సాక్షి, న్యూఢిల్లీ: అనుమతి లేకుండా పోస్టర్లు అంటిం చి, ప్రజాఆస్తులను ధ్వంసం చేస్తున్నారన్న ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు నలుగురు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కార్యకర్తలను సోమవారం అరెస్టు చేసి జామీనుపై విడుదల చేశారు. పోస్టర్ వివాదంపై ఆప్ కార్యకర్తలు అరెస్టు కావడంతో ఈ నెలలో ఇది రెండోసారి. నగరంలో ఆప్ వచ్చే నెల మూడున నిర్వహించనున్న ర్యాలీ ప్రచారం కోసం పోస్టర్లు అతికిస్తుండగా వీరిని మాలవీయనగర్‌లో అరెస్టు చేశారు. 20-30 సంవత్సరాల వయసున్న నలుగురు యువకులను ప్రజాఆస్తుల విధ్వంసక నిరోధక చట్టం, సమాచార, పుస్తక నమోదు చట్టం 1867 ప్రకారం అరెస్టు చేశారు. ఢిల్లీలో త్వరగా ఎన్నికలు జరిపించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి ఆప్ వచ్చే నెల 3న ర్యాలీ నిర్వహించనుంది. దీని కోసం ఆప్ ప్రత్యేక పోస్టర్లు రూపొందించింది.
‘ఎన్నికలు జరిపించకుండా బీజేపీ ఎందుకు పారిపోతోంది? త్వరగా అసెంబ్లీ ఎన్నికలు జరిపిం చేందుకు జంతర్ మంతర్ వద్ద జరిగే జనసభలో పాల్గొనండి’ అని ఈ పోస్టర్ల ద్వారా పిలుపునిచ్చింది. అయితే తాజా గా మాలవీయనగ ర్‌లో నలుగురు యువకుల అరెస్టుపై ఆప్ తీగ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఆరోపణలు ప్రత్యారోపణల పర్వం మొదలయింది. తమ కార్యకర్తల అరెస్టు వెనుక బీజేపీ హస్తముందని ఆప్ ఆరోపించింది. నరేంద్ర మోడీ సర్కారు ప్రోద్బలంతోనే ఢిల్లీ పోలీసులు ఆప్ కార్యకర్తలను అరెస్టు చేశారని స్పష్టం చేసింది. ఆప్ పోస్టర్ల ప్రచారం చూసి బీజేపీ బెదిరిపోయిందని, అందుకే తమ పార్టీ కార్యకర్తలను అరెస్టు చేశారని ఆప్ అగ్రనేత అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. బీజేపీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని ఆయన తన ట్విటర్‌లో ఆరోపించారు. బీజేపీ నేతల పోస్టర్లు, పార్టీ అధ్యక్షు డు సతీష్ ఉపాధ్యాయ పోస్టర్లు నగరమంతటా అతి కించి ఉండగా తమ వారినే ప్రత్యేకంగా అరెస్టు చేయడమేంటని ఆప్ నేత, ఎమ్మెల్యే మనీష్ సిసోడియా ప్రశ్నించారు.
దీని వెనుక నరేంద్ర మోడీ ప్రభుత్వ కుట్ర ఉందని మరో నేత సోమ్‌నాథ్ భార తీ ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మరో ఆప్ నేత దిలీప్ పాండే ట్వీట్ చేశారు. పోస్టర్లు ద్వారా ప్రచారం చేయడం తమ విధానమని, ర్యాలీ కోసం పోస్టర్లు వేయడంలో తప్పేంటని ఆయన ప్రశ్నించారు. దీనికి బీజేపీ మాజీ అధ్యక్షుడు విజేందర్ గుప్తా వివరణ ఇస్తూ తప్పులు చేయడం, వాటిపై దానిపై చర్య తీసుకుంటే మొత్తం వ్యవహారాన్ని రాజకీయం చేయడం ఆప్ సిద్ధాంతమని విమర్శించారు. ఆప్ కార్యకర్తలను అరెస్టు చేయడంలో పక్షపాతమేదీ లేదని, పోస్టర్లను అతికించడం నేరమేనన్నారు. ఈ ఆరోపణలపై గతంలో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అరెస్టయ్యారని కాంగ్రెస్ మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్ అన్నారు. బీజేపీ చేసిన తప్పు తాము చేస్తే తప్పేమిటని ఆప్ నేతలు ప్రశ్నించడం సబబు కాదన్నారు. ఇతరులకు భిన్నమని ప్రకటించుకునే ఆప్ నేతలు ఇతరులు చేసినతప్పిదాన్నే ఎందుకు చేస్తున్నారని దీక్షిత్ ప్రశ్నించారు.
ఒకే నెలలో ఇది రెండో కేసు
కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా పోస్టర్లు అంటిం చి ప్రజలను రెచ్చగొడుతున్నారనే ఆరోపణలపై పోలీసులు పలువురు ఆప్ నాయకులను ఈ నెల 19న కూడా అరెస్టు చేయడం తెలిసిందే. ఆప్ ఢిల్లీశాఖ కార్యదర్శి దిలీప్ పాండే, రవిశంకర్ సింగ్, సోనూ, జావెద్, రాజ్‌కుమార్‌ను అరెస్టయ్యారు. పాండే పార్టీ అధికార ప్రతినిధిగానూ వ్యవహరిస్తున్నారు. ఈ ఘటనపై ఆప్ తీవ్రంగా స్పందించింది. బీజేపీ తమనాయకులు, కార్యకర్తలను కేసుల్లో ఇరి కించి ఇబ్బందులపాలు చేస్తోందని కేజ్రీవాల్ అప్పు డు కూడా ఆరోపించారు. మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టేందుకే ఆప్ ఇలాంటి పోస్టర్లు వేసిందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో పోస్టర్లు కనిపించాయి. వీరంతా ‘వర్గాన్ని వంచిస్తున్నార’ని అందులో రాశా రు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతు బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్టు వార్తలు రావడంతో ఈ పోస్టర్లు కనిపించాయి. ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మతీ న్ అహ్మద్, ఆసిఫ్ మహ్మద్ ఖాన్, హసన్ అహ్మద్ నివాసాల ఎదుట నిరసన ప్రదర్శనలు నిర్వహించాల్సిందిగా ఇందులో పిలుపునిచ్చారు. దీనికి కేజ్రీవాల్ వివరణ ఇస్తూ అమానుతుల్లా అనే వ్యక్తి పోస్ట ర్లు అంటించినట్టు విచారణలో అంగీకరించినా, పోలీసులు తమవారిని అరెస్టు చేశారని ఆక్షేపించా రు. బీజేపీ నేతల ఒత్తిడి మేరకే ఈ చర్య తీసుకు న్నారని అన్నారు. మొదటి కేసులో అరెస్ట యిన ఆప్ కార్యకర్తలు కూడా బెయిల్‌పై విడుదలయ్యారు.
మరో పోస్టర్ వివాదం
Published Mon, Jul 28 2014 10:34 PM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM
Advertisement
Advertisement