనాలు ఆనందభరితమౌను జీవితాలు ॥బలె॥ చిత్రం : బాలభారతం (1972) రచన : ఆరుద్ర సంగీతం : సాలూరి రాజేశ్వరరావు గానం : ఎల్.ఆర్.ఈశ్వరి నిర్వహణ: నాగేశ్ -
గీత స్మరణం
పల్లవి అతడు: ఆడవాళ్ల కోపంలో అందమున్నది అహ! అందులోనె అంతులేని అర్థమున్నది... అర్థమున్నది మొదటిరోజు కోపం అదో రకం శాపం పోను పోను కలుగుతుంది బలే విరహతాపం ఆమె: బ్రహ్మచారి లేతమనసు పైకి తేలదు తన మాటలందు చేతలందు పొత్తు కుదరదు... పొత్తు కుదరదు చరణం : 1 ఆ: పడుచువాడి మిడిసిపాటు పైన పటారం ఒక గడుసు పిల్ల కసరగానె లోన లొటారం ॥ అ: వగలాడి తీపితిట్టు తొలివలపు తేనెపట్టు ఆ తేనె కోరి చెంత చేరి చెడామడా కుట్టు ॥ చరణం : 2 ఆ: పెళ్లికాని వయసులోని పెంకి పిల్లలు కళ్లతోనె మంతనాలు చేయుచుందురు పెళ్లికాని వయసులోని పెంకి పిల్లలు తమ కళ్లతోనె మంతనాలు చేయుచుందురు అ: వేడుకొన్న రోజు అది పైకి పగటి వేషం ఆ: వెంట పడిన వీపు విమానం ॥ చరణం : 3 అ: చిలిపి కన్నె హృదయమెంతో చిత్రమైనది అది చిక్కు పెట్టు క్రాసు వర్డ్ పజిలు వంటిది ॥ ఆ: ఆ పజిలు పూర్తి చేయి తగు ఫలితముండునోయి మరుపురాని మధురమైన ప్రైైజు దొరుకునోయి ॥॥ చిత్రం : చదువుకున్న అమ్మాయిలు (1963) రచన : ఆరుద్ర సంగీతం : సాలూరి రాజేశ్వరరావు గానం : ఘంటసాల, పి.సుశీల -
లాహిరి లాహిరి-అరుద్ర