Writer Arudra Wife K Ramalakshmi Passed Away In Hyderabad - Sakshi
Sakshi News home page

K Ramalakshmi: ప్రముఖ రచయిత్రి కన్నుమూత

Mar 3 2023 7:04 PM | Updated on Mar 3 2023 9:01 PM

Writer Arudra Wife K Ramalakshmi Passed Away - Sakshi

ప్రముఖ రచయిత ఆరుద్ర సతీమణి, రచయిత్రి కె.రామలక్ష్మి శుక్రవారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. హైదరాబాద్‌లోని మలక్‌పేటలో నివాసముంటున్న ఆమె వయోభారంతో కన్నుమూశారు. 1930 డిసెంబర్‌ 31న తూర్పు గోదావరి జిల్లాలోని కోటనందూరులో ఆమె జన్మించారు. మద్రాసు విశ్వవిద్యాలయంలో బీఏ పట్టా పుచ్చుకున్నారు. 1951 నుంచి రచనలు ప్రారంభించారు. ఆమె కలం నుంచి విడదీసే రైలుబళ్లు, మెరుపు తీగె, అవతలిగట్టు, ఆంధ్రనాయకుడు వంటి ఎన్నో రచనలు జాలువారాయి.

1954లో కవి ఆరుద్రతో రామలక్ష్మి వివాహం జరిగింది. ఆరుద్ర మోసగాళ్లకు మోసగాడు సినిమాకు కథ అందించగా ఈ చిత్రం సూపర్‌ హిట్‌గా నిలిచింది. మీనా, దేవదాసు సినిమాలకు కూడా రచనాపరంగా ఆరుద్ర సహాయం చేశారు. కె.రామలక్ష్మి సెన్సార్‌ బోర్డ్‌ మెంబర్‌గానూ పని చేశారు. ఈ దంపతులు తెలుగు సాహితీరంగానికి ఎనలేని సేవ చేశారు. వీరికి ముగ్గురు కుమార్తెలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement