సొంత గూటికి సంజనాసింగ్
సాధారణంగా ఇంట గెలిసి రచ్చగెలవాలంటారు.అయితే కొందరికి పొరుగున తమ ప్రతిభను నిరూపించుకున్న తరువాత గానీ సొంతవాళ్లు గుర్తించరు. నటి సంజనాసింగ్ పరిస్థితి ఇలాంటిదే. ముంబైకి చెందిన ఈ బ్యూటీని నటిగా మొద ట గుర్తించింది రేణిగుంట చిత్రం ద్వారా రంగ ప్రవేశం చేసి ఆ చిత్రంలో వేశ్య పాత్రకు జీవం పోసి తమిళ చిత్రపరిశ్రమను తన వైపు తిప్పుకున్నారు.అయితే ఆమెనిక్కడ ఆ తరువాత ఒక వ్యాంప్ పాత్రలకు, ఐటమ్ సాంగ్‌లకు మాత్రమే పరిమితం చేశారు.అయినా నిరాశ చెందక సంజనాసింగ్ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ తనకంటూ ఒక ఇమేజ్‌ను సొంతం చేసుకుంటూ మంచి అవకాశాల కోసం తన వంతు ప్రయత్నం చేస్తున్నారు.
రగళైపురం, వెట్రిసెల్వన్,అంజాన్ మొదలగు పలుతమిళ చిత్రాలతో తనకే సొంతమైన నటనతో ప్రేక్షకుల్ని అలరిస్తూ వస్తున్నారు. ఇంత కాలం తరువాత సంజనాసింగ్‌కు మాతృభాష అక్కున చేర్చుకుంది. తోడ లుట్ఫ్ తోడ ఇష్క్ చిత్రంలో నటి సంజనాసింగ్ ఒక ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. హిత్తేన్‌తేజ్‌వాణి,సున్నత్‌ముఖర్జీ,నేహాపవర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ,కథనం,మాటలు,దర్శకత్వం బాధ్యతల్ని సచిన్ గుప్తా నిర్వహిస్తున్నారు.
కొంచెం ప్రేమ, కొంచెం జాలి అంటూ రొమాంటిక్ ఎంటర్‌టెయినర్‌గా సాగే ఈ చిత్రాన్ని ఈ నెల 10న ప్రపంచ వ్యాప్తంగా విడదల చేయనున్నట్లు మంగళవారం సాయంత్రం చెన్నైలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్రయూనిట్ వెల్లడించింది. నటి సంజనాసింగ్ మాట్లాడుతూ దాదాపు ఏడేళ్ల తరువాత సొంత భాషలో నటించడం సంతోషంగా ఉందన్నారు. ఇంత వరకూ తనను ఐటమ్ గర్ల్‌గానే చూశారని ఈ చిత్రం తరువాత తనకు కచ్చితంగా కొత్త ఇమేజ్ వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.తోడా లుట్ఫ్ తోడా ఇష్క్ చిత్రంలో తనకొక పాట కూడా ఉంటుందన్నారు. ఈ ఏటి ది బెస్ట్ గీతాల్లో ఇదొక గీతంగా నిలుస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.