భద్రతను నిరాకరించిన మంత్రి రాఖీ బిర్లా
Published Mon, Jan 13 2014 1:02 AM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM
న్యూఢిల్లీ: భద్రత విషయమై మిహ ళా శిశు సంక్షేమ శాఖ మంత్రి రాఖీ బిర్లాను నగర పోలీసులు మరోసారి ఆదివారం సంప్రదించారు. అయినప్పటికీ ఆమె నిరాకరించారు. తాను భద్రంగానే ఉన్నానని, అవసరమైతే ఈ విషయాన్ని లిఖితపూర్వకంగా తెలియజేసేందుకు సిద్ధమేనన్నారు. తాను భద్రతా విధులు నిర్వర్తిస్తానంటూ తమ శాఖకు చెందిన ఓ అధికారి గురువారం మంత్రి రాఖీ బిర్లాను మంగోల్‌పురిలోని ఆమె నివాసంలో కలిశారని, ఇందుకు సంబంధించి లేఖ కూడా తీసుకెళ్లారని పోలీసువర్గాలు తెలియజేశాయి. అయినప్పటికీ ఆమె భద్రత తీసుకునేందుకు నిరాకరించిందన్నారు. కాగా ఈ నెల ఐదో తేదీన నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని తిరిగి ఇంటికెళుతుండగా కారుపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు విసిరారంటూ మంత్రి రాఖీ బిర్లా మంగోల్‌పురి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేసిన సంగతి విదితమే. అయితే ఆ తరువాత జరిపిన విచారణలో క్రికెట్ బంతి తగిలి నట్టు తేలడంతో ఆమె తన ఫిర్యాదును ఉపసంహరించుకున్నారు.
Advertisement
Advertisement