![Interesting Unknown facts - Sakshi](/styles/webp/s3/article_images/2023/02/24/cat.jpg.webp?itok=gJpSw_eO)
► జపాన్ లోని ఆసోచి కొండల్లో ‘విండ్ ఫోన్’ అనే టెలిఫోన్ బూత్ ఉంది. ‘విండ్ ఫోన్ ఏమిటి? అక్కడెక్కడో కొండల్లో ఉండడం ఏమిటి?’ అనుకుంటున్నారా! విషయంలోకి వస్తే...2011లో జపాన్ లో భూకంపం వచ్చి ఎంతోమంది చనిపోయారు. చనిపోయిన వారితో ఆత్మీయులకు మాట్లాడే అవకాశం లేదు. వారు ఎక్కడో ఉన్నట్లుగానే భావించి ఫోన్‌లో మాట్లాడి మనసులో ఉన్న బాధను దించుకోవడమే ఈ ‘విండో ఫోన్’ ఉద్దేశం. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్‌లో కూడా ‘విండ్ ఫోన్’లు ఏర్పాటయ్యాయి.
► పెరూలో ‘టకనాకుయ్’ పేరుతో ప్రతి సంవత్సరం ‘ఫైటింగ్ ఫెస్టివల్’ జరుగుతుంది. ‘టకనాకుయ్’ అంటే ఒకరితో ఒకరు తలపడడం. అంతమాత్రాన ఈ ఫైటింగ్ ఫెస్టివల్‌లో రక్తం కారేలా కొట్టుకోరు. ఒక విధంగా చెప్పాలంటే ఉత్తుత్తి ఫైటింగ్ అన్నమాట! మనసులో ఉన్న కోపం, ఒత్తిడి, ఆందోళనను వదిలించుకోవడానికి ఈ ‘ఫైటింగ్ ఫెస్టివల్’ ఉపయోగపడుతుందనే నమ్మకం ఉంది. దీనికి ఎంతో పురాతనమైన చరిత్ర ఉంది.
Comments
Please login to add a commentAdd a comment