నటి సంజనా సెల్‌ఫోన్‌ చోరీ | Actress Sanjana Singh Cell Phone Stolen In Anna Nagar Tamil Nadu | Sakshi
Sakshi News home page

నటి సంజనాసింగ్‌ సెల్‌ఫోన్‌ చోరీ

Published Mon, Jun 25 2018 8:24 AM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM

Actress Sanjana Singh Cell Phone Stolen In Anna Nagar Tamil Nadu - Sakshi

పెరంబూరు: నటి సంజనాసింగ్‌ సెల్‌ఫోన్‌ చోరీకి గురైంది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు దొంగలను పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. వివరాల్లోకి వెళ్లితే రేణిగుంట చిత్రం ద్వారా ప్రాచుర్యం పొందిన నటి సంజనాసింగ్‌. పలు చిత్రాల్లో వివిధ పాత్రల ద్వారా గుర్తింపు పొందిన ఈమె స్థానిక ముగపేర్‌లో నివసిస్తున్నారు. సంజనాసింగ్‌ ఉదయం సైకిలింగ్‌ చేయడం అలవాటు. అదే విధంగా శనివారం ఉదయం 6 గంటలకు అన్నానగర్‌లో ఉన్న తన సోదరి ఇంటికి సైకిల్‌లో వెళ్లారు.తిరిగి వస్తుండగా అన్నానగర్‌ సమీపంలోని చింతామణి సిగ్నల్‌ ప్రాంతంలో మోటార్‌సైకిల్‌పై వచ్చిన ఒక వ్యక్తి సంజనాసింగ్‌ చేతిలోని సెన్‌ఫోన్‌ను లాక్కుని పారిపోయాడు. దీంతో అవాక్కు అయిన ఆమె వెంటనే అన్నానగర్‌ పోలీస్‌స్టేషన్‌లో పిర్యాదు చేశారు.

సంజనాసింగ్‌ ఫిర్యాదును నమోదు చేసుకున్న పోలీసులు సెల్‌ఫోన్‌ దొంగ కోసం గాలిస్తున్నారు. నటి సంజనాసింగ్‌ తెలుపుతూ తాను నిత్యం ఉదయం ఎక్సర్‌సైజ్‌లో భాగంగా సైకిలింగ్‌ చేస్తానన్నారు. అయితే శనివారం మరి కొద్ది దూరం సైకిలింగ్‌ చేస్తే మంచిదని భావించి అన్నానగర్‌లోని తన సోదరి ఇంటికి వెళ్లానని చెప్పారు. తానకు దారి తెలియకపోవడంతో సెల్‌ఫోన్‌లో గూగుల్‌ మ్యాప్‌ వాడుకుంటానని తెలిపారు. అన్నానగర్‌ నుంచి తిరిగి వస్తుండగా మోటర్‌బైక్‌పై వచ్చిన ఒక వ్యక్తి తన సెల్‌ఫోన్‌ను లాక్కుని వేగంగా వెళ్లిపోయాడని చెప్పారు. తాను దొంగ దొంగ అంటూ గట్టిగా కేకలు పెడుతూ సైకిల్‌ను వేగంగా తొక్కుకుంటూ వెళ్లినా ఫలితం లేకపోయిందని, దీంతో అన్నానగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement