ఎమ్మెల్యేపై బీజేపీ కౌన్సిలర్ దాడి | MLA Rakhi Birla attacked by BJP councillor | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యేపై బీజేపీ కౌన్సిలర్ దాడి

Published Mon, Oct 13 2014 9:33 PM | Last Updated on Fri, Mar 29 2019 9:14 PM

ఎమ్మెల్యేపై బీజేపీ కౌన్సిలర్ దాడి - Sakshi

ఎమ్మెల్యేపై బీజేపీ కౌన్సిలర్ దాడి

న్యూఢిల్లీ: బీజేపీ కౌన్సిలర్ సంజనా సింగ్ తనపై దాడి చేశారని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎమ్మెల్యే, మాజీ మంత్రి రాఖీబిర్లా ఆరోపించారు. తమ నియోజకవర్గం మాంగోల్పురిలోని 45 వార్డులో పర్యటిస్తుండగా సోమవారం మధ్యాహ్నం 12.15 గంటల ప్రాంతంలో తమపై సంజన్ సింగ్ దాడి చేశారని తెలిపారు.

సఫాయి కార్మికులతో మాట్లాడుతుండగా తమతో సంజనా సింగ్ వాగ్వాదానికి దిగారని చెప్పారు. తర్వాత భర్తతో కలిసివచ్చి దాడికి పాల్పడ్డారని వివరించారు. తనతో పాటు, ఆప్ వాలంటీరు రామ్ ప్రతాప్ గోయల్ కూడా ఈ దాడిలో గాయపడ్డారని రాఖీబిర్లా తెలిపారు. అయితే రాఖీబిర్లా ఆరోపణలను సంజన కొట్టిపారేశారు. ఆప్ మద్దతుదారులే తమమై ముందుగా దాడి చేశారని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement