Sanjana Singh
-
దిల్ కొల్లగొట్టింది
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన చివరి చిత్రం ‘దిల్ బేచారా’ అందరి çహృదయాల్ని కొల్లగొట్టింది. కేవలం హృదయాలనే కాదు పలు రికార్డులనూ కొల్లగొట్టిందని లెక్కలు చెబుతున్నాయి. ముఖేశ్ చాబ్రా దర్శకత్వంలో సుశాంత్ సింగ్, సంజనా సింగ్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘దిల్ బేచారా’. కరోనా కారణంగా ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో విడుదల చేశారు. పోయిన వారం ఈ చిత్రం హాట్‌స్టార్ లో రిలీజ్ అయింది. తొలి రోజు సుమారు 95 మిలియన్ వ్యూస్ సాధించిందట ‘దిల్ బేచారా’. అంటే.. సుమారు తొమ్మిదిన్నర కోట్లు. ఒకవేళ ఇది థియేట్రికల్ బిజినెస్‌లో లెక్కకట్టి చూస్తే... ప్రస్తుతం మన దగ్గర టికెట్ ధర 150 ఉంది అంటే ఈ సినిమా తొలి రోజే 1500 కోట్లు బిజినెస్ చేసినట్టు. ప్రస్తుతం ఒక్కో సినిమా వంద కోట్లు వసూళ్లను చేరుకోవాలంటే సుమారు 4 రోజులు పడుతుంది. కానీ ‘దిల్ బేచారే’ని తొలిరోజే తొమ్మిదిన్నర కోట్ల మంది వీక్షించడం రికార్డే. సుశాంత్ చివరి చిత్రం కావడం తో తప్పక చూడాలని ప్రేక్షకులు అతనికి ప్రేమగా ఇచ్చిన నివాళి ఇది. హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ తో సంబంధం లేకుండా ఈ చిత్రాన్ని అందరికీ అందుబాటులో ఉంచారు. అలాగే మొదటిరోజు ఎక్కువ మంది చూస్తూ ఉండటంతో హాట్‌స్టార్ క్రాష్ అయిందని కూడా వార్తలు వచ్చాయి. -
నూతన దర్శకుడు కన్నుమూత
చెన్నై: తమిళ నూతన దర్శకుడు బాలమిత్ర గుండెపోటుతో మరణించారు. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో బుధవారం ఆయన కన్నుమూశారు. కాగా బాలమిత్ర లాక్‌డౌన్‌కు ముందు "ఉడుక్కై" చిత్రం తెరకెక్కించాడు. ఈ సినిమాతో వెండితెరపై దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలన్నది అతని కల. షూటింగ్ దాదాపుగా పూర్తైన ఈ చిత్రం కరోనా కారణంగా అర్ధాంతరంగా ఆగిపోయింది. అయితే కొద్ది రోజుల క్రితం షూటింగ్స్ సహా, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. (హీరో అజిత్‌కు ఏమైంది? ) దీంతో అతను తన 'ఉడుక్కి' సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాడు. ఇంతలోనే ఆయన మరణించడం చిత్రబృందానికి తీరని విషాదాన్ని నింపింది. 'ఉడుక్కై' సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న నటి సంజనా సింగ్ ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటించారు. "ఒక మంచి వ్యక్తి ఇంత త్వరగా లోకాన్ని వదిలి వెళ్లిపోయారు. అతని కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి" అని ట్వీట్ చేశారు. బాలమిత్రకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. (వడివేలు స్నేహాన్ని వదలుకోను) -
మంచీ చెడు
రచయిత, నటుడు, దర్శక–నిర్మాత పా. విజయ్ ప్రధాన పాత్రలో నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆరుద్ర’. మరో ప్రముఖ నటుడు కె. భాగ్యరాజా కీలక పాత్ర పోషించారు. మేఘాలీ, దక్షిత, సోని, సంజన సింగ్ హీరోయిన్లుగా నటించారు. తమిళంలో ఇటీవల విడుదలై విమర్శకుల ప్రశంసలందుకున్న ఈ చిత్రాన్ని జె.ఎల్.కె. ఎంటర్ప్రైజెస్ అధినేత కె.వాసుదేవరావు అదే పేరుతో తెలుగులోకి అనువదించారు. సెన్సార్ పనులు పూర్తయ్యాయి. క్లీ¯Œ యు సర్టిఫికెట్ అందుకున్న ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేయనున్నారు. కె.వాసుదేవరావు మాట్లాడుతూ– ‘‘సామాజిక ఇతివృత్తంతో రూపొందిన చిత్రమిది. తల్లిదండ్రులు, పిల్లలకు మంచి సందేశం ఇచ్చారు. ఆడ పిల్లలపై జరుగుతున్న అమానుష చర్యలకు ప్రతీకార దిశగా ఈ చిత్రం ఉంటుంది. గుడ్ అండ్ బ్యాడ్ టచ్ గురించి అందరికీ అర్థమయ్యేలా చక్కగా చూపించారు. తమిళంలో మంచి వసూళ్లు రాబట్టింది. యూనివర్సల్ కాన్సెప్ట్ కావడంతో తెలుగులోకి అనువదిస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: వరకాంతం సునీల్ రెడ్డి. -
టచ్ చేసే చిత్రం
ప్రస్తుతం మహిళలకు ఇంటా, బయటా రక్షణ లేకుండా పోయింది. ఎక్కువశాతం మంది శారీరక, మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ అంశాలను ఆధారంగా చేసుకుని తమిళంలో రూపొందిన చిత్రం ‘ఆరుద్ర’. పా.విజయ్, కె.భాగ్యరాజ కీలక పాత్రల్లో, మేఘాలీ, దక్షిత, సోనీ, సంజన సింగ్ హీరోయిన్లుగా నటించారు. పా. విజయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలందుకుంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని ‘ఆరుద్ర’ పేరుతో వరకాంతం సునీల్ రెడ్డి సమర్పణలో జె.ఎల్.కె. ఎంటర్ప్రైజెస్ తెలుగులోకి అనువదిస్తోంది. ‘‘ఈ సినిమాలో పిల్లలకు, పేరెంట్స్‌కు మంచి సందేశం ఇచ్చారు. గుడ్ అండ్ బ్యాడ్ టచ్ గురించి అందరికీ అర్థమయ్యేలా బాగా చూపించారు. ప్రస్తుతం వెన్నెలకంటిగారి పర్యవేక్షణలో అనువాద కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు సునీల్ రెడ్డి. ఈ చిత్రానికి సంగీతం: విద్యాసాగర్. -
నటి సంజనా సెల్‌ఫోన్ చోరీ
పెరంబూరు: నటి సంజనాసింగ్ సెల్‌ఫోన్ చోరీకి గురైంది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు దొంగలను పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. వివరాల్లోకి వెళ్లితే రేణిగుంట చిత్రం ద్వారా ప్రాచుర్యం పొందిన నటి సంజనాసింగ్. పలు చిత్రాల్లో వివిధ పాత్రల ద్వారా గుర్తింపు పొందిన ఈమె స్థానిక ముగపేర్లో నివసిస్తున్నారు. సంజనాసింగ్ ఉదయం సైకిలింగ్ చేయడం అలవాటు. అదే విధంగా శనివారం ఉదయం 6 గంటలకు అన్నానగర్‌లో ఉన్న తన సోదరి ఇంటికి సైకిల్లో వెళ్లారు.తిరిగి వస్తుండగా అన్నానగర్ సమీపంలోని చింతామణి సిగ్నల్ ప్రాంతంలో మోటార్‌సైకిల్‌పై వచ్చిన ఒక వ్యక్తి సంజనాసింగ్ చేతిలోని సెన్‌ఫోన్‌ను లాక్కుని పారిపోయాడు. దీంతో అవాక్కు అయిన ఆమె వెంటనే అన్నానగర్ పోలీస్‌స్టేషన్‌లో పిర్యాదు చేశారు. సంజనాసింగ్ ఫిర్యాదును నమోదు చేసుకున్న పోలీసులు సెల్‌ఫోన్ దొంగ కోసం గాలిస్తున్నారు. నటి సంజనాసింగ్ తెలుపుతూ తాను నిత్యం ఉదయం ఎక్సర్సైజ్లో భాగంగా సైకిలింగ్ చేస్తానన్నారు. అయితే శనివారం మరి కొద్ది దూరం సైకిలింగ్ చేస్తే మంచిదని భావించి అన్నానగర్‌లోని తన సోదరి ఇంటికి వెళ్లానని చెప్పారు. తానకు దారి తెలియకపోవడంతో సెల్ఫోన్లో గూగుల్ మ్యాప్ వాడుకుంటానని తెలిపారు. అన్నానగర్ నుంచి తిరిగి వస్తుండగా మోటర్‌బైక్‌పై వచ్చిన ఒక వ్యక్తి తన సెల్‌ఫోన్‌ను లాక్కుని వేగంగా వెళ్లిపోయాడని చెప్పారు. తాను దొంగ దొంగ అంటూ గట్టిగా కేకలు పెడుతూ సైకిల్‌ను వేగంగా తొక్కుకుంటూ వెళ్లినా ఫలితం లేకపోయిందని, దీంతో అన్నానగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. -
సొంత గూటికి సంజనాసింగ్
సాధారణంగా ఇంట గెలిసి రచ్చగెలవాలంటారు.అయితే కొందరికి పొరుగున తమ ప్రతిభను నిరూపించుకున్న తరువాత గానీ సొంతవాళ్లు గుర్తించరు. నటి సంజనాసింగ్ పరిస్థితి ఇలాంటిదే. ముంబైకి చెందిన ఈ బ్యూటీని నటిగా మొద ట గుర్తించింది రేణిగుంట చిత్రం ద్వారా రంగ ప్రవేశం చేసి ఆ చిత్రంలో వేశ్య పాత్రకు జీవం పోసి తమిళ చిత్రపరిశ్రమను తన వైపు తిప్పుకున్నారు.అయితే ఆమెనిక్కడ ఆ తరువాత ఒక వ్యాంప్ పాత్రలకు, ఐటమ్ సాంగ్‌లకు మాత్రమే పరిమితం చేశారు.అయినా నిరాశ చెందక సంజనాసింగ్ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ తనకంటూ ఒక ఇమేజ్ను సొంతం చేసుకుంటూ మంచి అవకాశాల కోసం తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. రగళైపురం, వెట్రిసెల్వన్,అంజాన్ మొదలగు పలుతమిళ చిత్రాలతో తనకే సొంతమైన నటనతో ప్రేక్షకుల్ని అలరిస్తూ వస్తున్నారు. ఇంత కాలం తరువాత సంజనాసింగ్కు మాతృభాష అక్కున చేర్చుకుంది. తోడ లుట్ఫ్ తోడ ఇష్క్ చిత్రంలో నటి సంజనాసింగ్ ఒక ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. హిత్తేన్తేజ్వాణి,సున్నత్ముఖర్జీ,నేహాపవర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ,కథనం,మాటలు,దర్శకత్వం బాధ్యతల్ని సచిన్ గుప్తా నిర్వహిస్తున్నారు. కొంచెం ప్రేమ, కొంచెం జాలి అంటూ రొమాంటిక్ ఎంటర్టెయినర్గా సాగే ఈ చిత్రాన్ని ఈ నెల 10న ప్రపంచ వ్యాప్తంగా విడదల చేయనున్నట్లు మంగళవారం సాయంత్రం చెన్నైలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్రయూనిట్ వెల్లడించింది. నటి సంజనాసింగ్ మాట్లాడుతూ దాదాపు ఏడేళ్ల తరువాత సొంత భాషలో నటించడం సంతోషంగా ఉందన్నారు. ఇంత వరకూ తనను ఐటమ్ గర్ల్గానే చూశారని ఈ చిత్రం తరువాత తనకు కచ్చితంగా కొత్త ఇమేజ్ వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.తోడా లుట్ఫ్ తోడా ఇష్క్ చిత్రంలో తనకొక పాట కూడా ఉంటుందన్నారు. ఈ ఏటి ది బెస్ట్ గీతాల్లో ఇదొక గీతంగా నిలుస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. -
ఐదేళ్ల తరువాతే పెళ్లి
ఐదేళ్ల తరువాతనే పెళ్లి అంటున్నారు నటి సంజనా సింగ్. 2009లో తమిళంలో రేణిగుంట చిత్రం ద్వారా ప్రాచుర్యం పొందిన ఈ ముంబయి భామ ఆ తరువాత వరుసగా విభిన్న పాత్రల్లో తమిళ ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. ఈ నెల 23న తన కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య గోవాలో పుట్టిన రోజును జరుపుకోనున్న సంజనా సింగ్ గురువారం ఉదయం చెన్నైలో పాత్రికేయుల సమక్షంలో ముందుగానే బర్త్‌డే కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు కింది విధంగా బదులిచ్చారు. ప్రశ్న: ముందుగానే బర్తడే జరుపుకోవడానికి కారణం? జవాబు: రేణిగుంట చిత్రం నుంచి చిత్ర పరిశ్రమ వర్గాలతో పాటు మీడియా ఎంతగానో సహకరిస్తోం. అలాంటి పత్రికల వారిని కలవాలని చాలా కాలంగా అనుకుంటున్నాను. అందుకు ఇది సరైన సమయంగా భావించాను. నా పుట్టిన రోజును ఈ నెల 23న కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య గోవాలో జరుపుకోనున్నాను. ప్రశ్న : నటిగా కెరీర్ ఎలా ఉంది? జవాబు: చాలా ప్రోత్సాహంగా ఉంది. విభిన్న పాత్రలు పోషించి నటిగా తానేమిటో నిరూపించుకునే అవకాశం కలుగుతోంది. ప్రశ్న: తమిళంలోనే స్థిరపడాలని భావిస్తున్నారా? జవాబు: తమిళ చిత్రాలకు ప్రాధాన్యత నిస్తున్నమాట నిజమే అయినా తెలుగు, హిందీ, కన్నడం అంటూ అన్ని భాషలలోనూ నటించి మంచి నటిగా పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను. ప్రశ్న: నటి నమితను పోటీగా భావిస్తున్నారా? జవాబు: అందులో నిజం లేదు. నేను ఎవరినీ పోటీగా భావించడం లేదు. ఇంకొకరితో పోటీ పడటం గానీ, ఇతరులను అనుకరించడం గానీ నా కిష్టం ఉండదు. నేను సంజనగానే ఉండాలనుకుంటున్నాను. ప్రశ్న: ప్రస్తుతం చేస్తున్న చిత్రాలు? జవాబు: ఇటీవల హిందీలో ఒక చిత్రం చేశాను. తమిళంలో మానే తేనే పేయే చిత్రంతో పాటు మరికొన్ని చిత్రాలు చేస్తున్నాను. త్వరలో తెలుగులో కూడా నటించనున్నాను. ప్రశ్న: త్వరలో రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారా? జవాబు: ఆహా హా... అవన్నీ వదంతులే. ప్రస్తుతం నాకలాంటి ఆలోచన లేదు. ఇప్పుడు నా దృష్టి అంతా నటనపైనే. చాలెంజ్ అనిపించే పాత్రల్లో నటించి శభాష్ అనిపించుకోవాలి. ప్రశ్న: ఇటీవల హీరోయిన్ల ఫొటోలను మార్ఫింగ్ చేసి బాత్రూమ్ సన్నివేశాలను ఇంటర్నెట్లో పోస్టు చేసే సంస్కృతి అధికం అవడం గురించి? జవాబు: ఇది నిజంగా చాలా బాధాకరం. అలాంటి కారకాలకు పాల్పడే వారు తమకు అక్కాచెల్లెళ్లు ఉన్నారని, హీరోయిన్లు తమలాంటి మనుషులేనని విషయాన్ని గుర్తించుకోవాలి. ప్రశ్న: పెళ్లెప్పుడు చేసుకుంటారు? జవాబు: నటిగా చేయాల్సిన పాత్రలు చాలా ఉన్నాయి. సంజన మంచి నటి అనే గుర్తింపు పొందాలి. అందువలన మరో ఐదేళ్ల వరకు పెళ్లి ప్రసక్తే లేదు. -
ఎమ్మెల్యేపై బీజేపీ కౌన్సిలర్ దాడి
న్యూఢిల్లీ: బీజేపీ కౌన్సిలర్ సంజనా సింగ్ తనపై దాడి చేశారని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎమ్మెల్యే, మాజీ మంత్రి రాఖీబిర్లా ఆరోపించారు. తమ నియోజకవర్గం మాంగోల్పురిలోని 45 వార్డులో పర్యటిస్తుండగా సోమవారం మధ్యాహ్నం 12.15 గంటల ప్రాంతంలో తమపై సంజన్ సింగ్ దాడి చేశారని తెలిపారు. సఫాయి కార్మికులతో మాట్లాడుతుండగా తమతో సంజనా సింగ్ వాగ్వాదానికి దిగారని చెప్పారు. తర్వాత భర్తతో కలిసివచ్చి దాడికి పాల్పడ్డారని వివరించారు. తనతో పాటు, ఆప్ వాలంటీరు రామ్ ప్రతాప్ గోయల్ కూడా ఈ దాడిలో గాయపడ్డారని రాఖీబిర్లా తెలిపారు. అయితే రాఖీబిర్లా ఆరోపణలను సంజన కొట్టిపారేశారు. ఆప్ మద్దతుదారులే తమమై ముందుగా దాడి చేశారని అన్నారు.