గీత స్మరణం | Song from Chaduvukunna Ammayilu | Sakshi
Sakshi News home page

గీత స్మరణం

Published Sun, Oct 20 2013 11:32 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

గీత స్మరణం - Sakshi

గీత స్మరణం

 పల్లవి

 అతడు: ఆడవాళ్ల కోపంలో అందమున్నది
 అహ! అందులోనె అంతులేని అర్థమున్నది... అర్థమున్నది
 మొదటిరోజు కోపం అదో రకం శాపం
 పోను పోను కలుగుతుంది బలే విరహతాపం
 ఆమె: బ్రహ్మచారి లేతమనసు పైకి తేలదు
 తన మాటలందు చేతలందు పొత్తు కుదరదు...
   పొత్తు కుదరదు
 
 చరణం : 1
 
 ఆ: పడుచువాడి మిడిసిపాటు పైన పటారం
 ఒక గడుసు పిల్ల కసరగానె లోన లొటారం
 ॥
 అ: వగలాడి తీపితిట్టు తొలివలపు తేనెపట్టు
 ఆ తేనె కోరి చెంత చేరి చెడామడా కుట్టు
 ॥
 
 చరణం : 2
 
 ఆ: పెళ్లికాని వయసులోని పెంకి పిల్లలు
 కళ్లతోనె మంతనాలు చేయుచుందురు
 పెళ్లికాని వయసులోని పెంకి పిల్లలు
 తమ కళ్లతోనె మంతనాలు చేయుచుందురు
 అ: వేడుకొన్న రోజు అది పైకి పగటి వేషం
 ఆ: వెంట పడిన వీపు విమానం
 ॥
 
 చరణం : 3
 
 అ: చిలిపి కన్నె హృదయమెంతో చిత్రమైనది
 అది చిక్కు పెట్టు క్రాసు వర్‌డ్ పజిలు వంటిది
 ॥
 ఆ: ఆ పజిలు పూర్తి చేయి తగు ఫలితముండునోయి
 మరుపురాని మధురమైన ప్రైైజు దొరుకునోయి
 ॥॥
 
 చిత్రం : చదువుకున్న అమ్మాయిలు (1963)
 రచన : ఆరుద్ర
 సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
 గానం : ఘంటసాల, పి.సుశీల

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement