Rakhi Birla
-
విధానసభ ఎన్నికలు ఆప్ మలి జాబితాలో సిసోడియా, రాఖీ
న్యూఢిల్లీ: విధానసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మలివిడత జాబితాను శనివారం విడుదల చేసింది. ఇందులో మాజీ మంత్రులు మనీష్ సిసోడియా, రాఖీబిర్లాలకు చోటుదక్కింది. పత్పర్గంజ్ నియోజకవర్గంనుంచి సిసోడియా, మంగోల్‌పురి నియోజకవర్గం నుంచి రాఖీ బిర్లా పోటీ చేయనున్నారు. ఇదే నియోజకవర్గాలనుంచి వీరిరువురు విధానసభకు ప్రాతినిథ్యం వహించిన సంగతి విదితమే. పార్టీ సభ్యులంతా కలిసి సీఎం అభ్యర్థిగా అరవింద్‌ను ఎన్నుకున్న తర్వాత ఆయన పేరు మరో విడత జాబితాలో విడుదల అవుతుంది. ఇదిలాఉంచితే తాజా జాబితాలో మాజీ శాసనసభ్యులు మదన్‌లాల్, దినేష్ మోహనియా, ప్రకాష్ జర్వాల్లకు కూడా చోటుదక్కింది. వీరు కస్తూర్బానగర్, సంగంవిహార్, దేవ్లి నియోజకవర్గాలకు గతంలో ప్రాతినిథ్యం వహించిన సంగతి విదితమే. త్రిలోక్‌పురి స్థానం నుంచి ప్రాతినిథ్యం వహించిన రాజు ధింగన్ పేరు కూడా ఈ జాబితాలో ఉంది. పటేల్‌నగర్ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో బరిలోకి దిగిన వీణా ఆనంద్‌కు ఈ జాబితాలో చోటుదక్కలేదు. బాబుర్పూర్ స్థానాన్ని పార్టీ సీనియర్ నాయకుడు గోపాల్రాయ్కి కేటాయించారు. బల్లిమర స్థానాన్ని ఇమ్రాన్ హుస్సేన్, మటియామహల్ టికెట్‌ను ఆసిం ఆహ్మద్ ఖాన్లకు కేటాయించింది. షహదారా, నంగ్లోయ్ నియోజకవర్గాలను రాంనివాస్ గోయల్, రఘవేంద్ర షకీన్లకు కేటాయించింది. ఇక రిఠాలా నియోజకవర్గం టికెట్‌ను కొత్త అభ్యర్థి మహేంద్ర గోయల్‌కు కేటాయించింది. ఇదిలాఉంచితే ఆప్ ఇప్పటివరకూ ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య 35కు చేరుకుంది. ప్రచార పర్వం ప్రారంభం త్వరలో జరగనున్న విధానసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆమ్ ఆద్మీ పార్టీ పకడ్బందీ ప్రచార వ్యూహాన్ని రూపొందిస్తోంది. గత ఎన్నికల్లో తన ప్రచారహోరుతో అత్యధిక స్థానాలను ఆప్ కైవ సం చేసుకున్న సంగతి విదితమే. ఇక ఈ ఎన్నికలకు సంబంధించి ప్రకటించిన తొలి జాబితాలో అభ్యర్థులు ఇప్పటికే తమ ప్రచారపర్వాన్ని ప్రారంభించారు. తమ తమ నియోజకవర్గాల్లో ఇంటింటికీ వెళ్లి కేజ్రీవాల్ ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందనే విషయాన్ని తెలియజేయడంతోపాటు ఆప్ సర్కారు చేసిన పనుల్ని వివరిస్తున్నారు. కాగా కేజ్రీవాల్ నుపలాయనవాదిగా చిత్రీకరిస్తూ బీజేపీ, కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని తిప్పకొట్టాల్సిన అవసరాన్ని ఆప్ గుర్తించింది. కాంగ్రెస్, బీజేపీ ప్రచారం వల్ల కేజ్రీవాల్‌పై ఏర్పడిన దురభిప్రాయాన్ని ప్రజల మదిలోనుంచి తొలగించి ఆయన సమర్థ పాలనను అందజేయగలరంటూ వివరించాలని ఆప్ తన లక్ష్యంగా పెట్టుకుంది. విధానసభ ఎన్నికల నోటిఫికే షన్ వెలువడేలోపల పార్టీ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ రేడియో, టెలివిజన్ మొదలుకుని రహదారులు, కాలనీలు అన్ని చోట్లా దర్శనమివ్వాలనేది పార్టీ వ్యూహంగా ఉంది. ఆమ్ఆద్మీ పార్టీ ప్రభుత్వం సాధించిన విజయాలను కేజ్రీవాల్ తన సందేశాల ద్వారా నగరవాసులకు గుర్తుచేస్తారు. 49 రోజుల తమ పాలన కాలంలో తగ్గిన అవినీతిని, బీజేపీ150 రోజుల పాలనతో పోల్చనున్నారు. మళ్లీ అధికారానికి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేయనున్నారు. -
ఎమ్మెల్యేపై బీజేపీ కౌన్సిలర్ దాడి
న్యూఢిల్లీ: బీజేపీ కౌన్సిలర్ సంజనా సింగ్ తనపై దాడి చేశారని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎమ్మెల్యే, మాజీ మంత్రి రాఖీబిర్లా ఆరోపించారు. తమ నియోజకవర్గం మాంగోల్పురిలోని 45 వార్డులో పర్యటిస్తుండగా సోమవారం మధ్యాహ్నం 12.15 గంటల ప్రాంతంలో తమపై సంజన్ సింగ్ దాడి చేశారని తెలిపారు. సఫాయి కార్మికులతో మాట్లాడుతుండగా తమతో సంజనా సింగ్ వాగ్వాదానికి దిగారని చెప్పారు. తర్వాత భర్తతో కలిసివచ్చి దాడికి పాల్పడ్డారని వివరించారు. తనతో పాటు, ఆప్ వాలంటీరు రామ్ ప్రతాప్ గోయల్ కూడా ఈ దాడిలో గాయపడ్డారని రాఖీబిర్లా తెలిపారు. అయితే రాఖీబిర్లా ఆరోపణలను సంజన కొట్టిపారేశారు. ఆప్ మద్దతుదారులే తమమై ముందుగా దాడి చేశారని అన్నారు. -
వాయవ్య ఢిల్లీ బరిలో రాఖీ బిర్లా
సాక్షి, న్యూఢిల్లీ: వాయవ్య ఢిల్లీ రిజర్వ్డ్ ఎంపీ సీటు బరి నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అభ్యర్థి మహేంద్ర సింగ్ వైదొలిగారు. ఇప్పుడు ఈ స్థానం నుంచి మాజీ మంత్రి రాఖీబిర్లా పోటీ చేస్తున్నట్టు సమాచారం. ఈమె కేజ్రీవాల్ సర్కారులో మహిళాశిశు అభివృద్ధిశాఖ మంత్రిగా పనిచేయడం తెలిసిందే. వాయవ్యఢిల్లీ లోక్‌సభ ఎన్నికల బరి నుంచి వైదొలగడానికి మహేంద్ర సింగ్ కారణాలు వెల్లడించలేదు. సింగ్‌పై క్రిమినల్ కేసులున్న దృష్ట్యా అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా ఆమ్ ఆద్మీ పార్టీ ఆయనను కోరిందని, అందుకు సింగ్ అంగీకరించారని పార్టీ వర్గాలు అంటున్నాయి. అన్నా హజారే ఆందోళనలు మొదలు పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్న సింగ్‌పై అనేక క్రిమినల్ కేసులు ఉన్నాయని సమాచారం. ఈ విషయం తమకు ఇటీవలే తెలిసిందని ఆప్ నేత ఒకరు చెప్పారు. నకిలీ నోట్ల చెలామణి కేసులో సింగ్ మూడు నెలలు జైలులో ఉన్నట్లు తేలడంతో ఆయన అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని పార్టీ నిర్ణయించిందని చెప్పారు. ఇప్పుడు ఈ స్థానం నుంచి రాఖీ బిర్లాను అభ్యర్థిగా ప్రకటించాలని ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయించింది. వాయవ్య ఢిల్లీ నుంచి రాఖీ బిర్లాను అభ్యర్థిగా ప్రకటించాలని పార్టీలో ఒక వర్గం మొదటి నుంచీ డిమాండ్ చేస్తోంది. అయితే శాసనసభ్యులకు టికెట్ ఇవ్వరాదని నిర్ణయించినట్లు కేజ్రీవాల్ మొదట్లోనే ప్రకటించారు. ఇది వరకే ఎమ్మెల్యే అయిన రాఖీకి ఎలా టికెట్ ఇస్తారంటూ కొందరు కార్యకర్తలు నిరసనలు ప్రారంభించారు. ఇప్పుడు మహేంద్ర సింగ్ అభ్యర్థిత్వం రద్దు కావడంతో రాఖీ బిర్లాను ఎన్నికల బరిలోకి దింపాలని ఆప్ భావిస్తోంది. నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా వారణాసి నుంచి కేజ్రీవాల్‌ను బరిలోకి దింపాలని పార్టీ నిర్ణయించి కాబట్టి రాఖీని అభ్యర్థిగా ప్రకటించడం సులువుగా మారిందని పార్టీ నేత చెప్పారు. వాయవ్య ఢిల్లీకి ప్రస్తుతం కృష్ణాతీరథ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీజేపీ ఇక్కడి నుంచి ఉదిత్‌రాజ్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. రాఖీ బిర్లా ఆమ్ ఆద్మీ పార్టీలో దళిత నేతగా గుర్తింపు పొందారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ దిగ్గజం రాజ్‌కుమార్ చౌహాన్‌ను ఓడించారు. ఇది వరకే కీలక దళిత నేతలుగా ముద్ర పడిన ఉదిత్ రాజ్‌ను, కృష్ణా తీరథ్‌ను ఎదుర్కోవడానికి రాఖీ బిర్లాయే తగిన అభ్యర్థని పార్టీ భావించినట్లు సమాచారం. -
రాఖీబిర్లాకే లోక్‌సభ టికెట్ ఎందుకు?
సాక్షి, న్యూఢిల్లీ: పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ చేస్తున్న ప్రకటనలకు, వ్యవహరిస్తున్న తీరుకు పొంతనే ఉండడంలేదని ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నార. ఎమ్మెల్యేలుగా ఎన్నికైనవారికి లోక్‌సభ టికెట్ ఇవ్వబోమని ప్రకటించిన కేజ్రీవాల్ ఇప్పుడు రాఖీబిర్లాను లోక్‌సభకు పంపే యోచనలో ఉన్నట్లు తెలిసిందని, ఆ ప్రయత్నాన్ని వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే డిమాండ్‌తో శనివారం న్యూఢిల్లీలోని పార్టీ కార్యాలయం ముందు నిరసన ప్రదర్శన నిర్వహించిన కార్యకర్తలు రెండోరోజైన ఆదివారం కూడా నిరసన ప్రదర్శన కొనసాగించారు. దాదాపు 30 మంది ఆప్ కార్యకర్తలు హనుమాన్ రోడ్డులో ఉన్న ఆప్ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. రాఖీ బిర్లాకు టికెట్ ఇవ్వనున్నట్లు తమకు తెలిసిందని, పార్టీ నిర్ణయం పట్ల తమ వ్యతిరేకతను తెలియచేయడం కోసం ఈ నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు ఆప్ కార్యాలయ మందు ధర్నా జరిపిన కార్యకర్తలు తెలిపారు. శాసనసభ్యులుగా ఎన్నికైనవారిలో ఎవరికీ అసెంబ్లీ టికెట్ ఇవ్వమని ప్రకటించిన కేజ్రీవాల్ రాఖీ బిర్లాకు టికెట్ ఇవ్వాలనుకోవడాన్ని వారు ప్రశ్నించారు. బిర్లా కనీసం లోక్‌సభ టికెట్ కోసం దరఖాస్తు చేసుకోలేదని వారు ఆరోపించారు. అటువంటప్పుడు పార్టీ నియమాలను పక్కనబెట్టి రాఖీ బిర్లాకు టికెట్ ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారని నిలదీశారు. వలంటీర్ల అభిప్రాయాలను తీసుకోకుండా ఏకపక్షంగా అభ్యర్థుల పేర్లను ప్రకటించడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రొటొకాల్‌ను పాటించిన దరఖాస్తుదారులకే పార్టీ టికెట్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఇదిలాఉండగా ఆమ్ ఆద్మీ పార్టీ లోక్‌సభ ఎన్నికల కోసం మిగతా పార్టీల కంటే ముందుగానే సమాయత్తమవుతోంది. ఇందులోభాగంగా తమ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది. రెండో జాబితాను త్వరలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అయితే ఈ జాబితాలో రాఖీ బిర్లా పేరుందనే వార్త పార్టీవర్గాల ద్వారా బయటకు పొక్కడంతో కార్యకర్తల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. -
రాఖీబిర్లాకే లోక్‌సభ టికెట్ ఎందుకు?
సాక్షి, న్యూఢిల్లీ: పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ చేస్తున్న ప్రకటనలకు, వ్యవహరిస్తున్న తీరుకు పొంతనే ఉండడంలేదని ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేలుగా ఎన్నికైనవారికి లోక్‌సభ టికెట్ ఇవ్వబోమని ప్రకటించిన కేజ్రీవాల్ ఇప్పుడు రాఖీబిర్లాను లోక్‌సభకు పంపే యోచనలో ఉన్నట్లు తెలిసిందని, ఆ ప్రయత్నాన్ని వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే డిమాండ్‌తో శనివారం న్యూఢిల్లీలోని పార్టీ కార్యాలయం ముందు నిరసన ప్రదర్శన నిర్వహించిన కార్యకర్తలు రెండోరోజైన ఆదివారం కూడా నిరసన ప్రదర్శన కొనసాగించారు. దాదాపు 30 మంది ఆప్ కార్యకర్తలు హనుమాన్ రోడ్డులో ఉన్న ఆప్ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. రాఖీ బిర్లాకు టికెట్ ఇవ్వనున్నట్లు తమకు తెలిసిందని, పార్టీ నిర్ణయం పట్ల తమ వ్యతిరేకతను తెలియచేయడం కోసం ఈ నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు ఆప్ కార్యాలయ మందు ధర్నా జరిపిన కార్యకర్తలు తెలిపారు. శాసనసభ్యులుగా ఎన్నికైనవారిలో ఎవరికీ అసెంబ్లీ టికెట్ ఇవ్వమని ప్రకటించిన కేజ్రీవాల్ రాఖీ బిర్లాకు టికెట్ ఇవ్వాలనుకోవడాన్ని వారు ప్రశ్నించారు. బిర్లా కనీసం లోక్‌సభ టికెట్ కోసం దరఖాస్తు చేసుకోలేదని వారు ఆరోపించారు. అటువంటప్పుడు పార్టీ నియమాలను పక్కనబెట్టి రాఖీ బిర్లాకు టికెట్ ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారని నిలదీశారు. వలంటీర్ల అభిప్రాయాలను తీసుకోకుండా ఏకపక్షంగా అభ్యర్థుల పేర్లను ప్రకటించడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రొటొకాల్‌ను పాటించిన దరఖాస్తుదారులకే పార్టీ టికెట్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఇదిలాఉండగా ఆమ్ ఆద్మీ పార్టీ లోక్‌సభ ఎన్నికల కోసం మిగతా పార్టీల కంటే ముందుగానే సమాయత్తమవుతోంది. ఇందులోభాగంగా తమ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది. రెండో జాబితాను త్వరలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అయితే ఈ జాబితాలో రాఖీ బిర్లా పేరుందనే వార్త పార్టీవర్గాల ద్వారా బయటకు పొక్కడంతో కార్యకర్తల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. -
పట్టుదలకుతోబుట్టువు!
‘ముగ్గురు చాలు, ఇక పిల్లలు వద్దు’ అని తల్లిదండ్రులు అనుకుంటున్నప్పుడు పుట్టిన నాలుగో బిడ్డ రాఖీ బిర్లా. అదొక్కటే కాదు, రాఖీ జీవితంలో ఇంకా అనేకమైన నాటకీయ ఘటనలు ఉన్నాయి. ఆమె అసలు పేరు రాఖీ బిద్లాన్. అయితే పదో తరగతితో రాఖీ స్కూల్ టీచర్ బిద్లాన్కు బదులుగా సర్టిఫికెట్లో పొరపాటున బిర్లా అని రాశారు. అప్పటి నుండీ ప్రతి సందర్భంలోనూ ఆమెకు -‘మీది బిర్లా ఫ్యామిలీనా?’ అనే ప్రశ్న ఎదురవడం పరిపాటి అయింది. ఢిల్లీ రాష్ట్ర చరిత్రలోనే అతి పిన్నవయస్కురాలైన మంత్రిగా ప్రస్తుత కేజ్రీవాల్ మంత్రివర్గంలో స్త్రీ, శిశు అభివృద్ధి, సామాజిక సంక్షేమం శాఖలను నిర్వహిస్తున్న 26 ఏళ్ల రాఖీ బిర్లా... రాజకీయాల్లోకి రావడం కూడా అనుకోకుండా జరిగిన పరిణామమే. స్థానిక టెలివిజన్ రిపోర్టర్‌గా పనిచేస్తున్న సమయంలో రాఖీ, రెండు కీలకమైన వార్తాంశాలను తన చానెల్‌కు నిరవధికంగా అందించవలసి వచ్చింది. అందులో ఒకటి అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం. ఇంకొకటి నిర్భయ గ్యాంగ్‌రేప్ ఉదంతం. ఈ రెండూ ఆమె ఆలోచనా దృక్పథాన్ని పూర్తిగా మార్చివేసి రాజకీయాల్లోకి రప్పించాయి. సమాజంలో మార్పు తేవాలనుకున్నప్పుడు సమాజానికి దూరంగా ఉండి లాభం లేదని ఆమె బలంగా విశ్వసించారు. తన విశ్వాసానికి బలం చేకూర్చుకోడానికి ఆమ్ ఆద్మీ పార్టీతో చేరారు. ఎన్నికల్లో నిలబడి ఎమ్మెల్యేగా గెలిచారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, రాష్ట్ర మంత్రి పదవిని కూడా నిర్వహించిన రాజ్ కుమార్ చౌహాన్‌ను దళితురాలైన బిర్లా పదివేల ఓట్ల తేడాతో ఓడించారు. ‘‘ఈ పిల్ల మొదట్నుంచీ మమ్మల్ని ఆశ్చర్యచకితులను చేస్తూనే ఉంది’’ అంటారు రాఖీ తండ్రి భూపేంద్రసింగ్ బిద్లాన్. కడుపులో ఉన్నప్పుడే తల్లిదండ్రులు తనపై ప్రయోగించిన గర్భస్రావ విష ఔషధాలతో పోరాడి జన్మించారీ యువతి. మున్ముందు ఎదుర్కొనబోయే ఎలాంటి పోరాటం అయినా బహుశా అంతకన్నా చిన్నదే అవుతుంది. -
త్వరలో మహిళా సురక్షా దళాలు
మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి రాఖీ బిర్లా న్యూఢిల్లీ: నగరంలో మహిళా సురక్షా దళాలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోందని మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి రాఖీ బిర్లా తెలిపారు. ఆమె శుక్రవారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. మహిళలకు రక్షణ కల్పించడంతో లింగ సమానత్వంపై ప్రజల్లో అవగాహన పెంచడం ప్రధానమని ఆమె అభిప్రాయపడ్డారు. మహిళా సురక్షా దళాల ఏర్పాటుపై ఆమె మాట్లాడుతూ.. నగరంలో మహిళల రక్షణ కోసం మహిళా సురక్షా దళాల(ఎంఎస్డీ)ను ఏర్పాటుచేసేందుకు తగిన విధి విధానాలు రూపొందిం చాలని ప్రధాన కార్యదర్శి నాయకత్వంలో అత్యున్నతస్థాయి కమిటీని గత జనవరిలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిందన్నారు. ఆ కమిటీ ఫిబ్రవరి 15వ తేదీ తర్వాత తన నివేదికను అందజేస్తుందని చెప్పారు. ఈ దళాలు ముఖ్యంగా వేధింపుల కేసుల్లో మహిళలకు అండగా నిలబడతాయన్నారు. ‘ఈ ఎంఎస్డీలో చేరేందుకు మహిళలు చాలామంది స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. నాకు ఇప్పటివరకు చాలా ఈమెయిల్స్ అందాయి. సుమారు 150 మందికి పైగా యువతులు స్వయంగా వచ్చి నన్ను కలిశారు..’ అని బిర్లా వివరించారు. నగరంలోని ప్రతి నియోజకవర్గంలో 20 కి పైగా ఎంఎస్డీ బృందాలు సేవలందించేలా ప్రణాళికలు రూపొం దిస్తున్నామని ఆమె తెలిపారు. బృంద సభ్యులకు తగిన శిక్షణ ఇప్పిస్తామన్నారు. ఈ బృందాలు ఆయా నియోజకవర్గాల్లో సంచరిస్తూ ఆపదలో ఉన్న మహిళలకు అండగా నిలుస్తాయని చెప్పారు. దీంతోపాటు లింగవివక్షకు వ్యతిరేకంగా నగరంలో వీధినాటకాలు, అవగాహన శిబిరాలను నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోందని మంత్రి బిర్లా తెలిపారు. -
భద్రతను నిరాకరించిన మంత్రి రాఖీ బిర్లా
న్యూఢిల్లీ: భద్రత విషయమై మిహ ళా శిశు సంక్షేమ శాఖ మంత్రి రాఖీ బిర్లాను నగర పోలీసులు మరోసారి ఆదివారం సంప్రదించారు. అయినప్పటికీ ఆమె నిరాకరించారు. తాను భద్రంగానే ఉన్నానని, అవసరమైతే ఈ విషయాన్ని లిఖితపూర్వకంగా తెలియజేసేందుకు సిద్ధమేనన్నారు. తాను భద్రతా విధులు నిర్వర్తిస్తానంటూ తమ శాఖకు చెందిన ఓ అధికారి గురువారం మంత్రి రాఖీ బిర్లాను మంగోల్‌పురిలోని ఆమె నివాసంలో కలిశారని, ఇందుకు సంబంధించి లేఖ కూడా తీసుకెళ్లారని పోలీసువర్గాలు తెలియజేశాయి. అయినప్పటికీ ఆమె భద్రత తీసుకునేందుకు నిరాకరించిందన్నారు. కాగా ఈ నెల ఐదో తేదీన నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని తిరిగి ఇంటికెళుతుండగా కారుపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు విసిరారంటూ మంత్రి రాఖీ బిర్లా మంగోల్‌పురి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేసిన సంగతి విదితమే. అయితే ఆ తరువాత జరిపిన విచారణలో క్రికెట్ బంతి తగిలి నట్టు తేలడంతో ఆమె తన ఫిర్యాదును ఉపసంహరించుకున్నారు. -
'ఆమ్ ఆద్మీ' మంత్రి రాఖీ బిర్లా కారుపై దాడి
ఢిల్లీ రాష్ట్ర మంత్రి రాఖీ బిర్లా కారుపై కొందరు దాడి చేశారు. ఈ ఘటన దక్షిణ ఢిల్లీలోని మంగోళ్ పూరి ప్రాంతంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది అని ఢిల్లీ పోలీసులు తెలిపారు. అతి చిన్న వయస్సులో ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రివర్గంలో రాఖీ చోటు సంపాదించారు. కొందరు రాఖీ కారును చుట్టుముట్టి హంగామా సృష్టించారు. అక్కడ జరిగిన గలాటాలో ఆమె ప్రయాణిస్తున్న కారు విండో స్క్రీన్ ను పగిలిపోయింది. ఈ ఘటనలో ఎవరూ గాయ పడలేదని పోలీసులు తెలిపారు.