
చెన్నై: తమిళ నూతన దర్శకుడు బాలమిత్ర గుండెపోటుతో మరణించారు. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో బుధవారం ఆయన కన్నుమూశారు. కాగా బాలమిత్ర లాక్‌డౌన్‌కు ముందు "ఉడుక్కై" చిత్రం తెరకెక్కించాడు. ఈ సినిమాతో వెండితెరపై దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలన్నది అతని కల. షూటింగ్ దాదాపుగా పూర్తైన ఈ చిత్రం కరోనా కారణంగా అర్ధాంతరంగా ఆగిపోయింది. అయితే కొద్ది రోజుల క్రితం షూటింగ్స్ సహా, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. (హీరో అజిత్‌కు ఏమైంది? )
దీంతో అతను తన 'ఉడుక్కి' సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాడు. ఇంతలోనే ఆయన మరణించడం చిత్రబృందానికి తీరని విషాదాన్ని నింపింది. 'ఉడుక్కై' సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న నటి సంజనా సింగ్ ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటించారు. "ఒక మంచి వ్యక్తి ఇంత త్వరగా లోకాన్ని వదిలి వెళ్లిపోయారు. అతని కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి" అని ట్వీట్ చేశారు. బాలమిత్రకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. (వడివేలు స్నేహాన్ని వదలుకోను)
Comments
Please login to add a commentAdd a comment