టచ్‌ చేసే చిత్రం | arudra movie releasing shortly | Sakshi
Sakshi News home page

టచ్‌ చేసే చిత్రం

Published Sun, Mar 10 2019 5:29 AM | Last Updated on Sun, Mar 10 2019 5:29 AM

arudra movie  releasing shortly - Sakshi

మేఘాలీ

ప్రస్తుతం మహిళలకు ఇంటా, బయటా రక్షణ లేకుండా పోయింది. ఎక్కువశాతం మంది శారీరక, మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ అంశాలను ఆధారంగా చేసుకుని తమిళంలో రూపొందిన చిత్రం ‘ఆరుద్ర’. పా.విజయ్, కె.భాగ్యరాజ కీలక పాత్రల్లో, మేఘాలీ, దక్షిత, సోనీ, సంజన సింగ్‌ హీరోయిన్లుగా నటించారు. పా. విజయ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలందుకుంది.

ఇప్పుడు ఈ చిత్రాన్ని ‘ఆరుద్ర’ పేరుతో వరకాంతం సునీల్‌ రెడ్డి సమర్పణలో జె.ఎల్‌.కె. ఎంటర్‌ప్రైజెస్‌ తెలుగులోకి అనువదిస్తోంది. ‘‘ఈ సినిమాలో పిల్లలకు, పేరెంట్స్‌కు మంచి సందేశం ఇచ్చారు. గుడ్‌ అండ్‌ బ్యాడ్‌ టచ్‌ గురించి అందరికీ అర్థమయ్యేలా బాగా చూపించారు. ప్రస్తుతం  వెన్నెలకంటిగారి పర్యవేక్షణలో అనువాద కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు సునీల్‌ రెడ్డి. ఈ చిత్రానికి సంగీతం: విద్యాసాగర్‌. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement